మా ఊళ్ళో ఒకరు యోగాసనాలు బాగా వచ్చి, వారికి వచ్చిన విద్యని
అందరికీ పంచుదామనే మంచి ఉద్దేశ్యంతో స్థానిక గ్రంథాలయం లో యోగా
తరగతులు నడుపుతూ వుంటారు.
ఇవాళ లైబ్రరీలో యోగా క్లాస్ కి వెళ్లాను కదా, బుజ్జాయ్! చాలా మంది మనవాళ్ళు (అంటే
భారతీయులు), అమెరికన్లు, ఆఫ్రికన్-అమెరికన్లు వున్నారు. వాళ్ళందరినీ చూస్తే
భలే ఆనందంగా అనిపించింది - మన తెలుగు వారు నేర్పే ఒక
క్లాసుకి అంత మంది వచ్చారని. వెళ్లి కూర్చున్నాను.
యోగా నేర్పే ఆయన చెప్పారు - ఈ రోజు ఇంట్రడక్టరీ సెషన్ అని. అలా చెప్తూ యోగా-యోగాసనాల విశిష్టతా గురించి మాట్లాడుతూ ధ్యానం మనిషికి ఎంతో మంచి చేస్తుందని చెప్తూ ఇలా అన్నారాయన - ధ్యానం మనిషి కోరికలు తగ్గించుకుని ధ్యాన మార్గాన మోక్షం పొందడానికి సహాయం చేస్తుందీ అని.
(నాకిప్పటికీ సందేహం - అసలు యోగా ఎలా చేయగలరు అందరూ అని - నాకొక్క నిముషం
కుదురుగా ఒక దానిమీద మనసు నిలిపి మాట్లాడకుండా ధ్యానం చేద్దామని
ప్రయత్నిస్తే - ఉహో... నా వల్ల కాదు. ఆ ఒక్క నిముషంలోనే వద్దన్నా ఏవో గుర్తుకొచ్చేస్తూ వుంటాయి. సరే - నాకింకా యోగా చేసే టైం రాలేదు అనుకుంటూ వుంటాను. నుదురు పెద్దదయితే
కుదురెక్కువ అంటారు కానీ నాకవి inversely proportional అనిపిస్తాయి -
నన్ను నేను తలచుకుని.)
బదరీకి తన కాలేజ్ రోజుల జ్ఞాపకాలలో ఇష్టంగా
తలుచుకునేవాటిల్లో సూర్యనమస్కారాలు, యోగాసనాలు కూడా వుంటాయి. దగ్గరలోనే
యోగా నేర్పే వారున్నారని ఉత్సాహంగా ఓ శనివారం పొద్దున్నే లేచి, తయారయి
లైబ్రరీకి వెళ్ళారు-ఓ గంటలో తిరిగి కూడా వచ్చారు. అదేమంత విశేషం కాదు.
కానీ తర్వాత భోంచేస్తూ చెప్పారు - అదేంటో కింద :)
బదరీ మాటల్లో: (మాటలన్నీ తనవే - రాత ...కాదు కాదు... టైపింగ్ + అక్కడక్కడా బ్రాకెట్స్ లో చిన్న చిన్న వివరణలు మాత్రమే నావి - :) )
యోగా నేర్పే ఆయన చెప్పారు - ఈ రోజు ఇంట్రడక్టరీ సెషన్ అని. అలా చెప్తూ యోగా-యోగాసనాల విశిష్టతా గురించి మాట్లాడుతూ ధ్యానం మనిషికి ఎంతో మంచి చేస్తుందని చెప్తూ ఇలా అన్నారాయన - ధ్యానం మనిషి కోరికలు తగ్గించుకుని ధ్యాన మార్గాన మోక్షం పొందడానికి సహాయం చేస్తుందీ అని.
