కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 38 - రూఠియే న, నాన్నా! ఆప్ యూ రూఠియే న!
అనుకున్నట్టుగానే అమ్మా-నాన్న బయల్దేరి గుంటూరు వెళ్ళారు.
దానికి ముందు వారంలో ఒక రోజు నాన్న, శ్రీను, నేను NAL ఆఫీసుకి వెళ్లి అక్కడ కావాల్సిన పేపర్లు, సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి వచ్చాము. నాకొక టెంపొరరీ ఐడీ కార్డు లాంటిది ఒకటి ఇచ్చారు మొదటి రోజు ఆఫీసుకి వచ్చినప్పుడు గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్లకి చూపించడానికి.
ఆగస్టు నెలలో ఓ సోమవారం NAL లో నా మొదటి రోజు.
నేనా రోజుకి ఆఫీసుకి రాబోతున్నట్లు సునీతకి ముందే చెప్పాను. సునీత MCA లో నా సీనియర్. కాకపోతే తను డే-స్కాలర్. హాస్టల్లో వుండేది కాదు. రోజూ యూనివర్సిటీకి TVS మీద వచ్చేది. తను సిక్స్త్ సెమిస్టర్ ప్రాజెక్టు NAL లోనే చేసి, ప్రస్తుతానికి అక్కడే గ్రాడ్యుయేట్ ట్రెయినీగా ఫ్లైట్ సిములేటర్ ప్రాజెక్టు మీద పని చేస్తోంది కృష్ణన్ గారి గైడెన్సులో. నేను కూడా అదే ప్రాజెక్టులో తనతో కలిసి పని చేయబోతున్నానన్నమాట!
ఆ రోజు పొద్దున్నే శ్యామల చేసిచ్చిన బ్రెడ్ టోస్ట్ తినేసి, ఓ కప్పు పాలు తాగి నేను తయారయేటప్పటికి శ్రీను కూడా రెడీ అయున్నాడు. తన ఆఫీసుకి వెళ్లే టైం కూడా అదే. మామూలుగా ఐతే శ్రీను మైసూర్ రోడ్లో ఉన్న BHEL ఆఫీసుకి వెళ్తాడు తన బైక్ ఇండ్-సుజుకి మీద. ఈరోజు మాత్రం నాతో పాటు బస్సులో ఎన్నేయల్ దాకా వచ్చి, తర్వాత అక్కడికి దగ్గర్లో వున్న MG రోడ్ ఆఫీసుకి వెళ్తానని చెప్పాడు. మరి నాకు బెంగుళూరు కొత్త కదా! అందులోనూ NAL కి రెండు బస్సులు మారి వెళ్ళాలి.
ఏడింటికల్లా శ్రీనూ, నేను ఇంటికి కొంచెం దూరంలో వున్న RPC లేఔట్ బస్-స్టాపుకి వెళ్లి, అక్కణ్ణించి మెజెస్టిక్ బస్టాండుకి వెళ్లే 87A బస్సెక్కాము.
ఓ అరగంట తర్వాత మెజెస్టిక్‌లో దిగి 333 ఎక్కి, మారతహళ్ళిలో NAL గేటుకి ఎదురుగుండా వుండే బస్టాపులో దిగాం. వెంటనే శ్రీను నాకు రోడ్డుకి అవతల National Aeronautical Laboratory అన్న బోర్డు చూపించి "సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు 333 ఎక్కి మెజెస్టిక్‌కి వచ్చి, అక్కణ్ణించి పొద్దుట్లాగే 87A ఎక్కి RPC లేఔట్ స్టాపులో దిగి ఇంటికొచ్చెయ్" అని చెప్పి తన ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
సరే! అని తలూపానే కానీ కొంచెం బెంగగానే అనిపించింది. మళ్ళీ ఇదేమీ ఒక రోజు వ్యవహారం కాదు కదా, రోజూ నాతో శ్రీను తోడు రావాలంటే కుదిరే పని కాదు కదా! అందుకే లోపల్లోపల భయంగా అనిపించినా తప్పదు కదా ఎలాగోలా మేనేజ్ చేయగలను, చెయ్యాలీ అనేసుకున్నా.
