శుక్రవారపు పొద్దుట మా ఊళ్ళో వాన కురిసింది... ఒక పావుగంటకెక్కువ, అరగంటకి తక్కువగా కురిసి వెలిసింది.
పొద్దుటా, సాయంత్రం ఒకరినొకరం "పద పద" మని తొందరపెట్టుకుని -
ఒకరికొకరు "సరి సరి" అని చెప్పుకుని -
గబగబా నడకలలో అడుగులు కలుపుకుని -
గుసగుసలాడుతూ వీచు గాలికి సాటిగా - మేమూ గలగలలాడుతూ -
వస్తూ పోతూ గుబురుగా పెరిగిన చెట్లని ఏది బావుందో మెచ్చుకుంటూ -
నచ్చిన చెట్లనీ, విచ్చిన పూవులనీ పలకరిస్తూ -
దారిలో కంచెలు దాటి రాలేని ఉక్రోషంతో - కోపంతో కొన్ని, పలకరింపుగా ఇంకొన్ని - మబ్బుల్లా ఉరుముతున్న కుక్కతల్లుల్నీ-పిల్లల్నీచూసి "రాలేవులే...నువ్వు రాలేవులే..." అని నవ్వుతూ కవ్వించుకుంటూ -
అప్పుడే తన పొద్దుటి నడకకి బయల్దేరుతూ - మా కాలి అలికిడి విని తన డిప్పలోకి ముడుచుకుంటున్న బుజ్జి తాబేటి పిల్లని ఆట్టే బెదిరించకుండా రోడ్డుకావలి పక్కకి మళ్ళుతూ -
అందిన పువ్వో, కాయో తినబోతూ మా ఉనికికి బెదిరి చెవులు ముడుచుకుని పరిగెట్టే కుందేళ్ళని, చెలగాటాలాడుతూ చెట్లెక్కి దిగే ఉడతల్నీ చూసుకుంటూ -
చల్లటి వేళ మెల్లగా కబుర్లాడుకుంటూ - ఉసురుసురనే ఎండ వేళ కబుర్లతో విసుర్లాడుకుంటూ -
రెండుపూటలా చెరి రెండు మైళ్ళూ నడుచుకుని రావడం, పోవడం - మాకలవాటు.
ఇంట్లోంచి బయటికొచ్చి నడక మొదలెట్టబోతూ ఓ సారి పైకి చూసి నల్లటి వానమబ్బులు కనిపిస్తే ఓ గొడుగు చేతబట్టుకెళ్ళడం కూడా అలవాటే.
అలా పట్టుకున్న గొడుగుతో పాటు ఓ తాళం, రాయీ కూడా తెచ్చుకోలేదేంటి అని ఒకరినొకరం నవ్వుతాలకి నవ్వులాడుకోవడమూ అలవాటే. (గొడుగూ, తాళం, రాయి కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే "ఓం నువ్వు నాకు నచ్చావ్ నమః" అనేసుకుని ఆ సినిమా చూసెయ్యాల్సిందే!)
ఇన్ని అలవాట్లున్నాయా?
మరి నిన్నటి రోజున ఇంటి బయటికి రాగానే మింటిలో నల్లటి మబ్బు ఏరు ఒకటి కనిపించింది కదా?!
మరి వెంటనే ఇంటిలోకి ఉరికి గొడుగొహటి చేతబట్టి నడక మొదలెట్టాలా?
కురిసేదాకా కురుస్తుందని అనుకోలేదు కాబట్టి - మా వీధిలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు శ్రీరామనవమి పందిరిలా కనిపిస్తున్న నల్లమబ్బు నీటిపందిరినీ, దాని నీడలో తమ పచ్చటి రంగుని నలుగుగా పులుముకుని తలంటుకోవడానికి సిద్ధమవుతున్నట్లున్న చెట్టు-ౘానల్నీ చూస్తూ - మైమరచిపోయి, మా గొడుగు మాటే మరిచిపోయి - పొద్దుటి నడకకి బయలుదేరాం.
