గత నెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 1 - పెద్దొకటి
ఊఁ - సరే. పెద్దొకటి అయిపోయింది.
అయిపోయింతర్వాతేమో - నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూలు కెళ్ళాను.
వెళ్తే - పాపం - మా రాజుమేష్టారు "ఒరే నువ్వెళ్ళి రెండో క్లాసులో కూర్చోరా - నా ఒకటి పాసైపోయావు" అన్నాడీయన .
అంటే - సరే వెళ్లి రెండో క్లాసు - రెండో క్లాసు మూడో క్లాసు అంటే ఏంటంటే - ఓరుగంటి అప్పారావుగారని మన కాలిఫోర్నియాలో వుంటాడు - రమేషు - వాళ్ళ తాతగారు - ఆయన్ని చిన్నమేష్టారు అనేవాళ్ళం - ఆయన దానికి టీచరు.
రెండో క్లాసుకేమో ఒక వరస బెంచీలు. వాళ్లెదురుగానే మూడో క్లాసు వాళ్ళు ఒక వరస బెంచీలు.
ఈ మూడో క్లాసు వాళ్ళెవరంటే - నాతో పాటు ఒకటో క్లాసు చేరిన వాళ్ళే!
వాళ్ళు నా కన్నా ముందెళ్ళిపోయారు కదా! - అందుకే ఆ వరసలో వాళ్ళు కూర్చున్నారు.
వాళ్ళెదురు వరసలో మేము కూర్చునేవాళ్ళం - నేను, నారాయణరాజుగారి సూరి గాడు.
మేమేమిద్దరమే పెద్దొకటి చదువుతా.
సరే - ఇదయింతర్వాత - మొత్తం రెండో క్లాసు ఐపోయింది. మళ్ళి ప్రమోషన్ నెక్స్ట్ ఇయర్కి.
మూడో క్లాసు - ఇట్నించి వెళ్ళి ఆ బెంచీల్లో కూర్చున్నాం.
అప్పుడేదో - మా చిన్నమేష్టారు - ఏవో చిన్నచిన్న వేమన పద్యాలు, సుమతీ శతకాలు చెప్తుండేవారు.
అవన్నీ వల్లె వేసుకుంటూ నేర్చునేవాళ్ళం.
కాపోతే మనసులో బాధేంటంటే - నాలుగైదు క్లాసులకి పెద్ద బెంచీలుండేవి.
ఒకటి, రెండు, మూడు క్లాసులు నేల బెంచీలు - అవేమో పెద్ద బెంచీలు.
నాతోటి చేరిన వాళ్ళు - నాకన్నా ముందు ఒకటో క్లాసు పాసైపోయినవాళ్ళు ముందు వున్నారు కదా - వాళ్ళెళ్ళి పెద్ద బెంచీల మీద కూర్చుని - నేనేమో ఇక్కడ నేల బెంచీ మీద కూర్చునేవాణ్ణి.
నన్ను వెక్కరించే వారాళ్ళు.
సరే - మొత్తానికి - ఎలా అయితేనేం ఆ సంవత్సరం కూడా చిన్నంగా ఏదో ఇబ్బంది పడుతూ లాగించేశాం .
నాలుగో క్లాసు జాయిన్ అయ్యాం.
దానికేంటంటే - మరువాడ అప్పారావుగారని ఆయన హెడ్మాస్టరుండేవారు - పెద్దమేష్టారు అనేవాళ్ళమాయన్ని.
ఆయనేమో రిటైరయిపోయి - ఆయన కొడుకు మరువాడ శంకరం గారని చెప్పేసి - ఆయన హెడ్మాస్టరక్కడ. నేనంటే మంచి అభిమానం అదీనూ.
ఆ పెద్ద బెంచీలు రెండు వరసల్లో ఉండేవి -ఒక వరస ఐదో క్లాసు, ఒక వరస నాలుగో క్లాసు. ఈ రెండు క్లాసులు కూడా శంకరంగారే చూసేవారు.
