కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 18 - పాడకున్న ఏమిలే - చదివేద్దాం రాతలే!
పట్టాల వెంబడి చీకటి దారిని కొలుస్తూ వెళ్తున్న రైలు -
చుట్టం నేను - మామనని - నీ వెంటే నేనని - వెంట వస్తున్న ౘందమామ -
పట్టపగటిని మరపించేలా కాకపోయినా - చిమ్మచీకటి లేకుండా - కాసింత వెలుతురు కురిపిస్తూ కాస్తున్న వెన్నెల -
కట్టెదుట కాయితమ్మీద కలం కదులుతూ - "Now I have a surprise for you " అని రాసి - మళ్ళీ కాసేపు ఆగి - వేళ్ళ మధ్య పెన్ను కదుపుతూ - కాయితమ్మీద ఏదో రాయబోతూ... ఆగుతూ -
పట్టరాని ఉత్సుకతనూ - ఉద్వేగాన్ని కలిగిస్తుంటే -
చుట్టుముట్టి వున్న నిశ్శబ్దానికి తోడు - నిలవనీయని కలవరమో - సద్దు లేని కోలాహలమో - హద్దు దాటనీని కలకలమో ...
పట్టనట్లో, పట్టించుకోనట్లో ఉండాలన్నా ఉండనీయక -
టిక్... టిక్... టిక్... టిక్...
అదేంటో - మామూలుగా ఎప్పుడూ పట్టించుకోకపోయినా - ఇప్పుడు మాత్రం - నా చేతికున్న వాచ్‌లోంచి నా గుండె చప్పుడేమో అన్నట్టుగా వినిపిస్తున్న సెకండ్ల ముల్లు చప్పుడు -
రాయబోయి ఆగుతున్న పెన్నుని చూసి - పెరుగుతున్న adrenaline rush -
దాంతో ఇంకుండలేక - హడావిడిగా పేపర్ లాగేసుకుని - "Tell me what it is - I really don't like suspense even in books - that's why I read the ending first. I wish you could speak. I wish you could say something"
- అంటూ గబగబా - మనసులోని ఉద్వేగం రాస్తున్న చేతులని వణికిస్తుంటే - వంకరటింకర రాతల్లో రాస్తూ నేను -
టిక్... టిక్... టిక్... టిక్...
వాచ్‌లో పెద్దముల్లు, చిన్నముల్లు పన్నెండు మీదికి చేరుతూ వున్నాయి....
కళ్ళజోడు ముక్కు మీద జారుతుంటే ఎడం చేతి చూపుడువేలు-మధ్య వేలు జతకట్టి దాన్ని పైకి నెట్టుకుంటూ ...
రాస్తున్న పెన్నునాపి - నెమ్మదిగా తలెత్తి... పెదవులమీంచి కళ్ళలోకి పాకుతున్న నవ్వుతో - ఆ నవ్వు పూస్తున్న మెరుపుతో మెరుస్తున్న కళ్ళతో - నాకేసి చూస్తూ - ఇంతలో తల వంచి - తన చేతికున్న వాచ్ చూసుకుని ...
సరిగ్గా - పన్నెండింటికి - మృదుమేఘధ్వని - నిశ్శబ్దంలోంచి నా చెవులకి మాత్రమే వినిపించేలా - "What shall I say?" - అంటూ.
అప్పటిదాకా చుట్టమే అనిపించిన ౘందమామ, చుట్టూ కాస్తూ వెలుతురనిపించిన వెన్నెల - ఉన్నట్టుండి ఒక్కసారిగా హారర్ సినిమాలో సీనులా అనిపించేసి - అసలే అర్థరాత్రి పన్నెడుగంటల టైం - ఒక్క రెండు క్షణాల్లో - నాకెన్ని పాటలు గుర్తొచ్చాయంటే ...
