అనగనగా కిందటి శుక్రవారం...ఎప్పట్లాగే కాళ్ళకి స్ప్రింగులు మొల్చువారం - కంటిరెప్పలు ఎక్కువగా విచ్చి రాత్రిని కొల్చువారం.
పొద్దున-పొద్దున్నే నమస్కార్దేశీ డాట్‌కామ్ ఈమెయిల్ మోసుకొచ్చిన వార్తలేంటంటే -
అదేదో హోటల్లో తినదల్చుకున్నవారికి తిన్నన్ని అట్లు - ఇదేదో థియేటర్లో చూడదల్చుకుని రెండ్రోజుల్లో చూడకపోతే చూద్దామన్నా చూడలేని సినిమాలు.
మొదటిది పెద్ద పట్టించుకోదగ్గ విషయమేమీ కాదు - తినుట తిరుగుట కొరకే గానీ - తినుటకు తిరుగుట అలవాటు అంతగా లేని వారం - దోసెల వార్తని పక్కకి తోసేసి - సినిమాలేమున్నాయబ్బా అని కనులార్చక చూస్తే - తెలుగు సినిమాల పట్టికలో పట్టించుకోదగినదిగా - రాజా ది గ్రేట్ - కనిపించింది.
ఒక్క నిముషం... ఎందుకొచ్చిన సినిమా - అనవసరంగా ఒక శుక్రవారపు సాయంత్రం భేజా రిగ్రెట్ అవుతుందేమో! - అనిపించినా ధైర్యే సాహసే సిని-మా-లక్ష్మీ అనేసుకుని - బదరికి నా సినీ-మనవి చేసుకోగానే - "రవితేజానా హీరో? - పాపం ఈ మధ్య హిట్లేమీ లేనట్టున్నాయి కదా - వెళ్దాం" - అని ఏకగ్రీవంగా యుగళ-మాట అనేసుకున్నాం.
ఎవరైనా సినిమాలు హీరో మీద ఇష్టంతో చూస్తారు - హీరోయిన్ ఎలా ఉంటుందా అని ఇంట్రెస్టుతో చూస్తారు - మేం మాత్రం అప్పుడప్పుడు జాలితో కూడా చూస్తాం.
అందులోనూ - నిరుడో, ఆ పై ఏడాదో, ఇంకా ఆ ఆ పైదో - నిప్పో, దరువో - గుర్తు లేదు కానీ ఇలాగే రవితేజ సినిమా అని వెళ్తే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళకుండానే దార్లో ఎదురొచ్చిన వాళ్ళు చెప్పారు - సినిమా బాలేదని షో కాన్సెల్ చేశారండి - అని.
అప్పుడనిపించింది - "ఒక తాతగారి అంశో, ఇంకో తాతగారి వంశమో లేదనే కదా పాపం - ఇలా చేసి వుంటారు. పాపం రవితేజ!" - అని.
చిన్నప్పడు సినిమా అంటే ఏంటో తెలీని రోజుల్లో - అమ్మా-నాన్న అభిమానంగా తలుచుకునే కమలాకర కామేశ్వర్రావు పౌరాణికాలు, విజయావారి సినిమాలు, విఠలాచార్య జానపద-విన్యాసాలు - ఆ తర్వాత శంకరాభరణం నుంచి శుభసంకల్పం దాకా కాశీనాథుని విశ్వనాధుల స-కారాద్య-చిత్ర-పరంపర - ముళ్ళపూడి రాశారని, బాపు గీశారని చూసిన బొమ్మలు - ఇంకొన్నాళ్ళు రాజేంద్ర ప్రసాద్ పేరు చూసి వెళ్ళిన సినిమాలు - అన్నజింక కిష్టమని చూసిన సిద్ధార్థ, మహేష్‌బాబు సినిమాలు - నవ్విస్తాడని నరేష్ సినిమాలు - నచ్చుతాయని నాని సినిమాలు - రమ్యంగా వుంటాయని రాజమౌళి సినిమాలు - ఇలా రకరకాల కారణాలకు ఏక-హీరో / ఏక-దర్శక సినిమాలు చూసే - మేము చూసే - ఇంకో ఏక-హీరో సినిమాలు రవితేజావి కూడా.
