"మార్గశిర పుష్య మాసములు - హేమంత ఋతువు - మంచు కురియును."
చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో, పెద్దబాలశిక్షలో చదువుకున్న ఋతువుల పాటలో వాక్యమది.
మా ఊళ్ళో మంచు కురుస్తుంది.
అసలే చలికాలం.
అందులోనూ మంచు కురిస్తే - ఆదమరపుగా వేసిన కాలు జర్రున జారే కాలం.
అయినా సరే - ఏ కాలానికాకాలం - కాయాల్సిన ఎండా, పడాల్సిన వానా, కురవాల్సిన మంచూ - ఇలా జరగాల్సినవి జరిగితేనే హాయిగా అనిపిస్తుంది.
అందుకే డిసెంబరు నెల మొదలయీ అవగానే మంచు కోసం ఎదురుచూపు.
ప్రతి ఏడాదీ మంచు కురుస్తుంది.
కురిసిన మంచు ప్రతీసారీ కొత్తగా కనిపిస్తుంది.
కనిపించిన మంచుని చూసిన ప్రతీసారీ ఏదో చెప్పాలని అనిపిస్తుంది.
నాక్కనిపించిన మంచుని చూసి నా కనిపించినదేదో ...ఇదిగో..ఇలా...
"మురిసింది - మంచు పూల వానలో..." అంటూ ఇక్కడిలా...
మంచుపూల వానని చూసి మురుస్తూ ఉంటే ఓ రెండు మాం...చి వానపాటలు గుర్తొచ్చాయి.
ఒకటి అసలుది,
ఇంకోటి కొసరుది.
ఒకటి ఎప్పుడో చిన్నపుడు - మండువాలో - కురిసే వాననీళ్ళల్లో - కాగితప్పడవలు వదుల్తూ, ఆ పక్కనే వున్న రేడియో గదిలోంచి వివిధభారతిలో విన్న పాట.
ఇంకోటి "పాడుతా-తీయగా" లో విన్నప్పుడు - "అరె! ఈ పాట ఆ పాటలా వుందే?!" అనుకుని - ఆనవాలు పట్టుకుని - యూట్యూబ్లో ఆనుపానులు పట్టుకున్న పాట.
ఒకటి డోలక్ సత్యంగారి అచ్చంగా సొంతమైన పాట.
ఇంకోటి సత్యంగారి అసలు పాటకి తాళం హెచ్చించిన కొసరు పాట.
సరే! ఇప్పుడా రెండు పాటలేంటో చూద్దాం...
అసలు పాట: కురిసింది వానా - నా గుండె లోనా..
సిన్మా: బుల్లెమ్మ బుల్లోడు
పాట్రాసినోరు: రాజశ్రీ
ఆట ఆడినోరు: చలం, విజయలలిత
పాట పాడినోరు: ఎస్పీబీ, పీసుశీల
పాట పాడించినోరు: డోలక్ సత్యం గారు
ఈ పాటలో ఆడినవారు ఆంధ్రా దిలీప్ కుమార్ చలం, రివాల్వర్ రాణి విజయలలిత.
పాటలో లేతగా వినిపించే ఎస్పీబీ గొంతు ఎంత బావుంటుందో!
"కథలను తెలిపే కాటుక కనులు" అన్న లైన్లో "థ" అన్న అక్షరాన్ని బాలు పలికిన వైనం బహు బాగు!
ఈ సినిమాకి సంబంధించి ఓ పిట్ట కథ:
ముందు కన్నడలో "భలే జోడి" అనే సినిమా వచ్చిందట. అందులో రాజ్ కుమార్, భారతి హీరో హీరోయిన్లు.
ఆ తర్వాత చలం, విజయలలితలతో "బుల్లెమ్మ బుల్లోడు" తీశారు.
దాంతర్వాత జితేంద్ర, రీనారాయ్ లతో "జైసే తో వైసా" అని హిందీలో కూడా తీశారట.
అన్నట్టు "జైసే తో వైసా" లో కూడా ఓ వానపాట వుంది. "అబ్ కే సావన్ మే జీ డరే ... రిమ్ ఝిమ్ తన్ పే పానీ గిరే" అంటూ. ఆ పాట విశేషం ఏంటీ అంటే - అది "మనసే జతగా పాడిందిలే, తనువే లతలా ఆడిందిలే" అన్న మన తెలుగు పాటకి హిందీ కవల.
(ఆ "మనసే జతగా పాడిందిలే" అన్నది ఈ కవల పాటల సిరీస్ శీర్షిక కూడా!)
