29, జూన్ 2019, శనివారం

ఎంత బాగా చేశావయ్యా...ఏజెంటాత్రేయా!

అనగనగా ఒక ఊరు - అదే అందరికీ తెలిసిన నెల్లూరు.
ఆ వూళ్ళో ఓ ఏజెంటు  - నెల్లూర్లో వెలిసిన FBI ఏజెంటు.
  
కాడతను , కానే కాడు ఏజెంటాఫ్ ఎల్లైసీ.
తాను చేసేది దేశీ జాసూసీ.

ఈ సరి కొత్త డిటెక్టివ్ హీరో...
తెలుగు తెరకో pseudo షాడో!

కోటు తొడిగి, టోపీ పెడితే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.
ఏ నైటో కలవరించి, కళ్ళ నీళ్లు తిరిగే వేళ శ్రీను అనే అమ్మ చాటు పాపాయే!

ఏజెంటాత్రేయకి ఓ అసిస్టెంటు స్నేహ.
వీళ్ళిద్దరి బంధం ఏజెంటు-అసిస్టెంటు - అంతే!

డ్యుయెట్లు లేవ్, రొమాంటిక్ ట్రాకుల్లేవ్.
కాలితో తన్ని పడిపోతే నవ్వుకునే అ-కామెడీ జోకుల్లేవ్.

కాకపోతే కథ చెప్పేది కాదు.
చెప్పేస్తే సరదా లేదు.
చూడాల్సిందే!

రెండు గంటల సినిమాలో ఫ్రేమ్-ఫ్రేముకి వున్న చిన్నచిన్న డీటెయిల్స్ ఎవరికి వాళ్ళు చూసి నవ్వుకోవాల్సిందే!
చూసే సినిమాలో ఉత్సుకతనీ, కుతూహలాన్నీ పెంచేలా వున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విని, వింటూ సినిమా చూసి నచ్చుకోవాల్సిందే! 

మా  ఇంట్లో కిందటి వారమే మాట్లాడుకున్నాం ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా గురించి. పెద్ద హీరోల సినిమాలు ఎవరైనా చూస్తారు, మనం మాత్రం ఇలాంటి కొత్తవాళ్ళు తీసే మంచి సినిమాలు మాత్రం తప్పకుండా థియేటర్లో చూడాల్సిందే అని కూడా అనేసుకున్నాం.

అనుకున్నాం కదా మరి...ఆన్లైన్లో టికెట్లు కొనేసుకున్నాం. శుక్రవారం అంటే నిన్న నాలుగింటికి చూస్తే మావే మొట్టమొదటి టికెట్లు. ఇంకా ఎవరూ కొనలేదు.

రాత్రి తొమ్మిదింటికి మేము సినిమా హాల్లో అడుగు పెట్టగానే కనిపించిన ఇంకో నలుగురంటే నలుగుర్ని మాత్రమే చూసి ఓ నిముషం ఉసూరుమనిపించింది. కానీ సినిమా ఇంకో పది నిముషాల్లో మొదలవుతుందనగా సీట్లు గబగబా నిండడం చూసి అదేదో మా సొంత సినిమాకే అందరూ వచ్చేస్తున్నట్లు మురిసిపోయాం. చూస్తున్నంత సేపూ థియేటర్లో బోల్డన్ని నవ్వులు, నవ్వులు ఆగినంత సేపూ ఊపిరి బిగపెట్టినంత నిశ్శబ్దం. అసలీ ఈ సినిమా ఇంటర్వల్లో నాకైతే పక్కనున్న వాళ్ళు నాకస్సలు తెలీకపోయినా పలకరించేసి "సినిమా బావుంది కదా!" అని చప్పట్లు కొట్టాలనిపించింది. సినిమాలో అక్కడక్కడ తళుక్కున మెరిసిన నెల్లూరు యాస భలే నచ్చింది మాకు!

ఇంక సినిమా గురించి ఏమన్నా చెప్పాలీ అంటే... ముందే చెప్పినట్లు కథ కానీ, కథ గురించి హింట్ గానీ ఇవ్వకుండా - ఉట్టుట్టినే పైపైన చెప్తా...

పొద్దున్నే మీ ఇంటి ముందు కట్టిన బుట్టలో పాల పాకెట్లు పోతున్నాయా?
దొరికిన ఇద్దరు దొంగల్లో ఎవరు అసలు దొంగోఅంతుపట్టట్లేదా?
చెయ్యని నేరానికి జైల్లో పడితే బెయిలు కావాలా? 

"సమస్యలతో రా...
పది సమస్యలతో రా ...
పదిపది పెంచుకుంటూ రా ...
భయం లేదు పరిష్కారం పది సెకన్లలో ...
ఇచ్చట అన్ని కేసులు పరిష్కరించబడును."
అని  పిలిచేస్తున్నాడు మన FBI నెల్లూరు ఏజెంటాత్రేయ. 
అతనికి సాయం వుంది క్యూట్ & స్వీట్ అసిస్టెంటు స్నేహ 

ఔటాఫ్ స్టేట్ సమస్యలకి సంప్రదించండి - FBI హసన్, కర్ణాటక ఏజెంటు బాబీ. 

ఇంకెందుకాలస్యం!


"థియేటర్‌కి రా...
పది మందితో రా ...
పదిమందిని కలుపుకుంటూ రా...
కథ వుంది, కాలక్షేపం వుంది రెండు గంటల్లో ... 
ఇచ్చట ఎన్నో నవ్వులేరుకోవచ్చును."
అని పిలుస్తోంది...  ఓ మంచి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ!


~సినీ-మా-లక్ష్మి


6 కామెంట్‌లు:

  1. Naaku trailer choosi "Chantabbai" laa undi anukunnanakka. Veelainappudu choodali ee cinema

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తమ్ముడూ చైతూ! చంటబ్బాయ్‌కి ఈ సినిమాకి పోలిక ఒక్క "డిటెక్టివ్" అన్న మాట దగ్గరే. ఇది చాలా కొత్త కథ. అస్సలూహించలేం. అందుకే నేను హింట్స్ కూడా ఇవ్వలేదు. IMO Everyone should watch & enjoy movies without having even the slightest idea of what's going to happen next. This movie gives such an opportunity and I don't want to spoil that. I hope you will get to watch this in a theater.

      తొలగించండి
  2. మీ రివ్యూ బాగుంది లలిత గారు ఇప్పుడే ఆ సినిమా చూసేయాలి అనేంతగా. కాకపోతే చిన్న సినిమా కదా అనిమా ఊర్లో వేసినట్లు లేరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏ Amazon Prime లోనో వస్తే, మీకు వీలైతే తప్పకుండా చూడండి, పవన్‌గారు! మం(చి)న్న సినిమా. బావుంది.

      తొలగించండి
  3. I watched this on Amazon Prime just now (this never got released in my city) - when I saw the title, I remembered that this is what you had blogged about and watched it with more interest. He also reminded me of our own Psmith - with his Leave it to Psmith attitude. Agent Naveen is quite cute - I can't see him singing and dancing around the trees, but I still hope he has a future in Tollywood. Good review Lalita!

    రిప్లయితొలగించండి