క్రిందటి శ్లోకం / Previous slOkaH: స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 7
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
శ్లోకం - 8ఇక్ష్వాకువంశప్రభవఃరామో నామ జనైః శ్రుతఃనియతాత్మా మహావీర్యఃద్యుతిమాన్ ధృతిమాన్ వశీ
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అర్థం:
(గమనిక: 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వాల్మీకి మహర్షికి వివరిస్తూ నారద మహర్షి రాముని సుగుణాల గురించి చేసిన వర్ణన వుంటుంది.)
ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు, జనులలో రాముడనే పేరుతో ప్రసిద్ధి చెందినవాడు ఒకడు వున్నాడు. అతడు మనోనిగ్రహం కలవాడు, మహావీరుడు, మహాతేజస్వి, ధైర్యవంతుడు, మరియు జితేంద్రియుడై వున్నాడు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)
ఇక్ష్వాకువంశప్రభవః
రామః నామ జనైః శ్రుతః
నియతాత్మా మహావీర్యః
ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ
ఇక్ష్వాకువంశప్రభవః = ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు
రామః నామ = రాముడనే పేరుతో
జనైః = జనులలో
శ్రుతః = తెలిసినవాడు (ప్రసిద్ధి చెందినవాడు)
నియతాత్మా = మనోనిగ్రహం కలవాడు
మహావీర్యః = మహావీరుడు
ద్యుతిమాన్ = మహాతేజస్వి
ధృతిమాన్ = ధైర్యవంతుడు
వశీ = ఇంద్రియనిగ్రహం కలవాడు (జితేంద్రియుడు)
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
श्लोकः - 8
इक्ष्वाकुवंशप्रभवः |
रामो नाम जनैः श्रुतः |
नियतात्मा महावीर्यः |
द्युतिमान् धृतिमान् वशी ||
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
Meaning in English
(NOTE: From the slOkaH 8 until slOkaH 20, the virtues of Rama are described by Narada maharshi to Valmeeki maharshi)
There is one born in the Ikshvaaku dynasty and known by people by the name of Rama. He has fully controlled his mind, very powerful, radiant, resolute and has brought his senses under control.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
Word to word meaning (In the same order of occurrence in the slOkaH):
इक्ष्वाकुवंशप्रभवः |
रामः नाम जनैः श्रुतः |
नियतात्मा महावीर्यः |
द्युतिमान् धृतिमान् वशी ||
इक्ष्वाकुवंशप्रभवः = born in Ikshvaaku dynasty
रामः नाम = by the name "Rama"
जनैः = by people
श्रुतः = known
नियतात्मा = self-controlled
महावीर्यः = very powerful
द्युतिमान् = radiant
धृतिमान् = resolute
वशी = one who has conquered over the sense organs
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 9

ద్యుతిమంతుడు , ధృతిమంతుడు
రిప్లయితొలగించండిమతిమంతుడు , రామచంద్రమనుజవిభుడు , సం
తత కోదండ ధనుర్ధర
వితత మహావీర వరుడు , వినుతుడు జగతిన్ .
ఏదో యొక మిషతో , నిం
రిప్లయితొలగించండిపాదిగ , శ్రీరామచంద్రు భజనలు సేయన్ ,
మేదురమగు నా హృదయము
పాదుగ మధురానుభూతి పరవశ మందున్ .
తెనుగున భాగవతమ్మును
రిప్లయితొలగించండిజనహితముగ రాయుమనియె , జానకి రాముం
డొనరగ పోతన్నను , ఆ
యన యది తలదాల్చి , యతని కంకిత మిచ్చెన్ .
నెల మూడు వాన లొదవెను
రిప్లయితొలగించండిఇల సశ్యశ్యామలమయి యెందును ధన ధా
న్య లసిత సంతోష మొలుక
తులతూగిరి జనులు రాముతో కూడి తగన్ .
కాకుత్థ్సవంశ చంద్రుం
రిప్లయితొలగించండిడేకీకృత విష్ణుతేజ హేళావృతుడై
సాకేతము కేంద్రముగా
రాకానిభ నిటలు డేలె రాముం డవనిన్ .
జగమంతా రామ మయం ,
రిప్లయితొలగించండినిగమాగమ నుత చరితుని నిజ రక్షణలో
నగనిత సుఖ సంతోషా
లు గడించి ప్రజలు బ్రతికిరి ప్రోదిగ నిలలో .
ఆజానుబాహ ! వికసిత
రిప్లయితొలగించండిరాజీవదళాయతాక్ష ! రఘుకుల సోమా !
రాజిత దశరధ తనయా !
పూజిత బ్రహ్మాది దేవ ! భూమిజ రామా !
త్రేతాయుగ యుగపురుషుడు ,
రిప్లయితొలగించండిఆతత కరుణాంతరంగు , డవనిన్ నేడున్
ప్రాతస్స్మరణీయ విభుడు ,
సీతాపతి , రఘువరుండు , చేతులు మ్రోడ్తున్ .