కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి : త్వామనురజామి - 17 - మాట లేని రోజు అది - వాక్కు లేని walk అది!
డిసెంబర్ 20 - కాలేజ్ తొందరగానే అయిపోయింది.
రేపటి ప్రయాణం - ఇంటికి వెళ్తున్నాం అనే ఆలోచనే - అనుకోవడానికే భలే హాయిగా వుంది.
అమ్మాయిలు మామూలుగానే మాటల-జలపాతాలు
ఇప్పటికి...
కొంచెం కొంచెంగా పెరిగి కుంౘమంతైన
ఇంటికేగుతున్నామన్న ఇంపగు తలపు
ఇంతింతై మది పట్టలేనంతై
పెదవులపై దాగని చిరనవ్వై
పుడమిపై నిలవని పాదాల మువ్వై
వర్షానికి తడిసిన చెట్టు మీది నుంచి
జల జల రాలే చినుకుల్లా
పలకరిస్తేనే చాలు గలగలలాడే కబుర్లై
సెలవుల్లో రాబోయే పండగ సరదాల ఊహలై
ఒకచోట నిలవనీయకుండా సందడి చేయిస్తోంది మా అందరిచేతా
ఇంత హడావిడి మధ్య - అలిపిరి దగ్గరగా ఉన్నఒక రెసిడెన్షియల్ కాలనీలో వున్న - తిరుమల-నడక దారిలో కొత్తగా దొరికిన మా తమ్ముడు రవికుమార్ ఇంటిని - వెతుక్కుంటూ వెళ్ళి - వాళ్ళ ఇంట్లో పెట్టిన జంతికలు తినేసి, ఆరోజుకి హాస్టల్లో మిస్సైపోయిన టీ సేవించేసి - అడగ్గానే సనం తేరి కసం పాట నేను పాడేసి - మాకోసమని రవి వాళ్ళ నాన్నగారు ప్రత్యేకంగా తెప్పించిన తిరుపతి ప్రసాదం - లడ్డూలు, వడలు బోల్డన్ని మాతో తెచ్చేసుకున్నాం - నేను, మా క్లాసులో ఇంకొందరు అమ్మాయిలు.
ఆ రోజు రాత్రి డిన్నర్ అయాక - మా జంట-మేట్రన్లు కణ్ణగి, కొదై లతో పాటు - ఎప్పుడు నాకెదురుపడ్డా ఎంతో ఇష్టంగా నన్ను చూస్తూ - చిన్న నవ్వుతో పలకరించే ఇంకో అసిస్టెంట్ మేట్రన్ ఇందిరగారు - అందరికీ పేరుపేరునా ఊరికి వెళ్తున్నాను - సెలవులకి అని చెప్పి - రూంకి వచ్చి - సూట్‌కేస్ సర్దేసుకున్నాను.
డిసెంబర్ 21. ప్రయాణం రోజు.
ఈసారి గుంటూరు, హైదరాబాదు వెళ్ళే అమ్మాయిలమంతా ఒకే కంపార్ట్‌మెంటు అని ముందే తెలియడంతో ఎప్పుడెప్పుడు ట్రెయిన్ ఎక్కి పాటలు పాడేసుకుందామా అని తెగ ఉత్సాహ పడిపోతున్నాను.
ముందే అనుకున్నట్టు నేను, శ్రీలత ఒక రిక్షాలో వెళ్ళాము స్టేషన్ కి.
తిరుపతి రైల్వేస్టేషన్ లోకి వెళ్ళగానే - అబ్బ! ఎంత సందడో - ఎంత హడావిడో! బోల్డంత మంది అమ్మాయిలు - చీరల్లో, చుడీదారుల్లో.
