26, మే 2019, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 15 - కవలపాటలు - నగు నగుతా వచ్చేసిన తొలివలపు తొందరలు

అల్లప్పుడెప్పుడో
మా ఇద్దర్నీ కన్నవారల పుణ్యంగా 
మేమిద్దరమూ ఓ ఇంట ఉన్నవారమైన వేళ
ఎండా-వానా, మబ్బూ-నీడా, నీరూ-గాలీ
ఏదేమైతేనేం అన్నే మావే అనేసుకుని
కలలలవాటు చేసుకోని, కలతని దరిచేరనియ్యని
కానికాలమేదీ మన జోలికి రానివ్వబోమని ధిలాసాగా
కబుర్లు చెప్పుకుంటూ,పాటలు పాడుకుంటూ కులాసాగా
కమ్మని కొత్తకాపురపు గూడు నేసుకునే రోజుల్లో
కన్నడ నాట విన్నానో పాట
విన్న పాటునే "అరె! ఇదింకెక్కడో విన్నానే?!" అనుకున్న పాట
అనుకున్న పాటునే కనుగొన్న పోలిక మురిపించెనట
తెలిసీ తెలియని ఆ తొలినాళ్ళ వధువు కనులు మెరిపించెనట
ఆ ఒక్క పోలిక పాట-కవలల పట్టి
ఈ ఒక చోట పెట్టుటకీ వేళయిందట!

అసలు పాట:

సినిమాట: గిరికన్యె (1977)
పాట రాసిన వారట: చి. ఉదయశంకర్
పాట కట్టినవారట: రాజన్-నాగేంద్ర
పాట పాడినవారట: డాక్టర్ రాజ్ కుమార్, ఎస్. జానకి
పాటకాడినవారట: డాక్టర్ రాజ్ కుమార్, జయమాల

కన్నడ కంఠీరవుని కంఠానికి జతగా స్వరాల వీణ గళాన మోసే ఎస్జానకి పాడిన ఈ కన్నడ పాట ఊగే అలల మీద తూగే పడవలా సాగుతుంది. చివరగా వచ్చే కుణిసలు నీను - కుణియువె నాను -  మరెయువె జగవన్నే అన్న పల్లవికి కన్నడ కంఠీరవుడు ఆగి, ఆగి చేసిన అభినయం ఒక్క క్షణం తెలుగు నటరత్నాన్ని జ్ఞాపకం చేసింది.

నీవూ నోడి ఆనందిసి!



నగు నగుతా... 
నీ బరువే...
నగు నగుతా నీ బరువే - నగువినలే మనసెళెవే
కుణిసలు నీను - కుణియువె నాను - మరెయువె జగవన్నే...
 ఆ... ఆ... ఆ.. 
నగు నగుతా నీ బరువే - నగువినలే మనసెళెవే
కుణిసలు నీను - కుణియువె నాను - మరెయువె జగవన్నే...

నగు నగుతా నీ బరువే... - నగువినలే మన సెళెవే...
నగు నగుతా...
ఆ...
నీ బరువే...
హౌదు
నగువినలే... 
మన సెళెవే...

నగువే మాతాగి - మాతే ముత్తాగి - ఆ ముత్తే హెణ్ణాగిదే
ఆహా!
హెణ్ణే హూవాగి - హూవే  హణ్ణాగి - హణ్ణూ కణ్ణా తుంబిదే
ఒలవే గెలువాగి - గెలువే చెలువాగి - చెలువెల్ల నిన్నల్లిదే
నిన్నా రూపల్లి - నిన్నా మనదల్లి - ఎందూ నానూ బెరెతే

నీనే నానాగి - నానే నీనాగి - నన్నే నా మరెతే
నగు నగుతా నీ బరువే... - నగువినలే మనసెళెవే...
కుణిసలు నీను - కుణియువె నాను - మరెయువె జగవన్నే
నగు నగుతా నీ బరువే... - నగువినలే మన సెళెవే...
నగు నగుతా...నీ బరువే...
నగువినలే... మన సెళెవే...