వెంటనే నేనడిగాను "కోరికలు తగ్గించుకోవడం వరకూ బావుంది - కానీ మోక్షం కావాలని అనుకోవడం కూడా ఒక కోరికే కదండీ - అది మాత్రం ఎందుకు కావాలనుకోవడం - దొరికిందే మనకు చాలనుకోవాలి కదా అది మోక్షమయినా ఇంకోటయినా - కోరికలే వుండకూడదనుకుంటే?", అని. నేనలా అడగడం ఎవరికీ నచ్చినట్లు లేదు. ఇంకెందుకులే అని కాసేపు మాట్లాడకుండా ఆయన చెప్పేది విని వచ్చేశాను.
నాకెందుకో ఈ మధ్య ఇలాంటి మాటలు వింటే చాలా చిరాగ్గా ఉంటోంది. ఏ టీవీ చానెల్ పెట్టినా, ఏ పేపర్ చదివినా - ఇలా చేయాలి - అలా చేయకూడదు అంటూ ప్రతి ఒక్కరూ ఇంకొకరికి ఉపదేశాలు చేసేవారే. మళ్ళీ తమ దగ్గరికి వచ్చేసరికి ఎవరి వేదం వారిదే!
పండగ వస్తోందంటే చాలు - ఒక తెలుగు క్యాలెండర్ లో ఒక రోజు, ఇంకో క్యాలెండర్ చూస్తే ముందుదో, వెనకదో ఇంకో రోజు. పండగ వచ్చేది ప్రతి ఏడాది అదే నెల, అదే తిథి అయితే పంచాంగాల్లో ఇన్ని తేడాలెందుకు?
నీకన్నా నాకు బాగా తెలుసు - నా మాటే విను అనే వాదాలెందుకు?
ఈ ప్రపంచమంతా మాయ, మిధ్య- కోరికలు వుండకూడదు అంటూనే 'శతమానం భవతి' ఆశీస్సులు!
అసలు నువ్వే ఆలోచించు. నేను బాగా చదువుకున్నాను - నాకు చాలా తెలుసు అనుకునే ఏ మనిషికైనా నిజంగా - అన్నీ సరే - తనకు తెలుసు అనుకునే కొన్నిటి గురించయినా పూర్తిగా తెలిసుంటుందా?
ఒక మనిషి నిండు నూరేళ్ళు బ్రతికి,
అందులో ప్రతీ సంవత్సరం ఓ 50 క్రొత్త మంది తనకి పరిచయమవుతారు అనుకుందాము.
ఎవరైనా సరే - తల్లి, తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అత్తలు, మామలు, పిల్లలు, స్నేహితులు, బంధువులు, తనతో పని చేసే వాళ్ళు, ఇరుగు-పొరుగు వాళ్ళు ... ఎవరైనా సరే – కాని, వాళ్ళు అందరూ 'తన వాళ్ళు' అనుకునే వాళ్ళు అయి వుండి - తన గురించి ఎంతో కొంత తెలిసి ఒక రెండు నిముషాలన్నా పలకరింపు దాటి మాట్లాడుకోగలిగే వాళ్ళు అయివుండాలి.
అంటే జీవిత కాలంలో 'తన' అనుకునేవాళ్లు మొత్తం ఐదు వేల మంది వుంటారు.
(సంవత్సరానికి 50 మంది అనేది బదరి అనుకున్న చాలా optimistic number. నా ప్రస్తుత వయసు X 50 మంది పేర్లు రాయగలనేమో ప్రయత్నించి చూడాలి - ఇదొక తమాషా ఎక్సర్సైజ్ - ప్రస్తుతానికి నా ఈ వారాంతానికి).

అలాగే, ప్రతీ సంవత్సరం ఓ 5 సరి
కొత్త ప్రదేశాలు చూశాడు అనుకుంటే, జీవిత కాలంలో చూసేవి 500 ప్రదేశాలు.
మరి ఈ ప్రపంచంలో ప్రస్తుతమున్న
జనాభా 800 కోట్లు. చూడతగిన ప్రదేశాలు కొన్ని లక్షలు!