నేను కూడా నాకు ఇష్టమైన ఒక నీలపుడుపు వేసుకుని దానిమీద - డిసెంబర్ నెల కదా - చలిగా వుందని శ్రీనన్న అంతకుముందు బెంగళూరులో కొనిచ్చిన తెల్ల స్వెటర్ వేసుకుని - ఒక చేతిలో నా పింక్బాగ్ , ఇంకో చేతిలో సూట్‌కేస్ పట్టుకుని - దాని బరువుకి ఒక పక్కకి ఒంగి నడుస్తూ శ్రీలతతో కలిసి నా కంపార్ట్‌మెంటు, సీటు వెతుక్కుంటూ చార్టులు చదువుకుంటూ - రైలు పెట్టెల పక్కగా నడుస్తున్నాను.
మాలాగే కంపార్ట్మెంట్లు వెతుక్కుంటూ - అటూ ఇటూ నడుస్తూ - పలకరిస్తున్న అమ్మాయిలందరికీ - Merry Christmas, Happy New Year, HappyPongal...and Happy Holidays - అని గట్టిగా అరుస్తూ విషెస్ చెప్తూ - పాదాల్లో స్ప్రింగులు మొలిచినట్లుగా నడుస్తున్నాను.
ఈలోగా నిరుపమ కనిపించి - "మన కంపార్ట్మెంట్ ఈ పక్కదే - పద " - అని చెప్తే అటుకేసి వెళ్తూ చూస్తే - దూరంనుంచే - మా కంపార్ట్మెంట్ మెట్ల దగ్గర ఒక పక్కగా నించుని - 19వ తారీఖున రాజశేఖర్ తో కలిసి మా హాస్టల్ దగ్గరికి వచ్చిన ఆ మూగ-MBA-అబ్బాయి కనిపించాడు. చుట్టూ అతని ఫ్రెండ్స్ చాలా మంది వున్నారు.
అతన్ని చూడగానే - ఎంత ఎక్సైటేడ్ గా అనిపించందంటే - చేతిలో ఉన్న సూట్‌కేస్ అక్కడే వదిలేసి - నిరుపమని చూస్తూ ఉండమని చెప్పి - ఒక చేత్తో శ్రీలత చెయ్యి పట్టుకుని "ఇలా రండి " అని "ఏంటి లల్ల్లీ - ఎక్కడికి? ఎందుకీ పరుగు - ట్రెయిన్ కదలడానికి ఇంకా టైంవుంది కదా?" అంటూనే నాతో సమానంగా పరిగెడుతూ - తను అడుగుతుంటే - "చెప్తాను ఉండండి" - అంటూ లాక్కెళ్ళి ఆ అబ్బాయి దగ్గర ఆగాను.
హఠాత్తుగా - హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చిన నన్ను, శ్రీలతని చూసి - అతని ఫ్రెండ్స్ అందరూ అప్పటిదాకా మాట్లాడుకుంటున్న వాళ్ళు మాటలాపేసి మాకేసి చూస్తున్నారు.
నేను కొంచెం ముందుకి వంగి - (మూగబ్బాయి కదా - చెవులు కూడా వినిపించవేమో - పోనీ గట్టిగా మాట్లాడితే వినిపిస్తాయేమో - అసలు నాకేమనిపించిదో కూడా పట్టించుకునే స్థితిలో లేను నేను) - మామూలు కన్నా కొంచెం గట్టిగా Merry Christmas, Happy New Year, HappyPongal...and Happy Holidays చెప్తూ - నేనెందుకలా అరుస్తున్నానో తెలియక అయోమయంగా చూస్తున్న శ్రీలత కేసి తిరిగి, "శ్రీలతా! మీకు చెప్పానుకదా MBA అబ్బాయి - మాట్లాడలేడు అనీ - ఇదిగో ఇతనే" అంటూ మళ్ళీ అతనికేసి తిరిగి ఒక వేలు శ్రీలత కేసి చూపిస్తూ - వెంటనే నాకేసి తిప్పుకుంటూ "She is Srilatha, my senior" అని చెప్తూ - దాన్నే సైగలతో చెప్పడానికి కూడా తెగ ఆపసోపాలు పడిపోయాను.
