ముందుమాట ఇక్కడ
"అమ్మా! కాలేజ్‌కి వెళ్తున్నాను" గట్టిగా పిలిచి అమ్మకి చెప్పాను నా పుస్తకాలు, లంచ్ బాక్స్ బాగ్లో సర్దుకుంటూ.
బీఎస్సీలో చేరినప్పట్నుంచీ నేనూ, అపర్ణ ప్రతి గురువారం కాలేజ్‌కి తెల్లరంగు చుడీదార్లు వేసుకుని వెళ్దామని అనుకున్నాం.
ఇవాళ గురువారం.
మా గురువారపుడుపుల-పంచాంగం ప్రకారం తెల్ల చుడిదార్లు వేసుకుని 'రాణులు వెడలె' అన్నట్టు కాలేజ్ కి వెళ్దామని అనుకున్నామా- కానీ ఎక్కడ?! - Girls propose, Gods dispose! హ్మ్!
ఇవాళ కాలేజ్‌కి రానని అపర్ణ నిన్నే చెప్పేసింది. అపర్ణా వాళ్ళ రత్నాంటీ జర్మనీ లో వుంటారు. ఆవిడిప్పుడు బెంగళూరు IISc కి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వచ్చారట. ఆ రత్నాంటీ ఇవాళ గుంటూరుకి వస్తున్నారని అపర్ణ కాలేజ్‌కి రానని చెప్పింది.
మరి నాకు తప్పదు కదా! అందుకే ఒక్కదాన్నేబయల్దేరాను - కొంచెం భయం, భయంగానే. భయమెందుకంటే - నేను వెళ్ళబోయేది - మా మేథ్స్ లెక్చరర్ కోటేశ్వరరావుగారు అన్నట్లు వందేళ్ళ కాలేజీ - నేననుకునేట్లు నన్ను వణికించే కాలేజ్.
మళ్ళీ అమ్మకి వినబడిందో లేదో అని ఇంకొంచెం గట్టిగా అరిచేశాను - "అమ్మా! వెళ్తున్నాను. బై", అని.
"ఎన్ని సార్లు చెప్పాలి, లల్లీ! వెళ్తున్నాను కాదు వెళ్ళొస్తాను - అనాలని" అంటూ వంటింట్లోంచి చేతులు చీర కొంగుకి తుడుచుకుంటూ వచ్చింది అమ్మ.
"సరే తల్లీ, సరే! వెళ్ళొస్తాను" అని హడావిడిగా చెప్పులు వేసుకుని చున్నీ సర్దుకుంటూ పరుగు తీశాను బయటికి.
నేను ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్‌లో బీఎస్సీ చేరింది ఈ సంవత్సరమే. నాన్న ఏ. సి. కాలేజ్‌లో ఫిజిక్స్ బాగా చెప్తారని + నాకు ఫిజిక్స్ ఇష్టమని ఇక్కడ చేర్పించారు.
చేర్పించే ముందే చెప్పారు- "లల్లీ! నువ్వు పెద్దదానివి అవుతున్నావు. ఇంకా యూనివర్సిటీకి వెళ్లి పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేయాలనీ అనుకుంటున్నావు. ప్రపంచంలో బ్రతకాలంటే చదువులో తెలివితేటలు ఒక్కటే సరిపోవు. లౌక్యం కూడా నేర్చుకోవాలి. అందుకు నీ కాలేజ్‌లో ఏ సమస్య వచ్చినా నువ్వే పరిష్కరించుకోవడం అలవాటు చేసుకో. చిన్నపిల్ల లాగా ఇంట్లో చేసినట్టు నిన్ను అక్కడ అందరూ గారం చేయాలని అనుకోకు." అని.
విమెన్స్ కాలేజ్ లో చేరిన మిగిలిన అమ్మాయిలు అందరూ తెగ భయపెట్టేశారు - ఏ. సి. కాలేజ్‌లో గొడవలు ఎక్కువగా జరుగుతాయని. అక్కడ అబ్బాయిలు అమ్మాయిలని బాగా ఏడిపిస్తారని - చెప్పి.
అదీ! అదండీ - ఈరోజు నా భయానికి కారణం - కాలేజ్‌కి ఒంటరిగా వెళ్ళడానికి.
*****************************************************************
"నాన్న ఎప్పుడూ ఇంతే! కాలేజ్ లో ఏ గొడవ అయినా నన్నే సాల్వ్ చేసుకోమంటారు. అక్కడేమో అందరూ ఇంత పెద్దగా రౌడీల్లా వుంటారు. ఎంత భయమేస్తుందో ఆయనకెలా అర్థమవుతుంది? అసలే ఇవాళ అపర్ణ కూడా రావట్లేదు. వాళ్ళ ఆంటీ బెంగళూరు నుంచి వచ్చారసలే. ఇవాళ్టి దాకా ఎప్పుడూ ఒక్కదాన్ని వెళ్ళలేదు. ఎలా వుంటుందో ఏంటో !! " - నాలో నేనే గొణుక్కుంటూ, సణుక్కుంటూ సెంటర్ లో రిక్షా స్టాండ్ దగ్గర ఆగాను.
రోజూ అలవాటుగా ఎక్కే రిక్షా బండబ్బాయి - కోటేశు తను కూర్చున్న సీట్లోంచి లేచి తన తలపాగాలా కట్టుకున్న తువాలు తీసి రిక్షా సీటు తుడిచి - "ఎక్కండి పాపగారూ!" - అన్నాడు.
