చిన్నప్పటి పండగ కబుర్లు అయ్యాయి.
10, ఏప్రిల్ 2022, ఆదివారం
ౘదలచూలి పాట - 2 - పటికబెల్లపు పలుకుల రాముడి పాట, శ్రీరామనవమి పానకాల గురుతులతోనట...
చిన్నప్పటి పండగ కబుర్లు అయ్యాయి.
3, ఏప్రిల్ 2022, ఆదివారం
పాకోత్సాహము...శాకహృదయము ననుసరించి వండగ...- 3 - హాం...ఫఠ్! ఆమ్‌చూర్-పులిహోర!
మున్నమ్మా! ఎలా వున్నావ్? ఏం చేస్తున్నావ్? ఎన్నిరోజులయ్యిందో మన శాకహృదయపు కబుర్లు చెప్పుకుని!
అప్పుడెప్పుడో పచ్చిమిరపకాయలు తరగడం దగ్గరే ఆగిపోయాను.
అదేంటో అంతసేపు పచ్చిమిరపకాయల గురించి చెప్పి - దాంతో పాటే అసలు పచ్చిమిరపకాయలే వెయ్యని సాంబారు రెసిపీ కూడా చెప్పాను కదా!
పాకోత్సాహము...శాకహృదయము ననుసరించి వండగ...- 2 - సాంబారు సంబరం, ములగాకు చూర్ణం
మళ్ళీ ఇన్ని రోజులకి కుదిరింది ఆవురావురనిపించే ఆమ్-కబుర్లు చెప్పుకోవడానికి.
అన్నట్టు - నిన్ననే ఉగాది పండగతో కొత్త సంవత్సరం మొదలైంది. ఈ సంవత్సరం పేరు శుభకృత్. అంటే చాలా మంచి చేసే సంవత్సరమని అర్థం.
ఈసారి మంచి వేపపూత దొరికింది. దాంతో మన ఇంటి ఉగాది పచ్చడి ఎంత బాగా కుదిరిందో! నువ్వే చూడు.
అసలింతకీ - నీకు రుచులు ఎన్నో, వాటి పేర్లు ఏమిటో తెలుసా?
నాకు తెలిసి రుచులు ఆరు.
అవి చేదు, వగరు, తీపి, కారం, పులుపు, కమ్మన.
ఉండుండు... నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు. మరి ఉప్పో? అనే కదా? ఉప్పు గురించి చెప్తా ... చెప్తా!
మనం రోజూ తినే భోజనంలో చెట్లు, మొక్కల నుంచి వచ్చే ఆకులు, కాయలు, పళ్ళు, గింజలు - వీటన్నిటికీ వుండేవి ఆరంటే ఆరే రుచులు.
కాకరకాయ చేదు, నేరేడుపండు వగరు, మామిడిపండు తీపి, పచ్చిమిరపకాయ కారం, చింతకాయ పులుపు, ఆనపకాయ కమ్మన.
తెలుగులో నోటికి రుచిగా అనిపించిన ప్రతి తినుబండారాన్ని, ఆదరువునీ "కమ్మగా" వుంది అంటారు. కానీ నాకు కమ్మన అనేది ఒక రుచి అనిపిస్తుంది.
అంటే నోట్లో పెట్టుకోగానే నాలుకకి తీపి, చేదు, కారం, వగరు, పులుపు - వీటిల్లో ఏ రుచీ అనిపించని వాటన్నిటి రుచి పేరు ఏంటీ అంటే మిగిలింది ఇంకేమిటి ? కమ్మనైన కమ్మదనం తప్ప?!
కమ్మటి రుచికి ఒక మంచి ఉదాహరణ చెప్పనా?
అప్పుడెప్పుడో తమ్ముడు నా చేత సంతకం చేయించి, వండనని ఒట్టువేయించుకుని మరీ : అదే కాయ - అదే పప్పు - అదే వద్దు! అన్నాడు చూడు "పెసరపప్పు -ఆనపకాయ" ముద్దకూర... ఆ కూరకి చేదు, వగరు, తీపి, కారం, పులుపు - ఈ రుచుల్లో ఏ రుచీ ఉండదు. అలా అని ఉప్పగానూ ఉండదు - కావాలని ఉప్పెక్కువ వేసేసుకుంటే తప్ప!