వేటగాడు సినిమాలోంచి "ఇది పువ్వులు పూయని తోట" అని పాడేస్తున్న శ్రీదేవి వాళ్ళమ్మ -
నవమోహిని సినిమాలోంచి "ఎవరో ఎవరో నను చేరేవారెవరో" అంటూ ఉయ్యాలూగేస్తున్న రోహిణి -
అంతస్తులు సినిమాలో "నిను వీడని నీడను నేను...ఓ ఓ ఓ " అని రాగాల్తీసేస్తున్న పీసుశీల -
బీస్సాల్బాద్ సినిమాలో "కహి దీప్ జలే కహి దిల్ " అంటూ గజ్జెలు కట్టుకుని పరిగెడుతున్న వహీదా రెహ్మాన్ -
అప్పటిదాకా మాట్లాడగలిగితే బావుండును అనుకున్న మూగబ్బాయి ఒక్కటంటే ఒక్క ప్రశ్న వేయగానే - హడలిపోయి - literally ఏడ్చేశాను - ముందు ఒక్క క్షణం భయంతో - అదేదో సినిమాల్లో అర్థరాత్రి పన్నెండింటికి గడియారం గంటలు కొట్టగానే - మొదలయ్యే దెయ్యాల మాయలాంటిదేమో ఈ మూగబ్బాయిని మాట్లాడించింది అనేసుకుని - తర్వాత ఉక్రోషంతో - అంత అమాయకంగా నమ్మేశానని.
వెంటనే పళ్ళు బిగపెట్టి కోపాన్నాపుకుంటూ - కళ్ళు తుడుచుకుంటూ - చాలా నెమ్మదిగా, మెల్లిగా - తనకి మాత్రమే వినబడేలా చెప్పాను - "పొద్దున్న గుంటూర్లో ట్రెయిన్ దిగేదాకా మాట్లాడడానికి వీల్లేదు. నన్నింక మా ఫ్రెండ్స్ తెగ tease చేస్తారు. ముఖ్యంగా నిరుపమ తిడుతుంది - తను చెప్తూనే వుంది - నేనే పిచ్చిదానిలా వినలేదు" - అంటూ.
తను అదే నవ్వుతో - ఏమీ మాట్లాడకుండా తలూపి - మేమప్పటివరకూ మాటల్రాసుకున్నకాయితమ్మీద Good Night, బుజ్జాయ్! అని రాసేసి తన బెర్త్ మీద కెక్కేసి పడుకున్నాడు.
నేనూ - "ఛ! నేనెందుకలా ఏడ్చాను - మరీ చిన్నపిల్లలా?!"- అని నన్ను నేనే తిట్టుకుంటూ - "పొద్దున్న లేవగానే ట్రెయిన్ దిగి అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయేదాకా ఆ అబ్బాయి మాట్లాడకుండా ఉంటే బావుండును" - అని అనుకుంటూనే - "అమ్మో - నాకు చెప్పిన మాట మర్చిపోయి మాట్లాడేస్తే ఎలా?" అని బెంగ పెట్టేసుకుంటూ - రామ స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం - శయనేయ పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి - అని చిన్నప్పుడు పడుకునే ముందు నాన్నమ్మ చెప్పించే శ్లోకం చదివేసుకుని - హారర్-ౘందమామ కళ్ళలో పడకుండా- కిటికీకి ఇవతలికి తిరిగి పడుకుండిపోయాను.
తెల్లవారినట్టుంది.
హఠాత్తుగా - మెలకువ వచ్చింది.
చుట్టూ సందడి.
పడుకుని వున్న నా పక్కనుంచి ఒకళ్ళొకళ్ళుగా సన్నగా మాట్లాడుకుంటూ ట్రెయిన్ దిగుతున్నారు.
నేనూ గబగబా లేచి - "అమ్మో - గుంటూరొచ్చేసినట్టుంది - గబగబా దిగాలి - అనుకుంటూ - నేను కప్పుకున్న దుప్పటి మడతేస్తుంటే - కిటికీ కవతల మా కాలేజ్ అమ్మాయిలు దిగి నించుని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.
తీరా చూస్తే అది తెనాలి స్టేషన్. ఎందుకో ఆ రోజు ఎప్పటికన్నా ఎక్కువసేపు ఆగింది ట్రెయిన్ అక్కడ.
ఇంతలో - ఆ న-మూగబ్బాయి ఎప్పుడులేచాడో - వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తూ కనిపించాడు.
నన్ను చూస్తూనే - మళ్ళీ ఒక నవ్వు వరంగా ఇచ్చేసి - ప్లాట్‌ఫాం మీదకి వెళ్దామా - అన్నట్టు - తలని కుడిపక్కగా వంచి సైగ చేశాడు.