ఆ అబ్బాయి పెదవుల మీద చిన్న నవ్వు - కళ్ళ వెలుగే పెదవుల మీద మెరిసిందో - పెదవుల నవ్వే కళ్ళని వెలిగించిందో - అన్నట్టు మొహమంతా వెలుగు - అది నన్ను చూసి కాదు సుమా - అతని నవ్వే అంత.
అలాగే నవ్వుతూ - అర్థం అయిందన్నట్టు తలాడించాడు.
అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నాకేసి, శ్రీలత కేసి చూసి నవ్వుతూ - "హాయ్" - అని పలకరించి పరిచయం చేసుకున్నారు.
అప్పటికే చుట్టు పక్కల అందరూ - అంటే మా కాలేజ్ వాళ్ళు కాక - ట్రెయిన్లో ఎక్కుతున్న మిగిలిన వాళ్ళు - నేను ఆ అబ్బాయితో అరిచి మాట్లాడం, ఆ అబ్బాయి మౌనంగా నవ్వుతూ తలాడించడం చూసి - అతని కేసి కొంచెం జాలితో, అతని నవ్వు చూడగానే అప్రయత్నంగా కలిగే ఇష్టంతో - చూస్తూ మా పక్కనుంచే కంపార్ట్మెంట్లోకి ఎక్కుతున్నారు.
ఈలోగా నాకు గుర్తొచ్చింది - సూట్‌కేస్ ప్లాట్‌ఫాం మీద వదిలేసి, నిరుపమని నించోబెట్టి వచ్చానని.
వెంటనే ఆ అబ్బాయికేసి తిరిగి - Bye - చెప్తున్నట్టు చెయ్యి ఊపి - సూట్‌కేస్ తెచ్చుకుందామని వెనక్కి వెళ్ళాను.
శ్రీలత అక్కడే నించుని అతని ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు - ఎలాగూ అదే మా బోగీ కదా - నేను సూట్‌కేస్ తెచ్చుకురాగానే ఇద్దరం కలిసి లోపలికి ఎక్కొచ్చని.
వెనక్కి గబగబా వస్తున్న నాకు నన్నే విసుగ్గా చూస్తున్న నిరుపమ కనిపించింది. తన విసుగు-చూపులు నాకలవాటే.
అందుకే "సరే పద వెళ్దామింక" అంటూ సూట్‌కేస్ అందుకుని తన పక్కనే నడుస్తున్నాను.
తను నన్ను ఆగమని చెప్పి - కంటిచూపుతోనే నాకు ఆ మూగ అబ్బాయిని చూడమని చెప్తూ - "లలితా - ఈ అబ్బాయా నువ్వు చెప్పిన మూగతను? నాకెందుకో డౌటుగా వుంది. తనకి మాటలొచ్చని" అంది.
"లేదు నిరుపమా! రావు - చూడు - తన చుట్టూ అందరూ అంత మాట్లాడుతున్నా నవ్వుతూ చూస్తున్నాడు కానీ - కనీసం అవును-కాదు అన్నట్లు తల కూడా ఊపట్లేదు. ఇందాక అంత అరిచి విషెస్ చెప్పానా? - అస్సలు విన్నట్టే లేడనుకో. శ్రీలత కేసి చెయ్యి చూపిస్తే మాత్రం తను నా ఫ్రెండ్ అని అర్థమయినట్టు వుంది అంతే!" - ఎందుకో తెలీదు ఆ అబ్బాయి మాటరాని-తనాన్ని లేమిగా కాక అదో అదనపు క్వాలిఫికేషన్‌లా తెగ సమర్థించేశాను.
"లేదే - వాళ్ళిల్లు మా ఇంటి దగ్గరే. నేను BH కాలేజ్‌లో ఇంటర్ చదివేటప్పుడు, నాగార్జున మ్యూజిక్ కాలేజ్‌లో డాన్స్క్లాస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళింటిమీంచే వెళ్ళేదాన్ని. ఎప్పుడూ చుట్టూ ఫ్రెండ్స్ - వాళ్ళింటిముందు కరెంటుస్తంభం కింద నించుని గంటలు గంటలు తెగ గోల చేస్తూ వుండేవాళ్ళు." - నిరుపమ విసుగు-మీటర్ పెరిగిపోతోంది.
