కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 36 - కొరియరు పోస్టులో... పక్షి బొమ్మలొచ్చాయి...
తెల్లవారగానే అంతా మామూలుగానే అసలు రాత్రి మేం మాట్లాడుకున్నది కలలోనేమో అన్నట్లు, మా మధ్య అసలు మాటలేమీ జరగనట్లు అమ్మా, నాన్నా, నేనూ మా అనుదిన-జీవన-స్రవంతిలో కలిసిపోయాం.
నేను తొందర్లోనే బెంగుళూరు వెళ్ళాలి NAL లో ప్రాజెక్ట్ చేయడానికి.
అమ్మ ఇంక ఆ ప్రయాణ సన్నాహాల్లో పడింది - ఏం చీరలు సర్దుకోవాలి, ఎన్ని సర్దుకోవాలి అనుకుంటూ.
అంతే కాకుండా ప్రయాణంలో తినడానికని - నాన్నకిష్టమని మజ్జిగట్లు, నాకిష్టమని సొజ్జప్పాలు - లక్ష్మి దొడ్డతో కలిసి బోల్డు హడావిడి పడుతూ చేసింది. లక్ష్మి దొడ్డ అవన్నీ ఒబ్బిడిగా టిఫిన్ బాక్సుల్లో పెట్టి ఓ వైరు బుట్టలో సర్దింది. వాటితో పాటు తాగడానికి పల్చటి మజ్జిగ కూడా ఓ సీసాలో పెట్టింది దొడ్డ, ప్రయాణంలో తాగితే కడుపులో చల్లగా ఉంటుంది అంటూ.
నేను కూడా నాక్కావాల్సిన పుస్తకాలు, బట్టలు అన్నీ సర్దుకున్నాను. వెళ్ళేది బెంగుళూరు కదా చలిగా ఉంటుంది అన్జెప్పి నా డిగ్రీ సెకండ్ ఇయర్లో బెంగుళూరు వెళ్ళినప్పుడు శ్రీను నాకు కొనిచ్చిన తెల్ల స్వెటర్ కూడా పెట్టుకున్నాను. దాంతో పాటు నాకిష్టమైన లిండాగుడ్‌మన్ రాసిన సన్ సైన్స్ పుస్తకం, బాపు కార్టూన్లు, బారిష్టర్ పార్వతీశం - ఇవన్నీ సర్దేసుకున్నా. వాటితో పాటు యూనివర్సిటీలో చదువైపోయినా ఇంకా మోజు తీరక వదిలిపెట్టలేని RL Peterson - Operating Systems పుస్తకం కూడా పెట్టెలో పెట్టేసుకున్నా.
నేనివన్నీ సర్దుకుంటూ సర్దుకుంటూ - సర్దుకుంటున్నంతసేపూ ఒకటే పాట - నేను సర్దుకోవాలనుకున్నవి ఒక్కోటి పెట్టెలో పెడుతూ - వాటిని పెడుతున్న ప్రతిసారీ - నోటికి వచ్చిన నాలుగు లైన్లు తిప్పితిప్పి అవే మళ్లీమళ్లీ పాడుతూనే వున్నా...
దిల్ దీవానా
బిన్ సజ్‌నా కే మానేనా
ఏ పగ్‌లాహై సమ్‌ఝానే సే సమ్‌ఝేనా
దిల్ దీవానా
బిన్ సజ్‌నా కే మానేనా
దిల్ దీవానా
బిన్ సజ్‌నా కే మానేనా
- అంటూ.
నేను పెట్టె సర్దుకుంటున్నంత సేపూ నా పక్కనే ఉండి అవీఇవీ అందిస్తున్న పప్పి, కుట్టి విన్నంతసేపు విన్నారు. ఇంకో సారి నేను దిల్ దీవానా బిన్ సజ్‌నా కే మానేనా అనగానే కుట్టి ఒక్కసారి గట్టిగా "మానేయవే బాబూ...ఎన్నిసార్లు మానేనా, మానేనా అనడుగుతావ్? అసలు నిన్నెవరు పాడమన్నారు?" అనరిచింది. దాంతో పాట మానేసి, ముందు ఉక్రోషంతో ఏడవబోయి - కానీ ఏడుపు రాక - బోల్డంత నవ్వేసుకున్నా.
