ముందో చిన్న మాట...
బాల్యపు చిటికెన వేలు విడిచిన రోజులు
కళ్ళల్లో నక్షత్రాలు మెరిసిన రోజులు
అప్పుడప్పుడే కృష్ణ శాస్త్రి - గేయం లోని ఆకులో ఆకునై , పూవులో పూవునై -
ఆకలా ... దాహమా... , చింతలా...వంతలా !! - అని గొంతెత్తి పాడుతూ-
చెల్లెళ్ళతో, ప్రియ నేస్తం తో అల్లిబిల్లి అల్లరి ఆటలు ఆడుతూ -
శలవు వస్తే - జనరంజని తో మొదలు పెట్టిన రోజులు...
మన్-చాహే-గీత్ తో అలరించిన బద్ధకపు మధ్యాహ్నాలు...
ఛాయా-గీత్ తో అప్పుడే అయిపోయాయా అనిపించిన రాత్రులు ...
ఇవాళంటే... ఇప్పుడు నవ్విన నవ్వులే
రేపంటే ...సూర్యుడొచ్చి ఇచ్చే వెచ్చటి వెన్నెలే
Anne of Green Gables నుంచి Jane Austen కి ఎదిగిన అభిరుచి
లైఫ్ అంటే ఏంటో కాదు నువ్వూ-నేనూ పాడుకునే సుహానా సఫర్ అని నేస్తం తో చెప్పుకున్న కబుర్లు
ఇంతలో... ఏమయిందో ఏమో ...
మెరుపే మెరిసిందో
మనసే మురిసిందో
మిన్నే వంగిందో
కన్నే చెదిరిందో
ఓయ్ లైఫ్ !
ఎలుగెత్తి చెప్పాలనిపించింది నీతో ...
అందుకే చెప్పేశా ...
త్వామనురజామి!!
త్వామనురజామి!!
త్వామనురజామి!!
<<తర్వాతేం జరిగిందంటే... : త్వామనురజామి -1 - ఎవరేమన్నను - అపర్ణ తోడు రాకున్నను ఒంటరిగానే పో....>>
బాల్యపు చిటికెన వేలు విడిచిన రోజులు
కళ్ళల్లో నక్షత్రాలు మెరిసిన రోజులు
అప్పుడప్పుడే కృష్ణ శాస్త్రి - గేయం లోని ఆకులో ఆకునై , పూవులో పూవునై -
ఆకలా ... దాహమా... , చింతలా...వంతలా !! - అని గొంతెత్తి పాడుతూ-
చెల్లెళ్ళతో, ప్రియ నేస్తం తో అల్లిబిల్లి అల్లరి ఆటలు ఆడుతూ -
శలవు వస్తే - జనరంజని తో మొదలు పెట్టిన రోజులు...
మన్-చాహే-గీత్ తో అలరించిన బద్ధకపు మధ్యాహ్నాలు...
ఛాయా-గీత్ తో అప్పుడే అయిపోయాయా అనిపించిన రాత్రులు ...
ఇవాళంటే... ఇప్పుడు నవ్విన నవ్వులే
రేపంటే ...సూర్యుడొచ్చి ఇచ్చే వెచ్చటి వెన్నెలే
Anne of Green Gables నుంచి Jane Austen కి ఎదిగిన అభిరుచి
లైఫ్ అంటే ఏంటో కాదు నువ్వూ-నేనూ పాడుకునే సుహానా సఫర్ అని నేస్తం తో చెప్పుకున్న కబుర్లు
ఇంతలో... ఏమయిందో ఏమో ...
మెరుపే మెరిసిందో
మనసే మురిసిందో
మిన్నే వంగిందో
కన్నే చెదిరిందో
ఓయ్ లైఫ్ !
ఎలుగెత్తి చెప్పాలనిపించింది నీతో ...
అందుకే చెప్పేశా ...
త్వామనురజామి!!
త్వామనురజామి!!
త్వామనురజామి!!
<<తర్వాతేం జరిగిందంటే... : త్వామనురజామి -1 - ఎవరేమన్నను - అపర్ణ తోడు రాకున్నను ఒంటరిగానే పో....>>
ఆ మెరుపు మెరవడానికి, మనసు మురవడానికి, మిన్నే వంగడానికి, కన్ను చెదరడానికి, అసలు శీర్షిక కే దారితీసిన ఆ కబుర్ల కోసం మా ఆరాటం.
