హంపి ... ఆ పేరు విన్నప్పుడల్లా ఏదో చెప్పలేని fascination.
హంపి అంటే.... నావరకు నాకు....
చిన్నప్పుడు చరిత్ర పాఠాల్లో చదువుకున్న హంపి విజయనగరంలో కుందేళ్ళు వేటకుక్కలను తరిమిన వైనం ...
పాఠంలా కాకుండా చారిత్రిక నవలలా చదువుకున్న Non-detailed Text Book "విశ్వనాథ నాయకుడు" కథ ...
ముత్యాల తలపాగా పెట్టుకుని భువనవిజయంలో "తిలకాష్ఠ మహిషబంధనం" అంటే ఏంటో విప్పిచెప్పిన తెనాలి రామకృష్ణుడి కొంటె తనానికి గుబురుమీసాల చాటు నుంచి ముసిముసినవ్వులు నవ్విన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడే సాహితీ సమరాంగణ సార్వభౌముడూ అనేసుకోవడం...
మహామంత్రి తిమ్మరుసుని దోషిగా నిలబెట్టి "చరిత్ర ఎరుగని మహాపాతకం మా దేశానికి పట్టినదా?" అంటూ కుమిలిన నటసార్వభౌముడితో పాటు తెలీకుండానే గొంతులో పట్టేసిన దుఃఖం తెలియడం...
బెంగుళూరు నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళిన ప్రతి సారి పెనుగొండ అన్న ఊరి పేరు చూసి ఇది కూడా మన శ్రీకృష్ణ దేవరాయలు కాలూనిన ఊరే అని మురిసిపోవడం...
శ్రీకృష్ణ దేవరాయలు - ఆముక్తమాల్యద - భువనవిజయం - అష్ట దిగ్గజాలు - ఏకశిలారథం - విరూపాక్ష ఆలయం - హజార రామాలయం - తుంగభద్రా నది...ఈ పేర్లు తలచినంత మాత్రాన "నీ పేరు తలచిన చాలు... మదిలో పొంగు జయ తుంగభద్రా తరంగాలు..." అని పాట మార్చి మరీ పాడుకోవడం...
అలాంటి హంపి విజయనగరం ఒకే ఒక్కసారి చూడగలిగాను - బీహెచ్‌లో ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు excursion కని హంపీకి వెళ్ళినప్పుడు.
ఇంటి దగ్గరే ఎంచుకుని మరీ పట్టుకెళ్ళిన పచ్చిమామిడి కాయ రంగుకి గులాబీ అంచున్న పట్టు పరికిణీ వేసుకుని మాత్రమే తుంగభద్రని చూడాలీ, ఏకశిలారథం తాకాలీ అనుకుని అదే పరికిణీ కుచ్చిళ్ళ అంచుల్లో తుంగభద్ర నీటి ముత్యాల్ని కూర్చుకుని, వాటికి జోడింపుగా ఏకశిలారథ ప్రాంగణపు సైకతమణుల్ని పేర్చుకుని ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు నడిచిన దారుల్లో నడుస్తున్నానని ఎంత మురిసిపోయానో! భువనవిజయపు ఆనవాలు కోసం ఎంతగా వెతుక్కున్నానో!
అది అప్పటి మాట.
నాలాగే బదరికి కూడా హంపి అంటే చాలా ఇష్టం. తనూ నాలాగే డిగ్రీ చదివే రోజుల్లో హంపి వెళ్లొచ్చారు. కాకపోతే తన ఇష్టం కాలేజ్ రోజుల్లో excursion వెళ్ళి రావడం, ఆ జ్ఞాపకాలతో మురిసిపోవడం దగ్గర ఆగిపోలేదు. Google Books లో కనిపించిన A Forgotten Empire, Vijayanagar అన్న పుస్తకం చదివి, దాన్ని ప్రింటులో దక్కించుకోవడం దాకా సాగింది.
అలా హంపి కథ పుస్తకమై నా చేతిలో వాలింది.
