అసలు ముందేమైందో చెప్పాలంటే: బంగారు మనసుల వంగూరి సదస్సు - 1 - ఎలా మొదలైందంటే...
నవంబర్ 2, 2019 న వంగూరి సాహితీ సదస్సులో పేరెన్నిక గన్న హేమాహేమీల్లాంటి రచయితల ప్రసంగ పరంపరలో నాకూ మాట్లాడడానికి ఒక మంచి అవకాశం దొరికింది అని సంబరపడ్డంత సేపు పట్టలేదు. అంతలోనే అసలేం మాట్లాడాలీ అని ఓ బెంగ.
ఏదో ఒక రచయితనో, రచననో ఎంచుకుని దాని మీద నా అభిప్రాయం చెప్పాలంటే అసలు నేనెవరో తెలియని వారికి నా అభిరుచుల మీద, అభిప్రాయాల మీద ఏం ఆసక్తి ఉంటుంది కదా అనిపించింది.
అసలు నాకు వంగూరి సాహితీ సదస్సుకి ఆహ్వానం వచ్చిందే నా బ్లాగులో నే రాసిన రాతల వల్ల. అందుకే నా బ్లాగ్ గురించే మాట్లాడదామనుకున్నాను.
ఎలాగూ బోల్డన్ని కబుర్లు చెప్పడం అలవాటే కాబట్టి అవే కబుర్లు వేదిక మీద కూడా చెప్పా... బ్లాగెడివి కబుర్లట... అంటూ.
ఆ కబుర్లతో పాటే వేదిక మీద నేను మాట్లాడినప్పటి వీడియో కూడా ఉంది ఆ కిందనే.
ఇప్పటికి ఇవే విశేషాలు...
అసలు సదస్సు విశేషాలు ముత్యంగా మూడో పోస్టులో ఇంకోసారి.
ఈ వంగూరి ఫౌండేషన్ వారి సాహితీ సదస్సు వేదికకి సంబంధించినంత వరకూ నా ఉనికి నా బ్లాగ్.
నన్నిక్కడిదాకా తీసుకొచ్చింది నా బ్లాగ్
నేనిప్పుడు చెప్పబోయేదీ ఆ నా బ్లాగ్ గురించే!
ఒక వేళ నేనింకేదైనా మాట్లాడబోయినా అది "ఆవు మీద వ్యాసం"లా అటు తిరిగి ఇటు తిరిగి నా బ్లాగ్ దగ్గరికే వచ్చి ఆగుతుంది.
నాకు తెలిసినవి రెండే ప్రపంచాలు: ఇంటిది, ఐటీ (IT)ది.
ఈ రెంటి మధ్యా ఇవి కాక ఇంకేదో ఆటవిడుపు కావాలనిపించింది.
అనిపించిందే తడవు బ్లాగ్ మొదలుపెట్టేశా...
అలా మొదలుపెట్టింది మొదలు రాసింది రాయకుండా రాసేద్దామని అనుకున్నా.
నా బ్లాగోత్సాహం ఒట్టి ఆరంభ శూరత్వం కాకూడదని నా మేలిసగం బదరి నాతో "అనిపించింది అనిపించినట్లు రాసేస్తే ఓ రోజు రాస్తావు, రెండ్రోజులు రాస్తావు - అప్పుడింక రాయడానికేమీ మిగలదు. అలా కాకుండా అప్పటికప్పుడు హడావిడిగా అన్నీ రాసేయకుండా అట్టేపెట్టుకు ఓ వరసలో వారానికోటి చొప్పున రాస్తే బోల్డన్ని కబుర్లొస్తాయీ... ఒకప్పటి వార్తాపత్రికల్లా రాయడానికి నీకూ, చదవడానికి నీ బ్లాగ్ చదివేవాళ్ళకీ ఓ ఎదురు చూపు ఉంటుంది" అనగానే నాకూ అదేదో బావుంది అనిపించి "వారం వారం రాయువారం" అనేసుకున్నా.
సరే! బ్లాగ్ మొదలుపెట్టేశా. అందులో ఏం రాయాలీ? ఆటవిడుపుగా రాయడం అంటే ఆడుతూపాడుతూ రాయాల్సిందే తప్ప academic గా రాస్తే అందులో సరదా ఉండదు.
