కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 16 - ౘాప కింద నీరు... తెచ్చిన తీరు!
1977 ఆగస్టు-సెప్టెంబర్ ప్రాంతంలో ఒకసారి మైసూర్ వెళ్ళొచ్చాను. ఒక మూణ్ణాలుగు రోజులు అక్కడుండి అక్కడ స్టాఫు, సెటప్ అంతా సరిగా ఉందో లేదో చూసుకుని వచ్చేశాను. అక్కడున్న అజిత్ ఒంబత్కరె అంచెప్పేసి ఆయన కూడా మా గురువు గారే! నా కన్నా చాలా పెద్దవాడు. ఆయన "ఇంక ఇక్కడికి ఇంత దూరం వద్దురా నువ్వు. అక్కడే ఉండి వ్యవహారం చూసుకో" అని చెప్పేశాడు. దాంతో నేనింక మైసూర్ వైపు వెళ్ళలేదు.
ఫిబ్రవరి నుంచి జూన్ వరకు NLS-Northern Light Soils అని చెప్పి జంగారెడ్డి గూడెం ఏరియాలో అటువేపు ఉండేవాణ్ణన్నమాట. అంటే ప్రతి సోమవారం జంగారెడ్డిగూడెం వచ్చి శనివారానికి గణపవరం వచ్చేస్తూ ఉండేవాణ్ణి. తర్వాత ఏంటంటే జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా నేను గణపవరంలోనే ఉండేవాణ్ణి. ఉంటూ ఆ సౌత్ బ్రాంచెస్ ఉండేవి మాకు - మార్టూరు, రేలంగివరం చెక్క, ముప్పవరం, మేదరమెట్ల - తర్వాత... అప్పటికింకా టంగుటూరు లేదు, కందుకూరు ఉండేది, కావలి దగ్గర. ఈ బ్రాంచెస్ అన్నిటికీ వెరిఫికేషన్‌కి వెళ్లి వచ్చేస్తూ ఉండేవాణ్ణి. అది పెద్ద పనేం కాదు. కాకపోతే నవంబర్, డిసెంబర్లో మాత్రం తప్పకుండా ఏజెన్సీకి వెళ్ళాల్సొచ్చేది. ఆ ఏజెన్సీ రైతుల వ్యవహారం అదీ నేనే సెటిల్ చేశాను కదా! నే చెప్పినట్టుగానే అక్కడ స్వామిని మేనేజర్ని చేశారక్కడ.
ఇలా జరుగుతుండగా - మా సీతారామయ్య పంతులు గారికి 1977లో హార్ట్-స్ట్రోక్ వచ్చింది. ఆయనింక హెడ్డాఫీసుకే పరిమితమై పోయారు. బయటికి వచ్చేవారు కాదు. అంచాత ఏంటంటే జంగారెడ్డిగూడెంలో MVR ప్రసాద్ అని బ్రాంచ్ మేనేజర్ ఉండేవాడు. వాడూ నేనూ కలిసి CK రాజగోపాల్ అని మంగళగిరిలో పోలీస్ ట్రైనింగ్ అవుతున్నాడాయన. ఆయన అంతకు ముందు ILTD కంపెనీలో బయ్యరుగా పని చేశాడు జీరుగుమిల్లి, బుట్టాయిగూడెం ఏరియాల్లో. ఆయన దగ్గరికెళ్ళి మాట్లాడి లక్ష్మయ్యగారికి చెప్పి ఆయన్ని కంపెనీ లోకి తీసుకునేలా చేశాం. ఆయన పోలీస్ డిపార్టుమెంట్ వదిలి వచ్చేసి జంగారెడ్డిగూడెంలో సర్కిల్ మేనేజరుగా చేరాడు. ఏలేశ్వరంలో నేమో స్వామి బ్రాంచ్ మేనేజర్. చైనులు క్యాషియర్.
సరే! ఇలా నడుస్తూ ఉండేది. నేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ దాకా జంగారెడ్డిగూడెం ఏరియా, నవంబర్, డిసెంబర్ ఏలేశ్వరం చూసుకునేవాణ్ణి. జనవరి నెల నాకు ఖాళీ. జనవరి నెల్లో పిల్లల్ని తీసుకుని అనాతవరం పండగలకి మా ఇంటికి వెళ్ళేవాణ్ణి. మా అమ్మ, మా అన్నగారు, వదిన, పిల్లలూ వుండేవాళ్ళక్కడ. పండగలకి వెళ్లి వాళ్ళందర్నీ చూసొచ్చేవాణ్ణి.