2014లో ఈ పుస్తకం చదివినప్పుడు మాత్రం అంత మంచిగా అనిపించలేదు - అలా అనిపించకపోవడానికి కారణం - రాజులూ, రాజ్యాల మధ్య జరిగిన రక్తపాతానికి హంపి కేంద్రమయిందని Nuniz, Firishtah, Briggs లాంటి చరిత్రకారులు రాసినవి చదవలేక చదువుతూ A Forgotten Empire పూర్తి చేశాను.
అలా చదివినప్పుడు అంతటి "drank the sherbet of martyrdom" లాంటి రాతల మధ్య ఒక అందమైన అమ్మాయి ప్రసక్తి - ఒకట్రెండు పేజీలదే - ఆసక్తిగా అనిపించింది.
Firishtah మాటల్లో "There resided in th town of Mudkul a farmer, who was blessed with a daughter of such exquisite beauty, that the Creator seemed to have united all his powers in making her perfect." అంటూ మొదలయ్యే పెర్తల్ అన్న పేరున్న ఆ అమ్మాయి పరిచయం చదివినప్పుడు భలే అనిపించింది. ఆ అమ్మాయి వల్లే యుద్ధం కూడా జరిగిందని ఆ తర్వాత పేరాల్లో చదివినప్పుడు, ఇంక ఆ తర్వాత ఎక్కడా పెర్తల్ ప్రసక్తి ఎక్కువగా లేనప్పుడు "అరె! ఈ పెర్తల్ ఎవరో, ఆ యుద్ధం ఎలా, ఎందుకు జరిగిందో తెలిస్తే బావుండును" అనుకున్నాను.
Firishtah పెర్తల్ అని పిలిచిన ఆ అమ్మాయినే Briggs నేహల్ అని పిలిచాడని foot-note లో చదివి - విజయనగరాన్ని Beejanuggur అని రాసిన ఈ విదేశీ చరిత్రకారుల కలాల్లో "పెర్తల్, నేహల్" గా మారిన ఆ అందమైన అమ్మాయి అసలు పేరేంటా అని అనుకున్నాను. అంతకు మించి వివరాలు ఎక్కడా దొరక్క ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను.
ఆ తర్వాత నాలుగేళ్ళకు నా బ్లాగులో రాసుకున్న గాలికబుర్లలో కొన్నిటిని పోగుచేసి "బోల్డన్ని కబుర్లు" గా అచ్చు వేసినప్పుడు ఒక పుస్తకాన్ని కాలిఫోర్నియాలో వున్న గొర్తి సాయి బ్రహ్మానందం గారికి పంపించాను. మరి 2017-తానా సమావేశాల్లో ఆయన రాసిన నవల అంతర్జ్వలన అడిగి మరీ తీసుకోవడమే కాకుండా మా ఊరి తెలుగు పుస్తకప్రియులు అమృతరెడ్డిగారికి కూడా ఇప్పించాను కదా!
నేనలా నా "బోల్డన్ని కబుర్లు" పంపించగానే బదులుగా సాయి బ్రహ్మానందం గారు తను రాసిన చారిత్రిక నవల "నేహల" పంపించారు.
ఆ పుస్తకం చూడడానికే ఎంత అందంగా ఉందో! పైగా అందులో అంతకన్నా అందమైన book-mark.
ముందు పక్కే కాదు వెనక కవర్ కూడా అంతే అందంగా వుంది.
అసలా పుస్తకాన్ని చూడగానే అంత అందంగా ఉందా!
మరి ముట్టుకోవడానికి వెన్నపూస పూసినట్టు మెత్తని స్పర్శ.
పుస్తకంలో ఒక అక్షరం చదవకుండానే నాకు భలే నచ్చేసింది.
ఆ కవర్ల మీద బొమ్మలు అంత అందంగా వేసింది ఎవరా అని చూస్తే...ఇంకెవరూ? ఆర్టులో హార్టుని నింపే హార్టిస్టు అన్వర్ గారు.