ఇడియట్టుతో మొదలుపెట్టి కిక్కు దాకా బానే చూశాం - దరువు దెబ్బేసేసింది. అదుగో... అప్పణ్ణుంచీ ఇప్పటిదాకా - దడుపు జ్వరం వచ్చినవాళ్ళలా మళ్ళీ రవితేజా-సినిమా పేరెత్తలేదు మేం.
కిందటి గురువారం దీపావళికి నాలికకి రుచించే పులిహోర భోజనం - మరుసటి రోజు శుక్రవారం బలిపాడ్యమికి (పన్నేమీ లేదండి!) ప్రణాళికేసుకుని వేంచేద్దామనుకున్న రాజా ది గ్రేట్ సందర్శనం.
సరే - మేమనేసుకుంటే సరిపోదు కదా! బుజ్జిజింకని ఒప్పించాలి కదా!
ఎప్పట్లాగే నా సినిమా-వేడుకోలు... వాడి రాననే-జవాబు-ఇచ్చుకోలు... షరా మామూలు.
వాడిని అడిగీ-అడిగీ అలసటొచ్చి ఆఖరి అస్త్రంగా - అప్పుడెప్పుడో మా నాన్న నన్ను ఇండియా రమ్మని అడుగుతూ - 'బదరిని ఈ పాట పాడుతూ అడగనా నిన్ను పంపించమని' అంటూ గుర్తు చేసిన "మా అన్నలొచ్చారు నన్నంపుతారా" పాట నమూనాలో - ఇదిగో ఈ పాట కట్టి - బుజ్జిజింకని బతిమిలాడి ... ఒప్పించడానికి ప్రయత్నించాను.
రాక రాక వచ్చె రవితేజ సినిమా
పాపమెవ్వరు చూడకపోతె ఫ్లాపౌను సినిమా
మొత్తానికి - ఆఫీసైన వెంటనే ఐదింటికి మొదలుపెట్టి ఏడున్నర అయేటప్పటికి -
రాత్రి తొమ్మిదిగంటల-ఇరవై షోకి బయల్దేరేటప్పటికి పావుతక్కువ తొమ్మిది అయింది.
వెళ్ళేటప్పటికి పది-నిముషాలు సినిమా అయిపోయింది.
ఆ తర్వాతి పదినిముషాల్లో - ప్రతి సినిమాలో పదినిముషాలే వుండే కనకాల వారి వారసుడు - పదంకెలు లెక్కపెట్టి పనైపోయిందన్నట్టు - సినిమాపాత్రావతారం చాలించాడు. అతని వెనకాలే ఇంకో పదంకెలు లెక్కపెట్టే లోపు ప్రకాష్ రాజ్ కూడా పాత్రను పరమాత్మ పరం చేశాడు.
తన తమ్ముడిని చంపించిందన్న పగ తీర్చుకోవాలనుకుంటున్న విలన్ బారి నుంచి హీరోయిన్ని రక్షించాలంటే ఎవరో ఒకరు రావాలి అనుకున్న వేళ - హీరో ఎంట్రీ.
అన్ని కథలకన్నా ఇదో వెరైటీ కథ ఎలా అయిందంటే హీరో అందమైన-అంధుడు - పైగా కళ్ళు కనిపించకపోయినా ఇన్విన్సిబుల్ అయినవాడు.
హీరో- హీరో వాళ్ళమ్మ పదేపదే చెప్పినట్లుగా - He is blind, but he is trained - తన చెవులతో విని, చేతులతో ముట్టుకొని - కాళ్ళ కింద ఉన్న నేల, చుట్టూ ఉన్న గాలి - మాత్రమే కాకుండా - చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని, మనుషుల్ని తన అధీనంలోకి తెచ్చుకోగలిగినవాడు - అందమైన అంధమైన హీరో - అంధీరో.
ఆట్టే కథ చెప్పేయకుండా ఈ అబ్సర్డిస్ట్ కామెడీ సినిమాలో నాకు ఒప్పినవి చెప్పాలంటే:
1) మొదటగా చాలా రోజుల తర్వాత హీరోగా వచ్చిన రవితేజా - తన హడావిడి ఏక్షన్, డాన్సులు.
