అల్లల్లన అలలుగా
అల్లనల్లన మెలమెల్లగా
అలవోకగ తగిలీ తగలక
చెక్కిలి మీటి తట్టి పోయే చిరుగాలీ - ఒక పాటే...
చిరుగాలి పాటలో ఊయలలూగుతా
ఊగుతూ ఊగుతూ తూలియాడుతా...
ఉన్నట్టుండి ఉలిక్కిపడేలా
అదిరిపాటుగా హడావిడిగా
ఉన్నచోట ఉండనీక
చిందు వేయించి తరలిపోయే హోరుగాలీ - ఒక పాటే...
హోరుగాలి పాటతో చిందేసి ఆడతా
ఆడుతూ ఆడుతూ సోలి వాలుతా...
*****************
*****************
*****************
*****************
ఒక్కో అప్పుడు ఒక్కో పాట వింటుంటే ఆ పాటలో ఏముంటుందో ఏమో గానీ - నెయ్యంపు గాలి ఏదో తాకి - తనతో గొంతు కలిపి పదం పాడమని - కవ్వించినట్టనిపిస్తుంది.
ఇంకోసారి ఇంకేదో పాట విన్నప్పుడు - అల్లరల్లరి గాలి వెళ్తూ వెళ్తూ ఆకతాయితనంగా ఓ సారి చుట్టుముట్టి - నా చేయి పట్టి - తనతో నేను చెట్టాపట్టాగా - పాదం కలిపి ఆడేదాకా కుదురుగా ఉండనియ్యక - ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టనిపిస్తుంది.
అలాంటి పాటలకి నేను పెట్టుకున్న ముద్దుపేరు - గాలిపాటలు. ఒకప్పుడు రేడియోలో వివిధభారతి జనరంజని, మన్ చాహే గీత్, ఛాయా గీత్ కార్యక్రమాల్లో విన్న చాలా గాలిపాటలు ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని చూడడానికి వీలవుతోంది.
అప్పటివరకూ వింటూ, ఊహించుకుంటూ ఉన్న పాట చూస్తున్నపుడు - ఆ పాట అప్పటివరకూ అనుకున్న ఊహకి దగ్గర గానో, అంతకన్నా మెరుగ్గానో కనిపిస్తే - ఇహ అప్పుడు కలిగే ఆనందం ఏమని చెప్పాలి?! ఎంతని చెప్పాలి?!
ఎప్పట్నుంచో నా చెవిలో రొదరొదగా సందడి చేస్తూ, పెదవుల మీద చేరి పదేపదే పలుకుతున్న గాలిపాటలు ఓ రెండున్నాయి.
నా ఎత్తు మఱిగి, నా గొంతులో చేరి పూటపూటా నన్ను మోగేలా చేస్తున్న ఆ పాటల్ని - బ్రతిమాలి, బామాలి, బుజ్జగించి - మీకందరికీ అందేలా ఇక్కడ దించక పోతినా - ఆ రాలుగాయి పాటల రాగాలు నా నోట ఆగేలా లేవు.
మా నట్టింటిని ఆ రాగాల మోతలు వీడేలా లేవు.
ఇంట్లో వాళ్లందరికీ నిద్రలో కూడా ఆ పాటలే - కనులు తెరిచే వేళ పలకరింపులుగా - కనులు మూస్తే కలవరింతలుగా - కలల వేళ పలవరింతలుగా - వినబడుతున్నాయట.
అందుకే ఇవాళ ఆ పాటలు రెండిటికీ - అల్లరి చేసిన పాపాయిల్ని మాట మార్చి ఏమార్చి కుదురుగా కూర్చోపెట్టటానికి వాళ్ళ గురించిన కథలే వాళ్ళకి చెప్పినట్లు - ఆ పాటల గురించిన కబుర్లే వాటికి చెప్పి ఊర్కోపెడితే కానీ నాకు కుదురుండేలా లేదు.
ఇంతకీ ఆ రెండు పాటలకీ - భాష వేరు, భావం వేరు - రాగం వేరు, తాళం వేరు - రంగు వేరు, హంగు వేరు - సమయం వేరు, సందర్భం వేరు.