సరే - ఓ మూణ్ణాలుగునెల్లు గడిచిపోయింది. ఈలోగా శంకరంగారు - పాపం - ఆరోగ్యం బావులేక - ఆయన పరమపదించారు.
ఒక పదిహేను రోజులు, నెల్లాళ్ళపాటనుకుంటా - ఎవరూ టీచర్ లేరు మాకు.
చిన్నమేష్టారే వచ్చి ఆ క్లాసులకీ చెప్తుండేవారన్నమాట.
ఒక నెలతర్వాత ఒక కొత్తయనొచ్చారు టీచరు - సూర్యనారాయణగారని చెప్పేసి.
ఇంత లావుగా ఉండేవారు - కుర్చీ నిండా ఉండేవారు ఏనుగులాగా. ఎందుకో ఆయన నాకు నచ్చలేదు - ఫస్టు నించీ కూడా.
దానికి తోడేమో నా ఎదురు బెంచీల్లో కూర్చునేవాళ్ళు - ఐదో క్లాసు కదా! వీళ్ళందరూ అప్పుడప్పుడు మమ్మల్ని వెక్కిరిస్తూ ఉండడం - ఇవన్నీ జరుగుతూ వుండేవన్నమాట.
ఈలోపులో నాలుగో క్లాసుకొచ్చేటప్పటికే కొంచెం నాకు - ఈ తెలుగులో భాషాప్రవీణ్ణుడయ్యాను- కొద్ది తెలివితేటలబ్బుతున్నాయన్నమాటప్పుడే.
మా ఎలిమెంట్రీ స్కూల్లో సిమెంటు స్తంభాలుండేవి. ఆ స్తంభాలమీద సూక్తులు రాసేవారు - విద్య లేని వాడు వింత పశువు, విద్య యొసఁగు వినయంబు - అటువంటి సూక్తులుండేవి.
ఓ రోజేం చేశానంటే - చాక్పీసు తీసుకుని ఆ విద్య లేని వాడు వింత పశువు అనే దగ్గర - ఆ లేని కింద ఇంటూమార్కు పెట్టి - పైనేమో - విద్య నేర్పినవాడు వింతపశువు - అని పెట్టా.
మర్నాడు మా సూర్నారాయణ మేష్టారు చూశాడు. చూసి "ఎవడ్రా - ఈ భాషాపండితుడెవరు తెలుగు లోనూ ?" అనేటప్పటికి - మా ఎదురు బెంచీ వాళ్ళు - నా మీద కోపం కదా వాళ్ళకీ - "ఇదో ఈ బాబే రాసేశాడండీ - బాబోయ్ - బుల్నారాయణగారి బాబీ రాసేశాడండీ - అంటూ గోలగోల చేసేశారు.
ఆయన దెగ్గరికి పిలిచి - "బానే నేర్చుకున్నావురా తెలుగు నువ్వూ - ఏది - ఏ చేత్తోటి రాశావ్? - చూపెట్టు - ఆ చెయ్ చూపెట్టూ!" - అన్నాడు.
అన్నాక ఆ చెయ్యి తిప్పి తీసుకుని డ్రాయరు సొరుగులో పెట్టి నొక్కేశాడు.
ఇంకల్లాడి పోయానన్నమాట. "అయ్‌బాబోయ్" - డాన్సు కట్టేహానక్కడ.
సరే - అలా - ఇంకలాగైపోయింది - ఏడ్చుకుంటూ వచ్చి కూర్చున్నాను.
ఇంకసలిక్కడ చదవకూడదు - ఈయనదగ్గర అసలు చదవకూడదు - అంజెప్పి - రెండు బాధలు - ఒకటి ఆయన కొట్టాడు - ఆయన దగ్గర చదవకూడదు అనేదొకటి - రెండు ఒకటో క్లాసు నాతొ జాయినైనవాళ్లు నాకన్నా ముందు హైస్కూలుకెళ్ళిపోతారనే బాధ ఇంకొకటి.