నేను రిక్షా ఎక్కి కూర్చోగానే కోటేశు అలవాటుగా బ్రాడీపేట రెండోలైను లోకి తిప్పబోయాడు - అపర్ణ వాళ్ళ ఇల్లుండేది అటే మరి.
నేనది చూసి- "ఆ...! ఆ...! కోటేశూ ! అటు వెళ్ళక్కర్లేదు ఇవాళ. కాలేజ్‌కి పోనీయ్", అన్నాను.
"అదేంటమ్మా! ఆ రెండోలైను పాపగారు రారా ఇవాళ కాలేజీకి ?", అనడిగాడు.
"లేదు కోటేశూ! వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇవాళ నేనొక్కదాన్నే!", కొంచెం బెంగగానే చెప్పాను.
కోటేశు "సరేనమ్మా" అని బిజీగా వున్న బ్రాడీపేట నాలుగోలైనులో ఎదురుగా వచ్చే కార్లని, రిక్షాలని, మీదకొచ్చేస్తున్నట్టుగా అనిపించే సిటీ బస్సులని జాగ్రత్తగా తప్పించుకుంటూ రిక్షా తొక్కుతున్నాడు- శంకర్ విలాస్ వైపుగా. శంకర్ విలాస్ దగ్గర కుడి వైపు తిరిగి ఓవర్ బ్రిడ్జ్ ఎక్కిదిగితే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ వస్తుంది.
కాలేజ్‌కి ఒక్కదాన్నే వెళ్ళాలి అనే బెంగలో వున్ననేను రోజూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సంబరంగా ఎదురుచూసే బొమ్మల షాపు Prisma Curio ని కూడా మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను రిక్షాలో.
ఇంతలో రిక్షా పక్కనుంచి వెళ్తున్న అబ్బాయిలలోంచి - "ఎవర్రా అనిల్ ఈ అమ్మాయి? నేనెప్పుడూ మన గుంటూర్లో చూడలేదే? భలే వుంది", - అన్న మాటలు వినిపించాయి.
వెంటనే రిక్షాగూడుకి వున్న వెనకాలవైపు ప్లాస్టిక్ కర్టెన్ లాంటిది కొంచెం పక్కకి తీసి, "ముందు నీ మొహం అద్దంలో చూసుకో!" - అని అరిచాను.

ఇంతకీ ఆ అన్నదెవరో తెలీదు - ఎలా ఉంటారో తెలీదు - కానీ ఏదో మాటకు మాట అనాలనే ఉక్రోషంలో, తొందరలో అలా అనేశాను.
హఠాత్తుగా ప్రపంచం ఒక్కసారి నిశ్శబ్దంగా అయిపోయిందేమో అనేలా రిక్షా వెనకాల మాటలు ఆగిపోయాయి.
అంతే - ఒక్కసారిగా ఏదో ధైర్యం వచ్చేసింది.
అంతే - ఒక్కసారిగా ఏదో ధైర్యం వచ్చేసింది.
"నాకేంటి భయం, ఒక్కదాన్నీ కాలేజ్‌కి వెళ్ళడానికి. ఇదిగో ఎవరైనా నాజోలికి వస్తే ఇలాగే - కరిచేస్తుందా - అన్నట్టు అరిచేస్తా! దెబ్బకి పారిపోతారు", అనేసుకున్నాక బోల్డంత హాయిగా అనిపించేసింది.
ఇంకో పావుగంటలో కోటేశు రిక్షా ఏసీ కాలేజ్ ముందు ఆగింది - రిక్షా దిగి కాలేజ్ గేట్ దాటి మెయిన్ బిల్డింగ్ వైపు నడిచాను బిక్కు, బిక్కు మంటూ...మనసులో ఇలా పాడుకుంటూ ....
दुश्मन न करे - दोस्त ने वो काम किया है
कालेज को आज वो क़्यों డుమ్మ किया है ?!
సగం అసలు పాట - సగం నా కొసరు పాటగా ...
<<తర్వాతేం జరిగిందంటే... : త్వామనురజామి - 2 - హమే డర్ హై ...హం ఖో న జాయే కహీ... >>

అలా A.C College ముందు దించేసి, 'సశేషం' అంటే..... ఎలా???
రిప్లయితొలగించండిఇది మరీ అన్యాయం. మరీ 19th వరకు బిక్కుబిక్కు మంటూ వెయిట్ చేయాలంటే చాలా కష్టం :)
నాకూ తొందరగానే రాయాలని వుంది - ఎప్పుడొ మొదలుపెట్టాను కానీ - జ్ఞాపకాలు పేర్చడానికి కొంచెం టైం పడుతోంది మరి :(
తొలగించండిఎంతైనా అనతవరము అమ్మాయిలు తర్వాతే ఎవరైన సూపర్ అక్కా.
రిప్లయితొలగించండిథాంక్స్, హనుమాన్! - అనాతవరం అభిమానానికి :)
తొలగించండిTaruvayi bagam gurinchi eduruchustuntanu....
రిప్లయితొలగించండిBagundi ñi panchan-gam -udupulu mariu kalasala -kaburlu -lalli next episode ki waiting
రిప్లయితొలగించండిశారద, లలిత: మీ ఎదురుచూపులతో ఇస్తున్న ప్రోత్సాహానికి థాంక్స్!
రిప్లయితొలగించండిప్రారంభం బాగుందండీ.. హ్మ్.. మంత్లీ సీరియల్ లా రాస్తున్నరనమాట ఐతే :-)
రిప్లయితొలగించండిమీ కమెంట్ కి థాంక్స్ అండీ! అవును - ఇది మంత్లీ గానే రాయగలను :)
తొలగించండి