ఆగానని, ఆగి తాగానని – తింటానని, దెబ్బ తింటానని
అనుకోమాకు కలగనమాకు గోదారీ
అంటూ తూగే ఓ ఆల్కహాలిక్ హడావిడి
కానిచోట కాశావు వెన్నెలా!
కారడవుల కాశావు వెన్నెల
ఎవరి కొరకు కాశావే వెన్నెలా?
అడవి కాసినా వెన్నెలా! ...
అంటూ సాగే ఓ మెలాంకలిక్ ఆరడి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడి పోతే
అదే అచ్చట అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంటా
అంటూ ఊగే ఓ రొమాంటిక్ మెలొడీ
ఎప్పుడు పాడతారో
ఎవరు పాడతారో
ఎందుకు పాడతారో
ఎలా పాడతారో
తెలుసుకోవాలంటే
నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
జూన్ నెల సంచికలో...
ఈ లింక్ దారి వెంబడి నడిచి అలా అలా: జూన్ నెల సరదా సిన్మాయణం
మన్నించుమా చదువరీ! ఈసారి సరదా సిన్మాయణంలో - చక్కగా కుదిరిన ఊరీఊరని మెంతిముక్కల్లో అక్కడక్కడా నలగక, నమిలే పంటి కింద పడి సతాయించే మెంతి బద్దల్లా - ఓట్రెండ్మూణ్ణాలుగు అచ్చుతప్పులు చదివే కంటిని సతాయిస్తాయి. వాటిని ఈ మాటుకి ఆట్టే పట్టించుకోకుండా చదివేస్తిరా - ఇంక మీదటకి, ఇంకో మాటుకి ఆ పొరపాటు అలవాటు కాకుండా చూసుకుంటానని ఖామీ (అనగా....ఖాయమైన హామీ) రాసిస్తున్నా!
~ సినీ-మా-లక్ష్మి వ్రాలు
మీ సిన్మతులు భలే సరదాగా ఉంటాయండి. ఎస్జానకి, జేసుధ, ఏఎన్నారు,డిఎన్నారూ.. మీరు సూపరండి పేర్లెట్టెయటంలో. అవునండీ లలిత గారు, కళ్ళు మూసుకుని ఎలాగోలా ఎలా చూస్తారు?
రిప్లయితొలగించండినా సిన్మతులు మెచ్చుకున్నది ఇన్నాళ్ళలో మీరొక్కరే! బోల్డన్ని థాంక్స్! నాకు హారర్ సినిమాలు అంటే నిజంగానే చాలా భయం. కళ్ళు మూసుకుని వేళ్ళ సందుల్లోంచి చూస్తాను :))
తొలగించండి