కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 15 - ఏలా... ఏలేశ్వరం ఏగుటేలా?
1976 నవంబర్ మొదటి వారం. ఆదివారం రోజున లక్ష్మయ్యగారు, సుబ్బన్నగారు, పంతులుగారు ఆఫీసులో మీటింగ్ పెట్టారు. పెట్టి - నాకన్నీ చెప్పి "ఏలేశ్వరం వెళ్లూ, వెళ్లి ముందు అవన్నీ సరిజేయమని" చెప్పేసి అన్నారు.
అసలింతకీ ఏమిటంటే నేను సోమవారం బయల్దేరి వెళ్ళాలి. మంగళవారం లేదు, బుధవారం మార్కెట్టు ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఐఎల్టీడీ మాకు కాంపిటీటర్. వాళ్ళోపెన్ చేస్తున్నారు బుధవారం. అదే సమయానికి మేం కూడా ఓపెన్ చేయాలి. ఈ లోపులో ఏమయిందంటే మా లీఫ్ మేనేజర్ సీతారామయ్య పంతులు గారికి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆ మధ్య. ఆయనెక్కడికీ ప్రయాణాలు చెయ్యట్లేదు. అంచేత ఆయనేమో చిలకలూరిపేటలో ఆగిపోయారు. ఆయన బదులుగా ప్రొడక్షన్ మేనేజర్ LM తనేజా అని యూపీ ఆయన...ఆయనేమో బయ్యింగుకి వస్తాడని చెప్పారు. ఆయనకేమో తెలుగు రాదు, హిందీ, ఇంగ్లీషు. "సరే అయితే నే బయల్దేరి వెళ్తా రేప్పొద్దున్నే" అన్నా.
ఈలోపులో వీళ్ళేం చేశారంటే విజయవాడలో బుల్లెట్ మోటార్ సైకిలు బుక్ చేశారు ఏలేశ్వరం కోసం అని చెప్పేసి. దాని నంబర్ ఏపీజీ 7631. "నువ్వు విజయవాడ దాకా వెళ్లి, షోరూంకి వెళ్లి ఆ బుల్లెట్ తీసుకుని, దాని మీదే వెళ్ళిపో ఏలేశ్వరం" అన్నారు. విజయవాడ నుంచి ఏలేశ్వరం 230 కిలోమీటర్లు. చిలకలూరిపేట నుంచి మూడొందల కిలోమీటర్లు. సరే అంజెప్పేసి నేను సోమవారం పొద్దున్నే ఇంటి దగ్గర టిఫిన్ చేసి బయల్దేరి వెళ్ళాను. విజయవాడ చేరేటప్పటికి పదకొండు అయింది. పదకొండుంపావుకల్లా బుల్లెట్ డెలివరీ ఇచ్చారు నాకు. దాంతో పాటుగా ఓ హెల్మెట్. ఆ రోజుల్లో ఏంటంటే ఎవరూ హెల్మెట్ వేసేవారు కాదు. కాకపోతే నేను కర్ణాటకలో చేసొచ్చాను కాబట్టి హెల్మెట్ అలవాటయ్యింది. ఓ హెల్మెట్, ఓ జెర్కిను, తరవాత ఏంటంటే గ్లౌజెస్సు, ఇంకా షూస్ - ఇవన్నీ కొనుక్కుని బుల్లెట్ తీసుకుని, అక్కణ్ణించి బుల్లెట్ మీద ఏలేశ్వరం బయల్దేరా - వయా రాజమండ్రి. రాజమండ్రికో ఏభై కిలోమీటర్లుంటుందన్నమాట. సరే - దార్లో టిఫిన్లకి, టీలకి ఆగడం ఇవన్నీ చేసేటప్పటికి సాయంత్రం ఐదూ-ఐదున్నరకల్లా ఏలేశ్వరం చేరి పోయాను.
కొత్త బుల్లెట్టు, నేనూ దిగేటప్పటికి ఏలేశ్వరం బ్రాంచ్ వాళ్ళందరూ "ఏంటి బండేసుకొచ్చేశావా ఏకంగా అక్కణ్ణించి నువ్వూ?! " అన్నారు. "బండి కొన్నారయ్యా...మీ ఏరియా బ్రాంచెస్ కోసమే కొన్నారు. వాడినంతకాలం వాడతాను, తర్వాత ఇక్కడే విదిలేస్తాను" అన్నాను. నే తీసుకెళ్లిన బుల్లెట్ కాక అక్కడ జీపొహటుండేది.