అసలిప్పటిదాకా తిరుపతిలో టౌన్ బస్ ఎక్కడం తప్ప బెంగుళూరు లాంటి పెద్ద సిటీల్లో సిటీబస్సులెక్కడం అదీ నాకలవాటు లేదు. ఎప్పుడూ అవసరం కూడా రాలేదు. అసలు ఇంత పెద్ద సిటీకి రావడం ఇదే మొదలు.
రోడ్డు దాటి ఎన్నేయల్ కేంపస్‌లో కొంచెం ముందుకి వెళ్ళగానే ఎడం పక్కగా కొన్ని క్వార్ట్రర్స్, కుడి పక్కకి NAL ఎంట్రెన్స్ కనిపించాయి. ఆ క్వార్టర్సులో ఒక దాంట్లో సునీత ఉండేది. తను నాకోసం అక్కడ వెయిట్ చేస్తూ కనిపించింది.
తనతో కలిసి NAL ఆఫీస్‌లో స్టాఫుకి అదే నా మొదటిరోజని రిపోర్ట్ చేసింతర్వాత సునీత నన్ను కృష్ణన్ గారి ఆఫీసూ, ఆయన దగ్గర పని చేసే ట్రెయినీలు అందరూ కూర్చునే ఒక హాల్ లాంటి ఆఫీస్ రూమూ వుండే ALD బిల్డింగ్ మొదటి అంతస్తుకి తీసుకెళ్లింది. నేను తనతో వెళ్తూ అక్కడ ప్రతి గది ముందు వున్న నేమ్‌ప్లేట్స్ మీదున్న సైంటిస్టుల పేర్లు చదువుతూ వెళ్తున్నాను.
ముందు కుడి పక్కగా ఓ గది ముందు A. Krishnan అన్న పేరు కనిపించింది. అది దాటి కొంచెం ముందుకి నడిచి, ఎడం పక్కగా వున్న తలుపు తీసుకుని వెళ్తే ఓ పెద్ద హాలు వుంది. అందులో ఓ పక్కకి మూడు చిన్న టేబుల్స్, ఇంకో పక్క ఓ పేద్ద వర్క్ టేబుల్ వున్నాయి.
హాల్లోకి వెళ్తూనే మొట్టమొదటి టేబుల్ దగ్గర ఓ కుర్చీ. దాంట్లో పుస్తకం ఒకటి మొహానికడ్డం పెట్టుకుని చదువుకుంటూ ఒకాయన కూర్చుని వున్నారు. ఆయన పేరు గుర్తు లేదు. కానీ నాకూ, సునీతకి అనుమానం ఏంటంటే ఆయన ఎప్పుడూ చదివేది కన్నడ ౘందమామ ఏమో అని. అందుకని ఆయన్ని "ౘందమామ" అని పిలుచుకునే వాళ్ళం. అందుకే అసలు పేరు గుర్తు లేదు.
ఆ తర్వాత హరీష్ రావు అనే ఆయన టేబుల్ ఉండేది. ఆయన మా అందరి వర్క్ సూపర్వైజ్ చేస్తూ ఉండేవారు. ఆ పక్కనే వున్న వర్క్ టేబుల్ దగ్గర సర్క్యూట్ బోర్డ్స్ మీద పని చేసే ఇంజనీరింగ్ ట్రెయినీలకి కావాల్సిన సహాయం చేస్తూ ఉండేవారు. ఈ హరీష్ రావు గారు ఎప్పుడూ హడావిడిగా, ఏదో పని చేస్తూ అటూ ఇటూ పరిగెడుతూ వుండేవారు.