నిజంగా లెక్కల్లో మాట్లాడుకుంటే ఎంతో తెలుసనుకునే మనకి ఎంత తక్కువ తెలుసో కదా!

ఎంత ఎత్తుకైనా ఎగిరే ఓ పక్షి
ఏమేం చూడగలదో, మబ్బుల్లో తిరుగుతూ ఎంత సంతోషిస్తుందో తెలియదు.
నీళ్ళలో ఈదే ఓ చేప ఎంత ఆనందం గా వుంటుందో తెలియదు. వాతావరణ మార్పులను బట్టి ఒక సముద్రం నుంచి ఇంకో సముద్రానికి వేల మైళ్ళు ఈదుకుంటూ ఎలా వెళ్ళగలుగుతుందో తెలియదు.
ఎక్కడికీ తిరగకుండా ఒకేచోట వుండే ఓ చెట్టు అనుభవాలు ఎలా ఉంటాయో తెలియదు. తను బ్రతికి వుండే పదులు, వందల ఏళ్లలో తన చుట్టూ జరిగే మార్పులు చూస్తూ, తన మీద వాలే పక్షితో, పాకే ప్రతి ప్రాణితో కబుర్లు చెప్తూ, గాలికి ఊగుతూ, వర్షాలకి తడుస్తూ, ఎండలకి ఎండిపోతూ, చలికి ముడుచుకుపోతూ అది అనుభవించే జీవితమేమిటో తెలియదు.
సీతాకోకచిలుక (మోనార్క్ బటర్ ఫ్లై) లాంటి ఒక చిన్న ప్రాణికి కొన్ని వేల మైళ్ళు, సముద్రాల మీదుగా ప్రయాణించి ఇంకో ప్రదేశానికి ప్రతీ సంవత్సరం వెళ్లి రాగలిగే శక్తి ఏమిటో తెలియదు.
కంటికి కనపడని ఇంకా ఎన్నో జీవాలు ఎలా ఉంటాయో తెలియదు.
సైన్సూ-శాస్త్రాలు, సంగీతాలు-సాహిత్యాలూ, వింతలూ-విశేషాలూ పక్కన పెట్టు - అవతలి మనిషి ఎంత దగ్గర వారైనా, తెలియని వారైనా వారికి మన మాటల చేత కానీ, చేతల వల్ల కానీ - ఆనందం సరే - కనీసం ఇబ్బంది కలిగించకుండా ఉండగలుగుతున్నామో లేదో - తెలుసా - అనిపిస్తూ వుంటుంది.
ఇవన్నీ తెలియకపోయినా ఈ ప్రపంచంలో మనిషి జన్మే మహోన్నతమైనది. మంచిది, ఆనందం!
ఓ అడవిలో పుట్టి, వేరే ప్రపంచం ఉందనే స్పృహే లేకుండా అడవిలోనే పెరిగి, అడవిలోనే చనిపోయే మనిషి జన్మ కూడా అనాగరికంగా less equally మహోన్నతమే. నాగరికం అయితే ఇంకా మంచిది - more equally మహోన్నతం!

అంతెందుకు మనం విమానం ఎక్కినప్పుడు – అది పైకి వెళ్ళే కొద్దీ కింద మనుషులు, ఇళ్ళు,
రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగులు అన్నీ చిన్నవిగా, చీమల్లాగా కనపడతాయి కదా - అప్పుడనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తేనే ఇలా వుంది - ఇంకా పైకి వెళ్లి ఏ స్పేస్ స్టేషన్ నుంచైనా చూడగలిగితే మనమీ ప్రపంచం లో ఎంత చీమల్లాంటి వాళ్ళమో అనిపించేస్తుందేమో !!!