ఇలా జరుగుతూ ఉండగా ఏమయ్యిందంటే
1977-78లో సంగతి ఇది. నేను, VSV ప్రసాద్, KTLN మూర్తి - మేం ముగ్గురం బీకామ్ డిగ్రీ మూడు సంవత్సరాలూ కూడా క్లాస్మేట్సుమి. , వాడూ, క్లాస్మేట్సు. VSV ప్రసాద్ CA కూడాచేశాడు - వడ్లమాని ఉమామహేశ్వరరావు దగ్గర గుంటూర్లో. చేసి... వీడు తర్వాత అనకాపల్లిలో విజయా బాంకులో క్లార్కుగా పని చేసేవాడు .
VSVP ఫ్రెండే కాకుండా మాకు చుట్టం కూడా. ఈ ఉమామహేశ్వరరావుగారు వాణ్ణి తీసుకొచ్చి కంపెనీలో ఇంటర్నల్ ఆడిటరుగా ప్రవేశ పెట్టాడు. వాడితో పాటు KTLN మూర్తి కూడా వచ్చి అకౌంట్స్ ఆఫీసులో క్లార్కుగా చేరాడు. మేం ముగ్గురం క్లాస్మేట్స్ కదా -బయట సరదాగా తిట్టుకుంటాం, జోకులేసుకుంటాం ఒకళ్ళ మీదొకళ్ళు. ఇలా నడిచేది.
వాళ్లిద్దరూ నాతోబాటే కంపెనీలో జేరింతర్వాత VSVPని బయటికి పిలిచి చెప్పా.
"ఒరే! నువ్వు ఇంటర్నల్ ఆడిటరుగా వచ్చావు. నాకు సుపీరియర్వి. నేనిక్కడ క్లెరికల్ పోస్టులో వున్నాను. అంచేత ఆఫీసులో వున్నప్పుడు నేన్నిన్ను 'ఏవండీ' అని పిలుస్తాను. 'ఏవండీ ప్రసాద్ గారూ' అనే మాట్లాడతా. నువ్వు మాత్రం నన్ను 'ఏవండీ' అనకపోయినా 'ఏవయ్యా' అన్నా పర్లేదు నాకు. కానీ 'ఒరే, అరే' అన్నావనుకో తాట లేచిపోతుంది. పిచ్చి వేషాలెయ్యొద్దు అలాగ. ఎందుకంటే మన ఇద్దరి రిలేషన్ వాళ్లకి తెలియకూడదు." అన్జెప్పి అన్నా.
వాడు కూడా "సరేరా! ఆఫీసులో ఉన్నప్పుడు అలా చేద్దాం. బయటికొచ్చినప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు" అంచెప్పేసి నాతో అన్నాడు.
KTLN మూర్తి, నేను 'ఒరే' అంటే 'ఒరే' అనుకునేవాళ్ళం మాఇద్దరి క్యాడర్ ఒకటే కాబట్టి. ఈరకంగా నడుస్తోంది.
ఈలోపులో ఏమయ్యిందంటే 1978లో నేను నవంబర్ నెలలో ఏలేశ్వరం దగ్గర అమీనాబాద్ కాలనీలో వున్నాను. బయ్యింగ్ జరుగుతోంది. దాదాపు వెయ్యి బేళ్ళెన్నో వచ్చున్నాయి అక్కడ. బయ్యర్ వచ్చి బయ్యింగ్ చేస్తున్నాడు.