కథలూ, కబుర్లూ అయిపోయాయి. పాట చూస్తూ, పాడేసుకోండి మరి!
కొసరు పాట: సిరిమల్లె వాన పడుతోంది లోన...
సిన్మా: వాన
పాట్రాసినోరు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఆట ఆడినోరు: వినయ్, మీరా చోప్రా
పాట పాడినోరు: రంజిత్, చిత్ర
పాట పాడించినోరు: కమలాకర్
అప్పుడెప్పుడో మా వూళ్ళో "పాడుతా-తీయగా" జరిగినప్పుడు మేం చూడగా-వినగా వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి ఈ పాట పాడింది. అది వింటూనే మన సత్యం గారి ట్యూన్ని భలే వాడేసుకున్నారు అనేసుకున్నాన్నేను.
అనుకుని నా కవల పాటల సిరీస్ కోసం దాచుకున్నా. ఈ రోజిలా రాసుకున్నా.
"వాన" అన్న ఓ మాట పదేపదే పాటలో వాడారు కాబట్టి మొహమాటానికి పాటలో వానని కాసేపు చూపించారు కానీ ఇదేమీ వాన పాట కాదు.
ఈ పాట మొదట్లో హీరోకి ఓ చొక్కా వేశారు - మెరూన్ కలర్లో, మెరుపులు కుట్టినది. హీరోయిన్ డ్రెస్ కన్నా నాకది బాగా నచ్చింది.
ఈ పాటలో సీత, జయసుధ కనిపించడం కూడా నచ్చింది. అలా అని సినిమా చూడాలని మాత్రం అనుకోవట్లేదు.
అన్నట్టు ఈ "వాన" కూడా కన్నడ సినిమా "ముంగారు మళె" కి రీమేక్.
ఈ పాటలో ఆడిన మీరా చోప్రాని ఈ మధ్యే "సెక్షన్ 375" అనే హిందీ సిన్మాలో చూశాం.
ఈ పాట కూడా చూస్తూ పాడుకుంటారని...

వడి లేని నింగిచూలి అలల నెక్కి అలా
సడి లేని మంచుపాట ఒకటి ఇల వైపు వచ్చెనిలా
మళ్ళొక్కసారి తడిసింది...
మా వూరు...
మురిసింది - మంచు పూల వానలో...
కదిలీ కదలని గాలి పెదవుల రాగమది
మెదలీ మెదలని తెల్లపూవుల సోన అది
చూరు మీద మంచు జాలు కురిసింది ...
మా వీడు...
మురిసింది - మంచు పూల వానలో...
మంచుకాఱిదె మరి వచ్చెనని
మనసును మురిపించు కాఱిదేనని...
ఇలకు అద్దిన వెన్నెల మించు గని ...
నా మది...
మురిసింది - మంచు పూల వానలో...
--------------------------------------------------------------------------------------------------------
********************************************************************************
********************************************************************************
--------------------------------------------------------------------------------------------------------
మంచుపూల వానని చూసి మురుస్తూ ఉంటే ఓ రెండు మాం...చి వానపాటలు గుర్తొచ్చాయి.
ఒకటి అసలుది,
ఇంకోటి కొసరుది.
ఒకటి ఎప్పుడో చిన్నపుడు - మండువాలో - కురిసే వాననీళ్ళల్లో - కాగితప్పడవలు వదుల్తూ, ఆ పక్కనే వున్న రేడియో గదిలోంచి వివిధభారతిలో విన్న పాట.
ఇంకోటి "పాడుతా-తీయగా" లో విన్నప్పుడు - "అరె! ఈ పాట ఆ పాటలా వుందే?!" అనుకుని - ఆనవాలు పట్టుకుని - యూట్యూబ్లో ఆనుపానులు పట్టుకున్న పాట.
ఒకటి డోలక్ సత్యంగారి అచ్చంగా సొంతమైన పాట.
ఇంకోటి సత్యంగారి అసలు పాటకి తాళం హెచ్చించిన కొసరు పాట.
సరే! ఇప్పుడా రెండు పాటలేంటో చూద్దాం...
అసలు పాట: కురిసింది వానా - నా గుండె లోనా..
సిన్మా: బుల్లెమ్మ బుల్లోడు
పాట్రాసినోరు: రాజశ్రీ
ఆట ఆడినోరు: చలం, విజయలలిత
పాట పాడినోరు: ఎస్పీబీ, పీసుశీల
పాట పాడించినోరు: డోలక్ సత్యం గారు
ఈ పాటలో ఆడినవారు ఆంధ్రా దిలీప్ కుమార్ చలం, రివాల్వర్ రాణి విజయలలిత.
