5, నవంబర్ 2024, మంగళవారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 1

    స్మర వారం వారం ... అంటే మళ్ళీ మళ్ళీ మననం చేసుకోమని అర్థం. 

    నేర్చుకున్న సంక్షేపరామాయణం రాసి పెట్టుకుంటే ఇంకెప్పటికీ గుర్తుండిపోతుందని అనిపించింది. 

    అందుకే ఈ "స్మర వారం వారం....సంక్షేపరామాయణం".

    నేను నేర్చుకున్న సంక్షేపరామాయణం నాతో పాటు మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడానికి కొందరు మిత్రులు, ఆత్మీయులు ఆసక్తి చూపించారు. వారు కూడా పాడుకోవడానికి, నేర్చుకోవడానికి వీలుగా వారానికో శ్లోకం, దాని అర్థం ఇక్కడ పంచుకోబోతున్నాను. 

    ముందుగా ...రాముణ్ణీ, రాముడి బంటు హనుమంతుణ్ణీ ఒకసారి తలుచుకుని మొదలెడుతున్నా.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్ప వారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***






*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అథ సంక్షేపరామాయణం!
శ్లోకం - 1

తపఃస్వాధ్యాయనిరతం  
తపస్వీ  వాగ్విదాం  వరం
నారదం  పరిపప్రచ్ఛ 
వాల్మీకిర్మునిపుంగవం


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    అర్థం: 
ముని వాల్మీకి మహర్షి తపస్వీ, వేదాధ్యనంలో నిమగ్నుడూ, వాగ్విదులలో శ్రేష్ఠుడూ, మునిపుంగవుడూ అయిన నారదుణ్ణి అడిగాడు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)


తపఃస్వాధ్యాయనిరతం=తపస్సు చేయడం లోనూ, వేదాలని అధ్యయనం చేయడంలో నిమగ్నుడిని (ఇది నారద మహర్షి గురించిన విశేషణం)
తపస్వీ=ముని (ఇది వాల్మీకి మహర్షికి సంబంధించిన విశేషణం) 
వాగ్విదాం=వేదవిదులలో 
వరం=శ్రేష్ఠుడిని (ఇది నారద మహర్షి గురించిన విశేషణం)
నారదం=నారదుడిని
పరిపప్రచ్ఛ=అడిగాడు
వాల్మీకిః=వాల్మీకి
మునిపుంగవం=మునులలో శ్రేష్ఠుడిని (ఇది నారద మహర్షి గురించిన విశేషణం)


    వాల్మీకి మహర్షి నారదమునిని ఏమని అడిగాడో తెలియాలంటే మనం ఇంకొన్ని శ్లోకాలు నేర్చుకోవాలి. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


For the friends who don't speak Telugu, I am going to give the slOkaH in the devanagari (Hindi / Sanskrit) script and its meaning in English.


    "smara vAraM vAraM..." means remember (or recite) again and again. 

    I felt like writing down the Sanskrit Ramayanam that I have learnt so that I would remember it forever.

    Hence, this "smara vAraM vAram... sankshepa rAmAyaNaM" series. 

    Some of my friends and family showed interest in joining me in this recitation journey. I am going to share here one slOkaM and its meaning every week so that they can also sing and learn.

    Before starting to learn sankshepa rAmAyaNaM, let's pray to Rama & Hanumaan with the following slOkAH:



श्रीराम राम रामेति - रमे रामे मनोरमे |
सहस्रनाम तत्तुल्यं - रामनाम वरानने ||

यत्र यत्र रघुनाथकीर्तनम् - तत्र तत्र कृतमस्तकाञ्जलिम् |
भाष्पवारि परिपूर्णलोचनं - मारुतिं नमत राक्षसान्तकम् ||


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



अथ संक्षेपरामायणम् |

श्लोकः - 1 

तपःस्वध्यायनिरतम् |
तपस्वी वाग्विदां वरम् |
नारदं परिपप्रच्छ |
वाल्मीकिर्मुनिपुङ्गवम् ||

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Word to word meaning (In the same order of occurrence in the slOkaH)

तपःस्वध्यायनिरतम्=who is always engaged in the tapas and study of Vedas (adjective of Narada)
तपस्वी=Maharshi (adjective of Valmiki)
वाग्विदां=among the wise men
वरम्=the best (adjective of Narada)
नारदं=Narada
परिपप्रच्छ=asked
वाल्मीकिः=Valmiki 
मुनिपुङ्गवम्=the greatest among the sages (adjective of Narada)

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    Meaning in English: 

Maharshi Valmiki asked Narada, who performs penance (tapas), who is always engaged in the tapas and study of Vedas, who is the best among the wise men and who is the greatest among the sages.