2) తండ్రి (హీరో) చిన్నప్పటి పాత్రలో నటించిన రవితేజ-తనయుడు.
3) రవితేజా తల్లిగా చేసిన రాధిక.
4) క్లీన్-కామెడీ చేసిన శ్రీనివాసరెడ్డి.
5) ఒక పాటలో కనిపించినట్టనిపించిన డాన్స్ డైరెక్టర్ రాజు సుందరం (సినిమాల్లో అస్సలేమాత్రం ఊహించనప్పుడు - కథకే మాత్రం సంబంధం లేని వాళ్ళు ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోయే ఇలాంటి చమక్కులంటే నాకిష్టం)
6) ఇంకో పాటలో - హీరోయిన్‌తో పాటు మెరిసిన - ఇంకో హీరోయిన్ రాశీఖన్నా (ఈ అమ్మాయింకో చమక్కు - నచ్చడానికి అంతకన్నా కారణమింకోటేమీ లేదు) - వాళ్ళిద్దరూ వేసుకున్న లేతరంగుల పరికిణీలు-ఓణీలు.
7) 'ఆట్టే నటించేస్తానని ఊహించేసుకోకండి' అంటున్నట్టు - అంటూనే అలానే ఉంటున్నట్టు - 'నేను రాయిని - నాకు ఫీలింగ్స్ వుండవు' - అంటూ ముందే disclaimer ఇచ్చేసిన హీరోయిన్ మెహరీన్. ముందుగానే చాలా low-expectation సెట్ చేస్తున్నట్టుగా మాట్లాడినా - మరీ రాయిలా ఉండకుండా - మరీ సినిమా అంతా కాకపోయినా అక్కడక్కడైనా సీనుకి తగ్గట్టుగా నటించడం.
8) "ప్రసాదూ!" అని పిలిచి inter-era ప్రశ్నలడిగి వాటికి contemporary సమాధానాలు చెప్పిన రాజేంద్రప్రసాదుని బాదేసిన తల్లి అన్నపూర్ణ.
9) ఆవిడ ఎందుకలా బాదుతోందో - అలా బాదకుండా ఉండాలంటే - ఎలాంటి సమాధానం చెప్పాలో చెప్పిన రవితేజా లాజిక్కు.
10) Google maps ని ప్రమోట్ చేసిన పధ్ధతి.
11) కళ్ళు లేకపోయినా పర్వాలేదు - అసలుండాల్సింది కాన్ఫిడెన్ అన్న సినిమా-సందేశం.
12) రవితేజాని జాలి కలిగేలా కాక జాలీగా చూపించిన తీరు.
ఇంకెప్పటికీ తెలుగు సినిమా మారదని ఇంకొక్కసారి నొక్కి-వక్కాణిస్తూ అక్కజ పరచిన నిక్కమైన విషయాలు:
1) కళ్ళ-బలం, కాళ్ళ-బలం ఉన్న పోలీసులతో పోటీపడి కళ్ళులేని-హీరో చెవులతో ఆడి కబడ్డీ గెలవడం అనే విషయాన్ని నోరెత్తకుండా చూసే సినీ-సహనం నాకు సైతం అలవడడం.
2) మామూలు పోలీస్ కానిస్టేబులైన హీరోతల్లికి లేక్-వ్యూ ఉన్న ఇల్లు ఉండడం.
3) మామూలు పోలీస్ కానిస్టేబులైన హీరోతల్లి ఐజీకి ఆదేశాలు ఇవ్వడం - "పదండి సర్ - నా కొడుకు పడతాడు ఈ విలన్ పని" అంటూ.
4) పోలీసుల కన్నా హీరో ట్రైనింగ్ మిన్నగా ఉండడం.
5) ఏ ఆధారం లేకుండా హీరో వేగంగా వెళ్ళే (లేక వెళ్తోందని అనుకోవాల్సిన) ట్రెయిన్ మీద నించుని - Google maps సహాయంతో తను దిగాల్సిన చోట్లో దొరికిన స్తంభం పట్టుకుని సరిగ్గా దిగడం.