మా పంతులుగారి మేనల్లుడు ప్రసాద్ అని చెప్పి ఒహతనున్నాడు. మా పంతులు గారికి ఒక్కరే సంతానం. ఈ మేనల్లుడంటే మహా ప్రేమ ఆయనకి. 1978 నవంబర్ చివర్లో మేమక్కడ బయ్యింగులో వున్నప్పుడు ఆయన హఠాత్తుగా కాలం చేశారు. ఏలేశ్వరం ఆఫీసుకి లైట్నింగ్ కాలొచ్చింది "ఇలా పంతులు గారు పోయారు. కామేశ్వరారావుకి, ప్రసాదుకి వెంటనే బయలుదేరమని" చెప్పేసి మా ఫ్యాక్టరీ మేనేజర్ సుబ్బన్నగారు ఫోన్ చేసి చెప్పారు. దాంతో ఆఫీసులో ఒకతను ఏలేశ్వరం నుంచి అమీనాబాద్ కాలనీకి వచ్చి ఆ కబురు మాకు చెప్పాడు.
అక్కణ్ణించి చేతిలో బులెట్ మోటార్ సైకిలుంది కదా! అప్పుడింక బస్సులు, గిస్సులు అంటే టైం సరిపోదు. ఎందుకంటే సాయంత్రమే కార్యక్రమాలన్నీ అయిపోవాలి. అప్పుడింక అమీనాబాదు కాలనీ నుంచి నుంచి బయల్దేరి దాదాపు 24 కిలోమీటర్లు గెడ్డంగి మీదుగా ఏలేశ్వరం, 45 కిలోమీటర్లేమో హైవేకి రావాల. అక్కణ్ణించి ఓ 35-40 కిలోమీటర్లు రాజమండ్రి. రాజమండ్రి నుంచి 200 కిలోమీటర్లు విజయవాడ, మళ్ళీ విజయవాడ నుంచి చిలకలూరిపేట దాదాపు 60 కిలోమీటర్లుంటుంది. ఈ మొత్తం ప్రయాణం బుల్లెట్ మోటార్ సైకిల్ మీదే - ప్రసాదు నెక్కించుకుని బయల్దేరి వచ్చేశాను.
రాజమండ్రిలో ఆగి హోటల్లో ఏదో తినేసి మధ్యాహ్నం మూడు గంటల కల్లా చిలకలూరిపేటలో వున్నాము. అప్పుడు ఊరేగింపు జరుగుతోంది. ఓ లారీ మీద పంతులుగార్ని పెట్టి పూలూ అవన్నీ జల్లుతూ, ఎక్కడెక్కడి నుంచో రైతులు, గ్రేడర్స్, కంపెనీ స్టాఫు - వీళ్లంతా మొత్తం చిలకలూరిపేట వీధుల్లో మధ్యాహ్నం మూడు గంటలకి మొదలుపెట్టిన ఊరేగింపు సాయంత్రం ఐదూ-ఐదున్నర దాకా సాగింది. ఆ కార్యక్రమాలన్నీ అయింతర్వాత ఆ రాత్రికి గెస్ట్ హవుసులో ప్రసాదుని విదిలేసి, నేను గణపవరంలో మా ఇంటికి వెళ్ళిపోయాను. మరసటి రోజు రెస్టు. సుబ్బన్నగారు కూడా "వద్దులే! వెళ్లొద్దు. ఇంకో రోజు ఆగెళ్ళు" అన్నాడాయన. అలాగే ఉండిపోయి ఆ తర్వాతి రోజు పొద్దున్నే ఐదింటికి నేనొక్కణ్ణే బయల్దేరి బుల్లెట్ వేసుకుని ఏలేశ్వరం వచ్చేశాను.
ఆ రకంగా ఆ సీజన్ అయిపోయింది. మళ్ళీ ఫిబ్రవరిలో NLS మొదలయింది. అంటే జంగారెడ్డిగూడెం ఏరియా. అంటే మేమందరం వెళ్ళాలి కదా అక్కడికి! వింటాబెక్స్ అనే కంపెనీ ఉండేది. టోనీ లూయిస్ కానీ, మాక్స్ బెలోనీ కానీ నేనొస్తే కానీ ఊరుకొనేవాళ్ళు కాదు. తప్పకుండా నేనక్కడ ఉండాల. సరే! ఇంకక్కడ బ్రాంచెస్ అన్నీ తెరిచి అక్కడే ఉండేవాణ్ణి. C. K. రాజగోపాల్ గారు సర్కిల్ మేనేజర్. నేను మామూలుగా నా పని బ్రాంచెస్‌లో చేస్తూ తిరుగుతూ ఉండేవాణ్ణి.
