అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితం దొరికేదట - లెగో తాజ్‌మహల్ (Lego 10189).
ఎప్పుడు గూగుల్లో వెతికినా - Discontinued by manufacturer అనే కనిపించేది.
లెగో-అభిమానుల నలరించి వారితో హార్దిక్య-వృద్ధికో, లేకపోతే ఈ హాలిడే సీజన్లో తన ఆర్థికలబ్ధికో - నవంబర్ నెల 27న మళ్ళీ కొత్త తాజ్‌మహల్ విడుదల చేస్తున్నాం - కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అమ్ముతాం - అంటూ ప్రకటించింది లెగో.
ఆ వార్త చదివిన దగ్గర్నుంచీ నవంబర్ 27 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులు.
ఈలోగా నేను చేసిన ఇంకొక పని ఏంటంటే బదరికి చెప్పి - తాజ్‌మహల్ - కొనుక్కోవడానికి కావల్సిన ఫండ్స్ శాంక్షన్ చేయించుకోవడం.
ఇంట్లో వున్నప్పుడు బుజ్జిజింక ఎదురుగుండా అడిగితే - తను "హన్నా! ఇప్పుడొద్దు" అంటే - ఎంత పెద్ద disappointment కదా! అందుకని - ఒక సాయంత్రం వాకింగ్ కని వెళ్ళినప్పుడు - ఇల్లు దాటి రెండడుగులు వేశామో లేదో - మళ్ళీ చెప్పడానికి అవకాశం వస్తుందో రాదో అన్నట్లు - "బావా! నవంబర్ 27 న లెగో తాజ్‌మహల్ రిలీజ్ చేస్తున్నారు - దాదాపు పదేళ్ళ తర్వాత. ఇప్పుడే చెప్తున్నాను - నేనది ఆర్డర్ చేయబోతున్నాను - మీరు నాకు అవునని చెప్పాల్సిందే!" అని గబగబా చెప్పేశాను.
ఎప్పట్లాగే - ఒక చిరువ్వుతో - "నీకు, బుజ్జిగాడికి కాదని చెప్పే అవకాశం నాకెప్పుడిచ్చారు మీరు. కానీయండి" అన్నారు.
ఆ తర్వాత నా నడక నేలకు అరంగుళం పైన అని వేరే చెప్పక్కర్లేదు :)
ఆ ఇరవైఏడు రానే వచ్చింది.
పొద్దున్నే ఏడున్నర గంటలకు లెగోడాట్కాంలో తాజ్‌మహల్ (Lego 10256) కొనబోతే అప్పటికే Backorder (temporarily out of stock) చూపిస్తోంది.
అది చూడగానే ఒక్క నిముషం - "అయ్యో! ఎవరో లెగో-భిమానులు రాత్రి డేట్ 26 నుంచి 27కి మారగానే కొనేసుకుని వుంటారు. నేను కూడా పన్నెండింటి దాకా ఉండి ఆర్డర్ చేసి పడుకోవాల్సింది. ఇప్పుడింక కొందామన్నా దొరుకుతుందో లేదో" అనుకుంటూనే backorder చేశాను.
వెంటనే - మా దగ్గర తాజ్‌మహల్ కొన్నందుకు ధన్యవాదాలు అంటూ ఒక ఈ-మెయిలు, దాని వెనకాలే ఇంకో ఐదు నిముషాల్లో - మీరు కొన్నది temporarily out of stock కాబట్టి పంపించడం ఆలస్యం అవుతుంది, ఈ అసౌకర్యానికి మన్నించండి అంటూ ఇంకో ఈ-మెయిలు - లెగోవారినుంచి.
మొత్తానికి డిసెంబర్ ఆరు నాటికి అంకెలారా 5, 923 బ్లాకులున్న లెగో తాజ్‌మహల్ మా ఇంటికి చేరింది. దాంతో పాటు రెండు ఉచిత బహుమతులు - ఒకటి Nutcracker, ఇంకోటి బోల్డన్ని లెగో డబ్బాలు పట్టే లెగో-పాలియెస్టర్ సంచీ.