తన పుస్తకాన్ని అంత అందంగా డిజైన్ చేసుకున్నసాయి బ్రహ్మానందం గారిని బదరి భలే మెచ్చుకున్నారు. అందులోనూ తనకి చారిత్రిక నవలలు అంటే ఇష్టమేమో వెంటనే చదవడం మొదలు పెట్టేశారు. ఒక వారపు విమాన ప్రయాణంలో తనకి తోడు "నేహల". చదవడం పూర్తి కాగానే చెప్పారు "చాలా బావుంది... నువ్వూ చదువు" అని. నేనెలాగూ తనెప్పుడు పూర్తి చేస్తారా, నేను చదువుదామా అని ఎదురు చూస్తున్నాను కదా... నేనూ చదవడం మొదలు పెట్టాను.
ఇదొక రైతు కుటుంబంలో పుట్టి అల్లారుముద్దుగా పెరిగిన స్వాభిమాని అయిన ఒక అందమైన అమ్మాయి నేహల కథ.
నేహలని ప్రేమించి, నేహలచే ప్రేమించబడిన రేవన్న కథ.
నేహలని ప్రేమించి, ఆమె ప్రేమకి పాత్రుడు కాలేక రేవన్న మీద అసూయతో నేహలని రాజుల పాలు చేసిన శంభుడి కథ.
నేహలకి మంచి చేస్తున్నాననుకుని ఆమెని దేవరాయల జనానాలో బందీ చేయబోయిన వేదరాయశర్మ కథ.
నేహలని అందుకోలేక పోయిన దేవరాయల కథ.
నేహల మీద సానుభూతి వున్నా, ఏమీ చేయలేక ఆమెని రాజరికానికి బలిచేసిన మౌల్వీ గిసుదరాజ్ కథ.
"నా చేతను, నీ చేతను" అన్నట్లు వీరందరి స్వార్థాలూ, దురభిమానాల కారణంగా - తను కోరుకున్న చిన్న చిన్న ఆనందాల జీవితం దక్కక - చేతకాని హసన్ భార్య అయి అలమటించిన నేహల కథ.
ఆ కథ ఏంటో తెలియాలంటే "నేహల" నవల చదవాల్సిందే.
ఇది చదువుతుండగానే - సగంలోనే - ఇంత మంచి నవల రాసిన సాయి బ్రహ్మానందంగారికి - మెసేజ్ చేశాను "చాలా బావుందండి మీ నేహల. ఇటీవల కాలంలో contemporary తెలుగు రచయితలు రాసిన చారిత్రిక నవలల్లో నాకిది చాలా బాగా నచ్చింది" అంటూ.
అప్పుడే అనుకున్నాను ఎప్పటికైనా నేహల గురించి నా బ్లాగులో రాసుకోవాలని. నాకు నచ్చిన ఈ పుస్తకం గురించి అందరికీ చెప్పాలని.
ఈ నవలలో నాకు నచ్చిన విషయాలు చాలా వున్నాయి.
నవల మొదలుపెట్టబోయేముందు ప్రతి అధ్యాయంలో మొదటిసారిగా పరిచయం చేయబోయే పాత్రలన్నిటినీ "ప్రధాన పాత్రలు - ప్రవేశపరంగా" అని ఒక జాబితాగా ఇవ్వడం చాలా నచ్చింది.
ఇంకా ఏంటంటే కథని చాప్టర్ 1 , చాప్టర్ 2 అని విభజించకుండా ఆ కథ జరిగే ప్రదేశాల పేర్లతో - అంటే - ముద్గల్, లింగసుగూరు, హంపి విజయనగరం - అంటూ చెప్పడం చాలా బావుంది.
అలా చేయడం వల్ల పాఠకులకి ఒకే సమయానికి రెండు ప్రదేశాల్లో సమాంతరంగా జరుగుతున్న సన్నివేశాల్ని చదువుతూ, ఆ రెండిటికి మధ్య వున్న ఒక subtle connection ని ఊహించుకుంటూ చదవగలిగే వీలు కుదిరింది. ఒక్క మాటలో చెప్పాలంటే "నేహల" ఒక మంచి సినిమా కాదగిన స్క్రీన్‌ప్లేలా వుంది.