ఏలేశ్వరంలో దిగాను కదా...ఆఫీసులో కూర్చుని ఆ రాత్రికి చేసే పనేమీ లేదు కదా! ఆ వూళ్ళో సినిమా హాళ్ళుండేవి. బాల్కనీ రెండ్రూపాయలు. ఫష్షో సినిమాకెళ్ళొచ్చాను. సినిమాలు చూడాలంటే రాజమండ్రి వెళ్ళమన్నారు, ఈ ఊళ్ళో చూడొద్దన్నారు కానీ సినిమాయే కదా అనేసి వెళ్లొచ్చేసాను. అక్కడ చైనులు అంజెప్పేసి ఓ ఎసిస్టెంట్ క్యాషియర్ ఉండేవాడు. అతను శ్రీకాకుళం నుంచొచ్చాడు. అప్పట్లో ఎస్వీ సోమయాజి అని ఒక సీఏ జేరాడు హెడ్డాఫీసులో ఫైనాన్స్ మేనేజరుగా. ఆయన మేనల్లుడు ఈ చైనులు. ఇతను కాక ఇంకో క్యాషియర్, మేనేజర్, ట్రెయినీ మేనేజర్ - వీళ్లూ ఏలేశ్వరం ఆఫీస్ స్టాఫు.
రెండో రోజు పొద్దున్నే వాళ్ళందర్నీ కూర్చోబెట్టి - చెయ్యాల్సిన కార్యక్రమమేంటి, ఎక్కడికెళ్ళాలి, ఎవర్ని కలవాలి - ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేశా. ఇక్కడేమయిందంటే ఏలేశ్వరం సెంటర్ పాయింటు. ఇటు ప్లెయిన్సులో - అంటే జగ్గంపేట ఏరియాలో - నరేంద్రపురం, భావవరం, గుఱ్ఱాలపాలెం, గండేపల్లి, మన్యంవారిపాలెం - లలో కొంత బర్లీ టొబాకో కొనుగోలు చేశారు. ఇంక రమణయ్య పేట, గుంటువారిపాలెం, కరివేవపాలెం, అమీనాబాద్ కాలనీ, చికిలింత - ఇటువంటి ఏరియాలు ఏజెన్సీ. చాలా డీప్ ఏజెన్సీ అది.
సరే! క్యాషియర్ ఏమన్నాడంటే "బాసూ! రేప్పొద్దున్నే నరేంద్రపురం వెళ్ళిపోదాం. వెళ్లి అక్కణ్ణించి మొదలుపెట్టు నువ్వు" అన్నాడు. అసలు సంగతేంటంటే నే రావడానికి ముందు ఎంక్వైరీకి వచ్చిన దత్తు (మణి) గార్ని కూడా అలాగే మేనేజ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ప్లెయిన్సులో వున్న రైతులు కొంచెం ఎడ్యుకేటెడ్ వున్నారక్కడ. అక్కడ మోసం చేసే జరిగే అవకాశం లేదు. అది చూచాయగా గ్రహించాను నేను. అంచాత "సరే కానీయ్. వెళదాం" అంచెప్పేసి "నువ్వు డ్రైవ్ చెయ్, నువ్వే తీసుకెళ్ళు నన్ను" అంచెప్పి వెనకాల కూర్చున్నా.
నరేంద్రపురం, ఆ చుట్టుపక్కల ఏరియాలు తిరిగాం ఆ రోజున. ఆ రోజు మంగళవారం రోజు. తిరిగినప్పుడేమైందంటే ఏ రైతును కలిసినా కూడా ఎక్కడా ఫ్రాడ్ కనపళ్ళా నాకు. ఇంతకుముందు మణి కూడా పాపం! - అలాగే బోల్తా పడి "అంతా బానే వుంది" అని రాసేశాడు. ఎందుకంటే రైతులందరూ చదువుకున్నవాళ్ళు. వాళ్ళని మోసం చేస్తే తాట తీసేస్తారు స్టాఫుని.