అన్నట్లు ఇంకో విషయమేంటంటే - చెట్లకి చిగిర్చే, పూసే, కాసే, పండే - ఆకులూ, పూలూ, కాయలూ, పళ్ళూ - వీటిలో ఈ ఒక్కదానికీ వుండని రుచి ఏంటో తెలుసా? ఉప్పు.
మనం తినే కాయలు, పళ్ళూ కావాలంటే చెట్లకి నీళ్ళు పొయ్యాలి.
ఆ కాయలు వేసి వండిన వంటలకి రుచిని పెంచే ఉప్పు మాత్రం సముద్రపు నీళ్ళు ఆవిరైతే వస్తుంది.
ఉప్పు రుచిని పెంచేదే (taste enhancer) తప్ప అదొక రుచి కాదు - నాకైతే అలాగే అనిపిస్తుంది, అనాలనిపిస్తుంది.
అది సరే కానీ ఉప్పు-కారం తర్వాత నాలుకకి తగిలీ తగలగానే జివ్వుమనిపించే రుచి పేరు ఏంటో తెలుసా? అది తెలుగులో palindrome కూడా.
అదేంటో చెప్పుకో! నీకు తట్టిందా - అదేంటో?
నే చెప్పేయనా?
పు... లు... పు.
అసలివాళ పులుపు గురించి ఎందుకు చెబ్దామనుకున్నానంటే దానికి కారణం - ఆమ్‌చూర్.
ఆమ్‌చూర్ అంటే ఆమ్ర-చూర్ణం అంటే మామిడికాయ పొడి.
ఈ పాండెమిక్ రోజులు మొదలయ్యాక మన ఇంట్లో జరిగిన ఒక చెప్పుకోదగ్గ మార్పు ఏంటంటే - చింతపండు పూర్తిగా మానేసి దాని బదులు ఆమ్‌చూర్ వాడడం.
మన కోనసీమ చారులో, కర్ణాటక రసంలో, మద్రాసు సాంబారులో, రోజూ చేసే రోటి పచ్చళ్ళలో, ఒక్కసారిగా పెట్టుకునే నిలవపచ్చళ్ళలో, చివరికి చింతపండు వేయాల్సిన పులిహోరలో కూడా ఆమ్‌చూరే వాడుతున్నాను.
ఆమ్‌చూర్‌తో పులిహోరా...? అని ఆశ్చర్యపోకు మరీ!
అసలు అదెలా మొదలైందంటే ...
ఓ రోజు నాన్నగారు తన ఫ్రెండ్ గిరి అంకుల్ భోజనానికి వస్తున్నారూ అని చెప్పగానే కొంచెం స్పెషల్‌గా వాంగీబాత్ చేద్దామా అని చూస్తే ఇంట్లో ఎప్పుడూ ఉండే కాప్సికమ్ కూడా లేకపోయింది. పులిహోర చేద్దామా అంటే చింతపండు ఉడికించేంత సమయం లేదు.
ఇహ అప్పుడు అనుకున్నా ... ఆమ్‌చూర్‌తో పులిహోర చేద్దామని.
వెంటనే గబగబా అన్నం వండేసి మన పెద్ద బేసిన్‌లో వేసి ఆరబెట్టా. అన్నం కొంచెం గోరువెచ్చగా కాగానే అందులోకి కొంచెం ఉప్పు, పసుపు, నువ్వుల నూనె, ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆమ్‌చూర్ వేసి కలిపాను.
అందులో మామూలు పులిహోరలో వేసినట్టే - నువ్వులనూనెలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నాలుగు మెంతిగింజలూ, కొంచెం జీలకఱ్ఱా, ఆవాలూ, ముద్ద ఇంగువా - పోపు వేసి - కరివేపాకు కూడా వేసేశాను. దాంతో పాటే ఇంకొంచెం జీడిపప్పూ, ఇంకొన్ని వేరుశనగగుళ్ళూనూ...
హాం...ఫఠ్! ఆమ్‌చూర్-పులిహోర తయార్!