వాటికున్న చుట్టరికమూ, పోలిక అల్లా - ఆ రెండూ పాటలు కావడమే.
అందులో మొదటిది చల్‌తే చల్‌తే పాట - పాకీజా సినిమాలోది. పాట రాసినది ఉర్దూ కవి కైఫీ అజ్మీ.
(ఈ కైఫీ అజ్మీ పిల్లలే ప్రముఖ హిందీ నటి షబానా అజ్మీ, ఛాయాగ్రాహకుడు బాబా అజ్మీ. బాబా అజ్మీ భార్య తన్వీ అజ్మీ. దూరదర్శన్ సీరియళ్ళు చూసే రోజుల్లో మొట్టమొదటి సారిగా తన్వీ అజ్మీ షబానాకి వదిన అని తెల్సి - ఆ చిన్నపాటి celebrity titbit ఇచ్చిన excitement ఇప్పటికీ గుర్తు నాకు.
బాబా అజ్మీ, తన్వీ అజ్మీల పెళ్ళి గురించి ముళ్ళపూడి వెంకటరమణగారు "కోతికొమ్మచ్చి"లో ప్రస్తావించారు కూడా. బాబా అజ్మీ కజిన్ ఇషాన్ ఆర్యా బాపు సినిమాలు - ముత్యాలముగ్గు, గోరంతదీపం - సినిమాలకి కెమెరామన్.)
కైఫీ అజ్మీ రాసిన గుబాళించే ఉర్దూ కవితకి గులాబీ పరిమళాలని అద్దింది గులామ్ మొహమ్మద్ సంగీతం. పాటని గొంతులో గాలి అలలుగా వినిపించింది లతా మంగేష్కర్.
ఆకాశంలో ఉండే ౘందమామ - తను అమ్మాయిగా మారితే ఎలా ఉంటానో చూసుకుందామని సరదా పడి - అలంకరించుకుని భూమ్మీదకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీనాకుమారి ఈ పాటలో.
అలాసరదా పడి వచ్చి - పిల్లతెమ్మెర లాంటి పాట పాడుతూ - అలవోకగా - అందెల చిరుసవ్వడితో ఆడుతున్న తన ప్రతిబింబాన్ని అద్దంలో దొంగచాటుగా చూసుకుని మురుస్తున్నట్టుగా - ౘందమామ ఈ పాట సాగుతున్నంత సేపూ ఆకాశంలో దోబూచులాడుతూ కనిపిస్తూ ఉంటాడు.
ౘందమామ లాంటి మీనాకుమారి వెనకాల - వెన్నెల నద్దుకున్న మబ్బుతునకల్లా అలా-అలా అలల మీద జంట నావల్లా - కదిలీ కదలనట్లుగా ఉన్న - తేలిక పాటి కదలికలతో - నాట్యం చేస్తున్న అమ్మాయిలిద్దరి మీంచి చూపు మరల్చుకుందామన్నా మరలదే - అది ఏమి మాయో - మదిని మురిపించి మైమరపించే... మరదే !
ముందు కనిపిస్తున్న మీనాకుమారి దెంత మురిపించే అందమైనా - ఆ వెనకున్న అమ్మాయిల హొయలుకి మైమఱచె నా డెందమే!
పాట మొదలు పెడుతూ - వహీ థమ్‌కే రహ్ గయీ హై అన్న చోట మీనాకుమారి ఒక చేతిని అలా చులాగ్గా కదుపుతూ, కళ్ళతో కనిపించీ కనిపించనట్లుగా చేసే ఒక చిన్న సైగతో... వాహ్! ఆ జాణతనం చూడాల్సిందే!
ఇంకా - కే ఫసానా బన్ గయీ హై ... మేరే బాత్ టల్‌తే-టల్‌తే అని పాడేటప్పుడు చేతుల తోనూ, ఒక పక్కకి కొద్దిగా వంచిన తల తోనూ కూడా కూడా నాట్యం చేయించేసింది మీనాకుమారి.