రిప్లయితొలగించండిWhat a fitting write-up to a great title!!! Just beautiful.
కొంచెం ఓపిక పట్టండి - ఆ కబురూ, కబుర్లూ చెప్తాను. Thanks for your comment.
తొలగించండిWhat a pleasant surprise to see the title and post!!
రిప్లయితొలగించండిSo at last the you decided to bring your beautiful blog to light!
ఇన్నేళ్ళూ అజ్ఞాతం లో ఉంచిన ఈ అధ్భుతమైన టైటిల్ తో కూడిన బ్లాగు కోసం ఎదురుచూపులు.
రసగుళికల వడ్డన నీదే ఆలశ్యం.
మామూలుగా చెప్పే ఈ బోల్డన్ని కబుర్లలో నా త్వామనురజామి కబుర్లు కలుపుదామనే ఆలోచన. ఏ కబుర్లకైనా నువ్వు ఇచ్చే ప్రోత్సాహానికి థాంక్స్ (ఇది చాలా చిన్నమాట - కానీ ఇప్పటికి సర్దేసుకో)
తొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిచాలా బాగుంది, కానీ..... blog అవవలసిన titleని blog entry చేసేయవు కదా!!!!! ఒట్టేసి చెప్పు....
రిప్లయితొలగించండిఒట్టేసే చెప్తున్నా - త్వామనురజామి will be త్వామనురజామి blog, but not a single entry!
తొలగించండిఇంట్రెస్టింగ్.. టైటిల్, పోస్ట్ అండ్ కామెంట్స్ ఎదురుచూసేలా ఉన్నాయండి..
రిప్లయితొలగించండిత్వామనురజామి - అవునండీ - నా వరకూ నాకు కొంచెం స్పెషలే - తొందరలోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను. మీ ప్రోత్సాహకర కమెంట్ కి థాంక్స్!
తొలగించండిత్వామనురజామి భలే పేరు పెట్టావ్ అక్కా మధురమైన జ్ఞాపకాల పుస్తకానికి అందమైన పేరు పెట్టావ్.ఇవాళ అంటే ఇప్పుడు నవ్విన నవ్వులే......చదవడానికి ఎంత బాగుంది నా జ్ఞాపకాల తేనె తుట ను కదిలించింది స్వచ్ఛమైన తెలుగు పదాలని అందమైన అక్షరాలు గా మారుస్తున్నవు
రిప్లయితొలగించండిఎంతో ఇష్టంగా పెట్టుకున్న పేరు నా బ్లాగ్ కి - నచ్చినందుకు, మెచ్చినందుకు థాంక్స్!
తొలగించండిత్వామనురజామి అంటే అర్ధం ఏమిటండి?
రిప్లయితొలగించండిఅది (త్వాం + అనురజామి) అండి - నా జీవితానికి నేను చెప్పుకున్న, చెప్తూనే వున్న I Love You అది.
తొలగించండినా బ్లాగ్ వీలు చేసుకుని చదివి, కమెంట్ పెట్టినందుకు థాంక్స్!
థాంక్స్.
రిప్లయితొలగించండిజీవితాన్ని ప్రేమించడం(గలగడం) మంచి లక్షణం.
త్వామనురజామి అంటే అర్ధం తెలిసింది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి36 నుంచి వెనక్కి 25 దాకా చదివాను. ఇప్పుడు మొదటనుంచి 25 దాకా చదవాలి. కొంచెం టైము పట్టేటట్టు ఉంది. అయినా చదువుతాను. ఈ ప్రపంచ క్రికెట్ కప్పు అయ్యేదాకా రోజుకి ఒకటి రెండు కన్నా కుదరదేమో.
మీ జ్ఞాపక శక్తి కి జై. మీ జ్ఞాపకాలన్నీ పది పదిహేను రోజుల క్రితం జరిగినట్టే వ్రాస్తున్నారు.
మీ భాషా, శైలి కధనం చాలా బాగున్నాయి. అభినందనలు. .......... మహా
మీరు నా కథని చదువుతున్నందుకు ధన్యవాదాలు, సర్!
తొలగించండి