ఆ ముందు టేబుల్ దగ్గరున్న ౘందమామ గారు స్టేషనరీ ఆబ్జెక్ట్ ఐతే, ఈ హరీష్ రావుగారు మహా డైనమిక్ ఆర్బిటరీ సబ్జెక్టు.
ఇంక ఆ చివరికి ఇంకో టేబుల్ చుట్టూ ఓ నాలుగు కుర్చీలు వేసుండేవి. అక్కడ సునీత, నేను, రాజ్ బల్ అనే ఒక మళయాళీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ కూర్చునే వాళ్ళం.
ఓ పెద్ద వర్క్ టేబుల్ ఉందని చెప్పాను కదా - దానికి ఇటు పక్క అనంత్ అనే ఒక వెరీ స్టూడియస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ ఎప్పుడూ ఏదో బిగిస్తూ, విప్పుతూ ఉండేవాడు. మా టేబుల్ దగ్గర నాలుగో కుర్చీ ఈ అనంతుడిదే. కానీ నేనున్న ఆర్నెల్లలో అనంత్ కూర్చోవడం నేనెప్పుడూ చూళ్ళేదు.
వర్క్ టేబుల్‌కి ఇంకో పక్క జయ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ట్రెయినీ, మంజుళ అనే ఇంకో డిప్లొమా ట్రెయినీ వుండేవాళ్ళు.
మొత్తానికి నా ఆఫీస్ రూమ్, నా కుర్చీ అనుకుంటూ హాయిగా సెటిల్ అయిపోయాను. సునీత నన్ను తీసుకెళ్లి కృష్ణన్ గారికి పరిచయం చేసింది. ఆయన నన్ను పలకరించి మొదటి వారం సునీత దగ్గర అప్పటిదాకా అయిన వర్క్ గురించి డాక్యుమెంట్స్ చదువుకుని ఓ వారం తర్వాత కనిపించమన్నారు.
ఇక ఆ రోజంతా సునీతతో వెళ్ళి మేమున్న ఫ్లోర్లో మిగిలిన సైంటిస్టుల రూములూ, మేము actual గా కోడింగ్ చేయడానికి ఉపయోగించాల్సిన కంప్యూటర్ వుండే గ్రౌండ్ ఫ్లోర్లో గదీ, కేంటీన్, రోడ్డు పక్కగా వుండే ఒక స్టోరూ అన్నీ చూసి వచ్చాను.
అన్నట్టు అక్కడ పని చేసే ఒక సైంటిస్ట్ పేరు పంచాపకేశన్. నాకా పేరు చూడగానే భలే తమాషాగా అనిపించింది. అదే మొదటిసారి నేను ఆ పేరు వినడం.
మొత్తానికి పచ్చని చెట్ల మధ్యన, వానమబ్బుల నీడలో బద్ధకంగా పడుక్కున్న తెల్లఏనుగులా వున్న ఎన్నేయల్ నాకు భలే నచ్చేసింది. ఆ రోజుల్లో NAL అంటే "నాయర్, అయ్యర్ లిమిటెడ్" అనేవాళ్ళని మొదటి రోజే తెలిసింది. అది మరీ నచ్చేసింది. నాకు నచ్చడానికి వేరే కారణాలు అస్సలక్కర్లేదు.
తిన్ననైన మాట ఉన్నదున్నట్టుగా ఉంటూనే, పన్నుగా వినిపిస్తే చాలు, నచ్చేస్తుంది నాకు!
సరే! ఆ మొదటిరోజు మధ్యాహ్నం భోజనం NAL కేంటీన్ లో చేసేదాకా బాగానే వున్నాను. కానీ సరిగ్గా టీ-టైంకి హఠాత్తుగా సాయంత్రం నేను తోడు ఎవరూ లేకుండా నా అంతట నేను రెండు బస్సులు మారి ఇంటికి వెళ్ళాలీ అన్న సంగతి గుర్తుకు రాగానే బోల్డంత దిగులొచ్చేసింది.