"సర్లే - మాటలురాకపోతే మాత్రం ఫ్రెండ్స్ ఉండరా? - ఉన్నవాళ్ళు మాట్లాడరా? - నువ్వు సరిగ్గా చూసుండవ్. తినైతే మాట్లాడి ఉండడు" - అని స్థిరంగా చెప్పి - "పద - ఇంకా నేను నా బెర్త్ ఎక్కడో చూసుకోలేదు" అని మళ్ళీ నా పెట్టె మోసుకుంటూ వెళ్ళి కంపార్ట్మెంట్ మెట్ల దగ్గర ఆగాను.
అప్పటికే శ్రీలత లోపలికి వెళ్ళి తన సీటు వెతుక్కుని కూర్చున్నారు. నాది ఎప్పట్లాగే నాకిష్టమైన సైడ్‌బెర్త్ - కిందది. శ్రీలతది - నా పక్కనే వున్న సైడ్‌బెర్త్ -అదీ కిందదే.
నేను నా బాగ్‌లోంచి సూట్‌కేస్-శృంఖలాలు, వాటితో పాటు చిన్నసైజు గుండ్రాయి లాంటి గోద్రెజ్ తాళం తీసి - నా బెర్త్ కింద ఇనపరాడ్కి - నా సూట్‌కేస్‌ని గొలుసేసి కట్టేసి తాళమేసి - మళ్ళీ గా... ఠి....గా - పొరపాటున చేయి జారితే నేను వెళ్ళి వెనక్కి పడతానేమో అనిపించేంత గా... ఠి....గా లాగి చూసి - రెండు సైడ్ సీట్లూ కలిపి - సైడ్‌బెర్త్ మీద కూర్చుని నా పక్క సీట్లోకి ఎవరొస్తారా అని చూస్తున్నాను.
ఇంతలో ట్రెయిన్ కదిలే టైం అయింది. అప్పటిదాకా కింద మెట్ల దగ్గర కబుర్లు చెప్పుకుంటున్న SVU MBA అబ్బాయిలు అందరూ బిలబిలలాడుతూ లోపలికి వచ్చేశారు.
అందరి కన్నా వెనగ్గా - నెమ్మదిగా నడుచుకుంటూ మూగ-అబ్బాయి కూడా వచ్చి నా బెర్త్ దగ్గర ఆగి - వంగి సీట్ నంబర్ చూసుకుని - తన సూట్‌కేస్ నేను కూర్చున్న చోటుకి పై బెర్త్ మీద పెట్టుకుని - నా పక్క సీట్లో - అంటే నేను కూర్చున్న సైడ్‌బెర్త్ మీదే కూర్చున్నాడు.
నేను అతని కేసి చూసి నవ్వగానే అతనూ నన్ను చూసి నవ్వాడు.
ఇంకెవరన్నా అయితే ఇప్పటికి బోల్డన్ని కబుర్లు అయిపోయి ఉండేవి - ఇతనితో ఏం చెప్తాను?
కబుర్లూ-కాకరకాయలూ లేకుండా ఎన్నిసార్లు మొహం చూసి ఎంత నవ్వుతాను - కదా? అందుకే చుట్టూ వున్న అందరినీ చూస్తూ వున్నాను.
ఇంతలో మా ఎదురుగా వుండే ఆరు సీట్లలో వున్న ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు లేచి వచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్న - ఇండియా టుడే, ఆంధ్రప్రభ లాంటి పుస్తకాలు - నా పక్కన కూర్చుని వున్న ఆ అబ్బాయి చేతిలో పెట్టి - "పర్లేదు-చదువుకో" - అన్నట్లు సైగ చేసి వెళ్ళి వాళ్ళ సీట్లలో కూర్చున్నారు.