నడక అంటే కాళ్ళు నడుస్తాయి. కాళ్ళతో పాటు చేతులూ ముందుకూ వెనక్కూ ఊగుతూ వాటి కాలక్షేపమేదో అవి చేస్తాయి. కానీ ఎప్పుడూ ఆడుతూ వుండే నోరు మాత్రం ఊరికే ఉంటుందా? దాని సంబరమేదో అదీ తీర్చుకోవాలిగా!
అప్పుడు మొదలు - మొదలూ-తుదీ లేని మాటా-మంతీ.
అదే ఈనాటి సరదా-సంగతి.
"బావా! ఆ మబ్బు చూడండి! ఎంత బావుందో?వాన కురిసేముందు ఆ నల్లమబ్బు నీడలో చెట్లు చూడడం నాకు భలే ఇష్టం! ఆ ఆకుపచ్చరంగు వాన పడడానికి ముందే కడిగేసుకుని ముస్తాబు అయినట్లుంటాయి చెట్లు."
"అవునవును... అన్నట్టు చూశావా ... ఆ మబ్బు ఎంత పెద్దదో... ఆ చివర్నించి ఈ చివరిదాకా వుంది."
"ఆ... నిజమే! భలే! ఏదో సముద్రపుటల ఫోటో తీయించుకోవడానికి పోజిస్తూ ఆగిపోయినట్లుంది."
"కదా! వాటిని స్కై రివర్స్ అనో ఏదో అంటారనుకుంటా. అంటే నీళ్ళు ఒక్క చోట మబ్బుల్లో నిండినట్టు అయిపోయి జోరున వాన కురుస్తుంది."
"భలే!" అన్నానే కానీ తను Sky Rivers అని చెప్పిన మాటని నేను "Sky Reverse" అన్నట్టు విని - ఇప్పటికిప్పుడు ఆకాశం reverse అయితే మనం భూమికి పైనుంటామా, తలకిందులుగా వెళ్తామా అని అటు శాస్త్ర్రానికి పొసగని, ఇటు తర్కానికి నిలవని ఆలోచనలు ఏవేవో ఊహించుకోవడం మొదలుపెట్టాను.
ఈలోగా తన మాటలు సాగుతూనే వున్నాయి - తనకలవాటైన వివిధ-స్కీంలో - ఒక్కదానికొకటి పొంతన లేని రకరకాల పుంతలు తొక్కుతూ.
"ఇవాళ మా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళేం చెప్పారంటే పొట్ట కోస్తే అక్షరం ముక్క రాని వాడొకడు కొత్తగా Cloud Architect గా చేరానని కోతలేవో కోశాడట. నేను వెంటనే 'అయితే వాడో మబ్బుగాడన్న మాట!' అనగానే వాళ్ళెంత నవ్వారో తెలుసా?"
అది వినగానే నాకూ నవ్వొచ్చింది.
భుజమ్మీద తట్టి "భలే spontaneity మీలో. నాకు బాగా నచ్చుతుంది" అన్నా.
ఆ మాత్రానికే నవ్వు విరిసి కళ్ళు మెరిశాయి తనకి.
అడుగులు ముందుకు పడుతున్నాయి - కళ్ళు మాత్రం ఆకాశం మీంచి తిరగనంటున్నాయి.
ఆ పొడుగాటి నల్లమబ్బు చిక్కనై ఇంకా ఇంకా కమ్ముకొస్తోంది.
"చూశావా! అంతటి నల్లమబ్బుని చూసి కూడా గొడుగు తెచ్చుకోకుండా వచ్చేశాం. ఇప్పుడు వానొస్తే ఏం చేస్తాం?"
"మబ్బేసినంత మాత్రాన కురిసేస్తుందనేం లేదు."
"అయ్యో...ఇప్పుడు గుర్తొచ్చింది. నేను sun room తలుపులు కూడా వెయ్యలేదు. వాన కురిసి అంతా తడిసిపోతుందేమో?!"
"అబ్బా! ఇప్పుడు మీకున్నవి రెండు ఆప్షన్లు - ఒకటి ఇంటికి వెళ్ళిపోయి sun room తలుపులు వెయ్యడం, రెండు దాని గురించి ఆలోచించకుండా ఏం చేస్తున్నామో, చూస్తున్నామో దాన్ని enjoy చెయ్యడం. ఇల్లు కొన్న పదిహేనేళ్లనుంచి ఎన్నో సార్లు తడిసింది మన sun room. ఇప్పుడూ తడుస్తుంది. ఇక నడవండి బాబూ!"