ఇంకంతే... మధ్యాహ్నం టీ టైం నుంచి సాయంత్రం దాకా " 333 మెజెస్టిక్, 87A RPC లేఔట్ " జపం చేసుకుంటూనే వున్నాను - అలా అనుకుంటూ ఉండకపోతే మళ్ళీ మర్చిపోతానేమో అని భయం.
ఆ భయం ఒక్కటే ఉండడానికి భయపడి ఇంకొన్ని భయాలని తోడు తెచ్చుకుంది.
బస్సు రాగానే అక్కడ ఎక్కడానికి నాతో పాటు ఎక్కాల్సినవాళ్లు బోల్డుమంది ఉంటే - వాళ్ళ మధ్యలో ఇరుక్కు పోయి నేను గబగబా ఎక్కలేకపోతే - బస్సు నేనెక్కకుండానే కదిలిపోతుందో, తీరా ఎక్కాక కూర్చోడానికి సీటు దొరుకుతుందో లేదో, దొరక్కపోతే రాడ్ పట్టుకుని నించోగలనో లేదో, బస్సు రష్షుగా ఉంటే నేను దిగాల్సిన చోట దిగగలనో లేదో, అసలు దిగాల్సిన చోటేదో నాకు తెలుస్తుందో లేదో - ఇంటికి ఎలా వెళ్తానో ఈ బెంగళూరు మహానగరం లో అని ఒకటే బెంగ పెట్టేసుకున్నాను.
అలా గుబులు గుబులుగానే సాయంత్రం ఐదయింది. ఎన్నేయల్ ముందున్న చెట్టుకింద బస్-స్టాపులో నేనొక్కదాన్నే. ఒక పావుగంట నుంచున్నాక మెజెస్టిక్ వెళ్ళే 333 వచ్చింది. గబగబా బస్సెక్కి ఒక మంచి కిటికీ పక్క సీట్ చూసుకుని (మంచి కిటికీ, చెడ్డ కిటికీ అని రెండు వుండవు కానీ అది నాకు దొరికిన కిటికీ పక్క సీట్ కి సంబంధించిన ఉపమానమన్నమాట!) అదేదో తిరుపతిలో చుక్కల పర్వతం, మోకాళ్ళ పర్వతం ఎక్కేసి మామూలు తార్రోడ్డు మీద నడుస్తున్నంత రిలీఫ్‌గా (ఆ రిలీఫ్ ఎలా వుంటుందో తెలియాలంటే మీరు పద్మావతి యూనివర్సిటీ లో చదవాలి, ప్రతీ సెమిస్టర్ ఎగ్జాం అవగానే నడిచి కొండ ఎక్కాలి- అదీ లెక్క!) ఫీల్ అవుతూ చుట్టూ చూస్తే బస్సులో నేను, ఇంకో నలుగురు తప్ప ఎవరూ లేరు. మెజెస్టిక్ బస్టాండులో ఆగే సమయానికి అదే లాస్ట్ స్టాప్ నేనెక్కిన 333కి అని అప్పటికి అర్థం అయింది. మొత్తానికి 333 దిగి మళ్ళీ 87A ఎక్కి క్షేమంగా ఇంటికి చేరాను.
ఇక ఆ రాత్రికి శ్యామల, శ్రీనులకి ఎన్నేయల్లో నా మొదటి రోజు గురించి కబుర్లు చెప్పి, కాసేపు నేను రాసి తెచ్చుకున్న నోట్సు చూసుకుని, రేపెక్కబోయే బస్సు గురించి అంతగా లేని బెంగతో, బెంగుళూరులో... బీటీఎస్సులో...ప్రయాణం గురించి అంత బెంగెట్టేసుకున్ననన్ను తల్చుకుని నేనే నవ్వుకున్నా...
అర్థం మారిపోయిన మొట్టమొదటి కన్నడ నుడి:
నేను చెప్పింది వినగానే ఆ కౌంటర్
దగ్గర అతను ఒక్కసారి ఉలికిపడి "ఏన్రీ?" అని అడిగాడు.