సరే! ఆ అబ్బాయి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. నాకూ ఇంకేం చేయాలో తోచలేదు.
ఇంతలో ఆ పక్క సీట్లలోంచి మా క్లాస్మేట్స్, సీనియర్స్ అందరూ అంత్యాక్షరి మొదలు పెట్టారు. నేనూ వెళ్ళబోయాను.
కానీ - నా పక్క సీట్లో అబ్బాయి అవేం పట్టనట్టు పుస్తకం చదువుకుంటూ ఉంటే - "అయ్యో! పాపం - పాడలేకపోతే పోనీ - కనీసం విని ఎంజాయ్ కూడా చేయలేడు కదా - నేను కాసేపు ఇక్కడే వుండి ఎలాగోలా సైగలతో అయినా మాట్లాడతాను - తనకి కొంచెం టైంపాస్ అవుతుంది " - అనుకుని ఆగిపోయాను.
కానీ సైగలు మాత్రం ఎంత చేయగలను?
బాగ్‌లోంచి ఒక నోట్‌బుక్, పెన్ తీశాను.
తీసి "Shall we talk on this paper?" అని రాసి పుస్తకాన్ని అతని చేతికి ఇచ్చాను.
దాన్ని చదివి - అదే చిరునవ్వుతో నన్ను చూస్తూ - తన షర్ట్ జేబులోంచి పెన్ తీసి "Sure - why not?!" - అని రాసి నాకేసి జరిపాడు పుస్తకాన్ని.
ఇంతలో నిరుపమ పాటలు పాడుతూ ఆడుకుంటున్న అమ్మాయిల దగ్గర్నుంచి లేచి - నిద్రొస్తోందని తన బెర్త్ దగ్గరికి వెళ్తూ నా దగ్గర ఆగి - చిన్నగా నా చెవి దగ్గర - "నేన్నమ్మనే ఈ అబ్బాయిని - నాకేదో అనుమానంగా ఉంది" అంటూ గుసగుసలాడింది.
నేనూ అంతే గుసగుసగా "నేన్నమ్ముతాను - నాకనుమానమే లేదు" అని గీరగా గసగసలాడాను.
నిరుపమ "నీకు చెప్పలేనింక పోవే!" అని గట్టిగా విసుక్కుని వెళ్ళి దుప్పటి ముసుగేసుకుని పడుకుండిపోయింది.
నేను, నా పక్క సీట్లో మూగ-అబ్బాయి ఇంక బోల్డన్ని కబుర్ల్రాసేసుకున్నాం.
పేర్లు చెప్పుకోవడంతో మొదలుపెట్టి, హాబీస్, మా పప్పి-కుట్టి, వాళ్ళ తమ్ముడు-చెల్లెలు, మా అమ్మ-నాన్న, వాళ్ళ అమ్మగారు, నాకిష్టమైన పుస్తకాలు, పాటలు, తనకిష్టమైన జోకులు - ఇలా ఒకటి కాదు, రెండు కాదు - పుస్తకం ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళ చేతిలోకి మార్చుకుంటూ - రాసుకుంటూ - చదువుకుంటూ - నవ్వుకుంటూ మా లోకంలో మేమున్నాము.
నాకు పాటలు పాడడం ఇష్టం అని రాసిన దాని చదివి - తను రాసింది ఏంటంటే - "Can you sing a song for me?"
"Will you be able to hear if I sing ?" అన్నది నా ప్రశ్న.
"I can hear with my eyes - by looking at your face while you sing" - అంటూ రువ్విన ఇంకో నవ్వు.
నాకు ఆ ఊహే భలే fascinating గా అనిపించింది - Helen Keller గుర్తొచ్చింది.
"Then - okay " అంటూ మొదలు పెట్టి తనకి ఎలాగూ వినిపించదు కదా - అని చాలా మెల్లిగా - ఎవరికీ వినపడకుండా - నేను పాడుతున్నట్టు చుట్టూ ఎవరికీ అనుమానం రాకుండా - తల కొంచెం ఒంచి - చిన్నగా - నాకిష్టమైన ఘంటసాల పాట : తల నిండ పూదండ దాల్చిన రాణి - మొలక నవ్వుల తోడ మురిపించబోకే - పాడేశాను.