షబ్-ఏ-ఇంతెజార్ ఆఖిర్ - కభీ హోగీ ముఖ్తసర్ భీ అన్న చోట అంత అందంగా మందమారుతపు సాయంతో తూగుతున్న రాత్రి అక్కడితో ఆగిపోతుందేమోనని దిగులుతో - ౘందమామ - చిన్నబుచ్చుకున్న మొహంతో మబ్బుల చాటుకి వెళ్ళి పోతున్నట్టు కనిపిస్తాడు.
ఈ పాటలో నాకు బోల్డంత నచ్చింది ఏంటీ అంటే...ముగ్గురమ్మాయిలూ చేసిన డాన్స్.
ఆట్టే కదలకుండా ఎంత బాగా చేశారో... ఆ చల్లని వెన్నెల రాత్రిలో వెన్నెల తాగి మత్తిల్లిన వెన్నెలపులుగులు - చకోర పక్షుల్లా.
వాళ్ళకి తోడు ఆ వెనకగా పాటకి ఆడుతున్న జలయంత్రపు నీళ్ళు, దాని పైగా కింద ఆడుతున్న వయ్యారిభామకి దీటుగా మబ్బుల మేలిముసుగులో దోబూచులాడుతున్న జాబిలి పోకళ్ళు - చూసిచూసి నా కళ్ళ ముందు కలలా నిలిచిపోయాయి ఆ తళుకులు, బెళుకులు, మెరుపులు, జిలుగులు.
ఇది మహా సొగసైన పాట.
ఈ పాట తెలుగులో రాస్తున్నంత సేపూ రాస్తున్న ఒక్కో మాట దగ్గర ఆగి - ముఖ్యంగా - సర్-ఏ-రాహ్, షబ్-ఏ-ఇంతెజార్, ముఖ్తసర్, చల్‌తే-చల్‌తే, టల్‌తే-టల్‌తే, ఢల్‌తే-ఢల్‌తే, జల్‌తే-జల్‌తే - అన్న మాటలు రాస్తూ నేనెంత మురిసిపోయానో నాకే తెలుసు.
ఈ పాటలో అక్కడక్కడ పెట్టిన three dots (ellipses), hyphens, line breaks అన్నీ కూడా - నేను రాస్తున్న పాటని ఎంత అందంగా ఎక్కెడెక్కడ ఆపితే ఇంకెంత అందంగా అర్థం స్ఫుటంగా ఊరిస్తూ స్ఫురిస్తుందో అనుకుంటూ పెట్టినవి.
అన్నట్టు ఇంకో మాట... హిందీ कोई ని మన తెలుగులో సాధారణంగా కోయీ అని రాసేదాన్ని. ఈ పాటలో మాత్రం అలా రాయడానికి మనసొప్పక తెలుగులో కూడా కోఈ అని రాసుకున్నాను.
రాస్తూ రాస్తూ ఈ పాట మీద నాకు కలిగిన మోహం, పెరిగిన వ్యామోహం మాటల్లోకి తర్జుమా చెయ్యాలంటే బోల్డన్ని కబుర్లు చెప్పే నాకే మాటలు దొరకట్లేదు.
ఇక్కడికి ఈ పాట గురించి చెప్పడం ఆపుతాను. అంతా దీని గురించే చెప్పేస్తే ఆ రెండో హోరుగాలి పాట అలుగుతుంది నా మీద.
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే...
యు హీ కోఈ - మిల్ గయా థా!
యు హీ కోఈ - మిల్ గయా థా!
సర్-ఏ-రాహ్... చల్‌తే-చల్‌తే...
సర్-ఏ-రాహ్... చల్‌తే-చల్‌తే...
వహీ థమ్‌కే - రహ్ గయీ హై
వహీ థమ్‌కే - రహ్ గయీ హై
మేరీ రాత్... ఢల్‌తే-ఢల్‌తే...
మేరీ రాత్... ఢల్‌తే-ఢల్‌తే...
యు హీ కోఈ - మిల్ గయా థా!
యు హీ కోఈ - మిల్ గయా థా!