6) చెయ్యి నరం తెగిన తల్లిని కళ్ళు లేని హీరో సరిగ్గా ఇరవై నిముషాల్లో కనుక్కుని హాస్పిటల్లో చేర్చీ చేర్చగానే రెండ్రోజుల్లో ఆవిడ కోలుకోవడం.
7) ప్రతి సినిమాలో లాగే - ఒక్కసారిగా మీదపడి హీరోని కొట్టకుండా - అదేదో క్యూ-పద్ధతి మీద గౌరవం ఉన్నవాళ్ళలా విలన్లు ఒక్కొక్కళ్ళు వెళ్ళికొట్టించుకోవడం.
8) డార్జిలింగ్ వెళ్తున్నట్టు చూపించే సీనులో Air-India (అంతర్జాతీయ) విమానం చూపించడం - Indian Airlines (Domestic) బదులు.
ఎప్పట్లాగే పట్టించుకోని విషయాలు (పట్టించుకుంటే సిన్మా చూసిన ఫలితం ఉండదుకాబట్టి):
1) అర్థం-పర్థం లేని Bank దోపిడీ సీను.
2) హాస్యం పేరుతో ఊరికే చెంపదెబ్బలు కొట్టుకునే నటీ-నటులు.
3) గందరగోళంగా ఉన్న సంగీతం.
4) గుర్తు చేసుకుందామన్నా గుర్తు రాని పాటలు (ఒక్క ఎన్నియల్లో అన్న మాట తప్ప).
5) ఒక్కోచోట అవసరమైన దానికన్నా ఎక్కువ శృతిలో ఉన్న డైలాగులు.
6) ఇంకా ఇలాంటివెన్నో ఎన్నెన్నో...
మొత్తానికి ... కొంచెం భేజా-రిగ్రెట్ అయేలా
కొంచెం రవితేజాదీ trait అనేలా
ఇంతకు ముందెన్ని చూడలా అనేసేలా
పాపం! ఈ ఒక్కసారికి చూస్తే పోలా అనుకునేలా
రాజా ది గ్రేట్ అనబడే ఈ మాస్-మసాలా
అనేకానేక వచ్చీ-పోయే తెలుగు సినిమాల్లో
ఒకానొక absurdist comedy.

కలిపి ముద్దలు పెట్టే నీ కన్నతల్లీ
అడుగుతున్నది గూగుల్ సెర్చు జేసి
ఇపుడు వద్దనకు నా బుజ్జిజింకా
ఈ ఒక్కసారీ సినిమాకొస్తావా
నే...రాను నే...రాను - మీరెళ్ళి రండి
కౌచులో కూర్చున్న ఓ బుజ్జిజింకా
సిన్మాకు వెళ్దాము నువ్వు మాతో రారా
నే...రాను నే...రాను - మీరెళ్ళి రండి
అడుగుతున్నది గూగుల్ సెర్చు జేసి
ఇపుడు వద్దనకు నా బుజ్జిజింకా
ఈ ఒక్కసారీ సినిమాకొస్తావా
నే...రాను నే...రాను - మీరెళ్ళి రండి
కౌచులో కూర్చున్న ఓ బుజ్జిజింకా
సిన్మాకు వెళ్దాము నువ్వు మాతో రారా
నే...రాను నే...రాను - మీరెళ్ళి రండి
రాక రాక వచ్చె రవితేజ సినిమా
పాపమెవ్వరు చూడకపోతె ఫ్లాపౌను సినిమా
ఇపుడు వద్దనకు నా బుజ్జిజింకా
ఈ ఒక్కసారీ సినిమాకొస్తావా
ఈ ఒక్కసారీ సినిమాకొస్తావా
ఈ ఒక్కసారికే సినిమాకొస్తా ఇదే ఆఖరను
ఇంకెప్పుడూ నన్నింక రమ్మనద్దు రాలేను నేను

- బుజ్జిజింక చేత 'సరే' అనిపించగలిగాను మా- సిని-మా-ప్రయాణానికి.
రాత్రి తొమ్మిదిగంటల-ఇరవై షోకి బయల్దేరేటప్పటికి పావుతక్కువ తొమ్మిది అయింది.
వెళ్ళేటప్పటికి పది-నిముషాలు సినిమా అయిపోయింది.