మొత్తానికి అనుకున్నట్టుగానే అమ్మా-నాన్నా-లలితమ్మాయీ (అంటే నేనే) బయల్దేరి జులై ఆఖరి వారంలో బెంగుళూరు వెళ్లాం. ఎందుకంటే ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి నా ప్రాజెక్ట్ మొదలవుతుంది. రైలెక్కేముందు అమ్మ స్టేషన్‌లో వున్న హిగ్గిన్ బాథమ్స్ స్టోర్‌లో నాకోసం ఓ స్టార్ డస్ట్, ఒక టింకిల్, ఒక రీడర్స్ డైజెస్ట్, ఆంధ్రప్రభ వీక్లీ తీసుకుంది. ట్రెయిన్‌లో కూడా నాన్న నాకిష్టమైన సైడ్ బెర్త్ వచ్చేలా బుక్ చేశారు. హాయిగా కాళ్ళు జాపుకుని కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ, మధ్యమధ్యలో అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ, ఆకలేసినప్పుడు మజ్జిగట్లు, సొజ్జప్పాలు తింటూ, అవి చాలక అప్పుడప్పుడూ ట్రెయిన్ పాంట్రీ లోంచి వచ్చే వేడివేడి టొమాటో సూప్, కట్లెట్లు కొనుక్కుని తింటూ - పట్టాలమీద పడవలాగా ఊక్కుంటూ వెళ్తున్న రైలు కంపార్టుమెంటుతో పాటు ఊగుతూ-తూగుతూ మొత్తానికి బెంగుళూరు చేరాం.
రైల్వే స్టేషన్‌కి శ్రీను వచ్చాడు. అమ్మా, నాన్నా ఒక ఆటో, ఇంకో ఆటోలో నేనూ, శ్రీనూ ఎక్కి విజయనగర్ రెమ్‌కో లేఔట్‌లో వున్న శ్రీను వాళ్ళింటికి వెళ్ళాము. మేము ఇంటి దగ్గర ఆటో దిగ్గానే శ్యామల ఎదురొచ్చి పలకరించింది. వాళ్ళ పెళ్లి తర్వాత ఇదే మొదటిసారి నేను శ్యామలని చూడడం. కానీ అస్సలు కొత్తా-పాతా లేకుండా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది.
అంత దూరం రైలు ప్రయాణం చేసివచ్చామేమో - అందులోనూ బెంగుళూరు బోల్డంత చల్లగా వుంది -వేడి నీళ్ల స్నానం, వెచ్చవెచ్చని భోజనం కాగానే గెస్ట్ బెడ్‌రూంలో రగ్గు కప్పుకుని హాయిగా నిద్రపోయాను. ఎంత సేపు పడుక్కున్నానో తెలీలేదు. లేచేటప్పటికి భలే చలిగా, చీకటిగా వుంది. నేను లేచేటప్పటికి అమ్మా, నాన్నా, శ్రీను, శ్యామల అందరూ లివింగ్ రూంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
నన్ను చూడగానే అమ్మ "అదుగో లేచింది, త్రిపురసుందరి!" అంటూ నవ్వుతూ "వేడిగా పాలు తాగుతావేంటి?" అనడిగింది.
అమ్మలో ఏదో కొత్త హుషారు. ఈ మధ్య కాలంలో చూడని ఒక పెద్ద రిలీఫ్. నాకూ అమ్మని అలా చూడగానే భలే హాప్పీగా అనిపించింది. ఎందుకంటే అమ్మ తిరుపతి వచ్చి బదరిని కలిసి వెళ్ళినప్పట్నుంచి పాపం! ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగానే ఉంటోంది. పైకి నాతో ఏమీ అనకపోయినా, నన్నేమీ అడగకపోయినా తనలో తాను తనకే ప్రశ్న వేసుకుంటూ, సమాధానమూ తనే చెప్పుకుంటూ వుంటున్నట్టుగా ఉంటోంది.
అమ్మ అలా అడగ్గానే శ్యామల "మా బెంగుళూరు వాతావరణానికి టీ బావుంటుంది" అని ఓ మాంఛి ఏలకులు వేసి చేసిన టీ ఇచ్చింది. ఇంక ఆ సాయంత్రం అంతా కబుర్లతో సరదాగా గడిచిపోయింది. అమ్మా, నాన్న ఓ రెండ్రోజులుండి బయలుదేరేట్టు. తిరుగుప్రయాణానికి కూడా టికెట్లు బుక్ చేసేసుకున్నారు.
ఆ మర్నాడు ఇంట్లో వాతావరణం ఏంటో కొంచెం సందడిగా వున్నట్లనిపించింది - ఇంట్లో వున్నది నిన్న వున్న వాళ్ళమే అయినా. సాయంత్రం ఎవరో రాబోతున్నట్లు హడావిడి.
పొద్దున్నే లేవగానే అమ్మ నాతో "లల్లీ! తలంటు పోసుకుని రవి పెళ్ళికి కొనుక్కున్నావు చూడూ ...ఆ సాఫ్ట్ సిల్క్ చీర కట్టుకో. గుడికెళ్ళొద్దాం" అంది.
