కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ
ఏదో అరిచేస్తాను - కరిచేస్తాను అనుకుంటూ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ దాకా వచ్చేశాను కానీ వాటి శబ్దార్థాలే మరిచేస్తానని అనుకోలేదు.
మళ్ళీ గబగబా ఓ నాలుగడుగులు వెనక్కి వెళ్లి కాలేజ్ గేటు దగ్గర ఒక నిముషం ఆగి - ఒకసారి హిందూ కాలేజ్ రోడ్డు వైపు, ఓవర్ బ్రిడ్జ్ వైపు చూశాను - ఎక్కడైనా కోటేశు రిక్షా కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోదామని - ఉహూ....తను ఎప్పుడో పంచకల్యాణి మీద స్వారీ చేస్తున్నట్టు రయ్యిమని వెళ్ళిపోయాడు.
నా పింక్ బేగ్‌ని రెండు చేతులతో దగ్గరగా పట్టుకుని నడుచుకుంటూ - మళ్ళీ వెనక్కి మెయిన్ బిల్డింగ్ ఆర్చ్ దగ్గరికి - తల అటూ ఇటూ తిప్పకుండా - గబగబా వచ్చేశాను.
ఇంకా తొమ్మిదిన్నర కాలేదు కదా - గర్ల్స్ వెయిటింగ్ రూంకి వెళ్తే కనీసం ఒక అరగంట ప్రశాంతంగా వుంటుంది అనిపించింది.
ఈలోగా ఆఫీసు మేనేజర్ చంద్రపాల్ గారు కనిపించి "ఏమ్మా ! ఏదీ మీ ఫ్రెండూ?", అని అడిగారు ఈచివరి నుంచి ఆ చివరి దాకా పెదవులు సాగదీసి నవ్వుతూ.
"హమ్మయ్య ! పోన్లే ఈయనతో మాట్లాడుతూ వెయిటింగ్ రూం మెట్ల దాకా వెళ్లిపోవచ్చు ఎవరి కంట్లోనూ, నోట్లోనూ (అంటే మా కాలేజ్ అబ్బాయిలు ఈల వీరులు కదా మరి!) పడకుండా", - అనుకుని -
నేనూ అంతే నవ్వుతూ, "రాలేదండీ! తనూ ..." - ఇంకా నా నోట్లో మాట పూర్తి కానే లేదు -
పక్కనే గట్టిగా - ఎవరి వీపు మీదో చరిచిన చప్పుడు - ఆ వెంటనే - "ఇంకో పాప రాలేదట్రా - మనం ఇవాళ మన సుహానా -సఫర్ కి తోడుందామే!!", అన్న మాటలు వినిపించాయి.
చంద్రపాల్ గారికి నా కళ్ళలో ఏం కనిపించిందో ఏమో ఆ అబ్బాయిల కేసి తిరిగి, "ఏంటయ్యా! క్లాసులకి టైం అవట్లే? పదండి, పదండి", అని వాళ్ళతో ఏవో కబుర్లు చెబ్తూ అసెంబ్లీ హాల్ కుడి వైపుకి నడిచారు.
అసెంబ్లీ హాల్ ఎడమ పక్కకి వుంటాయి గర్ల్స్ వెయిటింగ్ రూం మెట్లు.
"ఈ రోజుకి - కాదు కాదు - ఈ పూటకి రక్షింపబడ్డాను - చాల్లే" అనుకుని ఎవరో తరుముకు వస్తున్నట్టు రెండేసి మెట్లు ఎక్కుతూ వెయిటింగ్ రూంలోకి వెళ్ళాను.
ధైర్యం నేర్చుకోవాలి అంటూ ఒక్కదాన్నీ కాలేజ్‌కి వెళ్ళమన్న నాన్ననీ , అసలు కాలేజ్‌కే రాని అపర్ణనీ , ఇంకా ... తిరిగి చూడకుండా వదిలి వెళ్ళిన కోటేశునీ - బోల్డంత విసుక్కుంటూ - అంతకన్నా ఎక్కువగా - అసలు ఫ్రెషర్స్ పార్టీలో - సుహానా సఫర్ పాట పాడిన నన్ను నేనే మనసులో తెగ తిట్టేసుకున్నాను.
అప్పుడెప్పుడో మన్ చాహే గీత్‌లో వినగానే ఫిజిక్స్ నోట్సులో న్యూటన్స్ లాస్ అఫ్ మోషన్ పక్కనే రాసేసుకున్నానా?!
అలా రాసుకుని వదిలేశానా?! అబ్బే!