ఆ తర్వాతి పదినిముషాల్లో - ప్రతి సినిమాలో పదినిముషాలే వుండే కనకాల వారి వారసుడు - పదంకెలు లెక్కపెట్టి పనైపోయిందన్నట్టు - సినిమాపాత్రావతారం చాలించాడు. అతని వెనకాలే ఇంకో పదంకెలు లెక్కపెట్టే లోపు ప్రకాష్ రాజ్ కూడా పాత్రను పరమాత్మ పరం చేశాడు.
తన తమ్ముడిని చంపించిందన్న పగ తీర్చుకోవాలనుకుంటున్న విలన్ బారి నుంచి హీరోయిన్ని రక్షించాలంటే ఎవరో ఒకరు రావాలి అనుకున్న వేళ - హీరో ఎంట్రీ.
అన్ని కథలకన్నా ఇదో వెరైటీ కథ ఎలా అయిందంటే హీరో అందమైన-అంధుడు - పైగా కళ్ళు కనిపించకపోయినా ఇన్విన్సిబుల్ అయినవాడు.
హీరో- హీరో వాళ్ళమ్మ పదేపదే చెప్పినట్లుగా - He is blind, but he is trained - తన చెవులతో విని, చేతులతో ముట్టుకొని - కాళ్ళ కింద ఉన్న నేల, చుట్టూ ఉన్న గాలి - మాత్రమే కాకుండా - చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని, మనుషుల్ని తన అధీనంలోకి తెచ్చుకోగలిగినవాడు - అందమైన అంధమైన హీరో - అంధీరో.
ఆట్టే కథ చెప్పేయకుండా ఈ అబ్సర్డిస్ట్ కామెడీ సినిమాలో నాకు ఒప్పినవి చెప్పాలంటే:
1) మొదటగా చాలా రోజుల తర్వాత హీరోగా వచ్చిన రవితేజా - తన హడావిడి ఏక్షన్, డాన్సులు.
2) తండ్రి (హీరో) చిన్నప్పటి పాత్రలో నటించిన రవితేజ-తనయుడు.
3) రవితేజా తల్లిగా చేసిన రాధిక.
4) క్లీన్-కామెడీ చేసిన శ్రీనివాసరెడ్డి.
5) ఒక పాటలో కనిపించినట్టనిపించిన డాన్స్ డైరెక్టర్ రాజు సుందరం (సినిమాల్లో అస్సలేమాత్రం ఊహించనప్పుడు - కథకే మాత్రం సంబంధం లేని వాళ్ళు ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోయే ఇలాంటి చమక్కులంటే నాకిష్టం)
6) ఇంకో పాటలో - హీరోయిన్‌తో పాటు మెరిసిన - ఇంకో హీరోయిన్ రాశీఖన్నా (ఈ అమ్మాయింకో చమక్కు - నచ్చడానికి అంతకన్నా కారణమింకోటేమీ లేదు) - వాళ్ళిద్దరూ వేసుకున్న లేతరంగుల పరికిణీలు-ఓణీలు.
7) 'ఆట్టే నటించేస్తానని ఊహించేసుకోకండి' అంటున్నట్టు - అంటూనే అలానే ఉంటున్నట్టు - 'నేను రాయిని - నాకు ఫీలింగ్స్ వుండవు' - అంటూ ముందే disclaimer ఇచ్చేసిన హీరోయిన్ మెహరీన్. ముందుగానే చాలా low-expectation సెట్ చేస్తున్నట్టుగా మాట్లాడినా - మరీ రాయిలా ఉండకుండా - మరీ సినిమా అంతా కాకపోయినా అక్కడక్కడైనా సీనుకి తగ్గట్టుగా నటించడం.
8) "ప్రసాదూ!" అని పిలిచి inter-era ప్రశ్నలడిగి వాటికి contemporary సమాధానాలు చెప్పిన రాజేంద్రప్రసాదుని బాదేసిన తల్లి అన్నపూర్ణ.
9) ఆవిడ ఎందుకలా బాదుతోందో - అలా బాదకుండా ఉండాలంటే - ఎలాంటి సమాధానం చెప్పాలో చెప్పిన రవితేజా లాజిక్కు.
10) Google maps ని ప్రమోట్ చేసిన పధ్ధతి.