అక్కడ ఈలోపులో హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పేసి ఒక రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - ఆయన్ని జంగారెడ్డిగూడెంలో కంపెనీకి తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే 78లో టోబాకోకి ఎక్సైజ్ పోయింది. చౌదరీ సింగ్ ప్రధాన మంత్రి అయినప్పుడు పొగాకు మీద ఎక్సైజ్ తీసేశాడు. ఒక ఫ్యాక్టరీ సేల్స్ మీదే కానీ రైతులు ఎక్సైజ్ కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ బెనెఫిట్ ఇచ్చాడాయన. అప్పుడేంటంటే ఎక్సైజ్ మీద పెద్ద పనేం ఉండేది కాదు. అంత పనేం లేకపోయినా పాత అలవాటు ప్రకారం కంపెనీలో ఎక్సైజ్ కొనసాగింది బుక్స్ అవన్నీ కూడా.
హరిశ్చంద్ర ప్రసాద్ గారు మాకు ఎక్సైజ్ ఇన్-ఛార్జ్. నేను, నా స్టాఫు పని చేసుకుంటూ స్టాటిస్టిక్సులో ఉండేవాణ్ణి. వింటాబెక్స్ ఎకౌంట్ మెయిన్ నాకు.
హరిశ్చంద్ర ప్రసాద్ గారు నా దగ్గరి కొచ్చి "ఇదిగో కామేశ్వరరావుగారూ! మీరు ప్రతీ రిపోర్టు నాకివ్వాలి. నాకిచ్చింతర్వాతే వింటాబెక్స్ వాళ్ళకివ్వాలి" అన్నాడు.
అప్పుడు నేను "నాకు, మీకు సంబంధం లేదు. మీ పని మీరు చేసుకోండి. నా పని నంజేయనివ్వండి. అంతే గానీ నా జోలికి రావొద్దు." అని చెప్తే అది వినకుండా "ఇవ్వాలి, ఇవ్వాలి" అని గొడవ గొడవ జేసేవాడు. లెక్క ప్రకారం ఆయనకి నేనేం చూపించక్కర్లేదు. ఇలా విసిగిస్తున్నాడని ఎప్పుడడిగితే అప్పుడు, ఎంతవరకైతే అంతే సగంసగం చేసిన ఎకౌంట్లు చూపించేవాణ్ణి. నిజానికి ఆయనకవి ఎలాగూ అక్కర్లేదు, పైగా అర్థం అయ్యేవి కాదు. ఇంక నా జోలికి రావడం తగ్గించాడు.
సరే! ఆయన సంగతలా వదిలేస్తే VSV ప్రసాద్ ఒకడు కొత్తగా జేరాడు కదా! మామూలుగా నేను చెప్పినట్టుగానే వాడు "ఏమయ్యా కామేశ్వరరావు!" అంటూ ఉండేవాడు. మాకు పెద్దగా పనిలో ఏ సంబంధమూ లేదు. వాడు ఎకౌంట్స్, నేను లీఫ్ సైడు. అయినా సరే బ్రాంచ్ ఎకౌంట్స్ అవీ చూస్తూండేవాణ్ణి కాబట్టి అవన్నీ పిలిచి అడుగుతూ ఉండేవాడు.
వాడు హెడ్డాఫీసులో వున్నప్పుడు ఓసారి నాగార్జునసాగర్ ప్రోగ్రాం పెట్టాడు. "ఒరే! రేపు మనందరం కలిసి నాగార్జునసాగర్ వెళ్తున్నాం ఫామిలీస్ తోటి" అంజెప్పేసి అంటే నేను ఇంట్లో చెప్పి, అందర్నీ రెడీ చేసుకుని - ఓ నాలుగు రోజుల్లో వెళ్దామని ప్లాన్. సరిగ్గా వెళ్లే రోజు పొద్దున్న ఐదింటికి పిల్లల్ని లేపి తయారు చేస్తుండగా వాడొచ్చి "ఒరే! కారు ఖాళీ లేదు. నువ్వు డ్రాప్ అయిపో" అన్నాడు. నాకిబ్బంది లేదు - నేనాగిపోతా. కానీ పిల్లలు - లల్లి, కుట్టి ఇద్దరూ మొహాలు వేళ్ళాడేసేసుకుని అప్పటివరకూ నాగార్జున సాగర్ వెళ్తున్నామంటూ ఎగురుతున్నవాళ్ళు కాస్తా ఒక్కసారిగా డల్ అయిపోయారు. వాళ్ళనలా చూడగానే అస్సలు నాకు చాలా ఇబ్బందనిపించింది. సర్లే! చూద్దాం. వీడి సంగతి. ఎప్పుడోకప్పుడు దొరక్కబోడు అని అప్పట్నుంచి వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండేవాణ్ణి. KTLN మూర్తితో బానే ఉండేది.