నాన్నగారూ, గిరి అంకుల్‌కే కాకుండా తమ్ముడికి కూడా బాగా నచ్చింది. నేను చేసిన అప్పటికప్పటి హాంఫఠ్-పులిహోర.
నువ్వు కూడా ఎప్పుడైనా ఒకసారి చేసుకుని చూడు - పుల్లపుల్లగా బావుంటుంది.
అన్నట్టు నాన్నగాడూ...మొన్నొకరోజు తమ్ముడూ నేనూ మాట్లాడుకున్న సంగతోటి చెప్పాలి.
శుక్రవారం నాన్నగారూ, నేనూ, తమ్ముడూ ఎక్కడికో వెళ్తుంటే ఉన్నట్టుండి వాడు "I forgot అనడానికి తెలుగులో ఏంటీ?" అనడిగాడు.
"మరచిపోయాను అంటామమ్మా" అన్నాన్నేను.
దానికి వాడు "అంటే forget and die ? అందులో forget కి root-word ఏంటీ" అన్నాడు.
"Forgot అంటే 'మరచానూ' అంటే చాలు. కాకపోతే కొంచెం emphasize చేయడానికన్నట్టు అలా 'మరచిపోయానూ' అంటామూ అని చెప్తున్నాను.
ఇంతలో కార్ సైడ్-మిర్రర్‌లోంచి వాడి నవ్వు మొహం చూడగానే నాకు చటుక్కున ఇలా చెప్పాలనిపించింది.
"ఒరేయ్ బుజ్జిగాడూ! అలా అని ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు 'ఏమన్నా తిన్నావా?' అనడిగితే 'ఇప్పుడే తినిపోయానూ' అని చెప్పకు. అన్నిచోట్లా అలా వాడకూడదూ" అని గబగబా చెప్పాను.
లేకపోతే ఆ రౌడీ గాడి సంగత్తెలుసుగా - నే నేర్పిన తెలుగుని నా మీదే ప్రయోగిస్తాడు.
27, మార్చి 2022, ఆదివారం
అంబుధి పొదికిట అంబుధి పొద్దులు (కార్పస్ క్రిస్టి కబుర్లు)
ఆదివారం సాన్ ఆంటోనియో ఏర్‌పోర్ట్‌లో దిగి, రెంటల్ కార్ తీసుకుని కార్పస్ క్రిస్టి వెళ్తూ - దార్లో ఆగి భోజనం చేస్తున్నప్పుడే బద్రి చెప్పారు - కార్పస్ క్రిస్టి వెళ్తూనే ఒకవేళ కుదిరితే USS లెక్సింగ్‌టన్ మ్యూజియం చూద్దామని.
మంగళవారం, బుధవారం కూడా ఒకే ప్రదేశానికి వెళ్ళాం. అది "కోల్ పార్క్ పియర్ (Cole Park Pier)".
19, మార్చి 2022, శనివారం
త్వామనురజామి 2.0 - 1 - హమ్ సింఘాసన్ పర్ జా బైఠే ...జబ్ జబ్ కరే ఇరాదే...
దీనికి ముందు కబుర్లు చదవాలంటే, ఒకసారి ఇక్కడికి వెళ్లి రండి: త్వామనురజామి - 52 - మళ్ళీ మొదలెడుతున్నా!
ఇంతకు ముందు చెప్పినట్టే... అక్కడెక్కడో ఆగిన మా కథ త్వామనురజామి - 50 - ఒకరికొకరం మేలి-సగం! ని మళ్ళీ మొదలెడుతున్నా.
కదిలిపోయిన కాలం - రాసేసిన పేజీలు
కదులుతున్న కాలం - పేర్చుకుంటున్న మాటలు'
కలిపి కూర్చుకున్న - బ్రతుకు పుస్తకం
మా "త్వామనురజామి" వెర్షన్ 2
త్వామనురజామి 2.0...
మళ్ళీ మొదలెడుతున్నా!
12, మార్చి 2022, శనివారం
మళ్లీ మొదలయింది - 2 - సంభాషణాంతః-శాటికా-న్యాయం
ఇంతకు ముందు ఏం చెప్పానంటే: మళ్ళీ మొదలయింది - 1 - అహమపి some సమ్భాషణం కృతవతీ...