అన్నట్టు ఈ నవలలో ఒక చోట రేవన్న నేహల కోసం జయదేవుని అష్టపది "సా విరహే తవ దీనా" లో ఒక చరణాన్ని తెలుగులో రాసి ప్రేమపత్రంగా ఇస్తాడు.
"నిందతి చందనమిందుకిరణమను విందతి ఖేదమధీరం ।
వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరమ్ ॥
మాధవ మనసిజ విశిఖ భయాదివ భవదవనయా త్వయి లీనా ।
సా విరహే తవ దీనా!"
పై చరణానికి సాయి బ్రహ్మానందం గారి తెలుగు సేత... ఈ కింద... నాకైతే - "వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరమ్" కి "మలయ పవనము హలమై తోచగా లాలన చెందెను ఖేదనం" - అంత సరిగా కుదిరినట్లు అనిపించలేదు కానీ మొత్తం మీద బావుంది.
"అలరుల గంధము శీతల వెన్నెల కలతలా చెంత మదీయం
మలయ పవనము హలమై తోచగా లాలన చెందెను ఖేదనం
మాధవ తలపున పూవులు తాకెడి భావనలే మదిలోనా
నా విరహం కనలేవా?"
[లలిత ఉవాచ: ఈ అష్టపది చరణానికి నాకు తోచిన అర్థం:
కినిసి కసరితి గంధమునే, మరి శీతల కౌముదినే...
వీచు మలయ పవనము తోచె చందనతరువసిత సర్పపు విషమై...
మాధవ! బేలను...ఓర్వలేను విరిశరముల, దాగెద నీ చాటున...
దీనను...నీ దానను... విరహిణి రాధను...]
ఒక భాగం అయ్యాక తరవాతి భాగానికి వెళ్ళే ముందు - ముందు జరగబోయే కథకి హింట్ ఇస్తున్నట్లుగా రాసిన కొస మాటలు నాకు భలే నచ్చేశాయి. ఆ కొస మాటలన్నీ quotable quotes లా చాలా thought-provoking గా వున్నాయి. కొన్ని ఆలోచనలు వచన కవిత్వంలా వున్నాయి.
అవన్నీ ... ఇదిగో ఈ కింద రాసి పెట్టా... కొసలు కావివి Quotes అంటూ.
కొసలు కావివి Quotes:
"ఆవేశాన్నీ, అగ్నినీ నియంత్రించకపోతే జరిగేవి మహాప్రళయాలే!"
"ప్రతీకారానికి వివేకమూ, విచక్షణా ఉండదు."
"కష్టాలూ ఉపద్రవాలూ ఎవరికీ చెప్పి రావు. వాటిని సాదరంగా ఆహ్వానించి ధైర్యం తోనే సాగనంపాలి."
"మానవ ప్రయత్నం మీద నమ్మకం సన్నగిల్లినప్పుడే దైవత్వం మీద ఆధారపడవలసి వస్తుంది. నమ్మకం ఉండాల్సింది దేవుడి మీద కాదు, మనుషుల మీద."
"తరచి చూస్తే నమ్మకం చుట్టూనే ప్రపంచం గుండ్రంగా తిరుగుతుంది. అదే లేకపోతే ఈ ప్రపంచమే లేదు."
"స్వేచ్ఛకి తండ్రిలా అతడూ, ప్రేమకి ప్రతీకలా ఆమె."
"మార్పు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు మొదలుపెట్టాలి."
"అప్పా! మనం గ్రహించం కానీ, ఈ జీవితం చాలా చిన్నది. మనం పెద్ద పెద్ద గమ్యాలు చేరుకోడంలో చిన్న చిన్న ఆనందాలూ, కోరికలూ పక్కన పెట్టేస్తాం. తీరా అనుకున్నది సాధించాకా కోల్పోయినవి వెనక్కి తిరిగి తీసుకురాలేం."
"అధికార దాహం ముందు బంధుత్వాలూ, రక్తసంబంధాలూ పిపీలికాలు. దానికి ఎదురుగా ఉన్న సింహాసనం ధగధగలు తప్ప మరేం కనిపించవు."
"ఒక్కోసారి మన చేతలే తలరాతలుగా మారుతాయి."