11) కళ్ళు లేకపోయినా పర్వాలేదు - అసలుండాల్సింది కాన్ఫిడెన్ అన్న సినిమా-సందేశం.
12) రవితేజాని జాలి కలిగేలా కాక జాలీగా చూపించిన తీరు.
ఇంకెప్పటికీ తెలుగు సినిమా మారదని ఇంకొక్కసారి నొక్కి-వక్కాణిస్తూ అక్కజ పరచిన నిక్కమైన విషయాలు:
1) కళ్ళ-బలం, కాళ్ళ-బలం ఉన్న పోలీసులతో పోటీపడి కళ్ళులేని-హీరో చెవులతో ఆడి కబడ్డీ గెలవడం అనే విషయాన్ని నోరెత్తకుండా చూసే సినీ-సహనం నాకు సైతం అలవడడం.
2) మామూలు పోలీస్ కానిస్టేబులైన హీరోతల్లికి లేక్-వ్యూ ఉన్న ఇల్లు ఉండడం.
3) మామూలు పోలీస్ కానిస్టేబులైన హీరోతల్లి ఐజీకి ఆదేశాలు ఇవ్వడం - "పదండి సర్ - నా కొడుకు పడతాడు ఈ విలన్ పని" అంటూ.
4) పోలీసుల కన్నా హీరో ట్రైనింగ్ మిన్నగా ఉండడం.
5) ఏ ఆధారం లేకుండా హీరో వేగంగా వెళ్ళే (లేక వెళ్తోందని అనుకోవాల్సిన) ట్రెయిన్ మీద నించుని - Google maps సహాయంతో తను దిగాల్సిన చోట్లో దొరికిన స్తంభం పట్టుకుని సరిగ్గా దిగడం.
6) చెయ్యి నరం తెగిన తల్లిని కళ్ళు లేని హీరో సరిగ్గా ఇరవై నిముషాల్లో కనుక్కుని హాస్పిటల్లో చేర్చీ చేర్చగానే రెండ్రోజుల్లో ఆవిడ కోలుకోవడం.
7) ప్రతి సినిమాలో లాగే - ఒక్కసారిగా మీదపడి హీరోని కొట్టకుండా - అదేదో క్యూ-పద్ధతి మీద గౌరవం ఉన్నవాళ్ళలా విలన్లు ఒక్కొక్కళ్ళు వెళ్ళికొట్టించుకోవడం.
8) డార్జిలింగ్ వెళ్తున్నట్టు చూపించే సీనులో Air-India (అంతర్జాతీయ) విమానం చూపించడం - Indian Airlines (Domestic) బదులు.
ఎప్పట్లాగే పట్టించుకోని విషయాలు (పట్టించుకుంటే సిన్మా చూసిన ఫలితం ఉండదుకాబట్టి):
1) అర్థం-పర్థం లేని Bank దోపిడీ సీను.
2) హాస్యం పేరుతో ఊరికే చెంపదెబ్బలు కొట్టుకునే నటీ-నటులు.
3) గందరగోళంగా ఉన్న సంగీతం.
4) గుర్తు చేసుకుందామన్నా గుర్తు రాని పాటలు (ఒక్క ఎన్నియల్లో అన్న మాట తప్ప).
5) ఒక్కోచోట అవసరమైన దానికన్నా ఎక్కువ శృతిలో ఉన్న డైలాగులు.
6) ఇంకా ఇలాంటివెన్నో ఎన్నెన్నో...
మొత్తానికి ... కొంచెం భేజా-రిగ్రెట్ అయేలా
కొంచెం రవితేజాదీ trait అనేలా
ఇంతకు ముందెన్ని చూడలా అనేసేలా
పాపం! ఈ ఒక్కసారికి చూస్తే పోలా అనుకునేలా
రాజా ది గ్రేట్ అనబడే ఈ మాస్-మసాలా
అనేకానేక వచ్చీ-పోయే తెలుగు సినిమాల్లో
ఒకానొక absurdist comedy.
"...... Air-India (అంతర్జాతీయ) విమానం చూపించడం - Indian Airlines (Domestic) బదులు."
రిప్లయితొలగించండి----------------------//.........................