మళ్ళీ అతనికి నేను చెప్పింది సరిగా వినపడలేదనుకుని బోల్డు విసుగ్గా - "ఈ మాత్రం కూడా అర్థం కాదా?" అన్నట్టు మొహం పెట్టి - "ఒందు బౌబౌ బాత్ బేకు" అన్నాను.
అప్పటికే అతను నవ్వకుండా ఉండడానికి తెగ ప్రయతిస్తున్నాడు.
చేత్తో తినుబండారాల లిస్టు వున్న గోడకేసి చూపించి "ఆ లిస్టు ఇంద ఏవ నంబరో హేళి (ఆ లిస్టు లో ఏ నంబరో చెప్పండి) " అన్నాడు.
నేను వెంటనే "నంబర్ 4 - బౌబౌ బాత్" అన్నాను - అప్పటికీ నేను ఇంకా నా కన్నడ అజ్ఞానం బయటపడకూడదని అనుకుంటూ. "
ఓ...చౌచౌ బాత్ బేకా (ఓ...చౌచౌ బాత్ కావాలా?) " అంటూ నవ్వుతూనే ఒక ప్లేట్ లో ఉప్మా + కేసరి పెట్టి ఇచ్చాడు. (అసలు విషయం కన్నడ "చౌ" (ಚೌ) నాకు "బౌ" లా కనిపించింది :( )
అంతే ---మారు మాట్లాడకుండా - ఎందుకంటే నాకు ఆ రోజుకి ఒందు, బేకు తప్ప ఇంకో కన్నడ మాట తెలీదు వాడుక భాషలో - గబగబా ఆ చౌచౌ బాత్ తినేసి ఈలోగా విజయనగర్ బస్ వస్తే ఎక్కేసి - నేను ఇంటికి, నా బారిన పడిన కన్నడ కథ కంచికి :)
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

బెంగుళూరులో... బీటీఎస్సులో...
ఫస్టు ప్రయాణం!
స్టాపు ఎక్కడో... మిస్సు అవునని...
బెంగట... పాపం!
బెంగట ... పాపం!
ఇక రెండోరోజు నుంచి నా అంతట నేనే బస్టాపుకి వెళ్లి బస్సెక్కి వెళ్ళడం, రావడం అలవాటయ్యింది నాకు. సాధారణంగా నేనెక్కే బస్సులు ఖాళీ గానే ఉండేవి. అందుకని ఓ కిటికీ సీటు చూసుకుని, చల్లటి చలిగాలి మొహానికి తగులుతూ ఉంటే, హాయిగా నాకు నచ్చిన పాటలు, నాకొచ్చిన వరసలో - చిన్నగా ఎవరికీ వినిపించకుండా - వరసగా పాడుకుంటూ ఉండేదాన్ని.
ఎన్నేయల్లో వారానికి రెండ్రోజులు మాత్రం వచ్చే ఇంకో గ్రాడ్యుయేట్ ట్రెయినీ సుజాత అనే అమ్మాయి కూడా పరిచయం అయింది. సుజాత కన్నడ అమ్మాయే కానీ కొంచెం తెలుగు మాట్లాడేది కన్నడ యాసలో. తనే కాకుండా ఇంకో ఇద్దరు బెంగాలీ అమ్మాయిలు కూడా పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ పెళ్ళైనవాళ్లు. అప్పుడే తెలిసింది నాకు బెంగాలీ అమ్మాయిలు పెళ్ళైన గుర్తుగా చేతికి ఓ ఎర్ర గాజు, ఓ దంతపు గాజు, ఓ ఇనప గాజు చేతికి వేసుకుంటారని.
మొత్తానికి ఎన్నేయల్ కేంపస్ అప్పటి దాకా నేనెప్పుడూ చూడని ఓ కొత్త కాస్మోపాలిటన్ పరిచయం.