"మనిషికి విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసపు వెలుగు క్రింద అహంకారం నీడ కూడా ఉంటుంది. నీడ వెలుగు కన్నా పెద్దది కాకూడదు. అది జరిగితే చివరకి మిగిలేది చీకటే!"
"ఆత్మవిశ్వాసం జాగ్రత్తని అధిగమించకూడదు. అదే జరిగితే ఎంతటి ప్రమాదమయినా రావచ్చు. ప్రమాదాలకీ, కష్టాలకీ రాజూ, పేదా అన్న తేడా ఉండదు."
"యుద్ధకాంక్షకీ, రాజ్యకాంక్షకీ కారణాలుండవు, ధ్యేయాలు తప్ప."
"కీర్తి కండూతీ, అధికార వాంఛ పెద్ద వ్యాధులు ఈ ప్రపంచంలో. అవి దరిదాపులకి రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి ఆవహించాక ఓ పట్టాన వదలవు."
"రాజకీయం రెండు వైపులా పదునున్న దుర్మార్గమైన ఆయుధం. దానికి ఒక్కోసారి సొంతవాళ్ళే బలవుతారు."
"అన్నీ అప్రయత్నంగా కదిలిపోతున్నాయి, ఒక్క కాలం తప్ప."
"నిర్లక్ష్యం నిప్పు లాంటిది. చిన్నదయినా చిట్టడివిని కూడా దహించగలదు."
"పంటి కింద పలుకూ, మెతుకూ రెండూ లేవు."
"బలమైన కోరికలకి అబద్ధమే పెద్ద ఆసరా!"
"మనుషుల్ని నమ్మాలి. విశ్వసించాలి. కానీ గుడ్డి నమ్మకమూ, గుడ్డి ప్రేమా ఎవరికయినా అనర్థదాయకమే!"
ఒక ఆశ - మరొక ఆశయం.
ఒక సాంగత్యం - ఒక స్వేచ్ఛ.
వెరసి రెండు జీవితాలు.
విధి ఎంత చిత్రమైంది?
"అవును, ప్రతి స్త్రీ ఒక పెద్ద మతం
ఒక ఇంటి నుండి మరొక ఇంటికి
ఒక ఊరి నుండి మరొక ఊరికి
ఒక కట్టుబాటు నుండి మరొక కట్టుబాటుకి
ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకి
జీవన ప్రవాహంలో విశ్వాసాన్ని మించిన శక్తి లేదు."
"సదుపాయాలు సుఖాన్ని ఇవ్వవు మౌల్వీ!"
"అహం - అధికారం
స్వేచ్ఛ - స్వాతంత్య్రం
గాలీ - నీరూ
మనిషికేం కావాలి?
స్వాతంత్య్రం ఒక ఎండమావి.
స్వేచ్ఛ ఒక మిథ్య."
ఏదో రెండు పేజీలు కూడా లేని "పెర్తల్ / నేహల్ " కథ లోంచి గొర్తి సాయి బ్రహ్మానందం గారు 365 పేజీల చారిత్రిక నవల రాయడం సామాన్యమైన విషయం కాదు. ఇంత బావున్న నవలలో - పరమాన్నంలో పటికబెల్లపు పలుకుల బదులు పలుకురాళ్ళొచ్చినట్లు - కొన్ని అచ్చుతప్పులు దొర్లాయి. వీటిని ఎత్తి చూపించడంలో ఉద్దేశ్యం "నేహల" విలువ తగ్గిద్దామని కానే కాదు. ఎంతో మంది కొని చదవబోతారు. మరెన్నో ప్రతులు ముద్రిస్తారు. అప్పుడు సరిదిద్దుకుంటారేమో అని... అంతే!
కంటిలోపడ్డ నలకలు - పంటికింద పలుకురాళ్ళు :
16 వ పేజీ: దేవరాయలకి వేదరాయశర్మంటే ఎంతో గౌరవం. గురుతుల్యుడిగా భావిస్తాడు.
17 వ పేజీ: దేవరాయల్ని చూడగానే అత్యంత వినయంతో నమస్కరించి మహారాజు కీర్తిని ప్రస్తుతిస్తూ రాగయుక్తంగా స్తుతించాడు దేవరాయశర్మ.