ఇంటి ప్రసక్తి రాగానే నా మేలి-సగం ఆలోచన ఎటూ తడవబోతున్న సన్ రూమ్ నుంచి ఎప్పటికీ తడారని వంటింటి సింకు దాకా కొనసాగింది.
"అన్నట్టు బుజ్జాయ్! మొన్న మా కొలీగ్ గిరితో మాట్లాడేటప్పుడు తనతో ' ఇల్లంతా నా అధీనంలోకి వచ్చేసింది. మా పిల్లలిద్దరూ కూడా ఏమన్నా ప్లేటో, గ్లాసో కావాలంటే "నాన్నగారూ !" అంటూ నన్నే పిలుస్తున్నారు.' అని చెప్పగానే తను గట్టిగా నవ్వి 'మీరు భలేవారు సార్!' అన్నాడు తెలుసా? ఏ మాటకామాట చెప్పుకోవాలోయ్ - మన సింకు రోజురోజుకీ అక్షయపాత్రలా తయారవవుతోంది. ఎన్ని కడిగినా ఇంకోటి ఉంటూనే ఉంటుంది."
వస్తున్న నవ్వునాపుకునే ప్రయత్నమేదీ చెయ్యకుండా - పెదవుల చేరిన నవ్వుని ఇంకా చెవులదాకా సాగించుకుంటూ - వింటూ నడుస్తున్నాను.
ఇంతలో తనన్నట్లే వాన మొదలయింది.
నడక నేరుస్తున్న పాపాయి తపతపలాడే అడుగుల్లా అక్కడోటీ, అప్పుడోటీ అన్నట్టుగా చినుకులు.
తల మీద - ఎగురుతున్న జుట్టు మీద
చెవి మీద - చెంప మీద
కనురెప్ప మీద - పెదవొంపు మీద
చేతి మీద - కదులుతున్న కాలు మీద
--నెమ్మది నెమ్మదిగా అక్కడో చినుకు, ఇక్కడో చినుకు అన్నట్టు చిందులాడుతున్నాయి.
ఆకాశంలో ఉరుముల సందడి మొదలయింది.
మా నడకలో వేగం పెరిగింది.
చినుకు జోరు పెరిగింది.
"ఇది ఆగే వర్షం కాదు" పెరుగుతున్న చినుకుల జడిని చూస్తూ తను ప్రకాశంగా.
"ఇది నిలిచే వాన కాదు" వడివడిగా నడుస్తూ నేను సావకాశంగా.
ఈలోగా మాకిద్దరికీ ఇష్టమైన ఓ గుబురు చెట్టుకిందకి వచ్చాము.
ప్రతి చెట్టు కిందకీ వెళ్ళగానే - తలెత్తి మెలికలముగ్గులా కనిపించే ఆ కొమ్మల మధ్యనుంచి వెలిగే ఆకాశం చూస్తూ - మురిసిపోవడం నాకున్న ఇంకో నడక-లవాటు.
ఇప్పుడూ అలాగే "ఎంత బావుంటుంది కదా - కింద నుంచి చెట్టు కొమ్మల మధ్యలోంచి చూస్తుంటే" - అంటున్నానో లేదో, తను వెంటనే అందుకుని కళ్ళు పెద్దవి చేసి మెరుస్తుండగా "అదే... నేనెప్పుడూ చెప్తూ ఉంటానే - అదేదో theory చెట్ల design కి సంబంధించి ... నాకు పేరు గుర్తు రావట్లేదు - అదేంటో గుర్తుందా నీకు?" అని మహా ఉత్సాహంగా మొదలుపెట్టారు.
నాకు చూచాయగా అదేదో Fractal Theory అని గుర్తుంది కానీ ఇప్పుడు దాన్ని గుర్తు చేసి - చిందు చినుకు రవళిని వింటూ ప్రశాంతంగా సాగుతున్న నడకని సైన్స్ పాఠాలు చెప్పుకోవాలని, వినాలని నాకే కోశానా ఇష్టం లేదు.