ఇప్పుడు ఇండియన్ ఎయిర్-లైన్స్ కంపెనీ లేదండి. ఒక ఐదారేళ్ళ క్రితం ఎయిర్ ఇండియా లో విలీనం చేశారు. అందువల్ల, చాలా ఇంపాసిబుల్ ఫీట్లు అతితేలికగా చూపించే మన సినిమా వారికి కూడా ఇప్పుడు ఇండియన్ ఎయిర్-లైన్స్ విమానం చూపించడం వీలుకాదు పాపం (కథాకాలం అప్పటిదయ్యుండి, వాళ్ళ దగ్గర విమానంది ఏదన్నా పాత ఫైల్ ఫొటో ఉంటే తప్ప).
మన సినిమా ల మీద మీకు చాలా అంచనాలున్నట్లున్నాయే! దూసుకెడుతున్న బులెట్ మీదకి హీరో గారు కత్తి విసిరి బులెట్ ని నిలువుగా చీల్చి ఆ రెండు బులెట్ ముక్కలూ ఇద్దరు ప్రత్యర్ధులకు తగిలేట్లు చేసినట్లు చూపించిన ఘనమైన సినిమాలు మన సినిమాలు. దానితో పోలిస్తే మీరు చెప్పిన తతిమ్మా ఫీట్లు / హీరోయిక్స్ ఏపాటి?
రవితేజా ది ఓవరాక్షన్ అనే నేను భావిస్తాను - "సింధూరం", మరో రెండు మూడు సినిమాలు మినహాయించి. "మాస్ మహారాజా" అని స్వయంప్రకటిత బిరుదు తగిలించుకున్న తరవాత మరీ ఎక్కువైంది.
ఓహ్ - అయితే ఇప్పుడు Air India - Domestic Flights వున్నట్టున్నాయి. పాపం! - సినిమా వాళ్ళు సరిగ్గానే చూపెట్టారు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు
తొలగించండి"ప్రతి సినిమాలో లాగే - ఒక్కసారిగా మీదపడి హీరోని కొట్టకుండా - అదేదో క్యూ-పద్ధతి మీద గౌరవం ఉన్నవాళ్ళలా విలన్లు ఒక్కొక్కళ్ళు వెళ్ళికొట్టించుకోవడం" ...
రిప్లయితొలగించండిమరొకటి కూడా ... మాటకు ముందు ఎక్కడినుంచి కావాలిస్తే అక్కడ్నించి తుపాకులు తీసి కాల్చేసే విలన్లు, వాళ్ళ అనుచరులూ హీరో వచ్చినప్పుడు మాత్రం ఒక్క దెబ్బతో కాల్చి పారెయ్యరు. ఆశ్చర్యంగా వొందల మంది ఉండి కూడా ఒక్కడి దగ్గర కూడా గన్ ఉండదు. ఒక్కడూ కాల్చడు. మీరన్నట్లు వరసలో తన్నులు తినే వాళ్ళే. అప్పుడప్పుడు, లేదంటే ప్రతి క్లైమాక్స్ లో, ఇనప రాడ్లు వగైరాలతో ఒళ్ళంతా కుళ్ళబొడిచిన తర్వాత కూడా హీరో భయంకరంగా అరిచి చివరి క్షణంలో లేచి వందమందినీ తుక్కు రేగ్గొట్టడం ... అబ్బో ఎన్ననిలేండి ...
:)
కదండీ, ఱావుగారూ :)
తొలగించండిమరీ ఇట్టా తిడతన్నారో పొగడతన్నారో తెలీకండా అబ్సర్డిస్టు రివ్యూ రాసి మా మొహాన్న పడేస్తే ఎట్టాగండీ!
రిప్లయితొలగించండిమాలాంటి ట్యూబులైట్లకి గ్నానోదయం అవ్వాలంటే ఇట్టా సెప్తే ఎక్కదు మ్యాడం- కూసింత క్లారిటీ గావాల!
తిట్టలేదు, పొగడలేదు - అనిపించింది రాశానంతే :) అబ్సర్డిస్ట్ సినిమా కదండీ - అబ్సర్డిస్ట్ రివ్యూనే పుడుతుంది. మీ కమెంట్‌కి థాంక్స్!