ఈ రెండు దృష్టిలో పెట్టుకుని - అసలింక - ఇంటికెళ్ళిపోయి మా నాన్న దగ్గర చెప్పేవాణ్ణి కాదు - మా అమ్మ దగ్గరే - వెళ్ళి - "నేం చదవనింక ఈ స్కూల్లో - నేను పొలమెళ్ళిపోతాను - లేదంటే నన్ను హైస్కూల్లో జేర్చేయండి" - అంటే సరే మా అమ్మ మా నాన్నతో - "వీడు హైస్కూల్లో జేరిపోతానంటున్నాడు" - అంటే - "అప్పుడే అన్ని తెలివి తేటలొచ్చేశాయా వీడికి - ఐదవ క్లాసు చదవకుండానూ?" - అన్నారు మా నాన్న.
అప్పుడు - ఇంటూ ఫస్ట్ ఫారం అని ఉండేది. ఫోర్త్ క్లాసులో ఇంటూ-ఫస్ట్ ఫారం పరీక్షలు రాస్తే - మనం పాసైతే డైరెక్టుగా ఫస్టు ఫారంలో జాయినైపోవచ్చు.
"సరే - చూద్దాం అప్పటి సంగతి - ముందు ఈ నాలుగో క్లాసు పూర్తవనీ" - అన్నారు.
నాలుగోక్లాసు పూర్తయింది.
ఈ లోపులో - ఈ మధ్యకాలంలో ఏంటి - నాకు సూర్నారాయణ మేష్టారి మీద కోపం వుంది కదా నాకు ?
నాలుగో క్లాసులో ఉండగానే అట్లతద్దొచ్చింది.
అట్లతద్దికేంటంటే - ఊళ్ళో ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ తెల్లవారుఝామున లేచి గోంగూరపచ్చడి, ఉల్లిపాయపులుసు వేసుకుని అన్నం తినేసి - తెల్లవారుఝామున నాలుగింటికి - తాంబూలాలేసేసుకుని - ఇంక బయటపడి ఆ వెన్నెల్లో చక్కగా -ఉప్పట్లు ఇవన్నీ ఆడుకునేవాళ్ళం.
ఈ మేష్టారు అద్దెకున్న ఇంటి ముందు ఆట మొదలు పెట్టాం.
అంతకు ముందు రోజు ఏం చేహానంటే - ఈ సంగత్తెల్సు - ఇక్కడే ఆడతామని చెప్పి. పొలమెళ్ళి పచ్చి ఆవుపేడ బంతులు తయారు చేశాను. వాటినేమో ఇసుకలో పొర్లించి నీటుగా తయారుచేసి ఓ సంచిలో పెట్టుకున్నాను.
పెట్టుకుని తెలవారుఝామున ఈ ఆటలకొచ్చాం. మా మేష్టారు తెల్లవారుఝామున లేచి బాత్రూంకని బయటికి వచ్చాడు. ఆ చీకట్లో వెనకనించి ఆ బంతులు పెట్టి ఆయన్ని కొట్టేహాను. ఆయన ఒళ్ళంతా పేడైపోయింది. పారిపోయాను.
పారిపోయింతర్వాత - ఇదెవరు చేశారో ఎవరికీ తెలీదు. నా మీద డౌటే ఆయనకి - వీడే చేసుంటాడని. ఎందుకంటే - ఆ ఊళ్ళో అవతారంగారి నారాయణగారంటే - ఆయన ఓల్డ్ BA - పైగా దివాణం. ఆయన మీదేంటంటే ప్రేమతో కూడిన అభిమానంతో కూడిన గౌరవం ఉండేది. నారాయణగారి బాబిగాడంటే భయంతో కూడిన ప్రేమతో కూడిన అభిమానముండేది. ఎందుకంటే - వీడో అల్లరి వెధవ ఎక్కడ రాళ్ళేస్తాడో మీదని చెప్పేసి. ఆయనకి డౌటుండేది - ఆ డౌటు బయట పెట్టకుండా - పాఠం రాలేదని వేరే వంకేదో పెట్టి కొట్టేహాడు.