"నాకేం గుర్తు లేదు బాబూ! ఇంకేమన్నా మాట్లాడండి. అదుగో... ఆ ఇంటి దగ్గర బంతిపూలు భలే వున్నాయి కదా! మనింటి ముందు ఎప్పుడు పూస్తాయో ఇల్లాంటివి! ఈసారి మనం జింకల్లేని చోట ఇల్లు కొనుక్కుందాం."
తనో నిముషం మాట్లాడకుండా ఆగి "నీకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం తక్కువ కదా ఎలాగైనా?" అని విచారించారు.
"ఇప్పటికిప్పుడు బావుంది. నాకు ఈ నిముషం తప్ప దీనికి ముందూవెనకా విషయాలూ, విశేషాలూ అక్కర్లేదు. My ignorance is my bliss. నావరకు నాకు నేను చేసే పనికి పనికొచ్చే జ్ఞానం చాలు. అన్నీ తెలిసేసుకొని ఏం చెయ్యాలిప్పుడు? " వింటున్నారో లేదో పట్టించుకోకుండా చుట్టూ కురుస్తున్న చినుకుల్లా నా నోట్లోంచి మాటలు రాలుతూనే వున్నాయి.
ఇంతలో వాన పెద్దదయ్యింది. రోజూ వెళ్ళే దూరానికి ఇంకో పావువంతు మాత్రమే మిగిలింది.
కానీ తను జేబులో ఉన్న ఫోన్ గురించి "అయ్యో! తడిసిపోతుందేమో!" అనుకుంటున్నారు.
ఇంక ముందుకి వెళ్ళాలనిపించలేదు ఇద్దరికీ. ఇద్దరం వెనక్కి తిరిగి గబగబా ఇంటి దారి పట్టాం.
"పోనీ... బుజ్జిగాణ్ణి కార్ తెమ్మందామా? తడవకుండా వెళ్లిపోవచ్చు!" పక్కనుంచి చిన్నగా అడిగారు తను.
"ఒక్కపూటకి వర్షంలో తడిస్తే ఏమైపోతుంది. వాణ్ణి పొద్దున్నే disturb చెయ్యడమెందుకు?" అంటూనే అడుగులు వేస్తున్నాను.
నేనలా అంటుండగానే దూరంగా కనిపిస్తున్న Nature Trail దగ్గర ఎవరో కార్ తీసుకొచ్చి వాళ్ళవాళ్ళని ఎక్కించుకుంటున్నారు.
నీటిదారాలు దారులు కట్టాయి మబ్బు నుంచి నేలకి.
కళ్ళు కనపడనీయకుండా కురుస్తున్న వర్షాన్ని చూస్తే - BH లో చదివే రోజుల్లో - "వానా వానా వందనం..." అంటూ బ్యాండ్‌మేళం వాళ్ళు చిరంజీవి పాటను వాయిస్తుంటే - కళ్ళూ, మొహం కనపడకుండా - మల్లెపూదండలు కట్టుకుని గుఱ్ఱమెక్కిన ఊరేగిన పెళ్ళికొడుకు - మా BH లో అటెండరుగా పనిచేసే - బికారి గుర్తొచ్చాడు.
మరీ జోరుగా కురుస్తోంది కదా అని ఇద్దరం గబగబా నడిచి వెళ్ళి - మళ్ళీ మాకిష్టమైన చెట్టు కిందే నించున్నాం.
"భలే! చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే... చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టునీడకై పరిగెడుతుంటే..." అని పాడుతూ ఉన్నానో లేదో... "ఆ... అది చెప్పలేని హాయే కానీ... ఇలా ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు చెట్టు కిందకి వెళ్ళాలంటే ఆలోచించాల్సిందే!" అని ఠక్కున తన నించి హెచ్చరిక.
"అవునవును...పిడుగులు పడతాయని కదా!?" అంతకన్నా ఠక్కున ఆగి ఆలోచనయ్యింది నా పాట.