ఇది జరిగింతర్వాత ఈ NLS వచ్చింది కదా! ఫిబ్రవరిలో బ్రాంచెస్ తెరిచాం. కొనుగోళ్లు మొదలు పెట్టారు. VSV ప్రసాద్ మార్చ్ నెల్లో జంగారెడ్డిగూడెం ఎకౌంట్ వెరిఫికేషన్‌కి వచ్చాడు . మరి వాడి క్యాడర్ ఇంటర్నల్ ఆడిటర్. CK రాజగోపాల్ సర్కిల్ మేనేజర్ కదా! ఆయన దగ్గర కూర్చుంటాడు. ఓ రోజు మధ్యాహ్నం పూట వీళ్ళిద్దరూ బీర్ తాగారు. తాగి మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. ఓ గంట రెస్ట్ తీసుకున్నారు. మూడున్నరకెంతకో ప్రసాద్ ఆఫీసుకొచ్చాడు. వచ్చి అకౌంట్స్ మొత్తం వెరిఫై చేయడం మొదలుపెట్టాడు. సాధారణంగా ఇంటర్నల్ ఆడిటర్ చేసే పనే అది.
ఆఫీసులో మొదటి గది రాజగోపాల్‌ది.
అప్పుడు ASN మూర్తి అనే అతను క్యాషియరుగా ఉండేవాడు. అతను గుంటూరతను. NBR ప్రసాద్ మేనేజర్. తర్వాతి గదిలో వీళ్ళుండేవాళ్లు.
మూడోది ఓ పెద్ద హాలు. ఆ హాల్లో నా సీటుండేది. మిగతా వాళ్ళందరూ నా స్టాఫు వుండేవాళ్ళు. వాళ్ళందరి పనులూ నా కంట్రోల్లో ఉండేవి. స్టాటిస్టిక్స్, ఎక్సైజ్ వాళ్ళందరూ అక్కడ వుండేవాళ్ళన్నమాట.
సరే! ఈ మూడు గదులూ కూడా ఒక రైల్వే కంపార్టుమెంటులా ఒకదానికొకటి అనుకుని ఓపెన్‌గా ఉండేవి. ఇంక VSV ప్రసాద్ అకౌంట్స్ చూస్తూ క్యాషియర్ దగ్గర కూర్చున్నాడు. పక్కనే NBR ప్రసాద్ వున్నాడు. ఆ పక్క గదిలో రాజగోపాల్ కూర్చున్నాడు.
ఇంతలో అకౌంట్స్ చూస్తున్నVSV ప్రసాద్‌కి నాది అడ్వాన్స్ అకౌంట్ ఒహటి కనబడింది అక్కడ. నేను చిలకలూరిపేట నుంచి వస్తుంటాను కదా! ఇక్కడ అడ్వాన్స్ వాడుతూ ఉంటా. వాడి మళ్ళీ అక్కడికెళ్ళినప్పుడు అకౌంట్స్ సబ్మిట్ చేసి తీసుకొచ్చి కాష్ కడుతూ వుంటాను. జరుగుతున్నది అది.
నా అడ్వాన్స్ అకౌంట్ కనపడగానే వీడు క్యాషియర్ ASN మూర్తిని అడిగాడు "ఏంటి? ఈయన అడ్వాన్స్ ఏంటిక్కడ?" అంటూ.