"అదా? అది నాకు చాలా ఇష్టం. గుళ్లో కుంకాలు, పసుపులు అంటుకుంటే ఇంకెప్పుడూ కట్టుకోలేను. అయినా గుడి కెళ్లడానికి అదెందుకమ్మా?" నా అయోమయపు ప్రశ్న.
"అంటే... చక్కగా సాయంత్రం దాకా అదే వుంచుకోవచ్చు. మనింటికి పిన్ని, బాబయ్య వాళ్ళు వస్తారు కూడాను" అమ్మ చాలా నెమ్మదిగా అనునయంగా అదేదో సాయంత్రం ఏదో అద్భుతం జరగబోతోంది అన్నట్లు ఊరిస్తూ అంది.
"పిన్ని, బాబయ్య వాళ్ళా? పిన్ని, బాబయ్య కాకుండా ఇంకా 'వాళ్ళు' ఎవరు?" నా ఆరా.
"ఎవరో ఒకళ్ళు... ముందు తలంటుకురా... మళ్ళీ గుడిలో పూజ చేయించే టైముండదు" అమ్మకి అణిచి పెట్టుకున్న విసుగు పెరుగుతోంది.
ఇంకేం మాట్లాడకుండా వెళ్లి తయారై వచ్చాను - అమ్మ చెప్పిన సాఫ్ట్ సిల్క్ చీర కాకుండా - ఏరి కోరి బాందినీ చుక్కల - మెంతి, వంగ, గులాబీ - మువ్వన్నె రంగుల జెండా లాంటి చీర కట్టుకుని.
నన్నా చీరలో చూడగానే అమ్మ - "అదేం చీర?" - అనడగబోయి ఆగింది - "ఏదో ఒకటి చీర కట్టుకుంది అంటే చాలు - ఏ కుచ్చుల స్కర్టో వేసుకోకుండా - అసలే చండిక" - అనుకుందో ఏమో!
తీరా చూస్తే ఇంకెవ్వరూ రెడీ కాలేదు. మైసూర్ రోడ్డులో వున్న రాజరాజేశ్వరి దేవాలయానికి రానూపోనూ ఆటో మాట్లాడి నన్నూ, అమ్మనే పంపించారు. నాకు అప్పుడే ఏదో డౌట్ వచ్చింది. నాకు తెలీకుండా ఏదో స్కీం జరుగుతోంది అని. ఏదో inkling సాయంత్రం నాకిష్టం లేనిది ఏదో జరగబోతోంది అంటూ. కానీ అదేంటో సరిగ్గా తెలీట్లేదు. వచ్చేది ఎవరో అస్సలు క్లారిటీ లేదు. ఒక్క నిముషం బోల్డంత తిక్కగా, ఉక్రోషంగా అనిపించింది. కానీ ఏం చేయగలను? ఏదైతే అది కానీయ్ అనుకున్నాను.
గుళ్ళో విరాజిల్లుతున్న రాజరాజేశ్వరి అమ్మవారు నవ్వుతూ పలకరించింది - నల్లనిదేవి - చల్లనిచూపులతో.
అమ్మ గోత్రనామాలు చెప్పి కుంకుమ పూజ, అష్టోత్తరం చేయించింది.
పూజైపోగానే దండం పెట్టుకుని, ప్రసాదం పుచ్చుకుని - చేతిలో పువ్వు తల్లో తురుముకుంటూ ఇవతలకి వస్తూ అమ్మ ప్రశ్న - "ఏమని దండం పెట్టుకున్నావ్?" - అంటూ.
"నీ సంగజ్జెప్పు ముందు" - అన్నాన్నేను.
"ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు - సవ్యంగా అడిగిందానికి జవాబు చెప్పు" - అమ్మకి అప్పటిదాకా దాచుకున్న విసుగు కొంచెం-కొంచెంగా బయటికి వస్తోంది.
"సరే విను - నువ్వేం కోరుకున్నావో అదవ్వకూడదని నే కోరుకున్నాను" - ఒక్కొక్క అక్షరం నొక్కి పలుకుతూ చెప్పాను.
అమ్మ కోపం మీద కప్పుకున్న మురిపాల-తొరక కరిగిపోయింది.
"ఎందుకెందుకని ఊరుకుంటుంటే నీ వ్యవహారం శృతి మించుతోంది - మిగిలిన విషయాల్లో మీ నాన్నా, నువ్వూ ఒకటే అయినా ఈ విషయంలో నాదీ-నాన్నదీ ఒకే మాట - ఏంటనుకున్నావో?!" - అమ్మ బెదిరింపు.
"మాటే మీది - నేను కాదన్నానా? తతిమాదంతా నాది" - నా తిక్క సమాధానం. అసలే ఉక్రోషంగా వుంది మరి.