సరే - ఇంకీయన దగ్గర చదవకూడదని చెప్పేసి - నాలుగో క్లాసు అవగానే ఇంటూ-ఫస్టుఫారం పరీక్షలు రాసేశాను.
నాతో మొట్ట మొదట చదివిన వాళ్ళతో కలిసి హైస్కూలుకి వెళ్ళిపోయాను - భీమనపల్లి హైస్కూల్ - సిరంగు రంగనాయకమ్మ హైస్కూల్. తర్వాత జిల్లా పరిషత్తు అయ్యింది. అందులో వెంట్రప్రగడ జగన్నాథరావుగారని చెప్పేసి ఆయనేమో హెడ్మాస్టరు.
తర్వాత మన ఊళ్ళో అనాతవరంలో తెలుగు టీచర్స్ ఉండేవాళ్ళు - ఆకెళ్ళ సుబ్బారావుగారు, చంద్రశేఖరశాస్త్రిగారు - వీళ్ళందరూ అనాతవరం నించే రోజూ వెళ్తుండేవారు. చంద్రశేఖరశాస్త్రిగారు వాళ్ళు మనకు చుట్టాలే. ఆయన కూడా - జాయిన్ చేసేయండి నారాయణగారూ - అంటే నన్ను హైస్కూల్లో చేర్చేశారు. ఫస్టుఫారం , సెకండుఫారం, థర్డుఫారం - చెప్పుకోదగ్గవేమీ లేవు. ఏదో సరదాగా బడికెళ్ళడం, రావడం గడిచిపోతూ ఉండేది.
ఇంటి దగ్గర అల్లర్లవీ మామూలే.
ఒకసారి సెలవులకి అమ్మ, నాన్న , నేను శివకోడు వెళ్ళాం - మా మేనమామగారి ఊరు. మాతామహుల ఊరు. మా తాతగారు, అమ్మమ్మ అందరూ ఉండేవారు.
ఆ శివకోడు వెళ్ళినప్పుడు అంతకు ముందు రోజు రాత్రే నేను సినిమాకు వెళ్తానని గొడవ చేశాను. పంపించలా. పంపించకుండా - "అస్తమాను సినిమాలేంటి - ఆడుకోండి" - అని కసిరేసింది మా అమ్మ.
మర్నాడు సాయంత్రం నాలుగింటికి అందరూ శివాలయానికి బయల్దేరారు - మా అమ్మ, మా అత్తయ్య, మా అమ్మమ్మ, ఆడపిల్లలు - వీళ్ళందరూ కూడా.
నేను సినిమాకి పంపలేదని కోపం ఆపుకోలేక దోసిళ్ళతో ఇసక తీసుకెళ్ళి వాళ్ళ తలల మీద పోసేసి పారిపోయాను.
ఇంక వాళ్ళు గుడి కెళ్ళడం మానేసి ఇంట్లో కొచ్చి - తలంతా ఇసక కదా - తలంట్లు అవీ పోసుకుని వాళ్ళ బాధలేవో వాళ్ళు పడ్డారు.
నేను దొరకలేదు వాళ్ళకి. మహా కోపంగా వుంది.
మా నాన్న కూడా వీధరుగు మీదే కూర్చున్నారు కానీ ఆయనా చూళ్ళేదు నన్ను.
వెనకనుంచి పెరట్లోంచి ఇంట్లోకి వెళ్ళిపోయి - మా మావయ్య గారింట్లో చాకలికి వేసే బట్టల కోసం పెద్ద పెట్టి ఉండేది. దానికి జాలీలవీ గాలి పోవడానికి ఉండేవి. దాన్నిండా ఉతకాల్సిన బట్టలున్నాయి.
నేను వెళ్ళిపోయి - సగం బట్టలు తీసేసి అందులోకి దిగిపోయి ఆ బట్టలు నా నెత్తిమీద కప్పేసుకున్నాను. ఆ బట్టల పెట్టిలో అలా ఉండిపోయాను. కాసేపటికి నిద్రొచ్చేసింది నాకు - నిద్ర పోయాను లోపలే.