అందులోనూ నా చుట్టూ వున్న ప్రపంచంలో జరిగే మామూలు సంఘటనలనీ, అప్పుడప్పుడూ జరిగే విశేషాల్నీ ఓ రెండు విభాగాల్లోకి నెట్టేసి వాటి గురించి ఆట్టే ఆలోచించకుండా ఉండడం నాకలవాటు. ఆ రెండు విభాగాలూ ఏంటంటే ఒకటి నా అదుపులో వుండి నేను ప్రయత్నిస్తే మారగలిగేవి. అంటే ఆ పూటకి వంట చేయాలా, వద్దా?, ఏం పాట పాడుకోవాలీ, ఏం సినిమా చూడాలీ - ఇలాంటివన్నమాట. రెండో రకం నా పరిధి దాటిన విషయాలు - అంటే నేనెంత మాట్లాడినా మాటలుగా మిగలడం తప్ప నేనే రకమైన మార్పూ తేలేనివి - ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు, అమెరికాలో తిట్టుకుంటూ మనదేశానికి మోసుకెళ్తున్న మెడికల్ ఇన్సూరెన్స్ పథకాలు, ఇండియాలో ఎక్కువవుతున్నాయని తిట్టుకుంటూ మనతో పాటు అమెరికా మోసుకొస్తున్న చదువుల రాంకుల బరువులు.
ఇలాటివన్నిటి గురించి రాయబోయినా, రాసినా అవేవో పనిగట్టుకు చెప్పే పాఠాల్లా ఉంటాయి కానీ పనిని మర్చిపోయేలా చేసే ఆటవిడుపులా వుండవు. అందుకని ఎప్పుడు బ్లాగ్ రాసినా అప్పటికప్పుడు తట్టిన విషయం గురించి రాయడమే తప్ప ఇది రాయాలీ అన్న పట్టికా, ప్రణాళికా ఏమీ లేవు నాకు. అలాంటప్పుడు రాయడానికి ఏముంటాయి? కబుర్లు తప్ప! అలా పుట్టింది నా "బోల్డన్ని కబుర్లు" బ్లాగ్.
అలా మొదలైన నా బ్లాగులో నేను రాసిన విషయాలు చాలా వున్నాయి. ముందుగా నాకు నచ్చిన చిన్నచిన్న సంఘటనలతో, నా చిన్నప్పటి విశేషాలతో రాయడం మొదలుపెట్టిన నేను ప్రతీవారం అవే రాయాలంటే చదివేవాళ్ళకి ఎలా వున్నా నా వరకు నాకే విసుగ్గా అనిపించి రాత కదిలేది కాదు.
అప్పుడు వారానికో అంశం మీద రాయాలి అనుకుని నాకు నచ్సిన పాటల కబుర్లు, సినిమాల కబుర్లు, బుజ్జిజింకల కబుర్లు అంటూ మా పిల్లల కబుర్లు, బారిష్టరు పార్వతీశం గారి వారసురాలి ననిపించే లాంటి ప్రవాసపు ప్రహసనాలు - ఇలా రకరకాల అంశాల మీద రాయడం మొదలుపెట్టాను. అన్నట్టు నాకు ఇంగ్లీషులో "క్రిప్టోక్విప్" అనే పజిల్ చాలా ఇష్టం. దాని గురించి రాసిన పోస్ట్ ఇంకా ఇష్టం.
ఇవే కాకుండా చిన్నప్పట్నుంచీ నాకు "ఇలా ఉండు" అని చెప్పకుండా వాళ్ళ ప్రవర్తనతో నాకెన్నో పాఠాలు నేర్పిన పెద్దలున్నారు. నోటి వెంట "లేదు" అన్న మాట రాకూడదు అని చెప్పడానికి ఆ "లేదు" అన్న మాటని కూడా ఉచ్చరించకుండా "లాకేత్వం, దాక్కొమ్ము రానీయకూడదు" అని నేర్పిన మా నాన్నమ్మ, నన్నసలు పల్లెత్తు మాట అనకుండా పెంచిన మా అమ్మా, నాన్నలు - వీళ్ళ గురించీ, ఆ గొప్పదనాల గురించి నేను తప్ప ఇంకెవరూ రాయలేరు. అలాంటి వాళ్ళందరి గురించి "నేర్పించిరి గురువులు" అన్న శీర్షికన కొన్ని పోస్టులు రాశాను. ఇంకా రాస్తాను కూడా. ఎందుకంటే గాంధీలు, నెహ్రూల గురించి ఎవరైనా రాస్తారు. కానీ మా ఇంట్లో వుండే గొప్ప వ్యక్తిత్వాల గురించి నేనే రాసుకోవాలి కాబట్టి.