అది మళ్ళీ - అసలు పాడిన ముఖేషే తను పాడిన రాగం ఏదో మర్చిపోయేంతలా ప్రాక్టీసు చేసీ, చేసీ - ఎవరు పాడమని అడుగుతారా అని ఎదురుచూసీ, చూసీ - చివరికి ఫ్రెషర్స్ పార్టీ లో పాడేశానా?!
కొంచెం బానే పాడినట్టున్నానేమో - సెకండ్ ఇయర్లో సౌండ్ టీచ్ చేసే హనుమంతరావు గారు కూడా తల తిప్పుతూ, కాళ్ళు ఊపుతూ వినేశారని మురిశానా?!
బా... గా అయింది!!!
అమ్మ అంటూనే వుంటుంది - పూర్వయుగాల్లో స్వర్గం-నరకం అని రెండు ఉండేవి. ఈ కలియుగంలో ఏం చేసినా ఇక్కడికిక్కడే అనుభవిస్తారు - అని.
నాకింతే కావాలి !!!.
ఇప్పుడింక - ఆ డిగ్రీ పర్వాల చొప్పున పదహారో సారి చదువుతున్న ఆ భావి-"భారత" విద్యార్థులని దాటుకుని ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వైపు ఎలా వెళ్ళాలో - ఏంటో ?
ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది.
హమే డర్ హై హం ఖో న జాయే కహీ .... (ఛ... ఛ... ఏడుపులో కూడా ఆ సుహానా - సఫర్ పాటే...ఈరోజు నుంచీ ఈ పాటని మర్చిపోవాలంతే !!!)
ఈలోగా నేను ఉలిక్కిపడేలా థర్ద్ బెల్ మోగనే మోగింది.
హడావిడిగా బేగ్ తీసుకుని లేచాను. దూరంగా జ్యోతి, సుజాత కనిపించారు - వాళ్ళూ నాతో, అపర్ణతో పాటే ఫిజిక్స్ మెయిన్ చదువుతున్నారు .
పిలవబోయి ఆగాను. రోజూ అపర్ణ పక్కనున్నప్పుడు వాళ్ళకేసి అదేదో - ముత్యాలు రాలుస్తున్నాను - ఏరుకోండి అన్నట్టు చిరునవ్వులు రాల్చీ రాల్చనట్టు రాల్చే నాకు ఇవాళ తను లేనప్పుడు పలకరించాలంటే మొహమాటంగా అనిపించింది. కానీ వాళ్లు కూడా నేను వెళ్ళే వైపే వస్తారుకదా అనే ధైర్యం తో బయల్దేరాను.
నా అదృష్టమో - మా అమ్మ చేసిన దాన మహిమో (ఆవిడ అంటుంది లెండి "పుణ్యం కొద్దీ పురుషుడు - దానం కొద్దీ పిల్లలు" అని ఎప్పుడైనా మరీ మా మీద ముద్దు వచ్చేసినప్పుడు! ) మొత్తానికి ఫిజిక్స్ క్లాసు లో భౌతిక శరీరం తోనే అడుగుపెట్టాను - ఇవాళ్టికి.
ఇవాళ ఫస్ట్ అవర్ MBR గారు .
అప్పుటికే ఆయన వచ్చేయడం - అటెండెన్స్ మొదలుపెట్టడం కూడా జరిగింది.
ఆయనని చూస్తే నాకసలే భయం - (ఫిజిక్స్ - హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ + సబ్జెక్ట్ తప్ప ఒక్క మాట కూడా వేరేది మాట్లాడరు) - చాలా సీరియస్. అసలలా నవ్వకుండా ఎలా వుండగలరో - నాకు నవ్వశక్యం కాని విషయం.
నేను క్లాస్ లోకి వెళ్ళేటప్పటికి ఆయన "త్రీ చిట్టీ త్రీ" అంటూ వున్నారు.
నేను ఫస్ట్ బెంచ్ లో నా సీట్ వైపు వెళ్తూ "ఏబ్సెంట్ సర్ , బట్ త్రీ చిట్టీ ఫోర్ ప్రెజెంట్ సర్" అనేసి నాలుక కొరికేసుకున్నానంతే!
(నా రోల్ నంబర్ 364, అపర్ణది 363 . MBR గారు 60 ని పలికే తీరు "చిట్టీ" లా వినిపిస్తుంది - అసలే ఒక్కదాన్నీ కాలేజ్ కి వచ్చానన్న కంగారులో వున్నానేమో ఇవాళ నా పుణ్యం పండి పోయింది - నేను కూడా చిట్టీ అనేశాను).
ఏ మూడ్ లో వున్నారో ఆయన పట్టించుకోలేదు కానీ వెనకాల నుంచి బోల్డు కిసుక్కులు వినిపించాయి.
ఇవాళ టాపిక్ - కైనెటిక్ మోషన్. MBR గారు కైనెటిక్ మోషన్ ని వివరించడానికి ఉదాహరణగా సీలింగ్‌కి
వున్న ఫ్యాన్‌ని చూపిస్తూ ఏదో చెప్తూ వున్నారు - ఇంతలో వెనక బెంచ్‌లో నుంచి ఎవరో ఆయన చెప్పే దాని మీద కామెంట్ చేశారు.
అంతే! మా MBR గారికి కోపం వచ్చేసింది.
ఇంకేముంది? - క్లాస్ అయిపోయింది. పనిష్మెంట్ గా ఆ రోజుకి ఇంక లాబ్ కాన్సెల్ చేసేశారు. "హమ్మయ్య" - అనుకున్నాను.
నా భయాన్ని చూసి "పాపం కాలేజే కరుణించిందా" అన్నట్టు ఇవాళ అన్ని క్లాసులూ ఫిజిక్స్ బిల్డింగ్ లోనే జరిగాయి. లక్కీగా ఇంగ్లీష్, హిందీ క్లాసులు లేవు. లంచ్ టైం లో కూడా వెయిటింగ్ రూం వైపు వెళ్ళకుండా క్లాస్ రూం లోనే బాక్స్ తెరిచి లంచ్ చేసేశాను.
అలా తెలియకుండానే నాలుగున్నర అయింది. బయటికి రాగానే మళ్ళీ తల తిప్పకుండా పరిగెడుతున్నట్టుగా వచ్చి కాలేజ్ బయట వున్న కోటేశు రిక్షా ఎక్కేశాను. మొత్తానికి ఎలా అయితేనేం ఇల్లు చేరేశాను.
అప్పటికే పప్పీ, కుట్టి, పక్కింటి లాయరుగారి అబ్బాయి లక్ష్మణ్ మేడ ఎక్కేసి వున్నారు.
ఇంటి ముందు రిక్షా దిగిన నన్ను చూడగానే మేడ మీద వున్న కుట్టి రోడ్ వైపు వున్న గోడ దగ్గరికి వచ్చి - "ఏంటే, కళ్ళు అంత వాచి వున్నాయి, అమృతవర్షిణీ ! మళ్ళీ రాగం తీసేశావా కాలేజ్ లో? ", అంది నవ్వుతూ.
నేనేం మాట్లాడలేదు - మళ్లీ అడిగింది కుట్టి - "ఇంతకీ క్లాసులకేమన్నా వెళ్ళావా? లేకపోతే ఆ వెయిటింగ్ రూం లోనే సాయంత్రం దాకా కూర్చుని వచ్చేశావా?"
పక్కనే దానికన్నా ఎక్కువగా నోరంతా తెరిచి నవ్వుతూ పప్పీ.
వాళ్ళకేసి కోపంగా చూస్తూ కాళ్ళు టప టప లాడించుకుంటూ [హవాయి "షూస్" మరి :)] ఇంట్లోకి వెళ్ళాను - వుండు వీళ్ళ పని చెబ్దాము - అమ్మ పెట్టిన ఉప్మా తిని వెళ్లి అనుకుంటూ.
మరి - హమే కోయీ డ ్ నహి హై - అబ్ ఖో జానే కీ :)
<<తర్వాతేం జరిగిందంటే... :

అత్యంత రమ్యంగా సాగుతోంది త్వామనురాజామి...
రిప్లయితొలగించండిరమ్యంగా - అంటే - ఇంకా అంత కాదు - ముందు ముందు అవ్వొచ్చు అలా :)
తొలగించండిచాలా బాగున్నాయండీ మీ కబుర్లు.
రిప్లయితొలగించండినా కబుర్లు మీకు నచ్చినందుకు సంతోషం - వింటూ వుంటారని ఆశిస్తూ - Thanks in advance!
తొలగించండి'అమృతవర్షిణి', Tease చేయడానికి కూడా ఎంతమంచి పేరు! బావుంది.
రిప్లయితొలగించండినా అసలు పేరు కన్నా కొసరు పేర్లు ఎక్కువ - అందులో ఇది నచ్చినందుకు - మది ఆనందమయి - ఇప్పుడు :)
తొలగించండి