ఎన్నేయల్ కేంటీన్లో బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉండేది. అందుకని ఇంట్లో పాలు మాత్రం తాగి వెళ్లేదాన్ని. ఏ రోజు టికెట్లు ఆ రోజు కొనుక్కుని కేంటీన్లోనే తినేదాన్ని.
ఓ రోజు భోజనం టికెట్లు కొనుక్కుని సునీత వెనకాలే లైన్లో నించున్ననన్ను చూస్తూ ఒక
పెద్దాయన నవ్వీ నవ్వనట్టు నవ్వారు. ఆయన అచ్చు శోభన్‌బాబు లాగా మొహం మీద ఓ
ముంగు-రింగు సింగారించుకుని, రంగురంగుల చొక్కా ఇన్-షర్ట్ చేసుకుని,
షూటింగులో ఫైటు డూపుకప్పగించి, కేంటీన్లో లంచుకొచ్చిన పంచదశ-వసంతాల హీరోలా వున్నారు.
ఆయన్ని
చూడగానే సునీత నా భుజమ్మీద చిన్నగా తట్టి "ఆయనే పంచాపకేశన్" అనగానే నా
నోట్లోంచి వెంటనే "సునీతా! పంచాపకేశన్-లంచుకొచ్చేసెన్" అంటూ
వచ్చేసిన మాటలకి ఇద్దరం తెగ నవ్వేసుకున్నాం.
నిజానికి యూనివర్సిటీలో చదివేటప్పుడు
ఎప్పుడైనా పలకరించడం తప్ప సునీతతో ఎక్కువగా మాట్లాడిందేమీ లేదు. కానీ NAL
కేంపస్లో ఇద్దరం ఎప్పుడూ కలిసి తిరిగేవాళ్ళం. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా -
మమ్మల్ని చూసినా - ఈలోకంలో సంబంధం లేనట్లు కబుర్లు చెప్పుకుంటూ,
నవ్వుకుంటూ, కాళ్ళలో స్ప్రింగులున్నాయా అన్నట్లు పరిగెడ్తున్నట్లు నడుస్తూ
ఉండేవాళ్ళం.
అన్నట్టు బీటీఎస్సు బస్సులో సరిగమలు పాడుకుంటూ తిరిగే ప్రయాణంలో నేనిప్పటికీ నెమరేసుకునే తమాషా మెమొరీలు కొన్నున్నాయ్!
అర్థం లేని నల్లముసుగు భయం:
ఒక్కోసారి ఏ సాయంత్రమో ముసురు పట్టి - తొందరగా చీకటి పడిన వేళ - బస్సులో వస్తుంటే కొంచెం భయంగా అనిపించేది. అలాంటప్పుడు కొన్ని అర్థం లేని భయాలు కూడా వేసేవి.
ఓ రోజలాగే బస్సులో వస్తూ ఇప్పుడు ఎవరైనా
వెనక నుంచి నల్ల గుడ్డ మొహం మీద వేసేసి ఎక్కడికో పట్టుకుపోతే, ఏదైనా చీకటి
గదిలో పెట్టేస్తే ఏం చేయాలి అని గోళ్ళు కొరుక్కుంటూ ఆలోచించేస్తూ బస్ కిటికీ
లోంచి బయటికి చూశాను.