    To know what Valmiki Maharshi asked Narada muni, we need to learn the next few slokas.

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 2


16 కామెంట్‌లు:

  1. లల్లి, మీరు పదాలను విడగొట్టి, ప్రతిపాదార్ధం కూడ ఇవ్వండి. అది నేర్చుకోవడం బాగుంటుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతిపదార్థాలు కూడా చేర్చాను చూడండి - తెలుగులో, ఇంగ్లీషులో కూడా. మీ ఆసక్తికి సంతోషం!

      తొలగించండి
  2. శ్రీరామ దూత , అంజని
    గారాముల సుతుడు , మీకు కార్యగతుండై
    ఈ రామాయణ పయనపు
    పారాయణమున సహాయపడుగాక ! బుధా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రోత్సాహపూరిత పద్యవ్యాఖ్యకి ధన్యవాదాలు, మాష్టారూ!

      తొలగించండి
  3. స్మర వారం వారం రామం........ స్మర దశరధ కుమారం..
    మంచి ప్రయత్నం. విజయోస్తు.

    రిప్లయితొలగించండి
  4. స్మర వారం వారం

    స్మ ! రమ్ వా రమ్ వా రమ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వా...వా...అంటూ
      రారమ్మంటూ
      మీరొస్తే చాలనుకుంటూ

      మీరొచ్చాక
      వారెవా! "ఆజ్యిలేబీ" ఆగచ్ఛంతి స్మ!
      అనుకుంటూ

      వారం వారం (పదే పదే) మీ రాకకి
      ఎదురుచూచువారం
      అయివుండడం
      అదో వరం! వరం!

      తొలగించండి
  5. శ్రీరామ కథామృతమును
    చేరలతో ద్రావు డనుచు , చే కలశముతో
    ధారగ వోయగ , త్రాగని
    వారలు గలరా ? వర మిది , పఠితలకు బుధా !

    రిప్లయితొలగించండి
  6. సీతారాములు భారత
    జాతికి తలిదండ్రి , వారి చరిత పఠింపం
    గా తన్మయు లగుదురు జను ,
    లేతత్ యతనంబు పుణ్య , మెంతయును బుధా !

    రిప్లయితొలగించండి
  7. చూడ నెందరో గలరు విశుధ్ధమతులు
    చెయ్యి దిరిగిన పండితశ్రేష్ఠు , లయ్యు ,
    రామకథ మీరు పూనిక రాయ దివుర ,
    పూర్వజన్మ సుకృతము గాబోలును బుధ !

    రిప్లయితొలగించండి
  8. శరణాగత రక్షకు డా
    పురుషోత్తము , డతని చరిత పుణ్యప్రదమౌన్
    స్మరియించు రామ నామమె ,
    తరియించును బాధ లనగ , దారి యదేగా .

    రిప్లయితొలగించండి
  9. దివ్య మంగళ సుభగ దేదీప్య మాన
    మోహనము రూపము , జన సమ్మోహ మ
    నోజ్ఞ పద్మ సంకాశ సన్నుతములు కనులు ,
    పరమ పావన మా రాము పదయుగమ్ము .

    రిప్లయితొలగించండి
  10. ధర్మమే రూపు దాల్చిన కర్మయోగి
    ఏకపత్నీవ్రతాదర్శ స్వీకర యతి
    సకల జగతి ప్రజామోద చక్రవర్తి
    రామ భద్రుని చరితము శ్రీ మహితము .

    రిప్లయితొలగించండి
  11. చెప్పగా విని , ' హరి ' రాము , జేరి చూచి ,
    ధనువు బాణాలు దాల్చిన ధర్మమూర్తి
    మోహనతలకు ముగ్ధుడై , ముచ్చట పడి
    తాను నటువలె మారి , యా దారి నడచె ,

    అచ్చు గుద్దిన రూపంబు లచ్చుపడగ
    మోహనాకార సంశోభ మూర్తిమత్త్వ
    రాములను గాంచి , ' అనిమిష' ద్రమణు డగుట ,
    దొంగ రాముడు సీతకు దొరికి పోయె .

    (కేవలం ఊహాజనితం)

    రిప్లయితొలగించండి
  12. ' రంజయతి ఇతి రామ ' - విరాజమాన
    రామ శబ్దాని కర్థంబు , క్షేమ కరము ,
    విన్న , పలికిన మాత్రనే పున్నెమొలుకు,
    నింక కీర్తించగా గల్గు నెంత ఫలమొ!

    రిప్లయితొలగించండి