వెంటనే ASN మూర్తి "మరి ఆయన పేట నుంచి వస్తున్నాడు కదండీ ఇక్కడకి!. ఇక్కడ అడ్వాన్స్ తీసుకుంటుంటాడు. మళ్ళీ చిలకలూరిపేట వెళ్ళినప్పుడు ఆ బిల్స్ అవీ పెట్టుకుని, వచ్చినప్పుడు మాకేమో ఇక్కడ అడ్వాన్స్ క్లియర్ చేస్తూ ఉంటాడు." అంచెప్పేసి అన్నాడు.
NBR ప్రసాద్ కూడా నా ఫ్రెండే. వాడు కూడా "అదే జరుగుతోంది, ప్రసాద్ గారు! కాకపోతే వాడికి ఖర్చెక్కువ కదా! కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటాడు." అన్నాడు.
అనేటప్పటికి వీడేం చేహాడంటే నన్ను పిలిచాడు. ఆ పిలివడం కూడా ఎలాగా... బీరు తాగున్నాడు కదా "ఒరే కామేశ్వర్రావ్! ఇట్రా!" అన్నాడు.
అప్పటికే నాకు "ఓహో! మన ఒప్పందం జారిపోయింది. "ఒరే" కొచ్చేశాడు వీడు. అయినా చూద్దాం. ఇంకేం జరుగుతుందో" అనుకుని - ఎందుకంటే స్టాఫ్ అంతా వున్నారు కదా - వాళ్ళ ముందు అనవసరంగా ఆవేశపడి వాడి మర్యాద పోగొట్టకూడదు కదా! - అనుకుని వాడున్న రూంలోకి వచ్చాను. తలుపులన్నీ తెరిచే వున్నాయి.
"ఏరా! ఏంటిక్కడ అడ్వాన్స్ ఏంటి? అసలేమనుకుంటున్నావ్? నువ్వక్కణ్ణించి తెచ్చుకోవాలి. ఇక్కడ అడ్వాన్స్ తీస్కోకూడదు." అన్నాడు వాడు.
"ప్రతివారం వస్తున్నాను ఇక్కడికి. మరి అక్కణ్ణించి తెచ్చుకున్నది సరిపోదు కదా ! అందుకే అడ్వాన్స్ వాడుతున్నాను." అని నేను గౌరవంగానే మాట్లాడాను.
మాట్లాడితే వీడేం చేశాడంటే ఆ ASN మూర్తితో "ఇదో మూర్తీ! ఈ వెధవకి ఇంకిక్కణ్ణుంచి రూపాయివ్వకు నువ్వు. ఎందుకంటే వీడు ఇక్కడ తీసుకోవడం, అక్కడ బిల్స్ సబ్మిట్ చేయడం ఇలాంటివన్నీ నాక్కుదరవ్. ఈ వెధవకి రూపాయివ్వకు" అన్నాడు.
అది వినగానే ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా స్టన్నైపోయారు. వాడు పెద్ద గొంతు పెట్టుకుని మాట్లాడేటప్పుడే వాళ్ళందరి దృష్టీ నా మీదుంది "కామేశ్వరరావుగారినేదో తిట్టేస్తున్నారు' అని.
ఎందుకంటే స్టాఫ్ అంతా నేను ఎంచుకుని పెట్టుకున్నవాళ్ళే! నా సంగతి వాళ్లందరికీ తెలుసు. 'ఈయన ఎలా రియాక్ట్ అవుతాడో ?!" అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉండగా - వీడెప్పుడైతే ఆ మాటన్నాడో నాక్కళ్ళు ఎఱ్ఱబడిపోయినయ్. వెంబడే ఒంగుని ఎడంకాలి చెప్పు తీసి చేత్తో పట్టుకుని రౌద్రంగా నిలబడ్డా.
అలా నించుని....
ఇక్కడికి ఆపుతా!
నా కళ్ళు ఎఱ్ఱనా ...
ఎక్కాయి చప్పునా ...
ఆ పైన ఏమైందో ...
ఆనక చెప్పనా...!
<వచ్చేమాటు తరువాయి కథ>

కథ యాక్షన్ మూడ్ లోకి టర్న్ అయ్యేట్లు ఉంది లలిత గారు, బాగుంది పోస్ట్.
రిప్లయితొలగించండిఅంతేనండి, పవన్‌గారు :) Thanks for your comment.
తొలగించండి