అదయ్యాక మరసటి రోజు పొద్దున్న బుధవారం నాడు - ఆ రోజు మార్కెట్టు ఓపెన్ అయ్యేరోజది. దాదాపు ఎమ్మెల్ కంపెనీ రైతులే ఓ వెయ్యి మంది వున్నారక్కడ. ఒక పదిహేను వందల బేళ్లు ప్లాటుఫార్మ్ మీది కొచ్చినయ్ అమీనాబాద్ కాలనీలో. LM తనేజా గారు ఆ రోజు పొద్దున్న చిలకలూరిపేటలో బయల్దేరి పదకొండింటికల్లా వచ్చేస్తాను AB కాలనీకి, ఈలోపులో మీరేర్పాట్లు చేసుకోండి అని చెప్పారాయన.
నేను పొద్దున్నే ఆరింటికల్లా స్నానం అదీ చేసేసుకుని, బుల్లెట్ మోటార్ సైకిలేసుకుని, క్యాషియర్ని ఎక్కించుకుని తిన్నగా జెడ్డంగి వెళ్ళాను. ఫ్రాడ్ రిపోర్ట్ చేసిన రైతునాయకుడు వసంతరాయుడు ఆ జెడ్డంగిలో ఉంటాడు. వెళ్లి అతన్ని కలిశా.
కలిసి "వసంతరాయుడు గారూ...ఇలా వచ్చాన్నేను. ఎంక్వైరీ కోసమే వచ్చాను. ఇవాళ బయ్యింగ్ వుంది. మీరొక్కసారి ఆ బయ్యింగ్ దగ్గరికి రండి గొడవ లేకుండా. పంతులుగారి కేమో ఆరోగ్యం బాలేదు. ఆయన స్థానంలో వచ్చే ఆయన యూపీ నుంచి వస్తున్నాడు. ఆయనకి తెలుగు రాదు. అంచేత మీరు కూడా వచ్చి నిలబడితే ఏదో విధంగా బయ్యింగ్ ఐపోతే ఈ రోజు నేను మిగతా పనులన్నీ చూస్తానిక్కడ" అంజెప్పేసి అంటే, ఆయన కూడా "సరేనండి" అని అమీనాబాద్ కాలనీకి వచ్చాడు.
వచ్చేటప్పటికి పదిహేనొందల బేళ్లతో కళకళ్ళాడిపోతోంది ప్లాట్‌ఫార్మ్. ఓ పక్కనేమో ఐఎల్టీడీ ప్లాట్‌ఫార్మ్. వాళ్ళకీ అన్ని బేళ్ళూ వచ్చేసినయ్. వచ్చిన రైతులందరి దగ్గరా పాస్‌బుక్కులుంటాయి. ఎందుకంటే యూనియన్ బ్యాంకు వీళ్ళందరికీ అప్పులిచ్చింది కంపెనీ ద్వారా. వాళ్ళు ఈ అమ్మిన సేల్స్ అన్నీ కూడా మేము యూనియన్ బ్యాంకుకి సబ్మిట్ చెయ్యాలి. చేస్తే వాళ్ళు అప్పు మొత్తం కట్ చేసేస్కుని మిగిలిన బాలెన్సు రైతులకిచ్చేస్తారు. అదీ అక్కడ పధ్ధతి. సరే! "అందర్నీ పాస్‌బుక్కులు తెచ్చుకోమనండి. నేను అన్నీ వెరిఫై చేస్తాను" అని చెప్పా. చెప్పేటప్పటికి సరే నన్నారు వసంతరాయుడు గారు. ఆయనింట్లోనే టీ అదీ తాగాము. తాగి జెడ్డంగి నుంచి బయల్దేరి అక్కణ్ణించి పది పన్నెడు కిలోమీటర్లు -అదంతా అసలు రోడ్డుండదన్నమాట, కొండల్లోంచి వెళ్ళాలి. మోటార్ సైకిలు మీదే అక్కడికెళ్ళాం.
వెళ్ళాక అక్కడేంటంటే అంతా ట్రైబల్స్ - సేనాధిపతులు, కోయలు, చెంచులు, కొండకాపులు. వాళ్లకి అసలు ఏమీ తెలీదు పాపం! వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళని కాంట్రాక్టర్లు అసలు దోచుకోవడమే! అటువంటి ఏరియా అది. పాపం! ఆ రోజుల్లో హే... మీ తెలిసేది కాదు వాళ్ళకి. ఇవాళంటే వాళ్ళూ నేర్చుకున్నారు .