సర్-ఏ-రాహ్... చల్‌తే-చల్‌తే...
సర్-ఏ-రాహ్... చల్‌తే-చల్‌తే...
వహీ థమ్‌కే - రహ్ గయీ హై
వహీ థమ్‌కే - రహ్ గయీ హై
మేరీ రాత్... ఢల్‌తే-ఢల్‌తే...
మేరీ రాత్... ఢల్‌తే-ఢల్‌తే...
జో కహీ గయీ న - ముఝ్‌సే
జో కహీ గయీ న - ముఝ్‌సే
వో - జమానా కహ్ రహా హై
వో - జమానా కహ్ రహా హై
కే ఫసానా...
కే ఫసానా - బన్ గయీ హై
కే ఫసానా - బన్ గయీ హై
మేరీ బాత్... టల్‌తే-టల్‌తే
మేరీ బాత్... టల్‌తే-టల్‌తే
యు హీ కోఈ - మిల్ గయా థా!
యు హీ కోఈ - మిల్ గయా థా!
సర్-ఏ-రాహ్... చల్‌తే-చల్‌తే...
సర్-ఏ-రాహ్... చల్‌తే-చల్‌తే...
యు హీ కోఈ - మిల్ గయా థా!
సర్-ఏ-రాహ్...
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
సర్-ఏ-రాహ్...
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
జో కహీ గయీ న - ముఝ్‌సే
వో - జమానా కహ్ రహా హై
వో - జమానా కహ్ రహా హై
కే ఫసానా...
కే ఫసానా - బన్ గయీ హై
కే ఫసానా - బన్ గయీ హై
మేరీ బాత్... టల్‌తే-టల్‌తే
మేరీ బాత్... టల్‌తే-టల్‌తే
యు హీ కోఈ - మిల్ గయా థా!
యు హీ కోఈ - మిల్ గయా థా!
సర్-ఏ-రాహ్... చల్‌తే-చల్‌తే...
సర్-ఏ-రాహ్... చల్‌తే-చల్‌తే...
యు హీ కోఈ - మిల్ గయా థా!
సర్-ఏ-రాహ్...
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
సర్-ఏ-రాహ్...
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
యు హీ కోఈ - మిల్ గయా థా!
యు హీ కోఈ - మిల్ గయా థా!
యు హీ కోఈ - మిల్ గయా థా!
యు హీ కోఈ - మిల్ గయా థా!
షబ్-ఏ-ఇంతెజార్ ... ఆఖిర్
షబ్-ఏ-ఇంతెజార్ ... ఆఖిర్
కభీ హోగీ ముఖ్తసర్ భీ...
కభీ హోగీ ముఖ్తసర్ భీ...
యే చిరాగ్...
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే
*****************
*****************
అక్కడ వినండి... ఇక్కడ చూడండి...షబ్-ఏ-ఇంతెజార్ ... ఆఖిర్
కభీ హోగీ ముఖ్తసర్ భీ...
కభీ హోగీ ముఖ్తసర్ భీ...
యే చిరాగ్...
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే
*****************
*****************
నన్ను చుట్టుముట్టి ఊపేస్తున్న ఇంకో గాలిపాట - ప్రాణం ఖరీదు సినిమాలో ఏలియల్లో... ఏలియల్లో ... ఎందాకా ? పాట.
ఈ పాట రాసినవారు జాలాది రాజారావు. పాడిన వారు జి. ఆనంద్, ఎస్పీ శైలజ. పాట మొదట్లో వచ్చే ఏలియల్లో అంటూ వచ్చే రెండు లైన్లూ పాడింది డాక్టర్ కోనాల సువర్ణ చంద్రశేఖర్ గారట.
ఈ పాటకి సంగీతం కూర్చినవారు స్వరరాగపూరితగానానువర్తి**- చక్రవర్తి. తెలుగు సంగీత దర్శకుల్లో నాకు చాలా ఎక్కువగా నచ్చే బాణీ చక్రవర్తిది. పాట ఎంత అలవోకగా ఆడుతూ పాడుతూ కట్టినట్లు ఉంటుందో! పాటలో ఉన్న మాటలు స్పష్టంగా వినిపించేలా - ఒకే రాగంతో అన్ని పాటలూ కట్టినట్లున్నా ఏ పాటకాపాటే తన రాగమేదో వేరన్నట్టుగా ఉంటుంది.