(అమ్మతో చూసిన ఎన్టీఆర్ జానపదాల / కృష్ణ గూఢచారి సినిమాల
ప్రభావం ఎంతంటే నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే ఎవరూ గుర్తు పట్టరనీ, నల్ల
ముసుగు వేసి ఏదో రైలు పట్టాల పక్క ఇంట్లో స్తంభానికి కట్టేస్తారనీ, ఇలాంటి
చాలా నమ్మకాలు ఉండేవి - అది చిన్నప్పుడు చదివిన Hardy Boys ప్రభావం కూడా అయి
ఉండొచ్చు. )
అక్కడ ఒక పెద్ద బిల్ బోర్డు మీద "CALL 080-5577875
for your Advertisement needs" లాంటిదేదో కనిపించింది. అంతే ఆ ఫోన్ నెంబర్ని
పదిసార్లు అనుకుని గుర్తుపెట్టేసుకున్నాను. ఇంక అప్పుడు హాయిగా
అనిపించింది - "హమ్మయ్య! ఒకవేళ నా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళినా ఈ నంబర్కి ఫోన్ చేస్తే ఎవరో ఒకరు తీస్తారు కదా - వాళ్ళతో మాట్లాడి హెల్ప్
తీసుకోవచ్చు" అని అనేసుకుని, ఆషికి పాటలు నజర్ కే సామ్నే- జిగర్ కే పాస్ అని
పాడేసుకుంటూ, మెజెస్టిక్ దాకా వచ్చేశాను. (ఇది రాస్తుంటే ఇప్పుడొచ్చిన డౌటు అసలు ఆ
చీకటి గదిలో ఫోన్ ఎందుకు వుంటుంది? ఒక వేళ వుంటే ఆ బిల్ బోర్డు నెంబర్
ఎందుకు - శ్రీను ఆఫీసుకి కాల్ చేస్తే సరిపోతుంది కదా! ఈ మాత్రం కూడా ఆలోచించలేనంత illogical భయం నాది ఆ రోజుకి.
(అప్పట్లో "లల్లీ! నీకు ఊహలెక్కువ" అని బాబు వూరికే అనలేదు మరి!)
అర్థం మారిపోయిన మొట్టమొదటి కన్నడ నుడి:
ఓ రోజు మెజెస్టిక్
దగ్గర దిగగానే, అక్కడున్న బీటీఎస్ కాంటీన్ని చూడగానే బోల్డు ఆకలి వేసేసింది - గబగబా ఏమన్నా
తిందామని లోపలికి వెళ్ళాను.
లోపలంతా చాలా హడావిడిగా వుంది. ఒక పక్కగా నించుని - "అచ్చు తెలుగు లాగే వుంది - ఈ మాత్రం కన్నడ చదవలేనా?" - అనుకుని అక్కడ గోడ మీద వున్న పదార్థాల లిస్టు చదివి లైన్లో నా వంతు రాగానే - "ఏను బేకు రీ? (ఏం కావాలండీ?) " అన్న కౌంటర్ దగ్గర అతనికి - అదేదో కన్నడ నా మాతృభాష అన్నట్లు (మళ్ళీ నాకు కన్నడ రాదని తెలిస్తే వీళ్ళందరూ నల్లగుడ్డ తెచ్చేసి ముసుగేసి పట్టుకుపోతారని భయం) "ఒందు బౌబౌ బాత్ బేకు (ఒక బౌ-బౌ బాత్ కావాలి)" అన్నాను.
లోపలంతా చాలా హడావిడిగా వుంది. ఒక పక్కగా నించుని - "అచ్చు తెలుగు లాగే వుంది - ఈ మాత్రం కన్నడ చదవలేనా?" - అనుకుని అక్కడ గోడ మీద వున్న పదార్థాల లిస్టు చదివి లైన్లో నా వంతు రాగానే - "ఏను బేకు రీ? (ఏం కావాలండీ?) " అన్న కౌంటర్ దగ్గర అతనికి - అదేదో కన్నడ నా మాతృభాష అన్నట్లు (మళ్ళీ నాకు కన్నడ రాదని తెలిస్తే వీళ్ళందరూ నల్లగుడ్డ తెచ్చేసి ముసుగేసి పట్టుకుపోతారని భయం) "ఒందు బౌబౌ బాత్ బేకు (ఒక బౌ-బౌ బాత్ కావాలి)" అన్నాను.