ఇవన్నీ కాక "త్వామనురజామి" శీర్షికన అప్పుడెప్పుడో మొదలయి ఇప్పటికీ కొనసాగుతున్న నా ప్రేమకథని రాస్తున్నాను. ప్రతినెలా 19 వ తారీఖుకి పోస్ట్ చేసే ఈ సిరీస్ చాలా మంది చదువుతారు.
ఇక్కడో విషయం చెప్పాలి. నేను రాసే ఒక్కో బ్లాగ్ సిరీస్‌కి ఒక్కో కీ-పేరు (కలం పేరులా) వాడుకుంటాను. పాటల గురించి రాసేటప్పుడు "పాటల భైరవి", సినిమాల గురించి రాసేటప్పుడు "సినీ-మా-లక్ష్మి" పేర్లతో రాస్తాను.
నా బ్లాగ్ రాసేటప్పుడు నేను వాడే భాష నేను మాట్లాడే భాష. నాకు మాటలతో ఆట్లాడడం, అప్పుడప్పుడు నా మాటలు నేనే కాయిన్ చేసుకోవడం ఇష్టం. అది చిన్నప్పట్నుంచీ వచ్చిన అలవాటు. ఇటీవల నేను కొత్తగా కాయిన్ చేసుకున్న మాట "బీన్ ఏజ్". బీనేజ్ అంటే ఏది విన్నా, ఏం చూసినా "been there once" అనిపించే ఏజ్. Teenage పిల్లలది, Beenage తల్లిది-తండ్రిది :)
నేనెంతో ఇష్టంగా రాసుకునే బ్లాగ్ నాకు ఎంతో ఇష్టాన్ని కూడా సంపాదించి పెట్టింది.
"భాగవతం" గురించి నేను రాసిన "ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం!!" అన్న పోస్టు చదివి భాగవతం మీద ఎంతో గొప్ప పుస్తకాలు రాసిన శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారు ఉంచిన వ్యాఖ్య "మధురాతిమధురంగా వ్రాశారు. మనస్సంతా మీ చిత్రపదబంధాలతో, పోతన గారి పద్యోదాహరణలతో నిండిపోయింది.మీకు హృదయపూర్వక ధన్యవాదాలు" నాకెంతో సంతోషాన్నిచ్చిందో చెప్పలేను.
అలాగే నేను "ఈమాట" పత్రిక్కి నాకెంతో ఇష్టమైన పిల్లల పుస్తకాల రచయిత డాక్టర్ స్యూస్ని (డాక్టర జాయిస్) అనుకరిస్తూ రాసిన "ఒకటి నుంచి పదిల దాకా" అన్న పద్యాన్ని నా గొంతులోనే రికార్డ్ చేయించి దాన్ని "ఈమాట" లో ప్రచురించారు సంపాదకవర్గంలో ఒకరైన మాధవ్ మాచవరం గారు. ఆ పాటకి "ఈమాట"లో వచ్చిన స్పందన కూడా చాలా ప్రత్యేకమైనది.
నా బ్లాగ్ వల్ల నాకు జరిగిన మేలు నాకు దొరికిన అపురూపమైన స్నేహం, అభిమానం, ఆత్మీయత. "మాలిక" అనే యాగ్రిగేటర్లో నా బ్లాగ్ చాలా మంది చదువుతారు. వాళ్ళందరూ దేశవిదేశాల్లో వున్న తెలుగువాళ్ళు. వాళ్లెవరో నాకు ముఖాముఖి తెలియదు. కొంతమందివి పేర్లు కూడా తెలీవు. కానీ నా రాతలు చదివి వాళ్ళు వుంచే ఆత్మీయమైన వ్యాఖ్యలు చదివినప్పుడు అంత మంది అభిమానాన్ని సంపాదించి పెట్టిన నా "బోల్డన్ని కబుర్లు" ఎంతో ప్రియంగా అనిపిస్తుంది.
ఇవన్నీ ఒక ఎత్తైతే నా బ్లాగ్ రాయడాన్ని ఒక మంచి వ్యాపకంగా, వ్యాసంగంగా మలుచుకోవడానికి ఎంతో సహకరించిన నా మేలి-సగం బదరి పట్టుబట్టి "బోల్డన్ని కబుర్లు" పుస్తకంగా వేయించారు. దాన్ని ప్రచురించిన వారు వలబోజు జ్యోతిగారు.