చీమలంటే గుర్తొచ్చింది - Disney-Pixar వాళ్ళు తీసిన “A Bug’s Life” మూవీ గుర్తుందా?! అందులో Flik వాళ్ళ ఊళ్ళో ఓ మామూలు చీమ కుర్రాడు. ఆ ఊళ్ళో జరిగే బోల్డన్ని సమస్యలకి సంఘటనలకి, సమాధానాలు పరిష్కారాలు వెతుక్కుంటూ వేరే ఊరు వెళ్లి, అక్కడ కలిసిన చీమలు కాని వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేసి, వాళ్ళని ఎలాగోలా తన ఊరు తీసుకెళ్ళి అవన్నీ తీర్చేసి హీరో అయిపోతాడు.
ఆ “A Bug’s Life” లో మొదటి సీన్ జాగ్రత్త గా చూస్తే - బోల్డన్ని పెద్ద పర్వతాలు, పెద్ద మైదానం, ఇంకా పెద్ద పెద్ద చెట్ల మీదనుంచి ఒక చెట్టు చుట్టూ వుండే పొదల మధ్యలో ఓ చిన్న చీమల పుట్టలోకి నెమ్మది గా వెళ్తుంది కెమెరా. అక్కడ బోల్డన్ని చీమలు వాటి ఆహారం సంపాదించే పని లో వుంటాయి. Flik కనిపిస్తాడు ఓ నిమిషంలో, మూవీ మొదలు!
నాకయితే మనమూ మనదనుకునే మనముండే ఈ ఇళ్ళు, ఊళ్ళు, దేశాలు కూడా మనకన్నా పెద్దవాళ్ళయిన, గొప్పవాళ్ళయిన ఏ super-humans కో ఆ సినిమా లో వుండే చీమల ప్రపంచంలాగే కనిపిస్తాయేమో అనిపిస్తుంది...
----------------------------------------------------------------------
ఇలా మోక్షం నుంచి చీమల దాకా ఒక టాపిక్ నుంచి ఇంకోదానికి అలా అలా అలవోకగా వెళ్తూ ఒక వారాంతపు మధ్యాహ్నం వెచ్చగా గడిచింది.
ఉపసంహారం:
తర్వాత ఇంకో అరగంటకి చాలా రోజులయింది అని ప్రియ-నేస్తానికి ఫోన్ చేశాను.
"లలితా! నీతో చాలా మాట్లాడాలి - ముందు గుడ్ న్యూస్ చెప్తాలే"
"ఏంటది? తొందరగా చెప్పు మరీ!"
"ప్రిన్సీకి మంచి లా స్కూల్ లో సీట్ వచ్చింది - లోకల్ లోనే"
"వావ్! కంగ్రాట్స్ చెప్పు. ఆగాగు - ఇంగ్లీషులో కాదు కన్నడాలో చెప్పు"
"కన్నడా లోనా ...." అటునుంచి ఆలోచిస్తూ నేస్తం "కన్నడ సరే తెలుగు ఏమంటారో చెప్పు నువ్వు"
చటుక్కున 'అభినందన' అన్నమాట గుర్తుకొచ్చినా ఎందుకో చిన్నపిల్లకి అర్థం కష్టం గా వుంటుందేమో - ఇంకో తేలికయిన మాట వుంటే బావుండును అనిపించి "లేదులే! కరెక్ట్ మాట గుర్తు రావట్లేదు - కంగ్రాట్స్ అని చెప్పేయ్" అంటే-
"అదే లలితా! పిల్లలు ఏమన్నా మంచి పని చేస్తే ఆయుక్షీణం అని చెప్పి పొగడడం అస్సలు అలవాటు లేదు మన society లో. అందుకే congratulations కి సరైన మాటలు ఎక్కువ లేవు మన భాషల్లో. ఎవరైనా బాగా చదివారు - పైకొచ్చారు అంటే చటుక్కున - వాళ్లకి అలా రాసి పెట్టి వుంది - అందుకే అలా బాగుపడ్డారు అంటారు కానీ - ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారో గుర్తించరు - ఒప్పుకోరు! ప్రతీదీ కర్మ సిద్ధాంతానికి ముడిపెట్టటం లో మన తర్వాతే ఎవరైనా!"