సరే! అక్కడికెళ్లి కూర్చున్నాక ఏంటంటే - ఇంకా టైముంది. మేమెళ్ళేసరికే దాదాపు పదయిపోయింది. పదకొండు గంటలకి వస్తాన్నాడు కదా తనేజా గారు! అన్నట్లుగానే పదకొండు గంటలకి వచ్చేశాడు. వచ్చేసి బయ్యింగ్ మొదలుపెడతానంటే "ముందు మా లెక్కలు తేల్చండి, తర్వాతే మీ బయ్యింగ్, లేకపోతే చెయ్యడానికి వీల్లేదు" అన్నాడు వసంతరాయుడు గారు.
"సరే! ఆ పాసుబుక్కులు తీసుకు రండి, నేను చూస్తాను" అని చెప్పేసి అక్కడ ఓ టేబుల్ దగ్గర కుర్చీ వేసుక్కూర్చున్నా. క్యాషియర్ని పక్కన కూర్చోపెట్టుకున్నా. అలా కూర్చుని ఒక్కో పాస్‌బుక్ తీసి ఆ ఎంట్రీలన్నీ చూస్తూ, ఎంక్వైరీ చేస్తూ చూస్తుంటే ఒక్కోదానికి అరగంట టైం పడుతోంది. అలా వెయ్యి మంది రైతులవి చూడాలంటే ఎంత టైం పడుతుంది? అదే వసంతరాయుణ్ణి పిలిచి చెప్పా.
"ఏమండి! ఈ రకంగా చేస్తే నాకెంత టైం పడుతుందో ఆలోచించండి. అవసరమైతే మూణ్నెల్లు కాదు నాలుగు నెల్లు వుంటానిక్కడ నేను. మీ ఎకౌంట్లన్నీ ఫైనలైజ్ చేసి, మీకొచ్చే ప్రతి రూపాయి ఇప్పించి వెళ్తానిక్కణ్ణించి. దయచేసి బయ్యింగ్ ఆపకండి - ఆయన చిలకలూరిపేట నుంచి వచ్చాడు తనేజా గారు. ఆయన్ని బయ్యింగ్ చేసుకుని వెళ్ళిపోనివ్వండి. నేనిక్కడ ఉండి - నేను భరోసా ఇస్తున్నాను మీకు - నేను హామీ ఇస్తున్నా నేనిక్కడుండి మీ కార్యక్రమం అంటా చక్కబెట్టి వెళ్తాను " అంటే "సరే" నని ఆయన అందరికీ మీటింగ్ పెట్టి చెప్పి "ఈయనుంటాడు, కామేశ్వరరావుగారుంటాడు. ఆయన మన వ్యవహారాలన్నీ చూస్తాడు. బయ్యింగ్ చేయనిద్దాం" అంటే తనేజా గారు బయ్యింగ్ చేసేశాడు. ఆ సాయంత్రానికి వెళ్ళిపోయాడు.
ఈ సాయంత్రం లోగా ఏంటంటే నేను ఖాళీగా కూర్చోలేదు. ప్రతివాణ్ణి పిలవడం, పాస్‌బుక్ తీసుకు రమ్మనడం. ఇందులో కొంతమంది ... కొండకాపులు అన్నవాళ్ళు ఏంటంటే ప్లెయిన్స్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డవాళ్లు. వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళున్నారు. క్యాషియర్ గానీ, మేనేజర్ గానీ వాళ్ళ జోలికి పోలా. వాళ్ళ జోలికి నేనూ పోలేదు. కాస్త ఏమీ తెలియని ట్రైబల్స్ ఉంటే - వాళ్లలో ఒకణ్ణి పిలిచి ఇంటర్వ్యూ చేశా.
" ఏమయ్యా నీకు మందు బస్తాలు ఎన్నిచ్చారు? తెల్లపిండెన్ని? నల్లపిండెన్ని?"
తెల్ల పిండి అంటే డీఏపీ. నల్ల పిండంటే నైట్రైట్స్.
"అయ్యా! నాకు తెల్లపిండి ఒక బస్తా, నల్లపిండి ఒక బస్తా ఇచ్చాడు"
అంటే వీళ్ళు "లేదు ...తెల్లపిండి రెండు బస్తాలిచ్చాం, నల్లపిండి రెండు బస్తాలిచ్చాం" అనే వాళ్ళు.