మళ్ళీ అతనికి నేను చెప్పింది సరిగా వినపడలేదనుకుని బోల్డు విసుగ్గా - "ఈ మాత్రం కూడా అర్థం కాదా?" అన్నట్టు మొహం పెట్టి - "ఒందు బౌబౌ బాత్ బేకు" అన్నాను.
అప్పటికే అతను నవ్వకుండా ఉండడానికి తెగ ప్రయతిస్తున్నాడు.
చేత్తో తినుబండారాల లిస్టు వున్న గోడకేసి చూపించి "ఆ లిస్టు ఇంద ఏవ నంబరో హేళి (ఆ లిస్టు లో ఏ నంబరో చెప్పండి) " అన్నాడు.
నేను వెంటనే "నంబర్ 4 - బౌబౌ బాత్" అన్నాను - అప్పటికీ నేను ఇంకా నా కన్నడ అజ్ఞానం బయటపడకూడదని అనుకుంటూ. "
ఓ...చౌచౌ బాత్ బేకా (ఓ...చౌచౌ బాత్ కావాలా?) " అంటూ నవ్వుతూనే ఒక ప్లేట్ లో ఉప్మా + కేసరి పెట్టి ఇచ్చాడు. (అసలు విషయం కన్నడ "చౌ" (ಚೌ) నాకు "బౌ" లా కనిపించింది :( )
అంతే ---మారు మాట్లాడకుండా - ఎందుకంటే నాకు ఆ రోజుకి ఒందు, బేకు తప్ప ఇంకో కన్నడ మాట తెలీదు వాడుక భాషలో - గబగబా ఆ చౌచౌ బాత్ తినేసి ఈలోగా విజయనగర్ బస్ వస్తే ఎక్కేసి - నేను ఇంటికి, నా బారిన పడిన కన్నడ కథ కంచికి :)
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>
ఈ టపా చదువుతుంటే మీరు అప్పడు బెంగళూరులో పడ్డ కష్టాలు..ఇప్పుడు నా హైదరాబాదు జీవనానికి రిలేట్ చేసుకోగలుగుతున్నాను...చాలా బాగున్నాయండి మీ అనుభవాలు..😊
రిప్లయితొలగించండిమొదటిసారి సిటీకి వెళ్తే అంతే కదా, మోహనా!
తొలగించండిఅంతే కదండీ మరి!!
తొలగించండిచదివేశామండోయ్!!!👌👌
రిప్లయితొలగించండిముంగు-రింగు 😂😂👌🏻👌🏻
మీకు థాంక్సండోయ్!
తొలగించండిభలే సరదాగా ఉంది ఈ పోస్ట్ లలిత గారు.
రిప్లయితొలగించండిThanks andi, Pavan gaaru!
తొలగించండిBhale unnayi Mee NAL kaburlu, Kannada kaburlu... as usual chadavadam modalu pedite ... apalemu 👍👌... end lo appude ayyipoyinda anipistundi
రిప్లయితొలగించండినీ అభిమానం, శారదా!
తొలగించండిಅಂತೂ ಇಂತೂ ಬೆಂಗಳೂರು episode ಬಂತು!! నేను బెంగళూర్ లో కన్నడ reading practice చేసుకునే ప్రయత్నం గుర్తు వచ్చింది.. first time bank లో ఒక counter ముందు ఒక్క time లో 5 bekkugalu (పిల్లులు) మాత్రం కట్ట వచ్చూ అని చూసి confuse అయ్యాను ... same old kannada చ versus తెలుగు బ ... అంటే 5 chekkugalu (cheques) కట్ట వచ్చు అన్న మాట పక్కన ఇంగ్లీష్ board చూసాక తెలిసింది!! Those were the days of ready and easy laughter!! ಅಲ್ವಾ??!!!
రిప్లయితొలగించండిಸರಿ! ನನ್ನ ಬೌಬೌಗೆ ನಿನ್ನ ಬೆಕ್ಕು ಸರಿಯಾಗಿದೆ :)
తొలగించండి