నేను నా వాళ్ళు అనుకునే సంఖ్య, వేలు కాదుకదా వెయ్యి లో పావు వంతు కూడా దాటడం గగనమే!
రిప్లయితొలగించండిమొత్తానికి వీకెండ్ అంతా బోల్డన్ని సీరియస్ కబుర్లతో గడిచిపోయిందన్నమాట.
నువ్వన్నది నిజం - 50 అనేది చా......లా optimistic number.
తొలగించండికబుర్లెప్పుడూ కబుర్లే - not so serious :)
I meant సంవత్సరానికి 50 మంది పరిచయం కావడం - అదీ just ముఖ పరిచయం కాకుండా మన గురించి కొన్ని వివరాలైనా తెలెసేలా అనేది చా......లా optimistic number.
తొలగించండిచాలా బాగుంది. P.G.Wodehouse "wheels within wheels" అన్నట్టు, ఈ post లో "topics within topics" బాగా దొర్లాయి. Very interesting and introspective. Enjoyed reading this.
రిప్లయితొలగించండిPick చేయకుండా చేసే talk - టాపిక్ కదా ;) మరి బోల్డన్నే దొర్లుతాయి. PGW ని గుర్తు చేశావు - వెంటనే మళ్ళీ ఇంకోసారి Leave it to Psmith చదవాలి - missing his subtle humor so badly. (btw humor is not a typo, but correct based on where I'm ;))
తొలగించండిలల్లి --
రిప్లయితొలగించండిమీ అందమైన లెక్కల కబుర్లని చదువుతూ -
ఒక్క సెకండ్ ఎక్కడో సుదూర తీరాలకి వెళ్లి, మళ్ళి బాహ్య ప్రపంచం లోకి వచ్చి చూస్తె మా లివింగ్ రూమ్ సోఫాలో నుండి ఒక అంగుళం కూడా కదలలేదు అన్న నిజం జీర్ణించుకొని '' ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ' అనుకోని ఒక దీర్ఘ నిట్టూర్పు విడచి - ఈ జన్మకి 'మోక్షం ' లేదు అని ... కాని ఇలాంటి మంచి కబుర్లు చదవటానికి టైం దొరికి నందుకు ఆనందిస్తున్నాను ...
Nice 'కబుర్లు ' ....
ధన్యవాదాలు
రాధిక
ఆ...! లెక్క నీకూ నచ్చిందీ? నాకెంతమంది తెలుసా అని మొదలుపెట్టిన నా లెక్క ఇంకా తేలలేదు :) వీలు చెసుకుని చదివి కమెంట్ పెట్టినందుకు థాంక్స్, రాధికా!
తొలగించండిమీరు ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా వాటినన్నిటినీ connect చేస్తున్న underlying విషయం ఒకటేనని అర్ధమైంది. 'మనకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత' అని. బావుంది.
రిప్లయితొలగించండినా బ్లాగ్ ఉద్దెశ్యాన్ని బాగా పట్టుకున్నారు - థాంక్స్ :)
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిChala bagundi...
రిప్లయితొలగించండినా బ్లాగ్ చదువుతున్నందుకు థాంక్స్, లలితా!
తొలగించండిమీ తమాషా ఎక్సర్సైజ్ చదవగానే, 'అందమైన జీవితం' శాంతి గుర్తొచ్చిందండీ. ఇంతకీ లెక్క తేలిందా? :)
రిప్లయితొలగించండిThank You - మీ కమెంట్ చూడగానే మళ్ళీ ఇంకోసారి "అందమైన జీవితం" చదవాలనిపిస్తోంది :)
తొలగించండిమరిచాను చెప్పడం - లెక్క ఇప్పట్లో తేలేది కాదు :))
తొలగించండిEnjoyed reading this post,.....very interesting
రిప్లయితొలగించండిThank you :)
తొలగించండి