(**స్వరరాగపూరితగానానువర్తి : ఇది సంగీతంలో ఓనమాలు కూడా దాటలేకపోయిన నేను కూడా పాడుకునేంత సులువైన రాగాలతో పాటలు కట్టిన చక్రవరి పాటల మీద ఇష్టంతో ఆయనకి నేను పెట్టుకున్న పేరు. )
ఇక పాటలో ఆడినవారు ప్రాణం ఖరీదు సినిమాకి నూతనతారలు - రేష్మీ, చిరంజీవి.
పైన చెప్పుకున్న హిందీ పాటలో మీనాకుమారి వెన్నెల కురిసే జాబిలి కన్నె అయితే - ఈ తెలుగు పాటలో చిరంజీవి కళ్ళు మిరుమిట్లు గొలిపించే సూరీడు.
గాలిలో....లీలగా ... అవలీలగా - చేసిన తన డాన్స్ చూస్తే ఇదసలు చిరంజీవికి - విడుదలైన మొట్టమొదటి సినిమా - అంటే నమ్మలేం.
ఆ వెలిగే కళ్ళ నవ్వు మొహం, గాలిలో తేలుతున్నట్టుగా కదిలే పాదాలు, చేస్తున్న డాన్సులో చిరంజీవికే సొంతమైన ease, grace చూస్తే Gifted he is! అనిపించింది.
ఇక పాటలో పల్లెటూరి మొనగాడు - కుచ్చుపంచెల చిరంజీవికి - జతగా ఆడిన జడకుచ్చుల పల్లెటూరి పిల్ల రేష్మి ఎంత బావుందో!
గళ్ళచీర, బుట్ట చేతుల జాకెట్టు, పొడుగు జడ, మెళ్ళో ఆడే గుళ్ళపేరు, నున్నగా జడ దువ్వుకుని జతగా ఆడుతున్న సూరీడి వెలుగుని కొంచెం పంచుకుని మెరుస్తున్న ౘందమామ లాంటి మొహం - బంగారంలా మెరిసింది తెర మీద.
ఈ గాలిపాటలో బంగారి రేష్మి కనిపించడమే - రెండు చేతులూ బారచాచి - తానే గాలేమో అన్నట్టు కమ్ముకుంటూ వస్తుంది. ఆ పరుగులో - ఒక విరుపు, ఒక మెరుపు, ఒక వెతుకులాట, ఒక వలపు పాట - కనిపిస్తాయి.
పాట చూస్తున్నంత సేపూ - నలుపు-తెలుపుల పాటే అయినా - ఎఱ్ఱగా మెరుస్తున్న సూరీడు, ఎండ పొడన వెచ్చగా కాగుతున్న చెట్లూ కనిపిస్తాయి. వాటితో పాటే వెచవెచ్చని గాడుపు తగులుతున్నట్టనిస్తుంది.
ఇక జాలాది రాసిన పాటలో నాకు నచ్చిన మాటలు రాయాలంటే పాట మొత్తం మళ్ళీ ఇక్కడ రాసెయ్యాల్సిందే. పాటలో ఎంత కవిత్వం!
తిరణాల గిలకలూ...
ఎన్నెల్లో ఇల్లూ - చుక్కల్లో పక్కలూ...
గీరెక్కిపోయిన గోరంకలూ...
మేజువాణి ఆడిన రోజువారి మోజులూ...
రేతిరంత నిదర కాచి నవ్విన కలవపూలూ...
పడమటేపు పడకేసి దొర్లి - తూరుపేపు తలుపు తీసి నవ్విన సూరిగాడూ....
ఏ మాట కవిత్వమని చెప్పను? ఏ మాట కవిత కాదని అనను? ఎంత సొంపైన మాటలు! ఏమి సొబగైన పాట!