పాట పాడినంతసేపు చూపు తిప్పకుండా - అదే చిరునవ్వుతో నన్ను చూస్తూ - నేను పాట ఆపగానే - కుడిచేతి బొటనవేలు-చూపుడువేలు కలిపి బావుంది అన్నట్టు మెచ్చుకున్నాడు.
అప్పుడే రాశాను - "It would be so nice if you can speak".
చదివిన కళ్ళలో మళ్ళీ నవ్వు మెరుపు.
ఇంతలో - తన క్లాస్మేట్ - కొంచెం స్టైల్‌గా జీన్స్ వేసుకుని, తేనెరంగు కళ్ళు - హిందీ సినిమాలో కొత్తగా వస్తున్న హీరోల హెయిర్-స్టైల్ వున్న - ఒకబ్బాయి వచ్చి తన పక్కనే కూర్చుని - మేమేం రాస్తున్నామా అని - టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నట్టు - మా చేతుల్లోంచి అటూ-ఇటూ మారుతున్న నోట్‌బుక్ కేసి చూస్తూ - ఓ పది నిముషాలు గడిపాడు.
మేమేమీ తనని పట్టించుకోలేదు - మా రాతల్లో మేమున్నాము - అని అర్థం కాగానే - లేచి మళ్ళీ - వాళ్ళ మిగిలిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు.
తను వెళ్ళగానే - రాతలో అడిగాను "Who is he?".
"He is Giriraj - a very good friend of mine. He plays the Guitar so well " - ఆ రాతలోనే ఫ్రెండ్ మీద ఇష్టం గిటార్రాగాలు తీసింది.
నేను - మామూలు విషయాలు అయిపోయి - ఇంక నాకిష్టమైన sayings, tongue twisters ఇవీ అని - అవి కూడా రాయడం మొదలుపెట్టాను.
వాటిలో గుర్తున్న కొన్ని:
Keep smiling - That makes people wonder what you have been up to...
He who knows not and knows not that he knows not - Ignore him
He who knows not and knows that he knows not - Teach him
He who knows and knows not that he knows - Wake him
He who knows and knows that he knows - Follow him
She sells sea shells on the sea-shore.
Betty bought some butter. But the butter was bitter - so she bought some more better butter to make the bitter butter better.
అందులో మళ్ళీ అంకెల లెక్కలు కూడా :)
How can you prove 1=(-1)? అంటూ. దాని ప్రూఫ్ కూడా రాసేశాను - నాకు తోచింది.
ఇదిగో ఇలా:
ఇలా పెదవులు కదలకుండా - బోల్డు మాటల్రాసేసుకున్నాం.
టైం ఎంతైందో చూసుకోలేదు - అప్పటిదాకా. చుట్టూ చూస్తే - అక్కడక్కడా నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలు - ఎవరో ఒకళ్ళో, ఇద్దరో తప్ప - అందరూ పడుకున్నారు.
నిద్రొస్తున్నటుగా అనిపించి - టైం చూస్తే పదకొండున్నర అయ్యింది.
అమ్మో - బోల్డు లేట్ అయిపొయింది - ఇంక పడుకోవాలి అనుకుని - "It's been nice "talking' to you" అని రాసి - మళ్ళీ ఇంకోసారి - "It would have been so nice if you could speak" - అని నేను రాసింది చదవగానే - సమాధానంగా "If I say something, it may hurt you" అని రాశాడు.
నాకర్థం కాలేదు .
"ఈరోజు మాత్రమే పరిచయం అయిన ఈ అబ్బాయి నాకేం చెప్తాడు? - అదే - రాతలో రాసి చూపిస్తాడు ? నేనేం హర్ట్ అవుతాను?" అనుకుని - "Not at all - You're a nice person - please go ahead" అని రాశాను.