ఎందుకంటే ఆ మందుబస్తాల్లో కొట్టేశారు వీళ్ళు.
"చూడు క్యాషియరూ! నేను ట్రైబల్స్ చెప్పింది నమ్ముతా! వాళ్ళ అమాయకత్వం చూస్తే నాకు వాళ్లనే నమ్మాలనిపిస్తోంది. వాడు చెప్పింది ఇక్కడ నోట్ చేస్తా. వాడు ఒక బస్తా ఇచ్చాడన్నాడనుక్కో, నువ్వు కాదూ రెండు బస్తాలన్నావనుకో - ఆ రెండో బస్తా నీ పెర్సనల్ ఎకౌంట్లోనో, మేనేజర్ ఎకౌంట్లోనో వేసేసుకోవాలి. ఇందులో ప్రశ్నే లేదు." అంజెప్పేసి కొంచెం గట్టిగానే వాదించేశాను.
ట్రైబల్స్ కూడా "ఓ... ఈయన మన తరఫునే మాట్లాడుతున్నాడు " అంజెప్పేసి వాళ్ళు కూడా మాం...చి హుషారైపోయారు.
మార్కెట్లో బయ్యింగ్ అయిపోయి సాయంత్రం నాలుగింటికల్లా తనేజా గారు బయల్దేరి చిలకలూరిపేటకి వెళ్ళిపోయాడు. ఇంక నేనేంటంటే రోజూ పొద్దున్నే బయల్దేరి అక్కడికెళ్ళడం - అమీనాబాద్ కాలనీలో కూర్చోవడం - ఎందుకంటే "అన్ని ఊళ్ళూ నేను తిరగలేను" అని చెప్పా. "రోజుకో వూరు వాళ్ళు రండి. రోజుకెన్ని ఎకౌంట్లవుతాయో చూసుకుందాం. ఇందులో తక్కువ చేశారు అనుకున్నవాటికి వాళ్ళ ఎకౌంట్లో రాసేస్తాను. ఇందులో నిర్మొహమాటంగా చెప్తున్నాను నేను" అంజెప్పేసంటే వసంతరాయుడు కూడా నాతోటుండేవాడు.
సరే...ఈ ఆఫీసు స్టాఫు -కొంత డబ్బు కూడా చెల్లించేవారు ట్రైబల్స్‌కి. దానికి వోచర్లు వీళ్ళే వేలిముద్రలు నొక్కేశారు.
ఓ ఏజెన్సీ రైతుని పిలిచి "నీకు డబ్బు ఎంతిచ్చారు" అంటే "నాకో ఒంద రూపాయలిచ్చారయ్యా." అనేవాడు.
"వందేంటి? - అప్పుడేమో చెట్టు కింద కూర్చున్నప్పుడు పాతిక రూపాయలిచ్చాను కదా నీకు?" అనేవాడు క్యాషియర్.
"లేదయ్యా. నాకు నువ్వు ఒందే ఇచ్చావు" అనే వాడు వీడు.
అప్పుడు వందా కోయరైతు పేర్న రాసి, పాతికా వీడి పేరున రాసేవాణ్ణి. ఆ రకంగా మూడు నెల్ల పాటు ఏలేశ్వరంలో వుండి - అంటే మధ్యమధ్యలో శనివారం శనివారం గణపవరం వచ్చేసేవాణ్ని - మళ్ళీ సోమవారం పొద్దున్న బయల్దేరి వెళ్ళిపోతూ వుండేవాణ్ణి బస్సులో. బుల్లెట్ అక్కడే విదిలేశాము. అక్కడికెళ్ళినప్పుడు బుల్లెట్ వాడుకునేవాణ్ణి. ఈ రకంగా చేసి మొత్తానికి మందుబస్తాల్లో, డబ్బు పంపకాల్లో తేడాలన్నీ బయటేశా.