నా "బోల్డన్ని కబుర్లు" పుస్తకం బదరి నాకిచ్చిన ఒక మంచి బహుమతి. ఆ పుస్తకమే నన్ను వంగూరి వారికి పరిచయం చేసి వారు నిర్వహించే సాహితీ సదస్సు దాకా తీసుకొచ్చింది.
చివరిగా నా బ్లాగ్ గురించి నే రాసుకున్న ఓ సిన్మతీ గిద్యం...
నా కబుర్ల వీడియోని యూట్యూబ్‌లో ఉంచిన మధు చెరుకూరి గారికి బోల్డన్ని ధన్యవాదాలు!

బ్లాగెడివి కబుర్లట...

బ్లాగెడివి కబుర్లట
బ్లాగ్చదివెడువారు ఇష్టులట నే
బ్లాగిన బోల్డన్ని కబుర్లౌనట
బ్లాగినది బ్లాగక బ్లాగెద నా బ్లాగులొ సిన్మతీ
నా కబుర్ల వీడియోని యూట్యూబ్‌లో ఉంచిన మధు చెరుకూరి గారికి బోల్డన్ని ధన్యవాదాలు!
ఎంతో సరదాగా, హుందాగా ఉన్న నీ బోల్డన్ని కబుర్లు మాకెంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాయి.😊👌👌💐💐- babuji
రిప్లయితొలగించండినువ్విలా మెచ్చుకోవడం చాలా బావుంది :)
తొలగించండిఓ..రాయువారూ,
రిప్లయితొలగించండికబుర్లాడువారూ..,
..మీకు
వారం వారం రాయువారం..
మాట్లాడు వారం
పాట్లాడు వారం
ప్రేమాట్లాడు వారం
పిల్లాట్లాడువారం
సినిమాట్లాడువారం
ఊహలు ఊసులాడువారం
కబుర్లు సయ్యాట్లాడువారం
మాకు హాయాట్లాడువారం
ఓ పేర్రాయనివారూ! మీకు... ధన్యవాదాలు చెప్పువారం కూడా!
తొలగించండిమీ ప్రవృత్తి సూపర్. వీడియో చూసాను. గ్రేట్..
రిప్లయితొలగించండిధన్యవాదాలు!
తొలగించండిప్రక్రియ ఏదైనా పరిచయం ఒక్కటే
రిప్లయితొలగించండివ్యాపకాలు ఎన్నున్నా రాసే వాక్యమొక్కటే
క్రొత్త పదసృష్టికి కర్త మీరొక్కరే...!
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు, చైతన్యగారు!
తొలగించండిToday is 19 th Lalitha garu. You know right....
రిప్లయితొలగించండి:) Thanks for your interest in Tvaamanurajaami.
తొలగించండిముందుగా వంగురి సాహితీ వేదికపై మాట్లాడే అవకాశం వచ్చినందుకు, బ్లాగాభివందనాలు. నీబ్లాగులో కొన్ని చదివాను. చాలా బాగున్నాయి.ఇంకాఇంకా ,బాగా రాయాలనికోరుకుంటూ ,, మీ సరోజ ఆంటీ.
రిప్లయితొలగించండినా బ్లాగ్ చదువుతున్నందుకు చాలా థాంక్స్, సరోజాంటీ!
తొలగించండిమీ ఉపన్యాసం బాగుంది. మీ వ్రాతలు చదువుతుండే మేము ఇప్పుడు మీ మాట కూడా వినగలిగాము, ఆనందం.
రిప్లయితొలగించండిఈ సమావేశాల్లో మా తమ్ముడు విన్నకోట రవిశంకర్ ను కూడా కలిసారని, మీ పుస్తకం ప్రతి ఇచ్చారనీ కూడా మా తమ్ముడు చెప్పాడు. థాంక్స్.
మీ సోదరులైన విన్నకోట రవిశంకర్ గారిని కలవడం, వారి ప్రసంగం వినడం వంగూరి వారి సదస్సుకి వెళ్ళినందుకు నాకు దక్కిన మంచి జ్ఞాపకాలు. నా ప్రసంగం విన్నందుకు మీకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి