కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ
ఖంగుఖంగున పాడుతూ నన్ను కుదిపి కుదిపి లేపేస్తోంది కుట్టి.
కళ్ళు తెరిచి చూస్తే - కుట్టి పక్కనే - మొహం నిండా పాలమీగడ, పసుపు రాసుకుని పచ్చని మొహంలో నల్ల కళ్ళు విప్పుకుని చూస్తోంది పప్పి.
"అబ్బ! ఏంటే ! కాసేపు పడుకోనియ్" - అని అటు పక్కకి తిరిగి పడుకున్నాను.
అది వదిల్తేగా ...ఉహు ...
"లల్లీ లేవవే ... నా తల్లీ లేవవే ... " - అంటూ దాని స్వంత కవిత్వం మొదలుపెట్టింది.
వెంటనే చెవుల్లో వేళ్లు పెట్టేసుకుని ఇంకొంచెంసేపు నిద్ర పోదామని ట్రై చేశాను.
అబ్బే ...కుదర్లేదు.
ఇంక లాభం లేదని లేచి మంచం మీదే మఠం వేస్కుని కూర్చుని, విసుగ్గా అడిగాను - "ఎందుకే ఇంత తొందరగా లేపేశావు?" అని .
"తొందరగానా తల్లీ?! ఏంటి సంగతీ - ఏం ఇవాళ కాలేజ్ డుమ్మానా? "- అనడిగింది కుట్టి.
"ఇంకా ఏడేగా!" - అన్నాను తల వంచి వెనక వున్న క్లాక్ కేసి చూస్తూ.
ఇంతలో అమ్మ అటు వచ్చింది.
"శుక్రవారం మహలక్ష్ములూ ! మంచాలు దిగండమ్మా ... నలుగులూ, తలంట్లూ అంటూ ఇంకో రెండు గంటల దాకా తయారు కారు. మళ్ళీ లేట్ అవుతోంది అని నన్ను తొందర పెడ్తారు" - అంటూ.
అమ్మని చూడగానే కుట్టి - "అమ్మా ! కొంచెం ఆ రేడియో సౌండు పెడ్తావా - ఇందాకట్నించీ ఈ ఎర్రతేలు లేవలేదని నాన్న దాని నోరు నొక్కేశారు" అంది.
అది వినగానే అమ్మకి ఒళ్ళు మండినట్టు వుంది - వెంటనే - "ఏం పిల్లలమ్మా... కుంచమంత కూతురుంటే మంచంలోనే కూడంటారు ....కానీ... ", అని ఇంకా ఏదో అనబోతోంది ....ఈలోగా నేను మంచం మీంచి గబగబా దిగుతూ "అది కూతురుకి, అమ్మకి కాదు- నువ్వు సరిగా వినుండవు" అంటూ గబగబా బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను.
పప్పీ, కుట్టి - వెంటనే నేనన్నది అర్ధం అయి కిసుక్కున నవ్వారు.
"తెల్లవార వచ్చే కొక్కొరో యని కోళ్ళు కూయంగ జొచ్చేను మేలుకో
మేలుకో లలితాంబ మేలుకో భ్రమరాంబ మేలుకో వనదుర్గ మేలుకో
తెల్లవారవచ్చేనూ ..."

మా అమ్మకి పాపం మొదట అందలేదు కాని ఒక రెండు నిముషాల్లో నేనేమన్నానో తట్టి - కోపంగా చూడబోయి కుదరక - "నవ్వింది చాలు. మీ ప్రతాపాలు అన్నీ నామీదే. తొందరగా తెమిలి కాలేజ్‌కి పద" - అంటూ వంటింట్లోకి వెళ్ళింది.
నేను బ్రష్ చేసుకుంటూ వుంటే కుట్టి వచ్చి అసలు సంగతి చల్లగా చెప్పింది - "లల్లెమ్మా... ఇవాళ కూడా అపర్ణ కాలేజ్‌కి రాదట. ఇందాక ఆరున్నరకి అంకుల్, ఆరతి వచ్చారు చెప్పడానికి. ఇవాళ వాళ్ళ ఆంటీతో విజయవాడ వెళ్తున్నారట."