ఆకలేసి ఆగం చేస్తున్న బుజ్జిగాడిలా వర్షం ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు.
ఎప్పుడాగుతుందో తెలియని వాన - ఆగేదాకా - ఆక్కడే ఆగడం ఎందుకని ఇద్దరం కలిసి మళ్ళీ బయల్దేరాం.
ఇంతలో అప్పుడే వాకింగ్ మొదలుపెట్టిన ఒకాయన - మాకెదుర్రాగానే "Enjoying the rain?" అని పలకరించి, ఆయన చిలకరించిన చిరునవ్వుల్ని చినుకులతో అందిపుచ్చుకుని ముందుకు సాగాం.
నాలుగడుగులు వేశామో లేదో - ఇంతకు ముందు - Nature Trail దగ్గర చూసిన కారు మా పక్కనే ఆగింది. లోపల్నుంచి ఓ చొక్కా లేని పెద్దాయన మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యనా అని అడిగితే "వద్దూ, We are fine, Thanks" అని చెప్పి మా దారిన మేము వానదారుల నడిచాం.
"అవును బంగారం! నీకు ఈ వానలో డాన్స్ చెయ్యాలనిపించదా?"
"వానలో డాన్సా ... బానే ఉంది... తడవడమే అంతగా ఇష్టం లేదు నాకు. చిన్నప్పుడు ఇంటికెదురుగా వున్న గోదాట్లో స్నానానికే తెల్లవారుఝామున చీకటిలో వెళ్ళి, ఆ చీకట్లోనే ఇంటికి తిరిగి వచ్చేసేవాళ్ళం - వెలుగులో తడిబట్టలతో ఎవరికీ కనబడడం ఇష్టం లేక."
"మరి సినిమాల్లో ఎందుకలా చూపిస్తారో కదా! మన చిన్నప్పట్నుంచీ ఏదో చిన్నపిల్లలు వానొస్తే ఆడుకోవడం చూశాం కానీ రోడ్డు మీద ఏ అమ్మాయీ వర్షంలో చిందులేయ్యడం చూడం. కదా!"
"ఏమో... బాగా కట్టుదిట్టాల్లో పెంచితే ఆ అదుపుకి ధిక్కారంగా అలా తడిసినట్టు సింబాలిక్‌గా చూపిస్తారేమో?
"అవున్లే... అందులో commercial elements కూడా ఉంటాయి. అలాగే దీపావళికి ఓ అమ్మాయికి తెల్ల డ్రెస్సు వేసి పిల్లలతో గెంతుతున్నట్టు ఎందుకు చూపిస్తారో?"
"నాకు తెలీదు బాబూ... ఆ సినిమా తీసిన డైరెక్టర్‌కి ఫోన్ చేసి కనుక్కోండి."
ఇద్దరం బాగా తడిసిపొయ్యాం. వాన కొంచెం తగ్గింది.
కురిసిన వాన రోడ్డుకి ఒక పక్కగా చిన్న ఏరులా పారుతూ అక్కడక్కడా వున్న sewer లలోకి జారుతోంది.
"వాన రోడ్ల మీంచి భలే జారుతోంది కదా!" నేనా నీళ్ళలో నడుస్తూ మురుస్తున్నాను నేను.
"అవును... అదే వాళ్ళ డిజైన్ గొప్పదనం. పైనే ఇలా ఉంటే కింద sewer system కూడా అంతే వాలుగా కట్టే ఉంటారు - ఈ నీళ్ళన్నీ చేరే చోటికి effortless గా చేరేలా. అదెలా డిజైన్ చేసుంటారో ఎప్పుడైనా ఆలోచించావా?" మళ్ళీ ఓ inquistive enquiry.
నేనేం మాట్లాడలేదు.
నేనసలే ఒక్క మాట మీద నిలబడే మనిషిని.
అప్పటికే ఆ ఒక్కమాట నిలకడగా ఎన్నిసార్లు చెప్పున్నానో "తెలీదండి" అని.
మరిప్పుడు మాత్రం మాట మారుస్తానేంటి?
నేను చెప్పాలనుకుని చెప్పినా, చెప్పకూడదనుకుని చెప్పకుండా imply చేసినా అదే మాట.