ఇంతకు ముందు చెప్పాను కదా - నా కాలేజ్ రోజుల్లోని సంస్కృతం "రామః - రామౌ - రామాః; హే రామ! - హే రామౌ! - హే రామాః!" అన్న రామ-శబ్దం దగ్గరే ఆగిపోయి అంతవరకే గుర్తుంది - అని.
అక్కడి నుంచి ఇవాళ్టి రోజు నాకంటూ ఒక "సంభాషణాంతః-శాటికా-న్యాయం!" ఉందీ అని చెప్పగలిగే వరకు జరిగిన నా సంస్కృత-ప్రస్థానం గురించినవే ఈ రోజు కబుర్లు.
అనగనగా... కోవిడ్-పూర్వం 2018వ సంవత్సరంలో...
అత్యుత్సాహంగా నేనే చేరానో - లేదా చేర్చబడ్డానో గుర్తులేని - శతకోటి వాట్సాప్ గ్రూపుల్లో ఒకానొక గ్రూపులో హైద్రాబాదు నుంచి ఎవరో పెద్దాయన ఉచితంగా ఈమెయిల్ ద్వారా సంస్కృతం నేర్పిస్తారు అన్న సందేశం ఒకటి చూశాను.
ఎప్పట్నుంచో సంస్కృతం నేర్చుకోవాలీ అనుకుంటున్న నాకప్పుడది మహా సమయోచితంగా, సముచితంగా అనిపించి వెంటనే ఆ పెద్దాయనకి ఈమెయిల్ ఇచ్చాను - నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంది, మీ ఈమెయిల్-స్కూల్లో చేరాలంటే ఏం చెయ్యాలీ అని అడుగుతూ.
దానికి బదులుగా వారడిగిన ఆవేదన పత్రంలో నా పుట్టుపూర్వోత్తరాలు, పూర్వ విద్యాభ్యాస, ప్రస్తుత ఉద్యోగ వివరాలు - నా ఛాయాచిత్రసహితంగా సమర్పించి ఆ ఈమెయిల్-బడిలో చేరాను. కాకపోతే అది ఎక్కువకాలం సాగలేదు.
ఆ విధంగా ... కోవిడ్-శకం 2020వ సంవత్సరం ఏప్రిల్ నెలలో...
నేను పంపించిన హోంవర్క్ ఈమెయిల్ - అందలేదనో, అందినా చదవడం కుదరలేదనో నన్ను ఆ ఈమెయిల్-బడి లోంచి బయటికి పంపించేశారు. "ఎందుకు-ఏమిటి" అని అడిగి ఆ పెద్దాయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ బడి మానేశా.
ఉదాహరణకి- చషకః (కప్పు), చమసః (చెంచా), వృక్షః (చెట్టు), స్యూతః (సంచీ), శునకః (కుక్క).
ఆ-కారాంత, ఈకారాంత పదాలు స్త్రీలింగ శబ్దాలు.
ఉదాహరణకి: కూపీ (నీళ్ళ సీసా), అంకనీ (పెన్సిల్), లేఖనీ (కలం), సఖీ (స్నేహితురాలు).
"మ్" అని అంతమయ్యే పదాలన్నీ నపుంసకలింగ శబ్దాలు.
ఉదాహరణకి: పుస్తకమ్ (పుస్తకం), మిత్రమ్ (స్నేహితుడు), పుష్పమ్ (పువ్వు), పృథుకమ్ (అటుకులు).
<<ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నా... మిగిలిన కబుర్లు ఇంకో మారు.... >>
21, ఫిబ్రవరి 2022, సోమవారం
మళ్ళీ మొదలయింది - 1 - అహమపి some సమ్భాషణం కృతవతీ...
చిన్నప్పుడు వేసవి సెలవులకో, సంక్రాతి సెలవులకో అనాతవరం వెళ్లినప్పుడు రోజూ రాత్రి నిద్ర పోయేముందు నాన్నమ్మ మా చేత శ్లోకాలు చెప్పించేవారు.
నాకు ఆ శ్లోకాలన్నీ ఇష్టమే అయినా - అన్నిటి కన్నా ఒక శ్లోకం చాలా ఇష్టం.