ఎన్నెల్లో ఇల్లూ - చుక్కల్లో పక్కలూ...
గీరెక్కిపోయిన గోరంకలూ...
మేజువాణి ఆడిన రోజువారి మోజులూ...
రేతిరంత నిదర కాచి నవ్విన కలవపూలూ...
పడమటేపు పడకేసి దొర్లి - తూరుపేపు తలుపు తీసి నవ్విన సూరిగాడూ....
ఏ మాట కవిత్వమని చెప్పను? ఏ మాట కవిత కాదని అనను? ఎంత సొంపైన మాటలు! ఏమి సొబగైన పాట!
యూట్యూబ్లో ఉన్న పాట చూడడానికి బావుంది. కానీ ఈ పాట వినడానికి మాత్రం చిమటా శ్రీనివాస్ గారి website కి వెళ్ళాల్సిందే: www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=9600
ఏలియల్లో ఏలియల్లో ఎందాకా?
ఎల మీరి పోయేనమ్మా గూటి సిలకా...
ఓలమ్మ తిరణాల గిలకా - వగలాడి ఒయ్యారి మొలకా
ఓలమ్మ తిరణాల గిలకా - వగలాడి ఒయ్యారి మొలకా
ఎన్నెల్లో ఇల్లేయనా? చుక్కల్లో పక్కేయనా?
ఎన్నెల్లో ఇల్లేయనా? చుక్కల్లో పక్కేయనా?
గోరంక గోరంక తుమ్మెదా...గీరెక్కిపోయింది తుమ్మెదా..
గోరంక గోరంక తుమ్మెదా...గీరెక్కిపోయింది తుమ్మెదా..
ఓరయ్యో చంద్రయ్య కొడకా - పొద్దుల్లో నా యెంట పడకా
ఓరయ్యో చంద్రయ్య కొడకా - పొద్దుల్లో నా యెంట పడకా
ఆ మూడు ముళ్ళెయ్యరా - నూరేళ్ళ పడకెయ్యరా
ఆ మూడు ముళ్ళెయ్యరా - నూరేళ్ళ పడకెయ్యరా
పాలమబ్బు గువ్వల మీద మెరుపు మెరిసి ఆడినట్టే
నీలికొండ గుండెల మీద వాన సుక్క జారినట్టే
వాన సుక్క వాగులయ్యీ సముద్రాన కలిసినట్టే
వాన సుక్క వాగులయ్యీ సముద్రాన కలిసినట్టే
వాన సుక్క వాగులయ్యీ సముద్రాన కలిసినట్టే
రోజువారి మోజులన్నీ మేజువాణి ఆడినట్టే
ఓరయ్య నేనాడుకోనా ? ఒడి నిండ నేనుండిపోనా?
ఓరయ్య నేనాడుకోనా ? ఒడి నిండ నేనుండిపోనా?
ఏలియల్లో ఏలియల్లో ఎందాకా?
ఎల మీరి పోయేనమ్మాగూటి సిలకా...
రేతిరంత నిదర కాచి కలవపూలు నవ్వినట్టే
రేపు మాపు ఆకాశం ఆకు-వక్క వేసినట్టే
పడమటేపు పడకేసి సూరిగాడు దొర్లినట్టే
పడమటేపు పడకేసి సూరిగాడు దొర్లినట్టే
పడమటేపు పడకేసి సూరిగాడు దొర్లినట్టే
తూరుపేపు తలుపు తీసి తొంగి సూసి నవ్వినట్టే
సందెల్లో సిందేయనా? పొద్దల్లే ముద్దెట్టనా?
సందెల్లో సిందేయనా? పొద్దల్లే ముద్దెట్టనా?
ఓరయ్యో చంద్రయ్య కొడకా - పొద్దుల్లో నా యెంట పడకా
ఓరయ్యో చంద్రయ్య కొడకా - పొద్దుల్లో నా యెంట పడకా
ఎన్నెల్లో ఇల్లేయనా? చుక్కల్లో పక్కేయనా?
ఆ మూడు ముళ్ళెయ్యరా - నూరేళ్ళ పడకెయ్యరా
ఎన్నెల్లో ఇల్లేయనా? చుక్కల్లో పక్కేయనా?