ఈ లోపులో ఏమైందంటే - యూనియన్ బ్యాంకులో ఐఎల్టీడీకి, మా కంపెనీకీ కూడా ఎకౌంట్లుండేవి. కొంతమంది రైతులు అక్కడా లోన్ తీసుకున్నారు, ఇక్కడా లోన్ తీసుకున్నారు. అంటే అక్కడో రెండు బేళ్లు, ఇక్కడో రెండు బేళ్లు పెట్టేవారు. అలాక్కూడా జరిగింది. అదేమైందంటే ఆ రైతులకి యూనియన్ బ్యాంకు వాడేం చేశాడంటే మా కంపెనీకి అమ్మిన సేల్ ప్రొసీడ్సన్నీనేమో జమ కట్టేసుకున్నాడు. ఐఎల్టీడీ పేరు మీదిచ్చిన లోన్లు కూడా దీనిమీదే క్లియర్ చేసేశాడు. ఐఎల్టీడీ రైతులకి కాష్ పేమెంట్స్ ఇచ్చేది. దానికి ఆ ట్రైబల్స్ ఏమన్నారంటే "అక్కడా మేం అప్పు తీసుకున్నాం, ఇక్కడా తీసుకున్నాం. ఐఎల్టీడీ మాకు పేమెంట్లు ఇస్తున్నారు. మీరివ్వట్లేదు. అవన్నీ మీరు మిగిల్చేసుకుంటున్నారు" అంటూ కొంచెం రివర్స్ అయ్యారు.
"అది కూడా నేను బయట పడేస్తాను, తొందర పడకండి" అని చెప్పా. ఆ ఇష్యూ తెలియాలంటే నాకు ఆఫీసు స్టాఫు సహకరించట్లేదు. ఏం చెయ్యాలో నాకర్థం కాలా. ట్రెయినీ మేనేజర్ స్వామి కారంచేడు నుంచొచ్చాడు. అతి మెత్తటి వాడు, మంచివాడు. ఇతన్ని బుట్టలో వేసుకుంటే మన పని అవుతుందని చెప్పేసి ఆ స్వామిని బండెక్కించుకుని తిరిగేవాణ్ణి. స్వామికి బుల్లెట్ అంటే మహా ఆనందం, ఇష్టం. "నాకు బండి నేర్పు గురూ!" అనేవాడు. "తప్పకుండా నేర్చుకుందువు గాని బండి" అనేవాణ్ణి.
సాయంత్రం పూట స్వామి, నేను వెళ్లి ఏలేశ్వరం రిజర్వాయిర్ దగ్గర గట్టు మీద కూర్చునేవాళ్ళం.
"స్వామీ! నాకో సందేహం. అడుగుతా విను. నాకు ఈ బ్యాంకు ఇష్యూస్ అసలర్థం కావట్లేదు. ఒకసారి బ్యాంకు మేనేజర్ దగ్గరికి నన్ను తీస్కెళ్తావా? ఈ బ్యాంకులో ఏదో మతలబు జరిగింది. మీకు తెలుసా విషయాలు. కానీ చెప్పట్లేదు బయటికి. నువ్వు కూడా ఎందుకు చెప్పట్లేదో నాకర్థం కావట్లేదు. నువ్విందులో నాకు సాయం చేశావంటే నేన్నీకు ప్రామిస్ చేస్తున్నాను - ఫస్ట్ థింగ్ నీకు బుల్లెట్ నేర్పుతాను. సెకండ్ థింగ్ ఈ మేనేజర్ని, క్యాషియర్ని ఇక్కణ్ణించి లేపేస్తా. ఈ బ్రాంచుకి నువ్వే మేనేజర్ వవుతావ్." అని ఒక విధంగా ప్రోబ్ చేశా.
చేసేటప్పటికీ ...పడ్డాడు నా వల్లో. "తప్పకుండా బాసూ, వెళదాం" అని చెప్పేసి మరసటి రోజు పొద్దున్నే యూనియన్ బ్యాంకు మేనేజర్ దగ్గరికెళ్ళాం.
వెళ్లి "ఏంటి సర్ - ఏంటీ పరిస్థితి? వాళ్ళకీ లోన్స్ ఉన్నాయ్, మాకూ ఉన్నాయ్. మా ఎకౌంట్లో సేల్ డబ్బు జమ చేస్తే మీరేమో వాళ్ళకేమీ డబ్బులివ్వట్లేదంట. వాళ్లేమో కాష్ పేమెంట్స్ చేస్తున్నారక్కడ. మరి వాళ్ళ లోన్స్ ఎలా తీరుతున్నాయి" అంటే అప్పుడా మేనేజర్ చెప్పాడు " పొగాకు వాడమ్మింతర్వాత మళ్ళీ దొరుకుతాడో లేదో తెలియదండి మాకు. ఆ వచ్చిన అమౌంటుని రెండు ఎకౌంట్సుకి ఎడ్జస్ట్ చేసి పడేశాం మేమిక్కడ. మిగతా ఏమన్నా ఉంటే కాష్ పేమెంట్స్ అక్కడిచ్చుకుంటార్లే అని" అంటూ.