లలిత ఉవాచ: దేవరాయలికి వేదరాయశర్మ గురుతుల్యుడైతే 17వ పేజీలో వాక్యంలో దేవరాయల్ని చూడగానే వేదరాయశర్మ అత్యంత వినయంతో నమస్కరించడం సరి అనిపించలేదు.
19 వ పేజీ: "దేవరాయా! తరతరాలుగా మీ కుటుంబం మాకు చేసిన సేవలకి మెచ్చి ముద్గల్లు అశ్వత్థనారాయణుడి దేవాలయం దగ్గరున్న నూరు 'గ' ల భూమిని మీకు దశవంధంగా ఇస్తున్నాము. దసరా సందర్భంగా ఇది మా కానుక. మా రాజముద్ర ఉన్న తామ్రపత్రం ఇది," అంటూ వేదరాయశర్మకి అందించాడు.
లలిత ఉవాచ: ఇక్కడ "వేదరాయా" అని ఉండాలి.
129 వ పేజీ: "నేహల పొరుగింటి వాళ్లు సురేంద్ర ఇంటికొచ్చిన వాళ్లని పరిశీలనగా చూస్తూనే వున్నారు.
లలిత ఉవాచ: నేహల తండ్రి "హరీంద్ర". ఈ నవలలో "సురేంద్ర" అన్న పాత్రే లేదు.
["నేహల" నవల ప్రతుల కోసం ఎవరైనా సాయి బ్రహ్మానందం గారిని సంప్రదించాలనుకుంటే వారి ఈ-మెయిల్: gorthib@yahoo.com]

చివరగా నా మాటల్లో నేహల...
ఈ నవల నేలిన నవల
స్వేచ్ఛ కోరిన బాల
నేహల...
చరిత్రనే మాత్రం ఏమార్చక కూర్చిన
బ్రహ్మానందం గారి కథల పోహళింపు...
నేహల...
అన్వర్ గారి కుంచెలో...
ఒదిగె అందమైన ఊహలా...
నేహల...
["నేహల" నవల ప్రతుల కోసం ఎవరైనా సాయి బ్రహ్మానందం గారిని సంప్రదించాలనుకుంటే వారి ఈ-మెయిల్: gorthib@yahoo.com]

Online లో ఈ నవల ఉంటే లింక్ ఇవ్వగలరు.
రిప్లయితొలగించండిరాజేశ్వరిగారు: ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో వున్నట్ట్లు లేదండి. ఈ నవల ప్రతులు కావాలంటే గొర్తి సాయి బ్రహ్మానందం గారికి ఈ-మెయిల్ పంపించగలరు (gorthib@yahoo.com)
తొలగించండిలలిత! మీ వ్యాఖ్యానం చదివాక, ఆ నవల ఎప్పుడు చదువుదామాని ఉంది.అందులొని క్యొటేషన్స్ మీరు ఇక్కడ పొందుపరచడం అభినందనీయం. ఇప్పుడే వాటిని భద్రపరచుకున్నాను
రిప్లయితొలగించండిశాయి ప్రభాకర్
శాయి ప్రభాకర్‌గారు: మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. "నేహల" ఒక చక్కటి నవల. వీలైతే చదవండి.
తొలగించండిమీ విశ్లేషణ బాగుంది లలిత గారు.
రిప్లయితొలగించండిఅది నేహల గొప్పదనం, పవన్‌గారు. థాంక్ యూ!
తొలగించండిఈ కొటేషన్లు కాపి చేసుకుని దాచుకోడం నాకు అలవాటు, ఇదివరకు యండమూరి నవలల్లోవి, గొల్లపూడి కాలంస్ లోవి ఇలానే దాచుకున్నాను, ఇప్పుడు కూడా మా సాయి బ్రహ్మానందం గారి కోట్స్ దాచేసుకున్నాను. మీకు తెలుసా ఆయన నాకు కూడా దోస్తే.ఎప్పటిలాగే మీ రాతలు కోనసీమ గంగాబోండాం నీళ్ళలాగే ఉన్నాయి
రిప్లయితొలగించండిభలే! మా ఊరివారు మీరూ, మన పక్కూరివారు సాయి బ్రహ్మానందం గారూ దోస్తులన్నమాట!