చాకళ్ళు సాయంత్రం వచ్చి బట్టలు పట్టికెళ్ళేవాళ్ళు. సాయంత్రం ఆరింటికో ఎప్పుడో చాకలి మనిషి వచ్చింది. వచ్చి ఆ బట్టలు తీసినప్పుడు - అప్పుడే మునిమాపు చీకటి పడుతోంది - లోపలేదో ఆకారం కనపడి "అయ్యబాబోయ్" అని పెద్దగా అరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మండువాలో పడిపోయింది.
ఏంటేంటి అని అందరూ అడుగుతుంటే - "బాబోయ్ - ఆ బట్టల పెట్టిలో ఎవరో వున్నారండి బాబూ" - అని గొడవ గొడవ చేసేసింది.
గబగబా వచ్చి చూస్తే నేనున్నాను లోపల - నిద్ర పోతూ. నన్ను తట్టిలేపి మా అమ్మ పైకి తీసుకొచ్చింది.
మా అమ్మమ్మ - ఆవిడకి నేనంటే పాపం మహా జాలి. ప్రేమెక్కువ - "వాణ్ణి ఏమనకే పాపం ఏదో సినిమా అని అడిగాడు" అంటే మా అమ్మ - "అబ్బెబ్బే ! నేను వాణ్ణేమంటానూ !? రేప్పంపిస్తాను సినిమాకీ. రేపెళ్దువుగానీ సినిమాకి రా నాయనా " - అని చక్కగా గాదె సావిట్లోకి తీసుకెళ్ళి పిక్కపాశాలు పెట్టేసింది.
గట్టిగా కేకలు పెట్టాననుకో మళ్ళీ మా నాన్నొచ్చి మళ్ళీ ఇంకో నాలుగు పీకుతారు నన్ను - అందుకని గట్టిగా నా నోరు మూసేసింది.
ఆ రోజలా గడిచింది కానీ మర్నాడు నన్ను సినిమాకి పంపించారు.
అదుగో - అదొక్కసారే మా అమ్మ నన్ను కొట్టింది. మళ్ళి ఎప్పుడూ కూడా నన్ను కొట్టలేదు. అదే ఫస్టు అదే లాస్టు.
శివకోడు వెళ్ళినా కూడా అక్కడ అందరూ నా ఫ్రెండ్సే. బాబొచ్చాడు - బాబొచ్చాడు అనేటప్పటికి హడావిడిగా వుండేవాళ్ళు అన్నమాట. చెడుగుళ్ళు ఆడడం - ఎక్కడికెళ్ళినా సందడే.
కాకపోతే ఫస్టుఫారం నుంచి థర్డుఫారం వరకు నేను ప్రాక్టీసు చేసిందేంటంటే - చెట్లు చేమలు ఎక్కడం, చెరువులు, కాల్వలు ఈదడం.
అసలు చెట్ల మీదే ఉండేవాణ్ణి నేను. జీడిమావిడి చెట్లు, నేరేడు చెట్లు, జామచెట్లు - కొబ్బరి చెట్లు కూడా ఎక్కేసేవాణ్ణి - బొండాలకి. ఈత చెట్లెక్కి గెలలు కొట్టుకొచ్చేసేవాణ్ణి.
చెరువు వార్న నేరేడు చెట్లు, మావిడి చెట్లు ఉండేవి. అవెక్కి ఆ కొమ్మలమీంచి చెర్లోకి దూకేసేవాణ్ని. దూకేసి అక్కడ ఈత కొట్టేవాణ్ణన్నమాట. ఆ మూడు సంవత్సరాలూ - ఈ ప్రాక్టీసు సరిపోయింది నాకు.
