క్యాలెండర్ మారింది.
వచ్చిందేమన్నా అలాంటిలాంటి సంవత్సరమా?
సమదృష్టి భరిత వత్సరం 20-20.
కొత్త సంవత్సరం.
కొత్త దశాబ్దం.
కొత్తని కొలుచుకోవడానికి క్యాలెండర్లో తిరిగిన పుట మాత్రం సరిపోతుందా?
పాత జ్ఞాపకాలని కొత్తగా తలుచుకుంటూ
కొత్త పరిచయాలని పాతగా మలచుకుంటూ
పాత-కొత్తల మధ్య నే నేర్చుకున్న కొత్త పాఠాలేంటి? - అన్నదే ఈ కొత్త సంవత్సరపు మొగసాల నా తలపోత.
జరిగిపోయిన ఏడాదిని తలుచుకుంటూ - అప్పుడెప్పుడో అనుకునో, అనుకోకుండానో చేసిన ఒప్పులెన్ని? - ఇంతకు ముందు చేసేసినా, ఇప్పుడూ-ఇక ముందు చేయకూడని తప్పులెన్ని? - అని జరిగిపోయిన తప్పొప్పుల లెక్కలు వేసుకునే ప్రతీసారీ నాకు నన్నయ మహాభారతంలో ఆదిపర్వంలో వ్యాసుడితో సత్యవతికి చెప్పించిన పద్యం గుర్తొస్తుంది.
మతి దలపగ సంసారం
బతి చంచల మెండమావులట్టుట సంప
త్ప్రతతు లతిక్షణికంబులు
గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్
వాగనుశాసనుడు నన్నయ్య చెప్పినట్లు గతకాలము మేలే.
కానీ గతాన్నే తలుచుకుంటూ, ఆ గతమే మేలనుకుంటూ ఆ గతవ్యామోహం లోనే ఉండిపోతే నేనున్న ఈ నేడు కాబోయేది రేపటికి గతమేగా?!
మరి రేపటికి గతమైన ఈ నేటిని మేటిగా రేపటి వేళ తలుచుకుని మురిసిపోవడానికి నేటికి నేడు మేలైనదిగా ఉండాల్సిందేగా?!
అందుకు ఈ నేటిలో మనతో వున్నవాళ్ళతో, మనం కావాలనుకున్నవాళ్ళతో మనం సమ్మతంగా ఉండి తీరాల్సిందేగా.
అంతే కాదు... గతం మేలు అని తలచుకోవడానికి, నెమరేసుకోవడానికి నేనంటూ వర్తమానంలో ప్రవర్తమానంగా ఉండాలిగా...
సరే! నేనిలా "గతము సంగతమా? వర్తమానము వర్ధమానమా?" - అని నాలో నేనే అనుకుంటుండగానే - కొత్త ఏడాది వేడుకలు ముగిసి పుట్టినగడ్డ మీద సంక్రాంతి సంబరాలు మొదలు.
Whatsapp Chaటుల్లో - ఊరి కోవెల్లో జరుపుతున్న ధనుర్మాసపు పూజల విశేషాలు, ఎవరో ఎవరినో పండక్కి ఇంటికి వెళ్తున్నారా అని అడుగుటలు, ఇంకెవరో వెళ్తున్నామని చెప్పుటలు, గొబ్బిపాటలని జ్ఞాపకం చేసేవాళ్ళు, సందెగొబ్బెమ్మల పేరంటాలు చేస్తున్న చిట్టితల్లుల ఫోటోలు, ముగ్గులూ, ముచ్చట్లూ - భలే సందడీ, హడావిడీనూ.
ఇంటి ముందు చూస్తేనేమో - నింగికెగసిన నీటిఆవిరి తనకు నల్లరంగు పులిమిందని అలిగిన వానమబ్బు ఒలకపోసిన ముగ్గు పిండిలా - నిన్న కురిసిన మంచుపూల కుప్పలు.
వాటిని చూసి ఉస్సురంటే హుషారెలా? "అయ్యో" అనుకుంటే పండగ అయ్యేదెలా?
అందుకే మునుపెన్నడో వేసుకున్న ముగ్గుని వెతికి పట్టుకున్నా... నా బ్లాగున సంక్రాంతి చేసుకున్నా...
దాంతో పాటే... చిన్ననాటి సంక్రాంతి రోజుల్లో కొలిచిన సందె-గొబ్బెమ్మని ఓసారి గుర్తు చేసుకున్నా...
నెమలికంఠం రంగుకి గులాబీ అంచున్న పట్టు పరికిణీ మీద నెమలికంఠం రంగు జాకెట్టు. అమ్మ బిగించి వేసిన రెండు జడల కొసనా జడగంటలు. రెండు జడలను కలుపుతూ పెట్టిన చిట్టిచేమంతుల దండ.
వేసుకున్న పరికిణీ కాలికడ్డం పడకుండా, గాలినీదు నేల-చేపలా పరిగెడుతూ వెళ్ళి - అమ్మ ఇచ్చిన నెమలి కుంకం-భరిణ పట్టుకెళ్ళి, బొట్టు పెట్టి "మా ఇంట్లో సందెగొబ్బమ్మ పేరంటానికి రా" అంటూ పిలుచుకొచ్చిన నేస్తులు రాధ, శైలజ, పద్మ, విజయలక్ష్మి ఆండాళ్.