ఆహా ఆ ఆ అ ....ఆహ అహా.... ఆఆ ఆ
ఆఅ ఆఆఆ...  ఆహా .... ఆఆఆఆ

ఏకో సంకోచ - ఏనో సంతోష - నింతల్లే నిల్లలారెను
నిజవాగి?
నిన్నా మాతింద - ఏనో ఆనంద - ఎందూ నిన్నా బిడెను
ఊరా మాతేకె - యారా హంగేకె - బా ఇల్లి నీ మెల్లగే
యారూ ఇల్లిల్ల - నావే ఇల్లెల్ల - బేగా బా బా బళిగే

సోతే నానీగ - ఏనో ఆ వేగ - ఇన్నూ నా తాళెను..

నగు నగుతా నీ బరువే... - నగువినలే మనసెళెవే...
కుణిసలు నీను, కుణియువె నాను మరెయువె జగవన్నే...

నగు నగుతా నీ బరువే... - నగువినలే మనసెళెవే...
కుణిసలు నీను - కుణియువె నాను -  మరెయువె జగవన్నే
నగు నగుతా నీ బరువే... నగువినలే మన సెళెవే...
నగు నగుతా... నీ బరువే... నగువినలే ... మన సెళెవే…
నగు నగుతా... నీ బరువే... నగువినలే ... మన సెళెవే…

సిసలు పాట:

సినిమాట: సొమ్మొకడిది - సోకొకడిది (1978)
పాట రాసిన వారట: వేటూరి సుందరరామ మూర్తి
పాట కట్టినవారట: రాజన్-నాగేంద్ర
పాట పాడినవారట: ఎస్పీబీ , ఎస్. జానకి 
పాటకాడినవారట: కమల్ హాసన్, జయసుధ

అసలు నాకు ముందు తెలిసినది ఈ సిసలు పాటే. చిన్నప్పట్నుంచీ రేడియోలో చాలా సార్లు విన్నా, చాలా ఏళ్ళు ఏ సినిమా లోదో కూడా తెలియదు. యూట్యూబ్ పుణ్యమా అని సొమ్మొకడిది-సోకొకడిది సినిమా చూడ్డంతో ఈ రొమాంటిక్ మెలోడీ  ఆనుపానులు తెలిశాయి.

ఈ పాటలో కమల్ హాసన్ పెట్టుకున్న flat cap, జయసుధ వేసుకున్న blue frock. కాళ్ళకి తొడుక్కున్న wellies, జుట్టు ముడి - ఒక fashion statement లా ఉంటాయి. పాటకి ఒక stylish mood ని తీసుకొచ్చాయి. నాకు ఈ ఒక్క పాటలో - అది కూడా మొదటి చరణం దాకా - జయసుధ కనిపించినంత stylish గా ఇంకే సినిమాలోనూ చూసినట్లు గుర్తు లేదు.

రెండో చరణంలో వణికే నీ మేన .. సణిగే నా వీణ .. పలికిందిలే మోహనా అంటూ ఎస్పీబీ గొంతు వణికించిన తీరు అద్భుతం. అందులోనూ మోహనా అన్న పదం అంత మోహనంగా మోహనరాగంలో పలకడం బాలూకే చెల్లు. ఈ పాటలో మోహనా అన్న ఒక్క మాట కోసం రోజూ ఈ పాట ఒక్కసారైనా వింటుంటాను ఇప్పటికీ నేను. 

అదే రెండో చరణంలో అస్సలు వాననేదే లేకుండా కురిసే ఈ వాన.. తడిసే నాలోనా.. రేపిందిలే తపనా అనిపిస్తూ జయసుధని సముద్రంలో దొర్లించి, పొర్లించడం సింగీతం వారి దర్శక-చమత్కారం. కాకపోతే అలా తడిసిన జయసుధని చూసి Et Tu, సింగీతం? అనుకోకుండా ఉండలేకపోయాను. రెండో చరణంలో కూడా జయసుధని మొదట్లాగే చూపిస్తే చూడక పోయేవాళ్లమా?! పైగా సినిమా తీసి విడుదల చేసేవరకు అసలెలా ఉంటుందో ఊహించను కూడా ఊహించలేని ప్రేక్షకులను "మీరలా అడుగుతారని మేమలా తీస్తాం" అనేస్తారు. అదొక్కటి వదిలేస్తే, అసలొదిలేయకపోయినా నాకు ఈ పాట భలే ఇష్టం. 