భీమనపల్లి హైస్కూల్ రెండు కిలోమీటర్లు అనాతవరానికి. నడిచి వెళ్ళాల్సివచ్చేది. అందుకని మా నాన్నేం చేశారంటే - గొల్ల నారాయడని మాకు పాలు అవీ పోస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. మన పొలం లోనే గేదెలు అవీ మేపుకుంటూ ఉండేవాడు. ఆ గొల్ల నారాయడు అద్దె సైకిళ్ళు పెట్టాడు.
మా నాన్న - ఆ గొల్ల నారాయడికి పురమాయించారు - "నారాయుడూ! పొద్దున్నే స్కూలుకి తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికి తీసుకురా" - అని.
రోజూ పొద్దున్నే ఎనిమిదిన్నరకి వచ్చి తీసుకెళ్ళి సాయంత్రం ఐదింటికి తీసుకొస్తూ ఉండేవాడు. ఈ అద్దె సైకిలు వ్యవహారం థర్డుఫారం వరకు నడిచింది. థర్డుఫారం వచ్చేసరికి ఎగ్గొట్టడం ఎక్కువయ్యింది కదా - గొల్ల నారాయడికి హాండిచ్చేసి వెళ్ళిపోయి కోతుల మామ్మగారని ఇద్దరు మామ్మలుండేవారు. ఓ తాటాకిల్లు అదీనూ. వాళ్ళింట్లో చద్దన్నం ఉండేది. నేను, సూరిగాడు స్కూలెగ్గొట్టేసి, ఆ చద్దన్నం తినేసి అక్కడే ఆట్లాడుకుంటూ ఉండేవాళ్ళం.
ఫస్టుఫారం నుంచి థర్డుఫారం దాకా సైకిల్లేదు కదా నాకు. మరి సినిమాకి వెళ్ళాలి ఎలా? సినిమాకెళ్ళాలంటే ఓ రోజంతా పేచీ పెట్టాలి.
పేచీ పెట్టింతర్వాత మా నాన్నేమో నాలుగు తగిలించి - నాలుగు వాయించేసేవారు ముందు - తర్వాత మళ్ళీ జాలి కదా - మా పొలంలో బొక్కా పళ్ళయ్య అని చెప్పేసి ఉండేవాడు.
ఆ బొక్కా పళ్ళయ్య నిచ్చి - "ఇదిగో పళ్ళయ్యా - వీణ్ణి తీసుకుని సినిమాకి తీసుకెళ్ళు" - అని బెంచీకి టిక్కెట్టిచ్చేవారు. అంటే పెద్ద బెంచీలు.
ఈ బొక్కా పళ్ళయ్య వెళ్ళేటప్పుడు నన్నెక్కించుకుని సినిమాకి తీసుకు వెళ్ళేవాడు.
వస్తూ వస్తూ ఇంటి దగ్గర పురమాయించుకురావడం అనుకుంటాను బొక్కా పళ్ళయ్య పెళ్ళాం, ఓ ముగ్గురు పిల్లలు - వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చేసేవారు అమలాపురం సినిమాకి.
సినిమాలో బెంచి టిక్కెట్టు తీసేవాడు కాదు - నేల టిక్కెట్లు తీసేవాడు - నేల బెంచీలు.
సరే - మనకి సినిమా ముఖ్యం కానీ బెంచీ ముఖ్యం కాదు కదా - చగ్గా సినిమా చూసేసేవాణ్ణి.
సినిమా అయిపోయింతర్వాత ఈ పళ్ళయ్య ఏం చేసేవాడంటే - నన్నేమో వెనకాల సైకిలు కారేజ్ మీద కూర్చోపెట్టేవాడు. సీటు మీద ఆయన కొడుకొకడు. ముందు కడ్డీ మీద ఇద్దరు కొడుకుల్ని కూర్చోపెట్టి - సైకిలు నడిపించుకుంటూ పళ్ళయ్య, పెళ్ళాం - అమలాపురం నుంచి అనాతవరం ఎనిమిది కిలోమీటర్లు - నడుచుకుంటూ వచ్చేవారు - రాత్రి పదకొండు అయిపోయేది ఇంటికొచ్చేటప్పటికి.