ఈ పూటకి అతనెక్కడ ఉంటే నేనూ అక్కడే ఉంటేనే మంచిది - మాట్లాడకుండా కాపు కాయొచ్చు అనుకుని - నేనూ తలూపి తనతో పాటు ట్రెయిన్ దిగాను.
మా కాలేజ్ అమ్మాయిలు కొంత మందికి అప్పటికే అపార్థమైపోయింది - మా మధ్య పరిచయం మూగమనుషుల మూకాభినయం స్థాయి దాటి మూగమనసుల మూగానుబంధం దాకా వెళ్ళిందనేసుకున్నారు.
నాకు మాత్రం ఈ పూట గడిస్తే చాలు - వాళ్ళేమైనా అనుకోనీ - అని ఆట్టే పట్టించుకోకుండా - నిశ్శబ్దంగా ఆ అబ్బాయి పక్కన నడుస్తూ ప్లాట్‌ఫాం మీద ఆ చివరి నుంచి ఈ చివరికి ఊరికే తిరుతున్నాను. (ఆ అబ్బాయి పేరు అప్పటికి మా పేప-రిచయాల వల్ల తెలిసినా - మాట్లాడే అవకాశం లేదు కాబట్టి పిలవలేదు ఆ రోజుకి - అందుకని ఆలోచనల్లో కూడా అనుకోకుండా "అబ్బాయి" గానే తలుచుకున్నాను - ఆ రోజుకి).
ఇంతలో-ముందు రాత్రి మా కబుర్లు చదివిన గిరిరాజ్ కూడా వచ్చి చేరాడు మాతో.
మేము సైలెంట్‌గా నడుస్తున్నాము - నడుస్తూనే వున్నాము.
గిరిరాజ్ మా ఇద్దరి మొహాలు చూస్తూ తనూ సైలెంట్‌గానే నడుస్తూ - మధ్యమధ్యలో నన్నేదో అడగబోయినా - నాకసలే ఉక్రోషంగా ఉందేమో - నేనంత ఫ్రెండ్లీగా మాట్లాడలేదు.
ఒక రెండు రౌండ్లు నడవగానే - ఈలోగా ట్రెయిన్ - నేనింక బయలుదేరుతున్నాను ఎక్కండింక - అంటూ కూసింది.
"హమ్మయ్య - ఇంకెంత ఒగ్గంటలో గుంటూర్లో దిగేస్తాం - ఈ మౌనవ్రతం బాధ తప్పుతుంది" అనేసుకుని ఇంకాట్టే శబ్దం చేయకుండా నా సైడ్-బెర్త్‌లో కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తూ - చూపు నా ముందున్న అబ్బాయిమీదకి అస్సలు పోనీయకుండా - ఎన్ని చెట్లు, కరెంటుస్తంభాలు లెక్కపెట్టానో లెక్కే లేదు.
ఈ లోగా రానే వచ్చింది - గుంటూరు స్టేషన్.
అంతదూరం నుంచే - కిటికీలోంచి - ప్లాట్‌ఫాం మీద నించుని - ఆగుతూ ఉన్న ట్రెయిన్లో ముందుకు వెళ్తున్న బోగీలని చూస్తూ - నా కంపార్ట్మెంట్ ఏదో అని తొంగి చూస్తున్న - నాన్న, పప్పి, కుట్టి, ప్రశాంతి కనిపించారు.
వాళ్ళని చూస్తూనే సంబరంగా చెయ్యూపేసి - శృంఖల-విముక్త-సూట్కేసుని పట్టుకుని - నేను దాన్ని మోస్తున్నానో, నన్ను అది లాక్కెళ్తోందో - పెద్ద పట్టించుకోకుండా నా బోగీ తలుపు దగ్గరికి వెళ్ళి నించున్నాను.
ట్రెయిన్ ఆగింది. నాన్న నా సూట్కేసుని, కుట్టి నా బాగ్గుని అందుకున్నారు.