తొలగించండినా రాతలు కోనసీమ గంగాబోండాం నీళ్ళన్న మీ పొగడ్త పంచదార పలుకులు చుట్టిన నేతి పూతరేకు :)
థాంక్యూ లలిత గారూ:
రిప్లయితొలగించండిమీరు లేవనెత్తిన కొన్ని అంశాల మీద వివరణ ఇది. ముఖ్యంగా కంట్లో నలకల గురించి.
మొదటిది:
16వ పేజీ: దేవరాయలకి వేదరాయశర్మంటే ఎంతో గౌరవం. గురుతుల్యుడిగా భావిస్తాడు.
17 వ పేజీ: దేవరాయల్ని చూడగానే అత్యంత వినయంతో నమస్కరించి మహారాజు కీర్తిని ప్రస్తుతిస్తూ రాగయుక్తంగా స్తుతించాడు దేవరాయశర్మ.
దేవరాయలకి వేదరాయ శర్మని ఎంత గురువుగా భావించినా, తాను సార్వభౌముణ్ణి అన్న అహంకారం ఉంటుంది.
వేదారాయశర్మక్కూడా దేవరాయలు రాజే. ఆ గౌరవం చూపించాలి. దేవరాయలకి ఆ రాజకీయం బాగానే తెలుసు. అందేకే పొగిడాడు.
రెండోది:
మీరు చూపించిన తప్పులు మేము అచ్చుకు ముందే చూసాము. అవి సవరించాము కూడా. కానీ అప్పటికే మొదటిసారి పంపిన ప్రతితో అచ్చు వేసేసారు.
ఏం చెయ్యలేక పోయాము. మరలా అచ్చు వేసినప్పుడు చూడచ్చులే అని అనుకున్నాం.
మీరు నేహల పుస్తకం గురించి రాయడం చాలా సంతోషం కలిగించింది. కృతజ్ఞతలు!
సాయి బ్రహ్మానందంగారూ! నమస్తే.
తొలగించండిముందుగా ...నేను ఎత్తి చూపిన చిన్నచిన్న అచ్చు తప్పుల్ని కోపం తెచ్చుకోకుండా స్వీకరించినందుకు, వివరించినందుకు, రెండో ప్రచురణలో సవరిస్తారన్నందుకు చాలా థాంక్స్.
మీ నవల చదవగానే నేను నా బ్లాగ్‌లో రాయాలీ అనుకోవడానికి ముఖ్యకారణం - మీరు రెండు పేరాల నేహల్ ప్రసక్తిని ప్రేరణగా తీసుకుని - చరిత్రని మార్చకుండా, ఏమార్చకుండా - ఇంత పెద్ద నవలగా రాయడం సామాన్యమైన విషయం కాదు. మీరు రచయితగా ఉత్తర అమెరికా వాసుల్లో చాలా మందికి తెలిసే వుంటారు. కానీ నా బ్లాగ్ చదివే స్నేహితులకి, పుస్తక ప్రేమికులకి మిమ్మల్ని ఒక మంచి సమకాలికులైన రచయితగా పరిచయం చేద్దామని. అంతే!
వీలు చేసుకుని వ్యాఖ్య రాసిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు.
ఇంత చక్కటి రివ్యూ చదివాక ఆ నావెల్ చదవాల్సిందే. థాంక్ యూ !
రిప్లయితొలగించండితప్పకుండా చదువు, శారదా!
తొలగించండినేహల Amazon లో దొరుకుతుంది.
రిప్లయితొలగించండిఇది రెండో ప్రచురణ.
మొదటి భాగంలో లలిత గారు సూచించిన సవరణలు కొన్ని చేసాము.
https://www.amazon.com/Nehala-15th-Century-Historical-Novel/dp/B08BK7GK5Z/ref=sr_1_2?dchild=1&keywords=nEhala&qid=1597641906&sr=8-2