పాటలో లేతగా వినిపించే ఎస్పీబీ గొంతు ఎంత బావుంటుందో!
"కథలను తెలిపే కాటుక కనులు" అన్న లైన్లో "థ" అన్న అక్షరాన్ని బాలు పలికిన వైనం బహు బాగు!
ఈ సినిమాకి సంబంధించి ఓ పిట్ట కథ:
ముందు కన్నడలో "భలే జోడి" అనే సినిమా వచ్చిందట. అందులో రాజ్ కుమార్, భారతి హీరో హీరోయిన్లు.
ఆ తర్వాత చలం, విజయలలితలతో "బుల్లెమ్మ బుల్లోడు" తీశారు.
దాంతర్వాత జితేంద్ర, రీనారాయ్ లతో "జైసే తో వైసా" అని హిందీలో కూడా తీశారట.
అన్నట్టు "జైసే తో వైసా" లో కూడా ఓ వానపాట వుంది. "అబ్ కే సావన్ మే జీ డరే ... రిమ్ ఝిమ్ తన్ పే పానీ గిరే" అంటూ. ఆ పాట విశేషం ఏంటీ అంటే - అది "మనసే జతగా పాడిందిలే, తనువే లతలా ఆడిందిలే" అన్న మన తెలుగు పాటకి హిందీ కవల.
(ఆ "మనసే జతగా పాడిందిలే" అన్నది ఈ కవల పాటల సిరీస్ శీర్షిక కూడా!)
కథలూ, కబుర్లూ అయిపోయాయి. పాట చూస్తూ, పాడేసుకోండి మరి!
కురిసింది వానా...
నా గుండె లోనా...
నీ చూపులే జల్లుగా...
కురిసింది వానా - నా గుండె లోనా - నీ చూపులే జల్లుగా
ముసిరే మేఘాలు - కొసరే రాగాలు
కురిసింది వానా ... నా గుండె లోనా - నీ చూపులే జల్లుగా
అల్లరి చేసే - ఆశలు నాలో - పల్లవి పాడేను
తొలకరి వయసు - గడసరి మనసు - నీ జత కోరేను
అల్లరి చేసే - ఆశలు నాలో - పల్లవి పాడేను
చలిగాలి వీచే - గిలిగింత తోచే
కురిసింది వానా - నా గుండె లోనా
నీ చూపులే జల్లుగా
ఉరకలు వేసే - ఉహలు నాలో - గుసగుస లాడేను
కథలను తెలిపే - కాటుక కనులు - కైపులు రేపెను
ఉరకలు వేసే - ఊహలు నాలో - గుస గుస లాడేను
బిగువు ఇంకేలా - దరికి రావేలా
కురిసింది వానా - నా గుండె లోనా
నీ చూపులే జల్లుగా
ముసిరే మేఘాలు - కొసరే రాగాలు
కురిసింది వానా - నా గుండె లోనా
నీ చూపులే జల్లుగా...
కొసరు పాట: సిరిమల్లె వాన పడుతోంది లోన...
సిన్మా: వాన
పాట్రాసినోరు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఆట ఆడినోరు: వినయ్, మీరా చోప్రా
పాట పాడినోరు: రంజిత్, చిత్ర
పాట పాడించినోరు: కమలాకర్
అప్పుడెప్పుడో మా వూళ్ళో "పాడుతా-తీయగా" జరిగినప్పుడు మేం చూడగా-వినగా వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి ఈ పాట పాడింది. అది వింటూనే మన సత్యం గారి ట్యూన్ని భలే వాడేసుకున్నారు అనేసుకున్నాన్నేను.
అనుకుని నా కవల పాటల సిరీస్ కోసం దాచుకున్నా. ఈ రోజిలా రాసుకున్నా.
"వాన" అన్న ఓ మాట పదేపదే పాటలో వాడారు కాబట్టి మొహమాటానికి పాటలో వానని కాసేపు చూపించారు కానీ ఇదేమీ వాన పాట కాదు.
ఈ పాట మొదట్లో హీరోకి ఓ చొక్కా వేశారు - మెరూన్ కలర్లో, మెరుపులు కుట్టినది. హీరోయిన్ డ్రెస్ కన్నా నాకది బాగా నచ్చింది.