"ముద్దు చేసినందుకు బానే బుద్ధి చెప్పావు - నువ్వసలూ ... "- మాటలు వెతుక్కుంది అమ్మ
"....." అమ్మకేం గుర్తు రావట్లేదో నాకూ తట్టట్లేదు.
" ఆ ... అదీ... నువ్వసలూ... వయోముఖ-విషకుంభానివి. చూడ్డానికి అమాయకంగా ఉంటావు కానీ నీ పంతం నీదే" - అమ్మ మాటలు కోపంతో తడబడుతున్నాయి
"హహ్హహ్హ" - నవ్వాపుకోలేకపోయాను.
"సిగ్గు లేనమ్మకి చిరునవ్వే సింగారం - ఎందుకా నవ్వు?"
"అదీ - పయోముఖవిషకుంభమమ్మా - వయోముఖ కాదు - పయః అంటే సంస్కృతంలో పాలు - అంటే పాలకుండలా కనిపించే విషపు కుండ ---" నాకు నవ్వాగట్లేదు.
"నీ తెలివితేటలన్నీ నాదగ్గరే - అదేదో పనికొచ్చే విషయాల్లో చూపిస్తే అందరం సంతోషిస్తాం.
అమ్మకి ఇంక మాట్లాడలేనంత కోపం వచ్చిందని తెలుస్తోంది.
కాకపోతే ఇంకంతకన్నా ఎక్కువ మాట్లాడితే అసలుకే మోసం వస్తుందనుకుందో ఏమో ఇంకేమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఇద్దరం కల్సి ఆటో ఎక్కి ఇంటికొచ్చేశాం.
మధ్యాహ్నం భోజనం చేసి శ్రీను దగ్గరున్న పుస్తకాల్లోంచి The Count of Monte Cristo తీసుకుని చదువుదామని పట్టుకుని సోఫాలో కూర్చున్నానే కానీ...
సాయంత్రానికి ఏమి జరుగునో ఎటులూహించెదనూ
అమ్మ ప్రణాళికను తప్పించుటకై ఎటుల సాహసించగలనూ ఊఁ ఊఁ ఊఁ
(ఈ పాటే వరసలో ఉందబ్బా? ఎవరికైనా తెలుసా?)
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించేదరు అన్న పాట వరుస లవకుశ సినిమా
రిప్లయితొలగించండిసరిగ్గా చెప్పారు!
తొలగించండిEvening Pelli choopulu baaga jarigaayaa? There is no suspense in this story. It is like a regular Telugu movie even if you wanted to make it sound suspenseful. Ha
రిప్లయితొలగించండిఎలా జరిగాయో చెప్తానుగా వచ్చే నెల! Thanks for taking time to read my blog & commenting.
తొలగించండినాకిష్టమైన లిండాగుడ్‌మన్ రాసిన సన్ సైన్స్ పుస్తకం...
రిప్లయితొలగించండిMee too...
ఓహ్ అవునాండీ?! :) Thanks for your comment!
తొలగించండిమీ "అందరాని కొమ్మ" చదివి ఉండటంతో పెళ్ళి చూపులు ఎలా జరిగాయో కొంత తెలిసింది. మిగతా వివరాల కోసం మళ్ళీ 19 వరకు వేచి ఉండక దారి లేదు కదా ☺. suspense పోతుంది అనుకుంటే ఈ వాఖ్యని ప్రచురించకండి.
రిప్లయితొలగించండిఈ "త్వామనురజామి" రాస్తోందే ఇన్నేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి నాతో పాటు నావాళ్ళూ కలిసి ఈదేసిన గోదార్ని చూసుకోవడానికి. ఇంతకు ముందు ఎవరో బ్లాగ్మిత్రులు అన్నట్లు నాది క్లైమాక్స్ తెలిసినా చదివిస్తున్న కథ. అందులో సస్పెన్స్ పోవడం ఏమీ లేదండి. మీరీ ఎపిసోడ్‌ని నా "అందరాని కొమ్మ"తో రిలేట్ చేయగలిగారంటేనే నాకు భలే ఆనందంగా అనిపించింది. బోల్డన్ని థాంక్స్, దీపగారు!
తొలగించండిEagerly waiting for your next post...!
రిప్లయితొలగించండిThanks, Mohana - for reading my blog & commenting.
తొలగించండిThe story has finally reached our, i.e., namma bengaluru... Even while reading, I can sense how much the city has changed from 20 years back.. No longer sleep-like-a-bug-in-a-rug cold afternoons in July! Enthaina, manam eedesina godaari sogase veru! The L&B tale is progressing well...... Waiting for more.
రిప్లయితొలగించండిAparne! Namma Bengaluru is no longer the same as the one I fell in love at first sight as a teenager - with those avenues covered by Flame of the Forest's and the days drenched in torrential rains. But my love for Bengaluru stays the same because of you and Handara.
తొలగించండి