బుజ్జిజింక, నేను - శీతాకాలపు సెలవుల్లో build చేద్దాం అని ఓ పక్కన పెట్టాం - మా కొత్త లెగో-తాజ్‌మహల్‌ని.
అప్పుడే బదరి చెప్పారు - అన్నజింక సెలవులకి ఇంటికి వచ్చాక అందరూ కలిసి చెయ్యండి అని.
అన్నజింక వచ్చాడు.
21 నుంచీ బుజ్జిజింకకూ, నాకు సెలవులు కూడా వచ్చాయి.
డిసెంబర్ 22 న మొదలుపెట్టి - ముగ్గురం కలిసి - ముక్కా ముక్కా చేర్చి - రెక్కా రెక్కా (wing of the build) పేర్చి - మూడు మూళ్ళ-తొమ్మిది గంటల పైన ఇంకో మూడిరవైలు - అరవై నిముషాలు - అంటే మొత్తం మీద నాలుగు రోజుల్లో పదిగంటలు వెచ్చించి - ఈరోజుకి అంటే డిసెంబర్ 25కి మా లెగో-తాజ్‌మహల్ కట్టడం పూర్తి చేశాం.
మొదటి రోజుకి బేస్ మాత్రం పూర్తి చేయగలిగాం.
దీనికి ముందు ఎన్నో లెగో సెట్లు పూర్తి చేసినా, దీంతర్వాత ఇంకొన్ని చేయబోతాం అనుకున్నా - ఈ తాజా తాజ్ సెట్టుకి ఒక ప్రత్యేకత వుంది.
గత తొమ్మిదేళ్ళుగా బుజ్జిజింక, నేను బోల్డన్ని లెగో సెట్లు build చేసినా ఎప్పుడూ మాతో చేరే వీలు కుదరని అన్నజింక ఈసారి మా ఇద్దరితో కలిసి ఈ తాజ్‌మహల్ build చేశాడు. చేస్తున్నంతసేపూ దాన్ని డిజైనర్లని (లెగో) మెచ్చుకుంటూనే వున్నాడు.
పూర్తయిన తర్వాత కూడా పదేపదే - దాని ముందు నించుని - "ఎంత బావుంది కదా!" - అని తెగ ముచ్చట పడుతున్నాడు.
ఎప్పట్నుంచో లెగో-కబుర్లు రాద్దామనుకుంటున్నా కుదరలేదు.
ఈ రోజిలా - అన్ని విధాలా ప్రత్యేకమైన ఈ తాజ్ build గురించి రాయగలగడం బావుంది.
బోల్డన్ని లెగో కబుర్లకి
ఈ పోస్ట్ ఒక లెట్-గో
కబుర్లు చెప్తూ లెగో కడుతూ -
లెట్స్ గో, లెగో!

తాజమహల్ నిర్మాణానికి బ్లాకులు పేర్చిన వీరులెవ్వరు? :-)
రిప్లయితొలగించండిఇద్దరు జింకలు, వాళ్ళమ్మ :)
తొలగించండిఓపిక అంటే ఏమిటి అని పిల్లలెవరైనా అడిగితే మిమ్మల్ని చూపెట్టాలి. కట్టడాన్ని పిల్లలతో చాలా శ్రమపడి చేశారు. very engaging activity with kids.
రిప్లయితొలగించండిమీ మెచ్చుకోలు వ్యాఖ్యకి ధన్యవాదాలు, అన్యగామిగారు!
తొలగించండిBeautiful. On many levels
రిప్లయితొలగించండిThanks for your comment, Sir!
తొలగించండిమీ తాజ్ మహల్ చూసి నేను ఆర్డర్ చేసి చేసేద్దాం అన్న ఉత్సహంతో ఉన్నాను మూడు నెలలనుంచీ :)
రిప్లయితొలగించండికొని - కట్టేసి - ఫోటో పంపేయండి మరి :)
తొలగించండి