ఈ పాటలో సీత, జయసుధ కనిపించడం కూడా నచ్చింది. అలా అని సినిమా చూడాలని మాత్రం అనుకోవట్లేదు.
అన్నట్టు ఈ "వాన" కూడా కన్నడ సినిమా "ముంగారు మళె" కి రీమేక్.
ఈ పాటలో ఆడిన మీరా చోప్రాని ఈ మధ్యే "సెక్షన్ 375" అనే హిందీ సిన్మాలో చూశాం.
ఈ పాట కూడా చూస్తూ పాడుకుంటారని...
సిరిమల్లె వాన - పడుతోంది లోన - కనిపించదే కంటికి
వడగళ్ళ వాన - వురిమింది మీనా -వినిపించదే జంటకి
తడిసే తరుణాన - గొడుగై నే లేనా
సిరిమల్లె...
సిరిమల్లె వాన పడుతోంది లోన
కనిపించదే కంటికి
వల అనుకోనా - వలపనుకోనా - కలిపిన ఈ బంధం
వలదనుకున్నా - వరమనుకున్నా - తమరికి నే సొంతం
చినుకై వచ్చావే - వరదై ముంచావే
సిరిమల్లె...
సిరిమల్లె వాన - పడుతోంది లోన- కనిపించదే కంటికి
చిలిపిగ ఆడి - చెలిమికి ఓడి - గెలిచా నీపైన
తగువుకి చేరి - తలపుగ మారి - నిలిచా నీలోన
మనసే ఈ వింతా - మునుపే చూసిందా
సిరిమల్లె
సిరిమల్లె వాన - పడుతోంది లోన- కనిపించదే కంటికి
వడగళ్ళ వాన - వురిమింది మీనా -వినిపించదే జంటకి
--------------------------------------------------------------------------------------------------------
********************************************************************************
********************************************************************************
--------------------------------------------------------------------------------------------------------
మంచు కురిసిన వేళలో
మనసు మురిసి
పంచుకున్న పాటలివి
వినుమని నేనన
వినమని అనక
వింటారని
అనుకుంటూ...
~ పాటల భైరవి

మంచు కురిసే వేళలో, లలిత మురిసిన మనసుతో
రిప్లయితొలగించండిమనసుతో ఆ మనసుతో, విరిసినా ఈ కవితతో
అందమంతా ఆస్వదించి, వేడిగుక్క కాఫితో,
మధురమైన కవిత రాసి, పులకరించిన మనసుతో
మంచు కురిసే వేళలో....
చిన్ననాటి పాటలేమో జ్ఞాపకాలను కదిపినేమో
ఆ పాటలే వాన పాటలై మనసు మదిని తడిపినేమో...
లలిత మురిసిన మనసుతో, మంచు కురిసిన వేళలో
మంచు కురిసే వేళలో...
తమ్ముడూ...మంచుతోనేమో కానీ నీ కవితతో నా మనసు మురిసింది :)
తొలగించండిపాటలతో పాటు వాటికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న కబుర్లు పంచుకోవడం చాలా బావుందండీ..
రిప్లయితొలగించండిపాటలతో పాటు ఆ పాటలు వెనకుండే ఆ చిన్నచిన్న కబుర్లు నాకు చాలా ఇష్టం. అవి మీకూ నచ్చడం బావుంది. థాంక్ యూ!
తొలగించండికవితే జతగా కురిసిందిలే..అన్నట్లుగా వుంది పాటలతో మీరు రాసిన చక్కటి పలుకులు. అద్భుతం లలిత గారు !
రిప్లయితొలగించండిభలే! నా కవీత మెచ్చిన మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండిమంచు డిస్క్రిప్షన్ బావుంది. నిజంగానే మీరు సినిమా పాటలు రాయచ్చేమో. ప్రయత్నించండి. నాకు "కురిసింది వాన" ఇష్టమైన పాట. అలానే ఇంకో పాట వుందని మీరు చెప్తే గానీ తెలియలేదు. థాంక్స్ లలితా!
రిప్లయితొలగించండిమీ అభిమానపూరిత వ్యాఖ్యకి ధన్యవాదాలు, నిర్మలా!
తొలగించండిమంచి తెలుగు, వాన పాటలు, చేతిలో వేడి టీ కప్పు, చిరు చలి - వెరసి స్వర్గానికి ఒక్కటే స్టెప్ దూరంలో వున్నట్టు వుంది లలితా!
రిప్లయితొలగించండిఅంతేనంటావా, హేమ రాధా! థాంక్ యూ!
తొలగించండి