వాళ్ళు వచ్చేలోగా అలికిన నేల మీద నేను వేసిన కొబ్బరిబొండాల ముగ్గు మధ్యన - గుమ్మడిపూలు, బంతిపూలు, చిక్కుడుపూలు ముడుచుకుని - పసుపూ-కుంకం పెట్టుకుని ముస్తాబైన గొబ్బెమ్మలు సిద్ధం.
ఈలోగా పిలిచిన కన్నె-పేరంటాళ్ళు వచ్చేసేవారు - చేతి గాజులు గలగల్లాడుతూ, కాలి పట్టీలు ఘల్లు-ఘల్లుమంటూ.
వచ్సిన వారితో చేరి గొబ్బెమ్మల చుట్టూ చేతులు తడుతూ తిరుగుతూ -
"గొబ్బీయళ్ళో, గొబ్బీయళ్ళో... దుక్కూ దుక్కూ దున్నారంట" అంటూ మొదలుపెట్టి...
"అటవీ స్థలముల కరుగుదమా" పాటలో కింద కూర్చుని - అక్కడ లేనట్టి గంధప్పీట ఉన్నట్టనుకుని - ఉట్టుట్టి గంధం తీసి "చల్లని గంధము తీయుదమా... , సఖియా మెడలో పూయుదమా..." అని పాడుతూ ఒకరి మెడలో ఒకరు తాకించిన వేళ్ళ చక్కిలిగింతలకి ముసిముసిగా నవ్వుకుంటూ...
"సుబ్బీ గొబ్బెమ్మా - సుబ్బణ్ణీయవే" అని పాడుతూ చివర్లో "మొగలీ పువ్వంటి మొగుణ్ణీయవే" అన్న చోట ఆ మొగుడంటే ఎవరో, ఏంటో తెలీకపోయినా - అన్నీ తెలుసన్నట్టుగా బడాయి పోతూ - ఆపుకోలేని నవ్వుతో పకపకలాడుతూ...
"ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే ... మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే..." అని నడుం మీద ఎడమ చేయి ఆనించి, కుడి చేతి బొటన వేలెత్తి ఎదుట లేని యశోదమ్మనడుగుతూ...
మా ఆడే ఆటలకి, పాడే పాటలకి మురిసి కళకళలాడ్తున్న సందెగొబ్బెమ్మకి హారతిచ్చి - అమ్మ చేసిన శనగపప్పు పాఠోళీ ప్రసాదం అరిటాకు దొప్పల్లో అందరితో పంచుకుని తిన్న ఆ పసితనపు పసిడి రోజుల గతమూ మేలే!
ఆ మేల్-గతాన్ని తల్చుకుంటున్న ఈ నాటి ఆనవాలూ మేలే!
అందుకే నన్నయ్య చెప్పిన పద్యాన్ని నాక్కావాల్సినట్లు రాసుకున్నా... (పద్యంలో ఛందస్సు లుప్తమైతే అది నా తెలుగు-లేమికి గుర్తు మాత్రమే!)
నన్నయ్య నాడు నుడివిన దానికి నేటి నా నుడి:
మతి దలపగ ఈకాలం
బతి సంతస మొందనోపునట్టుల బంధు
స్నేహము లతిమధురంబులు
వర్తమానము మేలు భూతకాలము కంటెన్...
ఇంకా గట్టిగా చెప్పాలంటే -
చేరువనున్న వారికి నవ్వులు పంచిన మేలు
అక్కఱనున్న వారి నొవ్వులు తుంచిన మేలు
ఉన్నచోట మన్నికగా నుండుటె మేలు
ఉన్నకాలము మేలు ఏ కాలము కంటెన్...

బాగా చెప్పావమ్మా. ఈ రోజు బాగా గడిపితే అది రేపటికి మధుర స్మృతి అవుతుంది. మరు రోజుకి ఆశావహమైన ఎదురు చూపునిస్తుంది. మీ తల్లితండ్రులని మెచ్చుకోవాలి వారి పెంపకానికి.
రిప్లయితొలగించండిఎంత మంచి మాటన్నారు! ధన్యవాదాలు!
తొలగించండిచూడండి: https://syamaliyam.blogspot.com/2020/01/blog-post_14.html
రిప్లయితొలగించండిప్పటికి కుదిరిందండి చదవడానికి. ఆ యతిరాజ్యం గారెవరో నాకు తెలియకపోయినా ఆవిణ్ణి అలా చదువు మాన్పించడం అంత బాగా అనిపించలేదు. కానీ అప్పట్లో చాలా మంది ఆడపిల్లలు అలానే బడికి దూరమయ్యుంటారు. నా బ్లాగ్లో నే రాసుకున్నట్లు "ఉన్నకాలము మేలు ఏ కాలము కంటెన్…"
తొలగించండిKonni dasaabdalani time machine lo tippunattu tippesi teeskochesaru!
రిప్లయితొలగించండిWonderful journey for me in this post!!
You always take my breath away with that lightening speed of yours and range of topics in each post.
Chivara lobpadyam mahadbhutam!!
To be framed and kept at sight always!
Oh! Thanks a lot for your nice words!
తొలగించండి