నేర్చుకున్న శ్లోకాలు, పాడుకునే స్తోత్రాలు కాకుండా - చిన్నప్పట్నుంచి - నేను తరచుగా విన్న సంస్కృత వాక్యాలు మూడో, నాలుగో ఉన్నాయి.
అవన్నీ కూడా మా అమ్మ నాతో అన్నవి - ఆవిడ అనగా నేను వినీవిననట్లున్నా వినిపించుకున్నవి - వినాలనిపించి మళ్లీమళ్లీ అనిపించుకున్నవి.
నాకు గుర్తుండి చిన్నప్పుడు నాతో మా అమ్మ మాట్లాడిన భాషితాలు, సుభాషితాలు అన్నీ కూడా "All roads lead to Rome" అన్నట్టు - చదువు దగ్గర మొదలై, చదువు దగ్గరే ఆగేవి.
అవేంటంటే...
చెప్పిన మాటేదైనా విననప్పుడు - పెంకిగా ఎదురు మాట్లాడబోయినప్పుడు - "విద్యా దదాతి వినయం"
ప్రతిసారీ పరీక్షల ముందు పోటీ పడి చదవాలి అని గుర్తు చేస్తున్నట్టుగా - "స్పర్థయా వర్ధతే విద్యా"
ఇంకో ముచ్చటైన మూడో వాక్యం - "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం"
నాకు నచ్చి గుర్తుంచుకున్న నాలుగో వాక్యం - "స్వదేశే పూజ్యతే రాజా - విద్వాన్ సర్వత్ర పూజ్యతే ".
అప్పటికి సంస్కృతంలో ఉన్న ఆ వాక్యాలు ప్రతి పదం అంతో ఇంతో అర్థం కావటంతో - ఆ భాషేదో నాకు తెలిసిపోతున్నట్టే అనిపించేది.
కానీ సంస్కృతం భాషగా నేర్చుకోవాలని అప్పటికీ అనిపించలేదు.
బడికి వెళ్లి ఒక తరగతి తర్వాత ఇంకో తరగతి చదవడం తప్పనిసరి కాబట్టి ఆ చదువు మాత్రం విన్నది గుర్తుపెట్టుకుంటూ నెట్టుకుంటూ వచ్చేసే నాకు అదనంగా ఏమన్నా నేర్చుకోవడం అన్న ఆలోచనే నచ్చేది కాదు.
దాన్ని రానిచ్చేదాన్నే కాదు.
అందుకే "అమ్మాయ్! ప్రాథమికకి కట్టూ" అని చెప్తున్న హిందీ మాష్టారు గుర్నాథం గారిని తప్పించుకోవడానికి ఇంట్లో మొక్కలకి పాదులు కట్టి, నీళ్లు పెట్టాలని ఆయన నమ్మలేని సాకులు చెప్పి తప్పించుకునే దాన్ని కూడా... కదా!
ఎప్పుడో అలా ఆగిపోయిన నా సంస్కృతం చదువు అనుకోకుండా మళ్ళీ మొదలయింది.
-
స్వాతి: హరిః ఓం, భగిని!
లలిత: ఏతత్ లోకయానే ఏకః ఆసన్దః అపి రిక్తః నాస్తి. అహం భవత్యాః సమీపే ఉపవిశామి వా?
స్వాతి: ఆం భగిని! ఉపవిశతు!
లలిత: ధన్యవాదాః, భగిని!
(లలితా ఉపవిశతి)
స్వాతి: చింతా మాస్తు!
లలిత: అద్య వాతావరణం సమీచీనమ్ అస్తి, కిల?
స్వాతి: ఆం, బహు సమ్యక్ అస్తి! మమ నామ స్వాతి. భవత్యాః నామ కిమ్?
లలిత: మమ నామ లలితా. భవతీ కుత్ర గచ్ఛతి?
స్వాతి: అహం కార్యాలయం గచ్ఛామి. మమ కార్యాలయం Pine Street మార్గే అస్తి. భవతీ కుత్ర గచ్ఛతి?
లలిత: ఆగామి శనివాసరే మమ పుత్రస్య జన్మదినం! తస్య కృతే ఉపాయనం క్రేతుం Toys R Us ఆపణం గచ్ఛామి.