నేనేం సమాధానం ఇవ్వకపోవడం చూసి "నువ్వు యక్షుణ్ణి పెళ్ళి చేసుకున్నావ్. ఏం చేస్తాం?!" అని ఓ మాటా, దాంతో పాటు ఓ నవ్వూ నాకేసి విసిరారు తను.
అవి అందుకుని అలాగే ముందుకి సాగా - నీళ్ళని కాళ్ళతో చిందుతూ, చిమ్ముతూ...
ఓ రెండడుగులు వెయ్యగానే "వర్షంలో తడిసి ఒళ్ళు అంతా ఎంత refreshing గా ఉందో కదా?" అని ఇంకో ప్రశ్న కాని ప్రశ్న.
"ఊఁ ..." అని నేనేదో అనబోతుంటే "ఇదేమీ ఇంకో జోక్ కాదు. నిజంగానే అంటున్నా. మబ్బుల్లోంచి సరాసరి మన మీదకి ఇంత స్వచ్ఛమైన నీళ్ళు - ఇందులో ఎన్ని మినరల్స్ ఉంటాయో! అందులో మనం తడిస్తే ఎంత బావుందో కదా!"
పాపం! నేనే ఊరికే తను మాట్లాడే ప్రతిమాటకీ ఏదో సైన్సూ, సోషలూ ముడిపెడ్తారు అనుకుంటాను కానీ తనకి మాత్రం వానంటే నాకుండేలాంటి ఇష్టం ఉండకూడదా ఏంటి? తను నిజంగానే అంటున్నారు అనుకోబోతూ ఉన్నాను - అంతలోనే పక్కనుంచి "నా IQ బాగా పెరిగుంటుంది ఈ వానకి" అన్నారు తను చటుక్కున.
"అదేంటీ? మీ IQ ఎలా పెరుగుతుంది?" ఒక్క నిముషం రోడ్డు మీదే ఆగి అడిగా.
"అదే మరి .... ఇంత మంచి మినరల్ వాటర్ నా తల మీద మబ్బుల్లోంచి డైరెక్టుగా పడితే నా IQ పెరగదేంటి మరి?!" మళ్ళీ యక్షుడు ఆవహించేశాడు.
"మరే ..." అనేదో అనబోతున్నా.
అంతలోనే "నా పన్నెండేళ్ళ వయసు నుంచి eye-టెస్టులు తప్ప మా అమ్మ నాకెప్పుడూ IQ test చేయించలేదేంటో?" యక్షావతారం కొనసాగింపు.
"అంటే ఉన్నవాటికి టెస్ట్ చేస్తారు కానీ... " నేనింకా పూర్తి చెయ్యనేలేదు.
"అవున్లే... ఉండి పనిచెయ్యని వాటికి టెస్టులు కావాలి కానీ అసలు లేని దానికి టెస్టులెందుకని మా అమ్మ మానేసుంటుంది. ఎలా అయినా మా అమ్మకి అన్నీ బాగా తెలుసు."
"అదే మరి... అత్తయ్యకి IQ ఎక్కువ - అందుకే ."
"బా చెప్పావు." అంటూ కుడిచేతి బొటనవేలు, చూపుడువేలు సున్నాలా చుట్టి బావుందన్నట్టు చూపించారు.
నేనేదో మురిసేలోగా "ఇలా ఎవరైనా చూపిస్తే బావుందనే కాదు - అది నీ IQ measure కూడా... "
"హహ్హహ్హా... కదా! ఆ చేతిముద్రకి ఈ కొత్త definition బావుంది."

నవ్వులవాన కురిసింది
నవ్వుల జల్లులు తాకి మా నట్టిల్లు మురిసింది
చినుకుల వాన వెలిసింది
చినుకుల వెల్లువ ఆగి మింట వానవిల్లు విరిసింది

ఆ... ఇంకోటి పాడేసుకోండి... కురిసేదాకా అనుకోలేదు శ్రావణమేఘమనీ... and the subsequent lines...all for these posts!
రిప్లయితొలగించండిపాడేసుకున్నామండి, ఆయ్!
తొలగించండి