అప్పుడు... ఆ అబ్బాయి పెన్ను కాగితం మీద పెట్టి ఏదో రాయబోయి - మెల్లిగా తలెత్తి ... నాకేసి తిరిగి .... నన్ను చూస్తూ ...
ఇక్కడ ఆపుతానేం - మరీ అన్నీ ఇవాళే చెప్పేస్తే వచ్చే నెలకి కబుర్లేముంటాయ్ - కదా?!
ఈలోగా టైటిల్ పాట వరసేంటో కనిపెట్టేయండి.
ఈ కొసరు పాట వరస కూడా పాడుకుని వినిపెట్టేయండి.
రాసుకున్నామూ ...మేమే చదువుకున్నామూ
ఈ పేజి నిండనీ - అని నింపుకున్నామూ
ఆనాడే .... మేము రాశామే....
ఆ ప్రాయాలలో ... అభిప్రాయాలని...
ఊఁ ... ఊఁ ...ఊఁ ...ఊఁ ...
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

రిప్లయితొలగించండిసస్పెన్సు థ్రిల్లింగు గా వుంది
శ్రీలత మీ సీనియరన్న మాట
జిలేబి
జరిగిపోయిన కథ ఇది - రాయాలనే ఆసక్తి కొనసాగాలంటే ఒక చిన్న మలుపుతో సస్పెండ్ చేసి ఒక నెల స్పెండ్ చేయాలనుకోవడంతో వుట్టుట్టి సస్పెన్స్ బాగానే పుడుతోంది. థ్రిల్లింగో, చిల్లింగో - మీరు చదువుతున్నందుకు థాంక్సండొ!
తొలగించండిభలే కనిపెట్టారే మా సీనియర్ గురించి :)
టైటిల్ సాంగ్‌కి : జగ్గయ్య, జమున
రిప్లయితొలగించండికొసరు పాటకి : మంజుల, రామక్రిష్ణ
అయితే సరిపోతారు. 😊😊😊
మంజుల కాదండి - లత :)
తొలగించండి//మంజుల కాదండి - లత :)//
తొలగించండిచిన్నప్పుడు చూస్తే గుర్తుండేది, పెద్దాళ్ళు చూడనివ్వరు😏. పెద్దయ్యాక చూశాను, కానీ మర్చిపోయాను😂.
హు..హ్హు..హ్హు.. హూఁ... మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే...
పాటలు కనిపెట్టేసాను .. మూగబ్బాయి ఎవరో కూడా బాగా అర్ధం అయ్యింది :)
రిప్లయితొలగించండిటైటిల్ పాట -- ‘ మూగవైన ఏమిలే నగుమోమే చాలులే ‘
ఇంకొకటి - ‘ కోరుకున్నానూ నిన్నే చేరు కున్నాను.. ‘
చంద్రిక గారి కామెంట్ కి డిట్టో అండీ :-) అండ్ ఎపిసోడ్ కి తగినట్లుగా మీ ఛాయిస్ ఆఫ్ సాంగ్స్ సూపర్బ్.. నన్నూ మీతో పాటు ప్రాయాణం చేయించేశారు.
తొలగించండిపాటలు పట్టినందుకు చప్పట్లు :)
తొలగించండిఅనుమానం లేదు. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపేడు అన్నచోటే మొదటి భాగాన్ని ఆపేయమని మీరే రాజమౌళికి సలహా ఇచ్చారు. ఆ ఉత్కంఠని ఆద్యంతం కథలో ఉంచటం అనితరసాధ్యం. కుర్రతనంలో ఉండే ఉద్రేకాలని యధాతధంగా సినిమా చూపెట్టేసారు. భళీ, భళీ!!
రిప్లయితొలగించండికట్టప్ప కథ బాహుబలి సినిమా అయితే నా కథ బ్లాగు-భళీ అన్న మీ వ్యాఖ్యకి బోల్డన్ని ధన్యవాదాలు!
తొలగించండి