మా నాన్న - "ఏంటి ఇంత లేట్ అయింది పళ్ళయ్యా?" - అనడిగితే - పళ్ళయ్య - "సైకిలు దారిలో పంచరైపోయిందండి, పంచరేయించుకుని వచ్చేటప్పటికి ఆలస్యం అయిందండి" - అని ఏదో మాయ చేసేవాడు.
నేనూ ఏమీ చెప్పేవాణ్ణి కాదు - సరే - పోనియ్ మన్ని తీస్కెళ్తున్నాడు కదా సినిమాకి అంజెప్పేసి నేనూ మాట్లాడేవాణ్ణి కాదు. అదీ సినిమాల సంగతి.
అనాతారంలో సుబ్బన్న, వెంకటరెడ్డి అని ఇద్దరుండేవారు. వాళ్ళు పెసర పుణుకులు, బొంబాయి చట్నీ చేస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గర చిన్నంగా చేరి మధ్యాహ్నంపూట ఒకటీ అరా తినేసి అప్పు పెట్టేవాణ్ణి.
వాళ్ళు ఓ వారం పది రోజులయ్యాక ఇంటికొచ్చి మా నాన్న దగ్గరకొచ్చి - "బాబుగారు పెసర పుణుకులు అవీ తిన్నారండి - ఇంతయ్యింది" - అంటే పాపం - తినడానికే కదా అని వీళ్ళు కూడా ఇచ్చేసేవారు. ఆ రకంగా వాళ్ళకి అరువు పెట్టడానికి అలవాటు పడ్డాను నేను.
వీళ్ళు కాకుండా - భీమనపల్లిలో - నారాయణమూర్తి, తాతయ్య అని రెండు హోటల్స్ ఉండేవి. ఆ రెండు హోటల్సులో తీపిగారెలు వేసే వారన్నమాట మధ్యాహ్నం. అక్కడ కూడా అప్పు పెట్టడం మొదలుపెట్టా. మొదలుపెడితే వాళ్ళు కూడా వచ్చినప్పుడు - సరే ఏదో పాపం మధ్యాహ్నం పూట తింటున్నాడు పోనీ - అంజెప్పేసి ఇంట్లోవాళ్ళు పట్టించుకునేవారు కాదు నన్ను. అలాగే వాళ్ళకీ డబ్బులు ఇచ్చేస్తూ ఉండేవారు. థర్డుఫారం దాకా అలాగే ఆడుతూ పాడుతూ గడిచిపోయింది.
థర్డుఫారంలో స్కూల్ ఎక్కువ ఎగ్గొట్టాను కదా - అందుకే ఫోర్త్ ఫారంలోకి వెళ్ళాక - పరీక్ష పాసయ్యి ఫోర్తుఫారంలోకి వెళ్ళాను కానీ విత్-హెల్డ్ అని రాశారక్కడ. ఎందుకు రాశారంటే అటెండెన్స్ తక్కువయ్యింది. థర్డుఫారం క్లాసులోనేమో అటెండెన్స్ వేయించుకోవాలి. పాఠాలు వినడానికి ఫోర్తుఫారం క్లాసుకెళ్ళాలి.