తొలగించండిఆహా ఎంత నిక్కచ్చి నిజాయితీ రివ్యూ అండీ.. వేస్కోండో వీరతాడు :-) మా రోజుల్లో పిల్లలం పెద్దాళ్ళని బతిమిలాడి సినిమాకి లాక్కేళ్ళేవాళ్ళం... ఏంటో కలికాలం ఇపుడంతా రివర్స్ ఐపోయింది :-)
రిప్లయితొలగించండిఆహా! నా బ్లాగుకి మొట్టమొదటి వీరతాడు. మీరెవరో అసమదీయుల్లా తోసుతున్నారు - ధనయవాదాలు, ధనయవాదాలు :)
తొలగించండిమరే... కలికాలం! నేనూ కాళ్ళా-వేళ్ళా పడి సినిమాలు చూశాను చిన్నప్పుడు - ఇప్పుడు చూపించడానికి కాళ్ళా-వేళ్ళా పడాల్సొస్తోంది.
ఎంతమాట ఇదే మొదటి వీరతాడా.. అన్యాయం సుమండీ.. అసలు మీరు రన్ చేసే ఒక్కో సిరీస్ కీ ఒక్కో వీరతాడు వేయచ్చు.. ఇక మీరు చేసే కొంగొత్త పదప్రయోగాలను ఘటోత్కచుల వారు చూస్తే.. "అవునవును ఎవరూ పుట్టించకండా మాటలెలా పుడతాయ్.." అని రెండ్రెండు వీరతాళ్ళు వేసేవారు :-)
తొలగించండిGood one Lalitha garu. Memu kuda chala sarlu, "evaru chudakapothe papam ela" anukoni movie ki vellaamu. I could relate your article in many places. Mee kaburlu chala baguntayi, meeru maatlaadutunnanta sahajam ga.
రిప్లయితొలగించండిThanks for your nice words, Bandhavi :)
తొలగించండిమీరేం అనుకోకపోతే,చిన్న పన్😃 ---
రిప్లయితొలగించండిabsurdEST కామెడీ అనబోయి కొంచెం మొహమాటపడి absurdist కామెడీ అనెయ్యలేదు కదా🤔?!? 😁
అబ్బే - అల్లాంటి మొహమాటమేమీ లేదండి - ఇంతకన్నా absurdEST సినిమాలు వున్నాయి - కాకపోతే నేను అన్నీ చూడను కాబట్టి పోల్చి absurdest అనలేను కాబట్టి absurdist తో సరిపెట్టాను.
తొలగించండిపన్నులని నేనసలు ఎన్నను కాబట్టి మీరు పన్నులు ఎన్ని మన్నికగా అన్ననూ నేనేమీ అనుకొనను
👍👍
తొలగించండి'ర''ల'యోరబేధః (ట) (సంస్కృతంలో)
'i''e'యోరబేధః (కొన్ని absurdist సినిమాల వరకు)😊
రిప్లయితొలగించండికాళ్ళావేళ్ళపడంగ నాడు సినిమా కైదుడ్డు లిచ్చేరు మా
నోళ్ళన్నానినపాటలే భళిభళీ నోచెన్ జిలేబీయమై!
కాళ్లావేళ్ళను పిల్లలన్ పడితిమీ కాలమ్ము జూపన్ సుమా
మళ్ళీచిత్రజగత్తులన్, బుడతలే మాపెన్నిధీ, హా! బలీ :)
జిలేబి
Hey , lalitha .. nice article on ravi teja’s movie .. intha fast ga movie chusesi blog ✍kuda raasesaaru .. kudos 👏
రిప్లయితొలగించండిThanks Siri 😀
తొలగించండిReview ni kuda intha chakaga comedy ga raayochu anetatlu raasaru
రిప్లయితొలగించండిThanks Sarada - for taking time to read my blog and commenting!
తొలగించండిఅందమైన అనకండి .
రిప్లయితొలగించండిబుజ్జి జింకలు భయపడేలా ఉంటేనూ .
పాపం లెండి... తెలుగు సినిమా ప్రకారం "హీరో అందముగా నుండును" అని కదా సిని-మా(యా)-నుడి. అందుకని అలా రాశానన్నమాట. మీ కమెంటుకి థాంక్స్!
తొలగించండి