కంటూ, వింటూ, పాడుకుంటూ ఆనందిస్తారని... నాకు నచ్సిన పాట ఇక్కడ...ఇలా.. 

 తొలివలపూ..తొందరలూ
తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను.. చలితో నీవు.. చేసే అల్లరులూ...
తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు.. చలితో నేను.. చేసే అల్లరులూ...

తొలివలపూ తొందరలు.. ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు .. తొందరలు.. ఉసిగొలిపే .. తెమ్మెరలు
 పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు.. కరగాలి కౌగిళ్ళలో
వలపించే ఒళ్ళు.. వలచే పరవళ్ళు.. కదిలే పొదరిళ్ళలో
తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు.. కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు.. బిగిసే సంకెళ్ళలో

నీలో అందాలు.. నేనే పొందాలి..నాకే చెందాలిలే..

తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను.. చలితో నీవు.. చేసే అల్లరులూ... 
తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు 
తొలివలపు .. తొందరలు.. ఉసిగొలిపే .. తెమ్మెరలు 

ఆహా ఆ ఆ అ ....ఏహె ఏహె... ఆఆ ఆ
ఆఅ ఆఆఆ...  ఆహా .... ఓ ఓ ఓ ఓ 

కురిసే ఈ వాన.. తడిసే నాలోనా.. రేపిందిలే తపనా
పలికే పరువాన.. వలపే విరివాన .. నీవే ఆలాపనా

వణికే నీ మేన .. సణిగే నా వీణ .. పలికిందిలే మోహనా
విరిసే నా నవ్వు.. విరజాజీ పువ్వు .. సిగలో నేనుంచనా

నీలో రాగాలు.. నాలో రేగాలి.. నేనే ఊగాలిలే

తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు.. చలితో నేను.. చేసే అల్లరులూ... 
తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు 
తొలివలపూ ఆహా తొందరలు 
ఉసిగొలిపే ఉహూఁ తెమ్మెరలు
తొలివలపూ తొందరలు  
ఉసిగొలిపే తెమ్మెరలు 



మొదట విన్న పాట తెలుగు పాట
అసలు అన్న పాట కన్నడ లోనట
ఆ పాట ఈ పాట - ఏ పూటైనా
అసలింకే పాటైనా - ఏ నోటైనా నాకిష్టమేనట
నాకిష్టమైనది పంచుట ఇంకెంతో ఇష్టమట
ఆ ఇష్టంతోనే పంచినవీ పాటలట ...

 ~ పాటల భైరవి

8 కామెంట్‌లు:

  1. అసలు ఎలా పట్టుకుంటావ్... మోహనా... 😳
    నాకన్నీ ఒక్క లాగే ఉంటాయి.😄

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇలా ఏదో ఒక్క మాట నచ్చిందని వినే పాటలు చాలా వున్నాయి నాకు- నేనేం పట్టుకోను కానీ అవే "పట్టించు"కుంటాయి :))

      తొలగించండి
  2. బాగున్నాయి మీ కవల పాటలు. చాలా రోజులు అయ్యింది ఆ పాట విని. Thank you for sharing.

    రిప్లయితొలగించండి
  3. నీ మెదడు మ్యూజియం అక్కా.... రోబో చిట్టి లా అలా చూసి... విని ...విశ్లేషిస్తూ హు..హు..ఎలా చెప్పాలి నాకు అర్ధం అవటం లేదు....ఏ బాష అయినా ఉతికి ఇస్త్రీ చేసేస్తున్నావ్. సూపర్ అక్కా
    కానీ రాజకుమారుని నృత్యవిన్యాసం బహుబాగుగా నవ్వుతెప్పించినది....🕺🕺

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి తమ్ముడూ! శీతకన్నేసేశావ్!

      తొలగించండి