పప్పి, కుట్టీలతో - కబుర్లు మొదలెట్టేసి - "ప్రశాంతి, దొడ్డ ఎప్పుడొచ్చారు? శ్రీనొచ్చాడా? బాబొస్తున్నాడా? పాపాయత్తయ్య వస్తాన్నారు - వచ్చారా?" - ఇలా అడిగేస్తూ ఉంటే - నాన్న - "ముందింటికి పద - తర్వాత సావకాశంగా మాట్లాడుకోవచ్చు" - అంటూ ముందుకి నడిచారు - మమ్మల్ని నడిపించారు.
నాన్న వెనకాల నడుస్తుంటే - కుట్టి నా పక్కకి వచ్చి - చెవి దగ్గర నెమ్మదిగా - "ఆ అబ్బాయేవరే బాబూ - నీకేసి అలా చూసేస్తున్నాడు?" అంటూ చూపించింది.
నేనటు చూసీ చూడనట్టు చూసి - "ఏమో నాకేం తెల్సు? పద" అనేసి మనసులో మాత్రం ... "నాకు bye చెప్పాలని అనుకున్నాడేమో - అందుకే అలా చూశాడేమో" అనుకుంటూ...
చెప్పాలనుకున్నావని తెలిసి
చెప్తే కుదరదని తెలిసి
సతమతమైనామందుకే
కలిసి.. కలిసి కలిసి...
- అని పాడుకుంటూ ...కుంటూ ... కుంటూ - నేనింటికి.... వెళ్తుంటే...
ఆ టైటిల్ చరణం లైను ఏ పాటలోదో, ఈ కొసరు పాటేమిటో ననుకుంటూ - కనిపెట్టి పట్టి నాకు చెప్పి పాడుకుంటూ ...కుంటూ... కుంటూ - నా బ్లాగింట మీరుంటూ... ఉంటే ...
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

రిప్లయితొలగించండిఅద్భుతః
బేలా బోల్నంత సమయ
మే లాహిరి! బోలినాక మేల్ముసుగేలా !
బోలమ్మో బోలోయ
మ్మా లలితమ్మా సుమధురమై కథ సాగెన్ !
జిలేబి
బోలుది కాని భలే పద్యం - బోల్డన్ని ధన్యవాదాలు :)
తొలగించండిఎప్పటిలాగే కబుర్లు బావున్నాయండీ... ఈ నెల అసలు కొసరు పాటలు రెండు ఏవిటో తెలియట్లేదు... మళ్ళీ మరో రోజు ఫ్రెష్ గా వచ్చి ప్రయత్నించెద :-)
రిప్లయితొలగించండిమీరు తప్పకుండా పట్టేయగలరు. తప్పక ప్రయత్నించండి!
తొలగించండిఊహూ బొత్తిగా తెలియట్లేదండీ.. నా బుర్రలో ఓ ఛానల్ పని చేస్తున్నట్లు లేదు :-) ఈ సారికి మీరే చెప్పెయండి.
తొలగించండిఅయ్యో! నేనే సరిగ్గా కన్వే చేయలేకపోయాను - పోన్లెండి ఈసారి కొంచెం పాపులర్ పాటలకి కొసరు పాటలిస్తాను. Thanks for trying.
తొలగించండిలేదండీ మీరు మీ ఫ్లోలోనే కంటిన్యూ అవండి :-) నేనే కొంచెం వేరే పనుల్లో బిజీగా ఉండి ఆలోచించలేకపోయాను. కిషోర్ గారు, మీరు చెప్పగానే అర్రే ఇవి చెప్పలేకపోయానా అని అనిపించింది జయభేరి ట్యూన్ లోనే కరెక్ట్ గా పాడుకున్నాను కానీ పాట గుర్తురాలేదు :-)
తొలగించండిమీ ప్రోత్సాహకర వ్యాఖ్యకి ధన్యవాదాలు :)
తొలగించండికొసరు పాట:
రిప్లయితొలగించండిచేరేదెటకో తెలిసి, చేరువకాలేమని తెలిసి
సరిగ్గా చెప్పారు, కిషోర్‌గారు! చప్పట్లు!
తొలగించండిఇంక నా పోస్ట్ టైటిల్: జయభేరి సినిమాలో "యమునా తీరమున సంధ్యా సమయమున" పాటలో - "రానంత సేపు విరహమా - నేను రాగానే కలహమా!" లైనుకి అనుసరణ