లోపల్లోపల బెంగగా అనిపించినా - అది ఇంకా ఏడిపిస్తుందని ఏమీ మాట్లాడకుండా అదంత ముఖ్యమైన విషయం కాదన్నట్టు నోట్లో బ్రష్ ఉంచుకునే - "ఇంకా వెళ్లిరా" - అన్నట్టు చేత్తో సైగ చేశాను.
వాళ్ళిద్దరూ ఒకళ్ళ మొహం కేసి ఒకళ్ళు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లి స్కూల్ బేగ్స్ సర్దుకోవడం మొదలుపెట్టారు.
మొత్తానికి నేనూ కాలేజ్ కి వెళ్ళడానికి రెడీ అయి రిక్షా స్టాండు వైపు వెళ్ళబోతూ ఆగాను.
"పప్పీ..."
"ఊ..."
"కుట్టీ ..."
"ఊ..."
"మరీ..."
"అబ్బా! చెప్పవే ...ఒకటే నసరాణివి అయిపోతున్నావు" - విసుక్కుంది కుట్టి.
"అది కాదే ...ఇవాళ నా క్లాసెస్ నాలుగున్నరదాకా వున్నాయి. మీ స్కూల్ అయిపోగానే నువ్వు, పప్పీ ఏసీ కాలేజ్‌కి వచ్చారనుకో మనం ఎంచక్కా బ్రిడ్జి మీంచి నడుచుకుంటూ వచ్చి రాయల్ ఐస్క్రీమ్సులో ఫ్రూట్ సలాడ్ తిని రావొచ్చు" - వూరిస్తున్నట్టు అన్నాను.
కుట్టి పిల్లకి అర్థమైపోయింది - "చాల్లేవే త్రిపుర సుందరీ! నేను రాలేను బాబూ - అంత దూరం సైకిలు తొక్కుతూ. అసలే నా ఓపికంతా సీతా టీచర్ గారి లెక్కల క్లాసు లోనే అయిపోతుంది" - అంది పప్పీ కేసి తిరిగి కన్ను కొడుతూ.
దానికి తెలుసు నేను బ్రతిమాలుతానని.
"ప్లీజ్ కుట్టీ! రండే! - ఇవాళొక్క రోజే - సరేనా .... ప్లీజ్!"
అసలెప్పుడూ ఎక్కువ మాట్లాడని మా మితవాది పప్పీ - "సర్లే! వస్తాం - ఇంక బయల్దేరు. ఇంటికి రాగానే మాత్రం ఆ లక్ష్మణ్‌తో కాకుండా నాతో షటిల్ ఆడు ఇవాళ" - అనేసి "రావే కుట్టీ" - అని వాళ్ళిద్దరూ సైకిళ్ళు ఎక్కి స్కూల్ కి వెళ్లిపొయారు.
కాలేజ్‌లో - ఈరోజు కూడా అదేం వింతో - లాంగ్వేజ్ క్లాసెస్ కాన్సెల్ అయాయి. దాంతో సైన్సెస్ బిల్డింగ్ లోనే అన్ని క్లాసెస్ జరిగాయి.
సాయత్రం అవగానే - "అమ్మయ్య , ఇవాళ్టికి హాయిగా వుంది" - అనుకుంటూ బయటికి వచ్చాను.

అప్పటికి 4:15 అవుతోంది.
కొంచెం భయంగానే వుంది - పప్పీ, కుట్టి రారని డౌటేం లేదు కానీ ట్రాఫిక్‌లో లేట్ అవుతుందేమో, ఇక్కడ నేనొక్కదాన్నీ వెయిట్ చేయాలేమో అనుకుంటూ గోళ్ళు కొరికేసుకుంటున్నాను.

క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు రెండు రన్నులు , ఒక బాలు వుండి గవాస్కర్ బాటు ఊపుతూ ఆడుతుంటే వచ్చే టెన్షన్ లాంటిదేదో అనిపించేస్తోంది.
నేను భయపడ్డట్టే - అప్పటికే క్లాసులు అయిపోయి ఫ్రెండ్స్ కోసం ఎదురుచూస్తున్న ఫైనల్ ఇయర్ అబ్బాయిలు లైబ్రరీ దగ్గర కూర్చుని వున్నారు. కెమిస్ట్రీ బిల్డింగ్ లోంచి బయటికి గేటు దగ్గరికి వెళ్ళాలంటే అటు పక్కనుంచే వెళ్ళాలి.
ఇంతలో గేటు లోంచి లోపలికి వస్తూ పప్పీ, కుట్టీ, లక్ష్మణ్ కనిపించారు (లక్ష్మణ్ ఒక్కడే అవడంతో మాతోనే వాడి ఆటలు , మాటలు, అడ్వెంచర్స్ అన్నీనూ ) ... అంతే రెండేసి మెట్లు దిగుతూ స్కర్ట్ కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డం పడి పడిపోతానేమో అనిపించేలా పరిగెత్తుకుంటూ వాళ్లకి ఎదురు వెళ్లబోయాను.
"బాసూ --ఈ రాయి తగుల్తుందా లేదా ఎంత బెట్టు? బ్రిడ్జి కింద బజ్జీనా? అజయ్ టీ సెంటర్లో సమోసానా? తొందరగా తేల్చండిరా" - అని వినిపించి అది నా గురించేనేమో అని డౌట్ వచ్చి అటు చూడబోయాను- ఇంతలోనే ఒక కంకర రాయి వచ్చి మోకాలికి తగిలింది. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. కాలంతా జివ్వున లాగింది, ఆ నొప్పికి ఏడుపు వచ్చేసింది.
పప్పీ వాళ్ళు అక్కడే ఆగిపోయారు - వాళ్ళకీ ఒక నిముషం ఏమీ తోచినట్టు లేదు.
నేనొక్క రెండు నిముషాలు మోకాళ్ళమీద కూర్చుండిపోయాను - కళ్ళు తుడుచుకుంటూ, కాలు మీద చేత్తో రాసుకుంటూ.
ఆ అబ్బాయిలు కూడా అంత గట్టిగా తగులుతుందని ఊహించినట్లు లేరు. వాళ్ళూ ఒక్కసారిగా లేచి వుండాలో వెళ్లాలో తేల్చుకోలేక నించుండి పోయారు.
అంతే ....పిచ్చి కోపంతో కూర్చున్నదాన్ని కాస్తా లేచి చేతికి అందిన రాళ్ళు తీసుకుని వాళ్ల కేసి విసిరేశాను.
"అమ్మో రాక్షసి! కొడుతోందిరోయ్!!" - అని గోలగా అరుస్తూ పరిగెత్తి వెళ్ళిపోయారు.
అవతల కుట్టి పొట్ట పట్టుకుని నవ్వుతోంది - "అదేంటే అలా కొట్టేశావు? రేపట్నించి పిచ్చిదంటారు నిన్ను .... " అని ఆగకుండా నవ్వుతూనే వుంది.
"అంటే అన్నార్లే - రేపట్నించీ దీని జోలికి రారు - కదే లల్లీ !" - దెబ్బ మీద కారం చల్లినట్టు పప్పీ సమర్ధింపు.
హుం ... అని వాళ్ళిద్దర్నీ అలాగే వదిలేసి గబగబా గేటు దాటి రోడ్డు మీదకి వెళ్లి క్రాస్ చేసేశాను.
"ఆగవే , లల్లీ , ఆగు! ఇవాళ డబుల్ పార్టీ. దెబ్బకి ఠా..రౌడీ ముఠా ...పద ఐస్క్రీమే కాదు, ఆ దెబ్బలు తిన్నవాళ్ళు తిందామనుకున్న సమోసాలు కూడా తినేద్దాం పద" - అనేసి అన్న మాట చెల్లించుకున్నారు నా చెల్లెళ్లు.
ఆ రోజు తర్వాత నేనింకెప్పుడూ ఒక్కదాన్నీ కాలేజ్ కి వెళ్ళడానికి భయపడినట్టు గుర్తు లేదు :)
<<.<<తర్వాతేం జరిగిందంటే... : త్వామనురజామి - 5 - లెక్కలు మార్చినా స్ట్రెస్సెంబరే >>>>

దెబ్బకు ఠా.. రౌడీ ముఠా.. బాగుందండీ వాళ్ళకి గుంటూరు మిర్చీ ఘాటు రుచి చూపించారనమాట. సుపర్.. అయినా వాళ్ళది అదేం అల్లరండీ మరీ ఘోరంగానీ.. సరదాగా కామెంట్ చేయడం ఓకే కానీ రాళ్ళేయడమేంటండీ... వాళ్ళని పట్టుకుని తన్నేవాళ్ళు లేక. చాలా బాగుంటున్నాయండీ కబుర్లు.. కీప్ రైటింగ్..
రిప్లయితొలగించండిఒక రాయి వేసి చూద్దాం అనుకున్నారేమో - పది రాళ్లు వెనక్కి వస్తాయని అస్సలు ఊహించి వుండరు. ఆ రాయి దెబ్బకి ఒక మంచి కూడా జరిగింది లెండి - నాకున్న భయం కూడా ఠా అయింది :) మీ ప్రోత్సాహకర కమెంట్ కి చాలా థాంక్స్!
తొలగించండిLalli ...nidra potunna gnapakalanu tatti leputunnavu. Idi nee kosam....
రిప్లయితొలగించండిPhoolon ka taaron ka
Sab ka kehna hai
Ek hazaaron me
Meri behna hain
Saree umar hame sang rahna hain ...
I am speechless, Pappi. Thanks a LOT for reminding of this song!
తొలగించండి"ఏం పిల్లలమ్మా... కుంచమంత కూతురుంటే మంచంలోనే కూడంటారు ....కానీ... ", అని ఇంకా ఏదో అనబోతోంది ....ఈలొగా నేను మంచం మీంచి గబగబా దిగుతూ "అది కూతురుకి, అమ్మకి కాదు- నువ్వు సరిగా వినుండవు" అంటూ స్పీడుగా బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను.
రిప్లయితొలగించండి:)) మళ్ళీ పేల్చేశారు టపా.....కాయలు.. హై హై శైలి.
ఆ సామెత అర్థం మా అమ్మకి నావల్లే సరిగ్గా తెలిసింది :) మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు
తొలగించండి'శుక్రవారం మహాలక్ష్ములూ! ' ఇలాంటి అందమైన పిలుపులు విని ఎంత కాలమైందో!
రిప్లయితొలగించండిమా డాడీ కూడా నాకు కోపం వచ్చినప్పుడు ఆ కోపం range కు తగినట్టుగా నన్ను, " తల్లీ! జగన్మాతా! ఆదిశక్తీ! పరంజ్యోతీ! భద్రకాళీ! మహంకాళీ!" ఇలా పిలిచేవారు :)
భలే రాస్తున్నావు లలితా! మా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఉంది, చదువుతుంటే.
మీ కుట్టి, పప్పిల మాటలు, చివరలో నీ రియాక్షన్ దేనికవే హైలైట్!!! :)
"ఇలాంటి అందమైన పిలుపులు...."
తొలగించండికదా ! :) నా కబుర్లు వింటూ నా వెంటే వుంటూ వున్న నీకు బోల్డన్ని థాంక్స్!
బాగున్నైయండి మీ జ్ఞాపకాలు, ధన్యవాదాలు
రిప్లయితొలగించండినా కబుర్లు చదువుతున్నందుకు మీకు నా ధన్యవాదాలు!
తొలగించండిమన గుంటూరు వాళ్ళు ఇలా కూడా చేసేవాళ్ళన్నమాట.వాళ్లకి భలే బుద్ధి చెప్పారు. అయినా ఇలా రాళ్లు పెట్టి కొట్టాల్సిన వాళ్ళు అప్పట్లోనే కాదు ఇప్పటికీ ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటారు.
రిప్లయితొలగించండిరాళ్లు వేసేవాళ్లు ఎప్పుడూ వుంటారు - తిరిగి ఒక రాయికి పదిరాళ్లు వేసే వాళ్లు అరుదు ;)
తొలగించండి