ఫోర్తుఫారంలో ఎప్పుడైతే విత్-హెల్డులోకి వచ్చానో - అప్పుడు మా నాన్న కర్రా చంద్రశేఖరశాస్త్రిగారు, ఆకెళ్ళ సుబ్బారావుగారు ఉండేవారు కదా మేష్టర్లు - వాళ్ళని అడిగారు - ఏంటి వీడు విత్-హెల్దేమిటి మళ్ళీ- అంటే - "లేదండి వీడు కూర్చోడం ఫోర్తుఫారంలోను - వెధవకి అటెండెన్స్ తక్కువయ్యింది - ఎక్కడ ఎగ్గొట్టాడో వీడు - అంచేత అటెండెన్సేమో థర్డుఫారంలోను" - అని వాళ్ళు చెప్పేటప్పటికీ - నాకేం చేశారంటే ఇంక ఆ సైకిలు కట్ చేసేశారు గొల్ల నారాయుడిది. పనిష్మెంటన్నమాట. "ఇంక నీకు సైకిల్లేదు - రోజూ నడిచి పోయి నడిచిరా"- అన్నారు. అలా ఫోర్తుఫారం అంటా నడక. పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళడం - సాయంత్రం నడుచుకుంటూ రావడం. ఈలోగా దారిలో సైకిళ్ళ వాళ్ళెవరైనా కనబడితే - ఓరి బాబ్బాబ్బాబూ - కాస్త అనాతారం తీసుకెళ్ళండ్రా అంటే - వాడు మంచివాడైతే వెనకాల ఎక్కమనేవాడు - లేపోతే నువ్వు తొక్కు, నే కూర్చుంటా - అనేవాడు. నేను సైకిలు తొక్కడం వాడు వెనకాల కూర్చోవడం.
అలా ఫోర్తుఫారం గడుస్తూ వుంది.

<వచ్చేనెల తరువాయి కథ>
బాగున్నాయండీ కబుర్లు.. అంత ఓపిక ఎక్కడినుండి వచ్చేదో కానీ కుర్రతనంలో సినిమాలకోసం నేను కూడా నాలుగైదు కిలోమీటర్లు అవలీలగా నడిచేసిన రోజులున్నాయ్.. ఇపుడు తలచుకుంటే ఆశ్చర్యమనిపిస్తుంది..
రిప్లయితొలగించండి:) మీ వ్యాఖ్యకి ధన్యవాదాలండి.
తొలగించండిమా నాన్నగారు కూడా వేమవరంలో (కోటిపల్లి వెళ్లే దారి) వాళ్ళ తాతగారి దగ్గర ఉండి రోజు అమలాపురం వెళ్లి చదువుకొనివచ్చారు. మీ నాన్నగారి ఆత్మకథ మీ రాతల్లో భలే బావుంది.
రిప్లయితొలగించండిఅన్యగామిగారు: నా రాతలని మెచ్చుకున్న మీకు ధన్యవాదాలు.
తొలగించండిఎప్పటి విషయాలు లలితా ఇవి! తోటివారివి, గురువుల పేర్లు ఇంటి పేర్లతో సహా గుర్తున్నాయి అంకుల్ కు!
రిప్లయితొలగించండిHats off to his memory.
'డాన్స్ కట్టేహానక్కడ'...
'కొట్టేహాను'... ఎన్నేళ్ళయిందో ఇలాంటి పదాలు విని.
అవి చిన్నప్పటి కబుర్లు కదా - అలానే రాసేహానంతే :)
తొలగించండిమీ నాన్నగారి కధను మీ మాటల్లో కాకుండా, ఆయన మాటలలోనే యధాతధంగా రాయడంలోనే రచయిత్రిగా మీ విజ్ఞత కనిపిస్తోంది. కధకు, కాలానికి తగ్గట్టుగా ఆ నాటి వాడుక పదాల్లో చదవడం చాలా బావుంది.
రిప్లయితొలగించండిఅమెరికా వీధులు, అనాతవరం వీధులు పక్కపక్కనే ఉన్నంత చులాగ్గా పాఠకుల్ని అక్కడా ఇక్కడా తిప్పేస్తున్నారు.
సాధ్యమయినంతవరకు ఆనాటి వాడుక భాషలోనే రాయాలని ప్రయత్నం - మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు.
తొలగించండిAgree with the comment above.
రిప్లయితొలగించండిTge beauty of your father's story lies in the narration and the choice of words.
పరమాన్నం పండుమిరపకాయ పచ్చడి ఒకే రుచిలో ఉంటే ఎలా??
ఆ పోలిక పులగం-పండుమిరపకాయపచ్చడి అయితే భలే సరిపోయేది. Thanks for your comment.
తొలగించండిఅనాతవరం కధలు....ఊ
రిప్లయితొలగించండిఆయ్ - అవునండి 😊
తొలగించండి