ఆ మూడు ముళ్ళెయ్యరా - నూరేళ్ళ పడకెయ్యరా
ఏలియల్లో ఏలియల్లో ఎందాకా?
ఎల మీరి పోయేనమ్మాగూటి సిలకా...
ఏలియల్లో ఏలియల్లో ఎందాకా?
ఎల మీరి పోయేనమ్మాగూటి సిలకా...
*****************
*****************
అక్కడెక్కడో - ఆ పైన - ముందే చెప్పినట్టు ...
*****************
*****************
అక్కడెక్కడో - ఆ పైన - ముందే చెప్పినట్టు ...
చిరుగాలి పాటలో ఊయలలూగుతా
ఊగుతూ ఊగుతూ తూలియాడుతా...
~ పాటల భైరవి
హోరుగాలి పాటతో చిందేసి ఆడతా
ఆడుతూ ఆడుతూ సోలి వాలుతా...~ పాటల భైరవి
ప్రాణం ఖరీదు పాట ఇప్పుడే చూసాను/ విన్నాను. మంచి పాట. అప్పట్లో డ్యూయట్ తీసిన విధం కూడా బాగుంది. పాకీజా లోని అన్ని పాటలూ నాకు మరీ మరీ ఇష్టం. ఉర్దూ షాయరీలను అర్ధం చేసుకోగలిగితే ఆ సౌందర్యాన్ని మరింత ఆస్వాదించగలుగుతాం.
రిప్లయితొలగించండిగౌరి గారు!నా పాటల కబుర్లు చదివినందుకు మీకు థాంక్స్! మీరన్నది నిజం - అర్థం చేసుకుంటూ వింటే పాకీజా పాటలు చాలా గొప్పగా అనిపిస్తాయి.
తొలగించండికైఫీ అజ్మీ అద్భుత కవి. మీరు ఎంచుకున్న పాటలో చిన్నచిన్న సులువయిన పదాలతో మనసుకు హత్తుకునే లోతయిన భావం ఉంది.
రిప్లయితొలగించండి"ఒక్కో మాట దగ్గర ఆగి"
"అక్కడక్కడ పెట్టిన three dots (ellipses), hyphens, line breaks"
Hats off to the fantastic way of conveying the nuances. మీరు ఎంత బాగా పాటను ఆస్వాదించారో అంతే చక్కగా మమ్మల్ని ఎంజాయ్ చేసే విధంగా చక్కగా రాసారు!
జై గారూ! మీ comment చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఎంతో ఇష్టంగా "చల్‌తే-చల్‌తే..." పాట గురించి రాసుకుంటూ - నేను రాసేది ఏ ఒక్కరైనా ఎలా చదివితే బావుంటుందో అని నేననుకున్నానో మీరు అచ్చు అలాగే చదివారు. మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండిలలిత గారూ, ఈ వ్యాఖ్య మీ ఔదార్యం.
తొలగించండిఇంత గొప్ప పాట గురించి ఎంతో ప్రయాస తీసుకొని చక్కటి విశ్లేషణలతో టపా రాసిన మీకే మేమందరం థాంక్సు చెప్పాలి.
ఆణి ముత్యాలు. ప్రాణం ఖరీదు లో ఇంకో పాట ఉంది.
రిప్లయితొలగించండియాతమేసి తోడినా ఏరు ఎండదు.
పొగిలి పొగిలి ఎడ్చినా పొంత నిండదు
యాతము , పొంత లాంటి పదాలు వింటే ఒళ్ళు పులకిరించి పోతుంది.
నిజమే ఇంద్రజాల మహేంద్రజాలాది మాట తీరు అమోఘం!
తొలగించండిఅవును, గిరిరాజ్! "యాతమేసి తోడినా..." పాట కూడా చాలా బావుంటుంది. మంచి పాట గుర్తు చేశారు. థాంక్స్!
తొలగించండిజై గారు: ఇంద్రజాల మహేంద్ర"జాలాది" - pun అద్భుతం :)