"మా కంపెనీ పేరు పోగొట్టారు కదా మీరు? ఇదేంటి సర్ ఈ పని? ఎవరి ఎకౌంట్ వాళ్ళకే. లేదంటే మీ గుంటూరు ఆఫీసుకి రిపోర్ట్ చేస్తా. అసలు మీ బ్యాంకులో మా ఎమ్మెల్ కంపెనీ ఎకౌంట్ లేకుండా చేస్తా" అని ఆయన్ని బెదిరించా. "బాబ్బాబూ! ఆ పని మాత్రం చేయబోకండి. ఇక్కణ్ణించీ అల్లా చెయ్యనింకా!" అని ఆయన మాటిచ్చాడు. ఛాన్సు దొరికింది కదా - ఈ వసంతరాయుణ్ణి, ఇంకో పదిమంది తెలిసున్న రైతుల్ని తీసుకుని బ్యాంకుకెళ్లి "వీళ్ళ ఫ్రాడ్ ఏమీ లేదు" అని ఆయన చేతే చెప్పించాను. అది విని వసంతరాయుడు వెళ్లి మళ్ళీ మీటింగ్ పెట్టి "ఈ కంపెనీ తప్పు కాదిది. పొరపాటు జరిగింది" అని చెప్పేసి అందరికీ సర్దిచెప్పాడు.
ఆ రకంగా షా కమిషన్ చేసింతర్వాత - ఆ రిపోర్టులన్నీ తీసుకుని - నాలుగు నెల్ల తర్వాత గణపవరం వెళ్లి - లక్ష్మయ్య గారు, సుబ్బన్నగారు, సీతారామయ్య పంతులుగారు, సోమయాజులుగారు, తనేజా గారు - వీళ్ళందరూ కూర్చున్నప్పుడు తీసుకెళ్లిచ్చి - "జరిగిన విషయం ఇదండీ. వ్యవహారం ఇలా జరిగింది. దీనివల్ల ఇబ్బంది పడాల్సొచ్చింది" అని చెప్తే తక్షణమే లక్ష్మయ్య గారు మేనేజర్ని, క్యాషియర్ని పంపించేశారు బయటికి. అప్పుడు చైనులు హెడ్-క్యాషియర్ అయ్యాడు.
బయటికొచ్చిన మేనేజర్, క్యాషియర్ "కామేశ్వర్రావ్! మాతో సరదాగా ఉంటూనే మా ౘాప కిందకి నీరు తెచ్చావ్." అంటే, నే చెప్పా "ట్రైబల్స్‌ని మోసం చేయడమేంటయ్యా? కంపెనీ మంచి జీతాలే ఇస్తున్నారు. బాగా చూసుకుంటున్నారు. ఎందుకిలాంటి పనులు? నేను మీ ౘాప కిందకి నీరు తీసుకురావడమేంటి? ఉన్న సబ్జెక్టేదో ఓపెన్‌గా చెప్పాను. నామీద ఇక్కణ్ణించి ప్రెజర్ వుంది, అక్కణ్ణించీ వుంది. పైగా ప్లెయిన్సులో మీ గురించి నేనేమీ తప్పుడుగా చెప్పలేదే?! అక్కడ వాళ్లు కరెక్టుగా ఉందని చెప్పిన మాటే చెప్పాను కదా! ఏజెన్సీలో జరిగిన తప్పులు చెప్పకపోతే ఎట్లా? నేనొచ్చిందే అందుకు!" అనేటప్పటికి ఇంకేమంటారు...వెళ్లి వేరే కంపెనీల్లో చేరారు.
అద్దీ ...అద్గదీ...
షా కమిషన్ తోడు
నేనాటాడిన తీరు
చడీచప్పుడు చేయక
ౘాప కింద నీరు... తెచ్చిన తీరు!
<వచ్చేమాటు తరువాయి కథ>

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి